ఒకే ఒక్క సినిమా.. హిట్టయితే ఇండస్ట్రీని షేక్‌ చేయడం పక్కా! | Ashika Ranganath, Janhvi Kapoor, Malavika Mohanan Focus On Tollywood Movie | Sakshi

ఒకే ఒక్క సినిమా.. హిట్టయితే ఇండస్ట్రీని షేక్‌ చేయడం పక్కా!

Jun 8 2024 4:57 PM | Updated on Jun 8 2024 5:14 PM

Ashika Ranganath, Janhvi Kapoor, Malavika Mohanan Focus On Tollywood Movie

సాధారణంగా హీరోయిన్లకు నాలుగైదు హిట్లు పడితేకానీ గుర్తింపు రాదు. చిన్న చిన్న హీరోలతో నటించి మెప్పిస్తే..స్టార్‌ హీరోల సినిమాల్లో చాన్స్‌ వస్తుంది. అక్కడ ఒక్క హిట్‌ పడితే చాలు..ఇక స్టార్‌ హీరోయిన్‌ అయిపోతారు. వరుస అవకాశాలు వస్తాయి. అయితే ఇదంతా జరగడానికి కొంత సమయం పడుతుంది. అదృష్టం కూడా ఉండాలి. కానీ కొంతమంది హీరోయిన్లకి మాత్రం తొలి సినిమాతోనే స్టార్‌ హీరోలతో నటించే అవకాశం వస్తుంది. అది హిట్టయితే చాలు..వాళ్లు ఇండస్ట్రీని షేక్‌ చేయడం ఖాయం. అలాంటి బంపరాఫర్స్‌ని పట్టేసిన హీరోయిన్లపై ఓ లుక్కేద్దాం.

మాళవికా మోహన్‌.. ఈ బ్యూటీ పేరు తెలుగు ఆడియన్స్‌కి అంతగా గుర్తుండకపోవచ్చు కానీ, తమిళ్‌ ఆడియన్స్‌కి మాత్రం బాగా తెలుసు. రజనీకాంత్‌, విజయ్‌ లాంటి స్టార్‌ హీరోల సినిమాల్లో నటించింది.  ‘మాస్టర్‌’తో సూపర్‌ హిట్‌ అందుకుంది. అయితే ఈ బ్యూటీ ఇంతవరకు టాలీవుడ్‌ సినిమాల్లో నటించలేదు. ఇప్పుడు ఏకంగా పాన్‌ఇండియా స్టార్‌ ప్రభాస్‌ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. మారుతి-ప్రభాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాజాసాబ్‌’ చిత్రంలో మాళవిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా విడుదలై హిట్టయితే మాత్రం మాళవిక స్టార్‌ హీరోయిన్‌గా మారడం ఖాయం.

జాన్వీ కపూర్‌.. దీవంగత నటి, అందాల తార శ్రీదేవి ముద్దుల తనయగా బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్‌. అక్కడ వరుస సినిమాలు చేసిన రావాల్సినంత గుర్తింపు రాలేదు. దీంతో ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్‌పై కన్నేసింది. తొలి సినిమాతోనే ఎన్టీఆర్‌తో నటించే చాన్స్‌ కొట్టేసింది. కొరటాల శివ, ఎన్టీఆర్‌ కాంబోలో తెరకెక్కుతున్న ‘దేవర’మూవీలో జాన్వీనే హీరోయిన్‌. అంతేకాదు రామ్‌చరణ్‌-బుచ్చిబాబు కాంబినేసన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు విడుదలై హిట్టయితే..సౌత్‌లో ఈ బ్యూటీకి వరుస సినిమా అవకాశాలు రావడం ఖాయమని సీనీ విశ్లేషకులు చెబుతున్నారు.

అషికా రంగనాథ్‌.. టాలీవుడ్‌లో మెగాస్టార్‌ చిరంజీవి నటించే అవకాశం వచ్చిందంటే.. ఆ హీరోయిన్‌కి ప్రమోషన్స్‌ వచ్చినట్టే లెక్క. చిరుతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలని చాలా మంది కలలు కంటుంటారు. అయితే అషికా రంగనాథ్‌కి మాత్రం రెండో సినిమాతోనే మెగాస్టార్‌ సరసన నటించే అవకాశం దక్కింది. ‘నా సామిరంగ’తో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా రిలీజ్‌ తర్వాత అషికాకు తెలుగులో వరుస సినిమాలు వచ్చే అవకాశం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement