సుజిత్ దర్శకత్వంలో? | Run Raja Run Sujith To Direct Prabhas? | Sakshi
Sakshi News home page

సుజిత్ దర్శకత్వంలో?

Published Sat, Dec 6 2014 11:12 PM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM

సుజిత్ దర్శకత్వంలో?

సుజిత్ దర్శకత్వంలో?

‘బాహుబలి’ సినిమా పూర్తయ్యేంత వరకూ ప్రభాస్ మరో సినిమా అంగీకరించరు.’ ఏడాదిన్నర కాలంగా అటు మీడియాలోనూ,

 ‘బాహుబలి’ సినిమా పూర్తయ్యేంత వరకూ ప్రభాస్ మరో సినిమా అంగీకరించరు.’ ఏడాదిన్నర కాలంగా అటు మీడియాలోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ నానుతున్న మాట ఇది. ‘బాహుబలి’ కోసం తన శారీరక భాషను మార్చుకోవడం, దృఢకాయుడిగా మారడం, పాత్ర కోసం భారీగా బరువు పెరగడం... ఈ మార్పులు చూసిన అందరూ ‘ఇక ‘బాహుబలి’ పూర్తయ్యే వరకూ ప్రభాస్‌ని మరో సినిమాలో చూడలేం’ అని ఫిక్సయిపోయారు. ప్రభాస్ కూడా ఈ విషయమై మొన్నటి వరకూ క్లారిటీ ఇవ్వలేదు. అయితే... తాజాగా ఈ అంశంపై క్లారిటీ వచ్చింది.
 
  ‘బాహుబలి’ పూర్తవ్వక ముందే ప్రభాస్ మరో సినిమాకు పచ్చజెండా ఊపేశారు. ప్రభాస్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే. ‘రన్ రాజా రన్’ చిత్రంతో మంచి విజయాన్ని చేజిక్కించుకున్న యువ దర్శకుడు సుజిత్ చెప్పిన కథ నచ్చడంతో ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకున్నారట. ఫిబ్రవరి నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రభాస్ హీరోగా ‘మిర్చి’, సుజిత్ దర్శకత్వంలో ‘రన్ రాజా రన్’ చిత్రాలు నిర్మించిన వంశీ, ప్రమోద్ ఈ చిత్రానికి నిర్మాతలు. యూవీ క్రియేషన్స్ పతాకంపై రూపొందే ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement