స్వీటీ అనుష్క ఇప్పుడా ఫొటో ఎందుకు పోస్ట్ చేసినట్లు? | Anushka Shetty Latest Post And Raja Saab Prabhas News | Sakshi
Sakshi News home page

Anushka Prabhas: అనుకోకుండా జరిగిందా? లేదా కావాలనే ఇలా!

Jul 30 2024 3:33 PM | Updated on Jul 30 2024 4:22 PM

Anushka Shetty Latest Post And Raja Saab Prabhas News

స్వీటీ అనుష్క సినిమా వచ్చి దాదాపు ఏడాది దాటిపోయింది. ప్రస్తుతానికి ఏదో మలయాళ సినిమా చేస్తోంది! ఈ విషయం తప్పితే బయటకు కూడా అస్సలు కనిపించడం లేదు. అలాంటిది ఇప్పుడు సడన్‌గా ఈమె వార్తల్లో నిలిచింది. అసలు సంబంధం లేని టైంలో, అది కూడా 'బాహుబలి' మూవీలో తన పిక్‌ని ఇన్ స్టాలో ఎందుకు పోస్ట్ చేసిందా అని తెగ మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: టాలీవుడ్‌ తీరుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి)

'సైజ్ జీరో' మూవీ వల్ల అనుష్క అనుహ్యంగా బరువు పెరిగిపోయింది. దీని వల్ల సినిమాలు తగ్గించేసింది. బయట కనిపించడం మానేసింది. ఇక సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలు పోస్ట్ చేసి చాలా కాలమే అయిపోయింది. తాజాగా సోమవారం సాయంత్రం 'బాహుబలి'లోని తన స్టిల్‌ని పోస్ట్ చేసింది. సరిగ్గా అదే టైంలో ప్రభాస్ 'రాజా సాబ్' గ్లింప్స్ రిలీజైంది. దీంతో చర్చ మొదలైంది.

అనుష్క ఫొటో పోస్ట్, ప్రభాస్ 'రాజాసాబ్' గ్లింప్స్‌ రిలీజ్ కావడం అనుకోకుండా జరిగిందా? అంటే ప్రభాస్ ఫ్యాన్స్ అవుననే అంటున్నారు. గ్లింప్స్ చూసిన తర్వాత ఈ ఫొటో పోస్ట్ చేసిందని, కావాలంటే ఇద్దరు మ్యాచింగ్ డ్రస్సుల్లోనే ఉన్నారని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో పెద్ద కాంట్రవర్సీ ఏం లేనప్పటికీ.. ఇలా మరోసారి ప్రభాస్-అనుష్క గురించి అభిమానులు మాట్లాడుకోవడం ఆసక్తికరంగా అనిపిస్తోంది.

(ఇదీ చదవండి: మూడున్నర నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement