కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి సమన్లు | Delhi Court summons Smriti Irani in defamation complaint | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి సమన్లు

Published Fri, Jun 6 2014 6:40 PM | Last Updated on Sat, Sep 2 2017 8:24 AM

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి సమన్లు

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి సమన్లు

న్యూఢిల్లీ: పరువు నష్టం దావా కేసులో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 27న న్యాయస్థానం ముందు హాజరు కావాల్సిందిగా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ధీరజ్ మిట్టల్ ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్ స్మృతిపై కేసును దాఖలు చేశారు.

2012 డిసెంబర్ 20న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విడుదల సందర్భంగా ఓ టీవీ చానెల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న స్మృతి తన పరువుకు భంగం కలిగించేలా దుర్భాషలాడారని సంజయ్ పరువు నష్టం కేసు వేశారు. కాగా ఇదే సందర్భంలో తనపై సంజయ్ అనుచిత, తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ స్మృతి కూడా ఆయనపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement