యూరప్‌ వెళ్లనున్న ప్రభాస్‌.. ఎందుకో తెలుసా..? | Prabhas And Malavika Mohanan To Shoot For Romantic Song In Raja Saab Movie, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

గ్లామరస్‌ హీరోయిన్‌తో 'రాజాసాబ్‌' రొమాన్స్‌..

Published Tue, Nov 26 2024 8:52 AM | Last Updated on Tue, Nov 26 2024 9:25 AM

Prabhas And Malavika Mohanan Song For Raja Saab Update

ప్రభాస్‌ యూరప్‌ వెళ్లనున్నాడు. రాజాసాబ్‌ సాంగ్‌ చిత్రీకరణలో భాగంగా ఆయన అక్కడకు వెల్లేందుకు సిద్ధం అవుతున్నాడు.
మారుతి దర్శకత్వలో తెరకెక్కుతున్న రాజాసాబ్‌ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సలార్‌, కల్కి చిత్రాల తర్వాత ప్రభాస్‌ నుంచి వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్  , మాళవిక మోహనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇప్పటికే రాజాసాబ్‌ షూటింగ్‌ పనులు పూర్తి అయ్యాయి. అయితే, సాంగ్స్‌ చిత్రీకరణ పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆరు పాటలు ఉన్నట్లు సంగీత దర్శకుడు థమన్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీనిలో భాగంగా వచ్చే నెలలో యూరప్‌లో ఒక సాంగ్‌ను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. ఈ పాట కూడా ప్రభాస్‌, మాళవిక మోహనన్‌ల మధ్య ఉంటుందట. అదిరిపోయే లొకేషన్స్‌లో చాలా గ్లామరస్‌గా ఈ సాంగ్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి నుంచే రాజాసాబ్‌ ప్రమోషన్స్‌ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. ఈ క్రమంలో సంక్రాంతి కానుకగా తొలి సాంగ్‌ను విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేశారట.

పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ రాజాసాబ్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌, మాళవిక మోహన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో సంజయ్‌దత్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్‌ తన కెరీర్‌లో  చేస్తున్న తొలి రొమాంటిక్‌ హారర్‌ చిత్రమిదే కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్‌ 10న  పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రం విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement