ప్రభాస్ ఫ్యాన్స్ ఫ్రస్టేషన్.. సందేహాలు తీర్చిన మారుతి | Director Maruthi Clarify Raja Saab Movie Release | Sakshi

Rajasaab Movie: 'రాజాసాబ్' రిలీజ్ పై సందేహాలు.. డైరెక్టర్ ఏం చెప్పాడు?

Apr 8 2025 3:36 PM | Updated on Apr 8 2025 3:54 PM

Director Maruthi Clarify Raja Saab Movie Release

పాన్ ఇండియా హీరో అయిన తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ ఆలస్యమవుతూనే ఉన్నాయి. ప్రతిదీ చెప్పిన సమయానికి అస్సలు రిలీజ్ కావట్లేదు. లెక్క ప్రకారం 'రాజాసాబ్' ఈ 10వ తేదీన రిలీజ్ కావాలి. కానీ వాయిదా గురించి నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో అభిమానులు ఫుల్ ఫ్రస్టేషన్ లో ఉన్నారు. 

(ఇదీ చదవండి: పాత కేసు.. హీరోయిన్ కి మళ్లీ అరెస్ట్ వారెంట్)

చాన్నాళ్ల క్రితం రాజాసాబ్ మూవీ సెట్స్ పైకి వెళ్లింది. కానీ ఇప్పటికీ షూటింగ్ పూర్తవలేదు. దీంతో ఈ ఏడాది రిలీజ్ అవుతుందా వచ్చే ఏడాది థియేటర్లలోకి వస్తుందా అని ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. తాజాగా డైరెక్టర్ మారుతిని ట్విటర్ లో అదే ప్రశ్న అడిగారు.

తాజాగా తిరుపతి, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాల్ని దర్శకుడు మారుతి దర్శించుకున్నాడు. ఆ ఫొటోలు పోస్ట్ చేయగా 'రాజాసాబ్' రిలీజ్ ఎప్పుడని ఫ్యాన్స్ అడిగారు. దీంతో మారుతి సమాధానమివ్వాల్సి వచ్చింది. 'రిలీజ్ అనేది నా ఒక్కడి చేతుల్లో లేదు. ఎలాంటి అప్డేట్ అయినా పీపుల్స్ మీడియా నిర్మాణ సంస్థ ఇస్తుంది' అని మారుతి చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: సింగపూర్‌లో అగ్ని ప్రమాదం.. పవన్‌ కుమారుడికి గాయాలు)

షూటింగ్ అప్డేట్ గురించి మరో అభిమాని అడగ్గా.. 'కొంత టాకీ, పాటల షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉంది. చాలా గ్రాఫిక్స్ సంస్థలు ఈ సినిమా కోసం పనిచేస్తు‍న్నాయి. కొన్ని సంస్థలు ఇచ్చిన ఔట్ పుట్ బాగుంది. చిత్రీకరణ పూర్తవగానే పాటలు రిలీజ్ చేస్తాం. మా కష్టాన్ని చూపించేందుకు మేం కూడా ఎదురుచూస్తున్నాం' అని డైరెక్టర్ మారుతి చెప్పుకొచ్చాడు.

డైరెక్టర్ చెప్పిన దానిబట్టి చూస్తే ఈ ఏడాదిలో రాజాసాబ్ రిలీజ్ కష్టమే అనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?

(ఇదీ చదవండి: దర్శకుడి భార్య బర్త్ డే పార్టీలో ఎన్టీఆర్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement