ప్రభాస్ 'ది రాజాసాబ్‌'.. బర్త్‌ డే రోజే వచ్చేస్తున్నాడు! | Rebel Star Prabhas Movie The Rajasaab Latest Update By Maruthi | Sakshi
Sakshi News home page

The Raja Saab: ప్రభాస్ 'ది రాజాసాబ్‌'.. అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్ మారుతి!

Oct 21 2024 4:29 PM | Updated on Oct 21 2024 4:37 PM

Rebel Star Prabhas Movie The Rajasaab Latest Update By Maruthi

రెబల్ స్టార్ ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న చిత్రం ది రాజాసాబ్‌. కల్కి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ అప్‌డేట్స్‌ కోసం ఎప్పుడెప్పుడా ‍అని తెగ ఆరా తీస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ కోసం ది రాజాసాబ్ టీమ్‌ అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. మరో రెండు రోజుల్లో డార్లింగ్ బర్త్‌ డే కావడంతో డైరెక్టర్ మారుతి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.

ఈనెల 23న డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు బ్లాస్టింగ్‌ ఖాయమని పోస్ట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే అదే రోజున టీజర్‌ రిలీజ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. బర్త్‌ డే రోజు ఫ్యాన్స్‌కు ది రాజాసాబ్ టీమ్ రాయల్ ట్రీట్‌ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో రెబల్ స్టార్ న్యూ లుక్‌లో అదిరిపోయేలా కనిపించాడు.

(ఇది చదవండి: ప్రభాస్ 'ది రాజాసాబ్' గ్లింప్స్‌.. అది రెబల్ స్టార్‌ క్రేజ్‌!)

ఇప్పటికే ది రాజాసాబ్ గ్లింప్స్‌ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన 24 గంటల్లోనే  20 మిలియన్స్‌కు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. కాగా.. ప్రభాస్ ఇప్పటి వరకు చేయని రొమాంటిక్ హారర్ జానర్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement