Raja Saab
-
ఫ్యాషన్ దుస్తుల్లో మెరిసిన ‘రాజా సాబ్’ బ్యూటీ (ఫోటోలు)
-
చిరంజీవి కోసం ప్రభాస్ కాంప్రమైజ్ కానున్నాడా..?
సలార్, కల్కి 2898ఏడీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా 'రాజాసాబ్'. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ మూవీకి మారుతి దర్శకుడు. చాలావరకు ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్లు చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు కూడా.. అయితే, ఇప్పుడు అనుకున్న సమయానికి ఈ చిత్రం విడుదల కాకపోవచ్చని తెలుస్తోంది. ఈమేరకు ఇండస్ట్రీలో వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి.‘రాజాసాబ్’ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. 2025 జనవరి సమయానికి ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తి అవుతుంది. కానీ, ఈ సినిమాలో ఎక్కువ సీన్స్‌కు VFX వర్క్‌తో లింక్ అయి ఉన్నాయట. దీంతో ఏప్రిల్ 10 నాటికి కూడా ఆ పనులు పూర్తి కావడం కాస్త కష్టమేనని తెలుస్తోంది. సమ్మర్‌కు విడుదల అవుతుందని అశించిన ప్రభాస్ ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురుకానుందని తెలుస్తోంది. అయితే, సంక్రాంతి కానుకగా ఒక సాంగ్‌ను విడుదల చేస్తున్నట్లు సమాచారం.చిరంజీవి కోసం ప్రభాస్ కాంప్రమైజ్చిరంజీవి 'విశ్వంభర' సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంటూ గేమ్ ఛేంజర్‌కు ఛాన్స్ ఇచ్చారు. అయితే, విశ్వంభర ఎప్పుడు విడుదల అవుతుందో మాత్రం వారు ప్రకటించలేదు. అయితే, వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానుందని నెట్టింట ఒక వార్త వైరల్ అవుతుంది. అదే డేట్‌కు ప్రభాస్ రాజాసాబ్ వస్తున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. కానీ, విశ్వంభర సినిమాను ప్రభాస్ అనుబంధ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండటంతో మెగాస్టార్‌కు పోటీగా ఆయన ఎట్టి పరిస్థితిల్లో బరిలోకి దిగడని తెలుస్తోంది. ఈ కారణం వల్ల రాజాసాబ్ ఏప్రిల్ 10న విడుదల కాకపోవచ్చని కూడా సమాచారం. ప్రభాస్ లిస్ట్‌లో ఇప్పటికే చాలా సినిమాలు ఉన్నాయి. కె.జి.ఎఫ్, సలార్ వంటి భారీ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిలింస్‌తో ప్రభాస్ మూడు సినిమాలు చేయనున్నారు. 'సలార్2'తో ఈ ప్రయాణం మొదలవుతోందని ఆ నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. 2026, 2027, 2028 సంవత్సరాల్లో ఆ సినిమాలు రానున్నట్లు కూడా తెలిపింది. ప్రభాస్ - ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో ఒక సినిమాతో పాటు ప్రభాస్ - లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కించాలని ఈ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా కూడా లైన్లో ఉన్న విషయం తెలిసిందే. -
యూరప్ వెళ్లనున్న ప్రభాస్.. ఎందుకో తెలుసా..?
ప్రభాస్ యూరప్ వెళ్లనున్నాడు. రాజాసాబ్ సాంగ్ చిత్రీకరణలో భాగంగా ఆయన అక్కడకు వెల్లేందుకు సిద్ధం అవుతున్నాడు.మారుతి దర్శకత్వలో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సలార్, కల్కి చిత్రాల తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ , మాళవిక మోహనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇప్పటికే రాజాసాబ్ షూటింగ్ పనులు పూర్తి అయ్యాయి. అయితే, సాంగ్స్ చిత్రీకరణ పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆరు పాటలు ఉన్నట్లు సంగీత దర్శకుడు థమన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీనిలో భాగంగా వచ్చే నెలలో యూరప్‌లో ఒక సాంగ్‌ను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ పాట కూడా ప్రభాస్, మాళవిక మోహనన్‌ల మధ్య ఉంటుందట. అదిరిపోయే లొకేషన్స్‌లో చాలా గ్లామరస్‌గా ఈ సాంగ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి నుంచే రాజాసాబ్ ప్రమోషన్స్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. ఈ క్రమంలో సంక్రాంతి కానుకగా తొలి సాంగ్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారట.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ రాజాసాబ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో సంజయ్‌దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్ తన కెరీర్లో చేస్తున్న తొలి రొమాంటిక్ హారర్ చిత్రమిదే కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 10న పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
నయనతార మరో సెన్సేషనల్ డెసిషన్?
-
Raja Saab ఆ హీరో సాంగ్ ని రీమిక్స్ చేస్తున్నారా?
-
రాజా సాబ్ స్పెషల్ సాంగ్ అప్డేట్..
-
ప్రభాస్‌తో ప్రశాంత్ వర్మ సినిమా.. ఇప్పట్లో సాధ్యమేనా?
హీరో ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుందా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. వీరి కాంబినేషన్లో ఓ పవర్ఫుల్ సబ్జెక్ట్‌తో సినిమా రానుందని, ప్రస్తుతం ఈ సినిమా చర్చల దశలో ఉందని, ఈ చర్చలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుందట. అలాగే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ఈ చిత్రం భాగం కావొచ్చనే టాక్ కూడా వినిపిస్తోంది. (చదవండి: జపాన్‌లో ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్.. రీ రిలీజ్ కూడా)అయితే ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే మాత్రం ఇది ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ప్రశాంత్ వర్మ బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞతో ఓ సినిమా అనౌన్స్ చేశాడు. అలాగే తన సినిమాటిక్ యూనివర్స్ పేరిట మహాకాళి, అధీరా లాంటి క్రేజీ ప్రాజెక్టులను ఇతర దర్శకులతో తీయిస్తూ బిజీగా ఉన్నాడు. మరోవైపు ప్రభాస్ డేట్స్ కూడా కొన్నాళ్ల పాటు దొరకడం కష్టమే. (చదవండి: డ్యాన్స్ మాస్టర్‌తో పాటు అతడి భార్యపైనా కేసు)ప్రస్తుతం ఆయన ‘రాజాసాబ్’, ‘ఫౌజీ’ సినిమాలతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ‘స్పిరిట్’ షూటింగ్లో పాల్గొంటాడు. ఆ తర్వాత కల్కి 2, సలార్ 2 చేయాలి. ఇవ్వన్ని పూర్తవ్వాలంటే కనీసం మూడున్నరేళ్లయినా పడుతుంది. ఆ తర్వాత కానీ ప్రభాస్ డేట్స్ ఖాలీగా ఉండవు. ఒకవేళ ప్రశాంత్ వర్మతో సినిమా ఉన్నా..ఇప్పట్లో అయితే ప్రారంభం అయ్యే చాన్స్ లేదు. మరి... ప్రభాస్ అండ్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ సెట్ అవుతుందా? లేదా రూమర్‌గానే మిగిలిపోతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
‘రాజా సాబ్’ మేకింగ్ వీడియో చూశారా?
మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ‘రాజాసాబ్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ఫై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. నేడు డైరెక్టర్ మారుతి బర్త్‌డే(అక్టోబర్ 8). ఈ సందర్భంగా రాజాసాబ్ మూవీ మేకింగ్ వీడియోని విడుదల చేశారు మేకర్స్. (చదవండి: 'పుష్ప 2'.. ఫస్ట్ హాఫ్ అంతా రెడీ)ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగార్వాల్, మాళవిక మోహన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రొమాంటిక్ హారర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరికొత్త లుక్‌లో సందడి చేయబోతున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. -
రాజాసాబ్ కి సీక్వెల్ కన్ఫర్మ్..?
-
కల్కికి మించిన కలెక్షన్స్ రాజాసానికి..
-
రాజాసాబ్ టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..?
-
నిధి అగర్వాల్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన ‘రాజాసాబ్’ మూవీ టీమ్ (ఫొటోలు)
-
ప్రభాస్ ఫుడ్‌కి ఫిదా అయిన ఆరో హీరోయిన్.. ఏం చెప్పిందంటే?
ప్రభాస్ పేరు చెప్పగానే పాన్ ఇండియా సినిమాలు, వేల కోట్ల రూపాయల వసూళ్లు ఎలా గుర్తొస్తాయో.. అతడి అతిథ్యం, పెట్టే ఫుడ్ కూడా అలానే గుర్తొస్తుంది. ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు స్టార్ హీరోయిన్లు డార్లింగ్ హీరో ఇచ్చే ఫుడ్ గురించి చాలాసార్లు చెప్పారు. వీళ్లలో శ్రద్ధా కపూర్, పూజా హెగ్డే, శ్రుతి హాసన్, కృతి సనన్, దీపికా పదుకొణె ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్టులో ఆరో హీరోయిన్ చేరిపోయింది. ఆమెనే మాళవిక మోహనన్.(ఇదీ చదవండి: యాంకర్ సుమకు స్టేజీపై ముద్దు పెట్టిన నటుడు)కేరళకు చెందిన ఈ బ్యూటీ.. ఇప్పటివరకు తమిళ, మలయాళ సినిమాలు చేసింది. ఇన్ స్టాలో గ్లామర్ ఫొటోల వల్ల తెలుగోళ్లకు కాస్త పరిచయమే. ఈమె లీడ్ రోల్ చేసిన 'తంగలాన్'.. ఆగస్టు 15న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇందులోనే ప్రభాస్ ఫుడ్ గురించి మాళవిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.'హైదరాబాద్‌లోనే బెస్ట్ ఫుడ్ ప్రభాస్ నాకు పంపించారు. మా అమ్మ ఫుడ్ తర్వాత నేను ఇప్పటివరకు తిన్న వాటిలో బెస్ట్ అంటే ప్రభాస్ సర్ పంపించిందే. దాదాపు మా అమ్మ వండిన వంటలానే అనిపించింది' అని మాళవిక చెప్పింది. 'రాజాసాబ్' సినిమా గురించి మాట్లాడుతూ.. ప్రభాస్ సినిమాలో అలాంటి క్యారెక్టర్ రావడం చాలా గ్రేట్. ఆ పాత్ర అంత అద్భుతంగా ఉంటుంది. మీరంతా రాజా సాబ్ చూడటం కోసం ఎదురుచూస్తున్నానని తన ఆనందాన్ని బయటపెట్టింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీలో 21 సినిమాలు/ సిరీస్‌లు రిలీజ్) -
ప్రభాస్ 'ది రాజాసాబ్' గ్లింప్స్.. అది రెబల్ స్టార్ క్రేజ్!
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'ది రాజాసాబ్'. ఈ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రిలీజైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఏకంగా నంబర్‌వన్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. గ్లింప్స్ విడుదలైన 24 గంటల్లోనే 20 మిలియన్స్‌కు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ది రాజా సాబ్ ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ ప్రభాస్ వింటేజ్ లుక్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.కాగా.. ప్రభాస్ ఇప్పటి వరకు చేయని రొమాంటిక్ హారర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి సరికొత్తగా ప్రభాస్‌ను చూపించనున్నారు. డార్లింగ్ ఫ్యాన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోయేలా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
స్వీటీ అనుష్క ఇప్పుడా ఫొటో ఎందుకు పోస్ట్ చేసినట్లు?
స్వీటీ అనుష్క సినిమా వచ్చి దాదాపు ఏడాది దాటిపోయింది. ప్రస్తుతానికి ఏదో మలయాళ సినిమా చేస్తోంది! ఈ విషయం తప్పితే బయటకు కూడా అస్సలు కనిపించడం లేదు. అలాంటిది ఇప్పుడు సడన్‌గా ఈమె వార్తల్లో నిలిచింది. అసలు సంబంధం లేని టైంలో, అది కూడా 'బాహుబలి' మూవీలో తన పిక్‌ని ఇన్ స్టాలో ఎందుకు పోస్ట్ చేసిందా అని తెగ మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ తీరుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి)'సైజ్ జీరో' మూవీ వల్ల అనుష్క అనుహ్యంగా బరువు పెరిగిపోయింది. దీని వల్ల సినిమాలు తగ్గించేసింది. బయట కనిపించడం మానేసింది. ఇక సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలు పోస్ట్ చేసి చాలా కాలమే అయిపోయింది. తాజాగా సోమవారం సాయంత్రం 'బాహుబలి'లోని తన స్టిల్‌ని పోస్ట్ చేసింది. సరిగ్గా అదే టైంలో ప్రభాస్ 'రాజా సాబ్' గ్లింప్స్ రిలీజైంది. దీంతో చర్చ మొదలైంది.అనుష్క ఫొటో పోస్ట్, ప్రభాస్ 'రాజాసాబ్' గ్లింప్స్ రిలీజ్ కావడం అనుకోకుండా జరిగిందా? అంటే ప్రభాస్ ఫ్యాన్స్ అవుననే అంటున్నారు. గ్లింప్స్ చూసిన తర్వాత ఈ ఫొటో పోస్ట్ చేసిందని, కావాలంటే ఇద్దరు మ్యాచింగ్ డ్రస్సుల్లోనే ఉన్నారని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో పెద్ద కాంట్రవర్సీ ఏం లేనప్పటికీ.. ఇలా మరోసారి ప్రభాస్-అనుష్క గురించి అభిమానులు మాట్లాడుకోవడం ఆసక్తికరంగా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: మూడున్నర నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు సినిమా) View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial) -
రెమ్యునరేషన్ తగ్గించుకున్న ప్రభాస్.. నిజమేనా?
హీరో ప్రభాస్ పేరుకే పాన్ ఇండియా స్టార్. కానీ చూస్తే చాలా సింపుల్‌గా ఉంటాడు. బయట కావొచ్చు, మీడియాలోనూ పెద్దగా కనిపించడు. సినిమా రిలీజ్ టైంలో తప్పితే డార్లింగ్‌ని చూడటం కూడా కష్టమే. ఫుడ్ విషయంలో సహ నటీనటుల్ని ఆశ్చర్యపరిచే ప్రభాస్.. నిర్మాతలకు అండగా ఉంటాడు. తాజాగా ఓ నిర్మాత కోసం తన పారితోషికాన్నే తగ్గించుకున్నాడనే వార్తలొస్తున్నాయి. ఇంతకీ ఇది నిజమేనా?'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్.. వసూళ్లకు తగ్గట్లే తన రెమ్యునరేషన్ కూడా పెంచాడు. రూ.100 కోట్ల మార్క్ ఎప్పుడో దాటేశాడని టాక్. రీసెంట్ బ్లాక్ బస్టర్ 'కల్కి 2898 AD' చేసినందుకు గానూ రూ.150 కోట్లు తీసుకున్నాడని సమాచారం. ఇదంతా పక్కనబెడితే ప్రస్తుతం చేస్తున్న 'రాజాసాబ్' కోసం మాత్రం తన పారితోషికాన్ని కాస్త తగ్గించాడట.(ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్' రికార్డ్ కూడా బ్రేక్ చేసిన 'కల్కి')'రాజాసాబ్' సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. గతంలో ఈ ప్రొడక్షన్ హౌస్.. 'ఆదిపురుష్' చిత్రాన్ని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసింది. ఈ క్రమంలోనే కొంతమేర నష్టాలొచ్చాయట. ఇందుకు బదులుగానే ప్రభాస్, 'రాజాసాబ్' కోసం కేవలం రూ.100 కోట్లని మాత్రమే పారితోషికంగా తీసుకున్నాడని తెలుస్తోంది. అధికారికంగా బయటకు రానప్పటికీ ఇది నిజమై ఉండొచ్చని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోయే మూవీ 'రాజా సాబ్'. ఈ ఏడాది క్రిస్మస్కి రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు. దీని తర్వాత స్పిరిట్, సలార్ 2, కల్కి 2.. వరసగా రానున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే రాబోయే ఐదేళ్ల వరకు ప్రభాస్ డైరీ ఖాళీ లేనట్లే. ఇవన్నీ పూర్తయ్యేసరికి డార్లింగ్ హీరో రెమ్యునరేషన్ రూ.200 కోట్ల మార్క్ దాటేస్తుందేమో?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?) -
ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో సర్ ప్రైజ్.. రాజా సాబ్ లో సూపర్ హిట్ సాంగ్స్ రీమిక్స్
-
ప్రభాస్ 'రాజాసాబ్'... ఆ వార్తలు నమ్మొద్దని టీమ్ ప్రకటన
ప్రభాస్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా మరోసారి ఈ పేరు మార్మోగిపోతోంది. ఎందుకంటే రీసెంట్గా 'కల్కి' మూవీతో వచ్చాడు. హిట్ టాక్ తెచ్చుకుని వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్నాడు. ఇప్పటికే రూ.700 కోట్ల మార్క్ దాటేసింది. సరికొత్త రికార్డులు కూడా నమోదవుతున్నాయి. ఇది ఇలా ఉండగా ప్రభాస్ తర్వాత మూవీ గురించి టీమ్ కీలక ప్రకటన చేసింది. ఓ విషయంలో మోసపోవద్దని హెచ్చరించింది.(ఇదీ చదవండి: రష్మిక 'కుబేర' వీడియో.. ఆ సూట్ కేసులో ఏముంది?)'బాహుబలి' తర్వాత డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు చేస్తున్న ప్రభాస్.. 'రాజాసాబ్'గా త్వరలో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని హారర్ కామెడీ కథతో తీస్తున్నారని టాక్. ఇందులో నిజమెంతనేది పక్కనబెడితే ఇప్పుడు ఈ మూవీ పేరుచెప్పి కొందరు ఫేక్ ఆడిషన్స్ చేస్తున్నారట. ఇది నిర్మాతలకు తెలిసి అలెర్ట్ చేశారు.'రాజాసాబ్ మూవీ ఆడిషన్స్ గురించి కొన్ని వార్తలు సర్క్యూలేట్ అవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. అయితే అదంతా ఫేక్. ఒకవేళ నిజంగా ఉంటే మేమే ప్రకటిస్తాం' అని నిర్మాతలు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. ఇకపోతే 'రాజాసాబ్'లో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బహుశా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కావొచ్చని టాక్ వినిపిస్తుంది. (ఇదీ చదవండి: Mirzapur 3: ‘మీర్జాపూర్ 3’ వెబ్‌సిరీస్ రివ్యూ) View this post on Instagram A post shared by People Media Factory (@peoplemediafactory) -
ఒకే ఒక్క సినిమా.. హిట్టయితే ఇండస్ట్రీని షేక్ చేయడం పక్కా!
సాధారణంగా హీరోయిన్లకు నాలుగైదు హిట్లు పడితేకానీ గుర్తింపు రాదు. చిన్న చిన్న హీరోలతో నటించి మెప్పిస్తే..స్టార్ హీరోల సినిమాల్లో చాన్స్ వస్తుంది. అక్కడ ఒక్క హిట్ పడితే చాలు..ఇక స్టార్ హీరోయిన్ అయిపోతారు. వరుస అవకాశాలు వస్తాయి. అయితే ఇదంతా జరగడానికి కొంత సమయం పడుతుంది. అదృష్టం కూడా ఉండాలి. కానీ కొంతమంది హీరోయిన్లకి మాత్రం తొలి సినిమాతోనే స్టార్ హీరోలతో నటించే అవకాశం వస్తుంది. అది హిట్టయితే చాలు..వాళ్లు ఇండస్ట్రీని షేక్ చేయడం ఖాయం. అలాంటి బంపరాఫర్స్ని పట్టేసిన హీరోయిన్లపై ఓ లుక్కేద్దాం.మాళవికా మోహన్.. ఈ బ్యూటీ పేరు తెలుగు ఆడియన్స్‌కి అంతగా గుర్తుండకపోవచ్చు కానీ, తమిళ్ ఆడియన్స్‌కి మాత్రం బాగా తెలుసు. రజనీకాంత్, విజయ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ‘మాస్టర్’తో సూపర్ హిట్ అందుకుంది. అయితే ఈ బ్యూటీ ఇంతవరకు టాలీవుడ్ సినిమాల్లో నటించలేదు. ఇప్పుడు ఏకంగా పాన్ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మారుతి-ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాజాసాబ్’ చిత్రంలో మాళవిక హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా విడుదలై హిట్టయితే మాత్రం మాళవిక స్టార్ హీరోయిన్గా మారడం ఖాయం.జాన్వీ కపూర్.. దీవంగత నటి, అందాల తార శ్రీదేవి ముద్దుల తనయగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. అక్కడ వరుస సినిమాలు చేసిన రావాల్సినంత గుర్తింపు రాలేదు. దీంతో ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్‌పై కన్నేసింది. తొలి సినిమాతోనే ఎన్టీఆర్‌తో నటించే చాన్స్ కొట్టేసింది. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న ‘దేవర’మూవీలో జాన్వీనే హీరోయిన్. అంతేకాదు రామ్‌చరణ్-బుచ్చిబాబు కాంబినేసన్లో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు విడుదలై హిట్టయితే..సౌత్‌లో ఈ బ్యూటీకి వరుస సినిమా అవకాశాలు రావడం ఖాయమని సీనీ విశ్లేషకులు చెబుతున్నారు.అషికా రంగనాథ్.. టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి నటించే అవకాశం వచ్చిందంటే.. ఆ హీరోయిన్‌కి ప్రమోషన్స్ వచ్చినట్టే లెక్క. చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని చాలా మంది కలలు కంటుంటారు. అయితే అషికా రంగనాథ్‌కి మాత్రం రెండో సినిమాతోనే మెగాస్టార్ సరసన నటించే అవకాశం దక్కింది. ‘నా సామిరంగ’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత అషికాకు తెలుగులో వరుస సినిమాలు వచ్చే అవకాశం ఉంది. -
పెళ్లెప్పుడు అని ప్రశ్న.. హీరోయిన్ మాళవిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు గ్లామర్‌నే నమ్ముకుని ఛాన్సులు కొట్టేస్తుంటారు. గతంలో అవసరం బట్టి సినిమాల్లో మాత్రం అందాల ఆరబోత ఉండేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి వారిలో మాళవిక మోహనన్ ఒకరు. అయితే అలా ఎందుకు చేస్తున్నారనే ప్రశ్న ఆమెకు ఎదురైంది. దీనికి మాళవిక ఆసక్తికర సమాధానమిచ్చింది.(ఇదీ చదవండి: మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే)తరచూ గ్లామరస్ దుస్తుల్లో స్పెషల్ ఫొటో షూట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండడం గురించి తనని అడుగుతున్నారని చెప్పిన మాళవిక.. గ్లామర్ అంటే ఇష్టమని, అందుకే అలాంటి దుస్తులు ధరిస్తున్నట్లు చెప్పారు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని చాలామంది అడుగుతున్నారని.. తనను పెళ్లికూతురు దుస్తుల్లో చూడడానికి మీకెందుకో అంత ఆసక్తి అని నటి మాళవికా మోహన్ పేర్కొన్నారు.మలయాళ సినిమాలతో నటిగా కెరీర్ మొదలుపెట్టిన మాళవిక.. రజనీకాంత్ 'పేట' మూవీతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. మాస్టర్, మారన్ తదితర చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం విక్రమ్ 'తంగలాన్'లో చేసింది. ఇది త్వరలో విడుదల కానుంది. అలానే తెలుగులో ప్రభాస్ సరసం 'రాజా సాబ్' మూవీలో ఓ హీరోయిన్గా చేస్తోంది.(ఇదీ చదవండి: పవన్ వల్ల కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి)