Malavika Mohanan Reacts On Question About Her Marriage And Bold Photoshoot, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

అందుకే అలాంటి ఫొటోలు పోస్ట్ చేస్తున్నా: మాళవిక మోహనన్

May 1 2024 9:07 AM | Updated on May 1 2024 1:23 PM

Malavika Mohanan Respond On Marriage And Bold Photoshoot

హీరోయిన్ మాళవిక మోహనన్ పెళ్లి గురించి స్పందించింది. అలానే హాట్ హాట్ ఫొటో షూట్స్ చేస్తూ ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గురించి కూడా క్లారిటీ ఇచ్చింది.

ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు గ్లామర్‌నే నమ్ముకుని ఛాన్సులు కొట్టేస్తుంటారు. గతంలో అవసరం బట్టి సినిమాల్లో మాత్రం అందాల ఆరబోత ఉండేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి వారిలో మాళవిక మోహనన్ ఒకరు. అయితే అలా ఎందుకు చేస్తున్నారనే ప్రశ్న ఆమెకు ఎదురైంది. దీనికి మాళవిక ఆసక్తికర సమాధానమిచ్చింది.

(ఇదీ చదవండి: మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే)

తరచూ గ్లామరస్ దుస్తుల్లో స్పెషల్ ఫొటో షూట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండడం గురించి తనని అడుగుతున్నారని చెప్పిన మాళవిక.. గ్లామర్ అంటే ఇష్టమని, అందుకే అలాంటి దుస్తులు ధరిస్తున్నట్లు చెప్పారు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని చాలామంది అడుగుతున్నారని.. తనను పెళ్లికూతురు దుస్తుల్లో చూడడానికి మీకెందుకో అంత ఆసక్తి అని నటి మాళవికా మోహన్ పేర్కొన్నారు.

మలయాళ సినిమాలతో నటిగా కెరీర్ మొదలుపెట్టిన మాళవిక..  రజనీకాంత్ 'పేట' మూవీతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. మాస్టర్, మారన్ తదితర చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం విక్రమ్ 'తంగలాన్'లో చేసింది. ఇది త్వరలో విడుదల కానుంది. అలానే తెలుగులో ప్రభాస్ సరసం 'రాజా సాబ్' మూవీలో ఓ హీరోయిన్‌గా చేస్తోంది.

(ఇదీ చదవండి: పవన్ వల్ల కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement