మాలె: ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ విరుచుకుపడ్డారు. లక్షద్వీప్ అభివృద్ధి చెందితే మాల్దీవులకు వచ్చిన సమస్య ఏంటీ..? అని ఎంపీ మహమ్మద్ ఫైజల్ ప్రశ్నించారు.
'భవిష్యత్తులో లక్షద్వీప్ కచ్చితంగా పర్యాటక ప్రాంతంగా మారుతుంది. ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు. ప్రధాని ఇక్కడికి వచ్చి ఒక రోజు గడిపారు. లక్షద్వీప్ ప్రజలు ఎల్లప్పుడూ పర్యాటక కోణంలో ఉండాలని కోరుకునే విషయాన్ని ఆయన చెప్పారు. ప్రభుత్వం టూరిజం కోసం ఒక విధానాన్ని కలిగి ఉండాలని మేము కోరుకున్నాను. దీంతో యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. దానితో మాల్దీవులకు వచ్చిన సమస్య ఏంటి?' అని ఆయన ప్రశ్నించారు.
ఇదీ జరిగింది..!
ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు.
మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. పర్యాటకంలో మాల్దీవులతో లక్షద్వీప్ ఏ మాత్రమూ సరితూగదంటూ ఎద్దేవా చేశారు. ‘‘భారత్‌లో హోటల్ గదులు అసహ్యంగా ఉంటాయి. మా దేశంతో లక్షద్వీప్‌కు పోలికేమిటి?’’ అంటూ మాల్దీవుల ఎంపీ జహీద్ రమీజ్ కూడా నోరు పారేసుకున్నారు. ఈ వ్యాఖ్యలపై మాల్దీవుల్లోని భారత హైకమిషన్ కార్యాలయం అధికారులు నిరసన తెలిపారు. దుమారం నేపథ్యంలోవారి వ్యాఖ్యలను ‘ఎక్స్’ నుంచి తొలగించారు. ఈ వివాదంపై భారత్ కూడా ఘాటుగానే స్పందించింది. దీంతో మాల్దీవులు ఆ మంత్రులను పదవి నుంచి తప్పించింది. ఢిల్లీలో మాల్దీవుల హైకమిషనర్‌కు సమన్లు జారీ చేసింది.
ఇదీ చదవండి: మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. మాల్దీవుల హైకమిషనర్‌కు భారత్ సమన్లు
Comments
Please login to add a commentAdd a comment