Prabhas Remuneration For Adipurush Movie Revealed - Sakshi
Sakshi News home page

Adipurush: ప్రభాస్‌ షాకింగ్‌ రెమ్యూనరేషన్‌!

Published Sat, Jun 5 2021 11:37 AM | Last Updated on Sat, Jun 5 2021 2:14 PM

Prabhas Stunning Remuneration For Adipurush - Sakshi

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో నాలుగు భారీ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ఇటీవల రాధేశ్యామ్‌ షూటింగ్‌ పూర్తి చేసుకోగా, ప్రశాంత్‌ నీల్‌తో సలార్‌,  ‘తన్హాజీ’ ఫేం ఓం రౌత్‌తో ఆదిపురుష్‌ చిత్రం షూటింగ్‌ దశలో ఉన్నాయి. ఆ తర్వాత డైరెక్టర్‌ నాగ అశ్విన్‌తో ఓ సినిమా సెట్స్‌పైకి రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా తాజాగా ప్రభాస్‌ ఆదిపురుష్‌కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నట్లు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓం రౌత్‌ తెరకెక్కిస్తున్న ఈ మూవీని టీ-సిరీస్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆదిపురుష్‌ కోసం టీ-సిరీస్‌ ఫిల్మ్స్‌ ప్రభాస్‌కు రూ. 50 కోట్లను పారితోషికంగా ఇస్తున్నట్లు సమాచారం. పౌరాణిక నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా, కృతి సనన్‌ సీతగా నటించనుంది.

ఇక లంకేశ్వరుడు రావణుడి పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్‌ అలరించనున్నాడు. కాగా గతంలో దర్శకుడు ఓం​ రౌత్‌ ఈ మూవీ గురించి మాట్లాడుతూ.. ‘ఆదిపురుష్ భారతీయ ఇతిహాసం రామాయణం అనుకరణ. ఈ సినిమా చేయాలని అనుకుంటున్న సమయంలో ఓ కార్యక్రమంలో ప్రభాస్‌ను చూశాను. ఆదిపురుష్‌కు అతను అయితే కరెక్ట్‌గా సరిపోతాడని నాకు గట్టిగా అనిపించింది. ఎందుకంటే అతడి ఆకర్షణీయమైన కళ్లు, వైఖరి, అతని వ్యక్తిత్వం. చెప్పాలంటే ప్రభాస్‌లో ఆదిపురుష్‌ను చూడగలిగాను. ప్రభాస్‌తో తప్ప ఇంకేవరితో ఈ సినిమా చేయలేను’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. భారీ బడ్జేట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. 2022 అగష్టు 11ను ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో థియేటర్లలోకి రానుంది. 

చదవండి: 
రా ఏజెంట్‌గా ప్రభాస్‌..హాలీవుడ్‌ స్టయిల్‌లో ఉంటుందట!

Prabhas Movie: పారితోషికమే రూ.200 కోట్లా?!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement