భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల్దీవులు మంత్రులపై ఆ దేశ ప్రభుత్వం వేటు వేసింది. ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది మాల్దీవులు ప్రభుత్వం. మంత్రులు మరియం షియునా, మల్షా షరీఫ్ , మహ్జూమ్ మజీద్ సస్పెన్షన్‌కు గురైనట్లు మాల్దీవులు స్థానిక మీడియా వెల్లడించింది.
ఇప్పటికే మంతత్రి మరియం షియునా ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమైనవి అని మాల్దీవులు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా ప్రకటించిన కొద్ది గంటల్లోనే వారిపై మాల్దీవులు ప్రభుత్వం సస్పెన్ వేటు వేయటం గమనార్హం.
ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్ష్యదీప్ పర్యటనకు వెళ్లిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. వాటిలో ఓ వీడియోపై మాల్దీవులు మంత్రి మరియం షియునా చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
లక్ష్యదీప్ బీచ్‌లో మోదీ నడుస్తున్న ఓ వీడియోపై మరియం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ దేశపు తోలు బోమ్మ అని అనుచిత కామెంట్ చేశారు. దీంతో ఒక్కసాగా ఆమె వ్యాఖ్యలు వివాదాస్పంగా మారాయి. ఆమె వ్యాఖ్యలను భారత్‌లోని పలువురు తీవ్రంగా ఖండించారు.
మాల్దీవులు మంత్రి చేసిన అవమానపూరిత వ్యాఖ్యలపై బాలీవుడ్ నటులు సైతం తీవ్రంగా ఖండిచారు. ‘భారత్‌పై మాల్దీవులు దేశ మంత్రులు అలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా ఆశ్చర్యం కలిగించింది. పొరుగు దేశంతో తాము స్నేహంగానే ఉండాలనుకుంటాం. కానీ, వారి ద్వేషాన్ని సహించము. మాల్దీవులులో ఎన్నోసార్లు పర్యటించాను. అయితే ఇటువంటి సమయంలో భారత్‌లోని దీవులను పర్యటిస్తూ.. మన పర్యాటకానికి మద్దతు ఇద్దాం’ అని బాలీవుడ్ నటుడు ఆక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
‘చాలా పరిశుభ్రమై లక్ష్య ద్వీప్ బీచ్‌ను ప్రధాని మోదీ పర్యటించడం ఎంతో బాగుంది. విశేషమేంటంటే అవి కూడా మన దేశంలో ఉండటం’ అని నటుడు సల్మాన్ ఖాన్ తెలిపారు. ఇక.. వీరితోపాటు చాలామంది ప్రముఖులు, సామాన్యులు కూడా మాల్దీవులు మంత్రి వ్యాఖ్యలను సోషల్‌మీడియాలో తీవ్రంగా ఖండిస్తున్నారు. తమ మాల్దీవులు పర్యటనను కూడా రద్దు చేసుకుంటున్నామని భారతీయ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment