మాలె: ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. మాల్దీవుల హైకమిషనర్‌కు భారత్ సమన్లు జారీ చేసిన కొన్ని గంటలకే కీలక పరిణామం చోటుచేసుకుంది. మాల్దీవుల ప్రభుత్వం కూడా అక్కడ ఉన్న భారత హైకమిషనర్‌కు సమన్లు జారీ చేసింది. భేటీ కావాల్సిందిగా మాలేలోని భారత హైకమిషనర్ మును మహావార్‌కు ఉత్తర్వులు జారీ చేశారు.
మాల్దీవుల హైకమిషనర్ ఇబ్రహీం షహీబ్‌కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నేడు నేడు సమన్లు జారీ చేసింది. ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సౌత్ బ్లాక్‌కు ఆయన వచ్చివెళ్లినట్లు సమాచారం. వివాదంపై రెండు దేశాలు సుదీర్ఘ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రులపై మాల్దీవుల ప్రభుత్వం వేటు వేసిన మరుసటి రోజే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. ఇది ఇరుదేశాల మధ్య వివాదాస్పద వాతావరణం ఏర్పడటానికి కారణమైంది.
ఇదీ చదవండి: Lakshadweep Islands History: లక్షద్వీప్‌పై పాక్ కన్ను.. భారత్ ఎత్తుగడతో చిత్తు!
Comments
Please login to add a commentAdd a comment