హీరో ప్రభాస్ పేరుకే పాన్ ఇండియా స్టార్. కానీ చూస్తే చాలా సింపుల్‌గా ఉంటాడు. బయట కావొచ్చు, మీడియాలోనూ పెద్దగా కనిపించడు. సినిమా రిలీజ్ టైంలో తప్పితే డార్లింగ్‌ని చూడటం కూడా కష్టమే. ఫుడ్ విషయంలో సహ నటీనటుల్ని ఆశ్చర్యపరిచే ప్రభాస్.. నిర్మాతలకు అండగా ఉంటాడు. తాజాగా ఓ నిర్మాత కోసం తన పారితోషికాన్నే తగ్గించుకున్నాడనే వార్తలొస్తున్నాయి. ఇంతకీ ఇది నిజమేనా?
'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్.. వసూళ్లకు తగ్గట్లే తన రెమ్యునరేషన్ కూడా పెంచాడు. రూ.100 కోట్ల మార్క్ ఎప్పుడో దాటేశాడని టాక్. రీసెంట్ బ్లాక్ బస్టర్ 'కల్కి 2898 AD' చేసినందుకు గానూ రూ.150 కోట్లు తీసుకున్నాడని సమాచారం. ఇదంతా పక్కనబెడితే ప్రస్తుతం చేస్తున్న 'రాజాసాబ్' కోసం మాత్రం తన పారితోషికాన్ని కాస్త తగ్గించాడట.
(ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్' రికార్డ్ కూడా బ్రేక్ చేసిన 'కల్కి')
'రాజాసాబ్' సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. గతంలో ఈ ప్రొడక్షన్ హౌస్.. 'ఆదిపురుష్' చిత్రాన్ని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసింది. ఈ క్రమంలోనే కొంతమేర నష్టాలొచ్చాయట. ఇందుకు బదులుగానే ప్రభాస్, 'రాజాసాబ్' కోసం కేవలం రూ.100 కోట్లని మాత్రమే పారితోషికంగా తీసుకున్నాడని తెలుస్తోంది. అధికారికంగా బయటకు రానప్పటికీ ఇది నిజమై ఉండొచ్చని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోయే మూవీ 'రాజా సాబ్'. ఈ ఏడాది క్రిస్మస్‌కి రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు. దీని తర్వాత స్పిరిట్, సలార్ 2, కల్కి 2.. వరసగా రానున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే రాబోయే ఐదేళ్ల వరకు ప్రభాస్ డైరీ ఖాళీ లేనట్లే. ఇవన్నీ పూర్తయ్యేసరికి డార్లింగ్ హీరో రెమ్యునరేషన్ రూ.200 కోట్ల మార్క్ దాటేస్తుందేమో?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)
Comments
Please login to add a commentAdd a comment