‘ది రాజాసాబ్‌’ అప్‌డేట్‌ .. ప్రభాస్‌ కొత్త లుక్‌ అదిరింది! | Motion Poster of Prabhas’s Raja Saab Has Been Unveiled on His Birthday. | Sakshi
Sakshi News home page

‘ది రాజాసాబ్‌’ అప్‌డేట్‌ వచ్చేసింది.. ప్రభాస్‌ లుక్‌ అదిరింది!

Published Wed, Oct 23 2024 2:32 PM | Last Updated on Wed, Oct 23 2024 3:05 PM

Motion Poster of Prabhas’s Raja Saab Has Been Unveiled on His Birthday.

 ‘ది రాజాసాబ్‌’ అప్‌డేట్‌ వచ్చేసింది. ప్రభాస్‌ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కించిన చిత్రం ‘ది రాజాసాబ్‌’. మాళవికా మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్‌ హీరోయిన్లుగా నటించారు. నేడు(అక్టోబర్‌ 23) ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుంచి వీడియోతో కూడిన స్పెషల్‌ మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. అందులో ప్రభాస్‌ సింహాసనంపై కూర్చొని చేతిలో సిగార్‌ పటుకొని మహారాజులా కూర్చున్నాడు. మొత్తంగా ఈ సినిమాలో ప్రభాస్‌ని ఓ డిఫరెంట్‌ లుక్‌లో చూపించబోతున్నట్లు మోషన్‌ పోస్టర్‌తో చెప్పేశాడు డైరెక్టర్‌ మారుతి. 

(చదవండి: ఒకే ఒక మాటతో ట్రెండింగ్‌లోకి వచ్చేసిన ‘స్పిరిట్‌’)

ప్రభాస్ ఇప్పటి వరకు చేయని రొమాంటిక్ హారర్ జానర్‌లో ఈ సినిమాను తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement