‘రాజా సాబ్‌’ మేకింగ్‌ వీడియో చూశారా? | Director Maruthi Birthday Special: Raja Saab Making Video Out | Sakshi
Sakshi News home page

‘రాజా సాబ్‌’ మేకింగ్‌ వీడియో చూశారా?

Published Tue, Oct 8 2024 5:49 PM | Last Updated on Tue, Oct 8 2024 7:05 PM

Director Maruthi Birthday Special: Raja Saab Making Video Out

మారుతి దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా ‘రాజాసాబ్‌’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ఫై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. నేడు డైరెక్టర్‌ మారుతి బర్త్‌డే(అక్టోబర్‌ 8). ఈ సందర్భంగా రాజాసాబ్‌ మూవీ మేకింగ్‌ వీడియోని విడుదల చేశారు మేకర్స్‌. 

(చదవండి:  'పుష్ప 2'.. ఫస్ట్ హాఫ్ అంతా రెడీ)

ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన నిధి అగార్వాల్‌, మాళవిక మోహన్‌, రిద్ది కుమార్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  రొమాంటిక్‌ హారర్‌ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ సరికొత్త లుక్‌లో సందడి చేయబోతున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement