ప్రభాస్ 'రాజాసాబ్'... ఆ వార్తలు నమ్మొద్దని టీమ్ ప్రకటన | Prabhas Raja Saab Movie Team Clarify On Fake Audition | Sakshi
Sakshi News home page

Prabhas RajaSaab: ఆ విషయంలో మోసపోవద్దు.. మూవీ టీమ్ హెచ్చరిక

Jul 5 2024 5:36 PM | Updated on Jul 5 2024 6:11 PM

Prabhas Raja Saab Movie Team Clarify On Fake Audition

ప్రభాస్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా మరోసారి ఈ పేరు మార్మోగిపోతోంది. ఎందుకంటే రీసెంట్‌గా 'కల్కి' మూవీతో వచ్చాడు. హిట్ టాక్ తెచ్చుకుని వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్నాడు. ఇప్పటికే రూ.700 కోట్ల మార్క్ దాటేసింది. సరికొత్త రికార్డులు కూడా నమోదవుతున్నాయి. ఇది ఇలా ఉండగా ప్రభాస్ తర్వాత మూవీ గురించి టీమ్ కీలక ప్రకటన చేసింది. ఓ విషయంలో మోసపోవద్దని హెచ్చరించింది.

(ఇదీ చదవండి: రష్మిక 'కుబేర' వీడియో.. ఆ సూట్ కేసులో ఏముంది?)

'బాహుబలి' తర్వాత డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు చేస్తున్న ప్రభాస్.. 'రాజాసాబ్'గా త్వరలో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని హారర్ కామెడీ కథతో తీస్తున్నారని టాక్. ఇందులో నిజమెంతనేది పక్కనబెడితే ఇప్పుడు ఈ మూవీ పేరుచెప్పి కొందరు ఫేక్ ఆడిషన్స్ చేస్తున్నారట. ఇది నిర్మాతలకు తెలిసి అలెర్ట్ చేశారు.

'రాజాసాబ్ మూవీ ఆడిషన్స్ గురించి కొన్ని వార్తలు సర్క్యూలేట్ అవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. అయితే అదంతా ఫేక్. ఒకవేళ నిజంగా ఉంటే మేమే ప్రకటిస్తాం' అని నిర్మాతలు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. ఇకపోతే 'రాజాసాబ్'లో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బహుశా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కావొచ్చని టాక్ వినిపిస్తుంది. 

(ఇదీ చదవండి: Mirzapur 3: ‘మీర్జాపూర్‌ 3’ వెబ్‌సిరీస్‌ రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement