defamation complaint
-
రాహుల్పై పరువు నష్టం దావా
చందౌళి(యూపీ): ఆర్మీ సర్జికల్ దాడులను ఉద్దేశించి ‘ఖూన్ కీ దలాలీ(‘రక్తం(ఆర్మీ)తో వ్యాపారం’ అని బీజేపీని విమర్శించిన ’ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఇక్కడి కోర్టులో పరువు నష్టం ఫిర్యాదు నమోదు చేశారు. లాయర్ సదానంద సింగ్.. మెజిస్ట్రేట్ కోర్టులో ఈ దావా వేశారు. రాహుల్ వ్యాఖ్యలు ప్రధాని మోదీని, దేశ ప్రజలను అగౌరవపరిచేలా ఉన్నాయన్నారు. -
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి సమన్లు
న్యూఢిల్లీ: పరువు నష్టం దావా కేసులో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 27న న్యాయస్థానం ముందు హాజరు కావాల్సిందిగా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ధీరజ్ మిట్టల్ ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్ స్మృతిపై కేసును దాఖలు చేశారు. 2012 డిసెంబర్ 20న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విడుదల సందర్భంగా ఓ టీవీ చానెల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న స్మృతి తన పరువుకు భంగం కలిగించేలా దుర్భాషలాడారని సంజయ్ పరువు నష్టం కేసు వేశారు. కాగా ఇదే సందర్భంలో తనపై సంజయ్ అనుచిత, తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ స్మృతి కూడా ఆయనపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు.