Run Raja Run
-
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 'రన్ రాజా రన్' హీరోయిన్
Run Raja Run Herouine Seerat Kapoor Becomes Very Slim See Photos: 'రన్ రాజా రన్' చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం అయిన హీరోయిన్ సీరత్ కపూర్. ఈ సినిమాలో‘బుజ్జి మా.. బుజ్జి మా’సాంగ్ ఎంతలా ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక తొలి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ ఆ తర్వాత రాజుగారి గది-2లో నటించింది. అయినప్పటికీ పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ తెగ యాక్టివ్‌గా కనిపిస్తుంది. అయితే తాజాగా షేర్ చేసిన ఓ ఫోటోలో మాత్రం సీరత్ గుట్టుపట్టలేనంతగా మారిపోయింది. రన్ రాజా రన్ చిత్రంలో కాస్త బొద్దుగా కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు బక్కచిక్కిపోయి సైజ్జీరోలా తయారైంది. దీంతో ఏమైంది నీకు ఇలా తయారయ్యావ్ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) -
సెల్ఫీ అంటే కష్టమే
‘రన్ రాజా రన్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్గాపరిచయం అయ్యారు సీరత్ కపూర్. ఆ తర్వాత ‘టైగర్’, ‘రాజుగారి గది 2’,‘ఒక్క క్షణం’ వంటి చిత్రాల్లో సీరత్ నటనకు ప్రేక్షకులు మంచి మార్కులేవేశారు. ఇటీవల ఓటీటీలో విడుదలైన‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రంలోకథానాయికగా నటించారు సీరత్.ఈ సందర్భంగా తన కెరీర్ జర్నీగురించి సీరత్ ఈ విధంగా చెప్పారు. ‘కృష్ణ అండ్ హీజ్ లీల’లో చేసిన పాత్ర గురించి? ఎవరి మీదా ఆధారపడని ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయి పాత్రను ఇందులో చేశాను. ఇతరులు చెప్పింది వింటుంది కానీ తన నిర్ణయానికే ప్రాధాన్యం ఇస్తుంది. ఈ క్యారెక్టర్ గురించి డైరెక్టర్ రవికాంత్ చెప్పినప్పుడు ఆసక్తికరంగా అనిపించింది. ఎందుకంటే నా నిజజీవితానికి కాస్త దగ్గరగా ఈ పాత్ర ఉంటుంది. కరోనా కారణంగా ప్రస్తుతం థియేటర్స్ ఓపెన్ చేసి లేవు. లాక్డౌన్ వల్ల ఆడియన్స్ ఇంట్లోనే ఉంటున్నారు. ఇప్పుడు ఓటీటీ మంచి ఆప్షన్. మంచి కంటెంట్ ఉన్న మా సినిమా ఆదరణ పొందుతోంది. లాక్డౌన్ వల్ల కొందరి జీవనశైలి గాడి తప్పింది.. అవును. చాలా బాధగా ఉంది. అదే సమయంలో నాకింత సౌకర్యవంతమైన జీవితాన్ని ఇచ్చిన ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. లైఫ్‌లో ఎలాంటి ఇబ్బంది లేని అమ్మాయిగా ఇతరుల పట్ల దయగా ఉండాలని, ఎవరినీ అనవసరంగా నిందించకూడదని, చేతనైతే సహాయం చేయాలని, ఎవరికీ హాని చేయకూడదని బలంగా నిర్ణయించుకున్నాను. హీరోయిన్ కావడం వల్ల స్వేచ్ఛ కోల్పోయినట్లు అనిపిస్తోందా? తెరపై మమ్మల్ని చూసి చాలామంది ఇష్టపడతారు. అదే సమయంలో మా వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంటారు. సినిమా స్టార్స్ ఎవరైనా వ్యక్తిగత జీవితాలకు సంబంధించి కొన్ని త్యాగాలు చేయక తప్పదు. యాక్టర్స్ కనిపించినప్పుడు ఫ్యాన్స్ సెల్ఫీ అడుగుతారు. షూటింగ్ చేసి, అప్పటికే అలసిపోయి ఉంటాం. ఒకవేళ షూటింగ్‌కి వెళ్తుంటే సమయానికి లొకేషన్‌కు చేరుకునే టెన్షన్లో ఉంటాం. అప్పుడు సెల్ఫీ అంటే కష్టమే. కానీ అభిమానుల ప్రేమను అర్థం చేసుకోవాలి. వారి ప్రేమ వెలకట్టలేనిది. మీ లైఫ్‌లో లవ్ ప్రపోజల్స్ ఉన్నాయా? ఎక్కువేం రాలేదు కానీ కొన్ని వచ్చాయి. కాలేజ్ డేస్‌లో కొంతమంది అబ్బాయిలు ప్రపోజ్ చేశారు కూడా. అబ్బాయిలు అంత ధైర్యంగా అమ్మాయిలకు ఎలా ప్రపోజ్ చేస్తారా? అని నవ్వుకునేదాన్ని. ఆ విషయంలో అబ్బాయిలంటే నాకు గౌరవం ఏర్పడింది. అయితే నేను ఎవరి లవ్‌నీ అంగీకరించలేదనుకోండి (నవ్వుతూ). ∙కరోనా ‘భౌతిక దూరం’ పాటించాలంటోంది.. మరి.. షూటింగ్‌లు ఆరంభమయ్యాక రొమాంటిక్ సీన్స్ చేయాలంటే.. కథలోని పాత్ర డిమాండ్ చేస్తే ఆ సీన్స్‌లో నటిస్తాను. తప్పదు. అయితే ఇకనుంచి షూటింగ్స్ అన్నీ కరోనాకి తగ్గట్టుగా జరుగుతాయి కదా. చూడాలి మరి.. మీ తర్వాతి ప్రాజెక్ట్స్? ‘మా వింత గాధ వినుమా’ సినిమా చేస్తున్నాను. -
హ్యాట్రిక్ హీరో ఖాళీగా ఉన్నాడు
ఇండస్ట్రీలో ఏ హీరో అయినా ఒక్క హిట్ ఇస్తే చాలు గ్యాప్ తీసుకోకుండా వెంటనే మరో సినిమా మొదలెట్టేస్తారు. అలాంటిది ఓ యంగ్ హీరో మాత్రం వరుసగా మూడు హిట్స్ ఇచ్చిన తరువాత కూడా మరో సినిమాను మొదలెట్టడానికి ఆలోచిస్తున్నాడు. రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాలతో వరుస సక్సెస్‌లు సాధించిన యంగ్ హీరో శర్వానంద్. ఇంత మంచి ఫాంలో ఉన్న ఈ యంగ్ హీరో చాలా రోజులుగా తన నెక్ట్స్ సినిమాను స్టార్ట్ చేయకుండా ఎదురు చూస్తున్నాడు. శర్వా చివరి చిత్రం ఎక్స్‌ప్రెస్ రాజా సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ అయ్యింది. స్టార్ హీరోల సినిమాలు బరిలో ఉన్నా డీసెంట్ హిట్‌తో ఆకట్టుకున్నాడు శర్వానంద్. ఈ సినిమాతో స్టార్ లీగ్‌లో చేరిపోయాడని భావించినా.. తరువాత మాత్రం స్లో అయ్యాడు. ఎక్స్ ప్రెస్ రాజా రిలీజ్ అయి ఆరు నెలలు గడుస్తున్నా ఇంతవరకు తన నెక్ట్స్ సినిమాను ప్రారంభించలేదు. దిల్‌రాజు నిర్మాణంలో శతమానం భవతి సినిమాలో నటిస్తున్నాడంటూ టాక్ వినిపించినా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. -
అమ్మకు అర్జంట్‌గా కోడలు కావాలట - శర్వానంద్
‘ఈ మధ్య అమ్మ, నన్ను పోరడం మొదలుపెట్టింది. అదేంటో మీకూ అర్థమైపోయుంటుంది. మ్యారేజ్... అమ్మకు అర్జంట్‌గా కోడలు కావాలట. చంపుతోంది. నేను చాలా తెలివిగా తప్పించుకుంటున్నా. చూద్దాం... అమ్మకు చిక్కకుండా ఎన్నాళ్లుంటానో! ’ - శర్వానంద్ ► కింద పడే బెంగ లేదు... పెకైదగననే భయం లేదు. ► రేపటి ఆలోచన లేదు... ఇవాళ్టికో స్ట్రాటజీ లేదు. ► హీరోగా పుట్టలేదు... యాక్టర్‌గా ఎదిగాడు. ► స్టార్ అయినా... రోడ్డు మీద చాట్ మానలేదు. ► బాల్యాన్ని మర్చిపోలేదు... స్నేహితుల్ని వదులుకోలేదు. ► షూటింగ్లో ఉంటే హ్యాపీ... ► లైఫ్‌లో ఉంటే హ్యాపీ గో లక్కీ. ► ఎప్పుడూ ఆనందంగా ఉండాలని ఎవరో స్వామీజీ ఈ పేరు సూచించారట. ► అమ్మ పేరు వసుంధరాదేవి. నాన్న పేరు ఎమ్.ఆర్.వి. ప్రసాదరావు. నాన్న బిజినెస్‌మేన్. ► నా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే - ‘జెన్యూన్’ అని చెబుతాను. ► నాలో మైనస్ పాయింట్ ఏమంటే - ఎవరినైనా ఇట్టే నమ్మేస్తా. ►‘రన్ రాజా రన్’ టైమ్‌లో ప్రభాస్ అన్న చెప్పడంతో నా లుక్ మార్చా. ► చిరంజీవిగారు, దీపికా పదుకొనే అంటే చాలా ఇష్టం. నిత్యామీనన్ అంటే ఇష్టం... మంచి ఆర్టిస్ట్. ► రాజమౌళి... మన తెలుగువాడైనందుకు మనమంతా గర్వపడాలి. ► ఖాళీ సమయాల్లో ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ పాటలు వింటుంటాను. ► ఈమధ్య ఫిలసాఫికల్ బుక్స్ చదువుతున్నా. ►‘రన్ రాజా రన్’ డెరైక్టర్ సుజిత్ చెప్పడంతో ఫేస్బుక్ ఓపెన్ చేశా. ట్విట్టర్లో లేను. ► అమ్మాయిలకు సైట్ కొట్టడం లాంటివన్నీ కామన్. అటెండెన్స్ షార్టేజ్ వస్తే, ఇంట్లో వాళ్లను తీసుకురమ్మని కాలేజ్‌లో చెబితే మా ఫ్రెండ్సే ఆదుకునేవారు. ► సినిమా ఫంక్షన్లూ, పార్టీల్లో ఎక్కువ కనబడను. నేను పెద్దగా బయటకు రాను. ► నా మీద గాసిప్స్ రావంటే? ఎందుకొస్తాయి. ఉంటేనే కదా వచ్చేది. ► షూటింగ్స్ లేకపోతే చాలా ఆలస్యంగా నిద్రలేస్తా. అర్ధరాత్రి వరకూ మేలుకునే ఉంటా. రోజూ 2, 3 సినిమాలు చూడనిదే నిద్రపట్టదు. ► నా కెరీర్లో రాంగ్ స్టెప్ అంటే - ‘కో అంటే కోటి’ సినిమా తీయడం. ► ఆ టైమ్‌కి అది కరెక్ట్ డెసిషన్ కాదు. కానీ ఓ రకంగా అది నాకు మంచే చేసింది. చాలా అనుభవాన్నిచ్చింది. భవిష్యత్తులో ప్రొడక్షన్ చేస్తా. కానీ అందులో నేను యాక్ట్ చేయను. ► డెరైక్షన్ చేసే ఉద్దేశం ప్రస్తుతానికి లేదు. ఎడిటింగ్లాంటివి ఏదో ఒకటి నేర్చుకోవాలని ఉంటుంది. ►‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ ఫేమ్ మేర్లపాక గాంధీ డెరైక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నా. ఇంకో కొత్త దర్శకుడి కథ ఓకే అయింది. వీధి నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్. వెంగళరావునగర్ కాలనీలో ఇప్పటికీ నన్ను వాళ్లింట్లో అబ్బాయిలా చూసుకుంటారు. అక్కడి వీధుల్లో క్రికెట్ ఆడిన రోజులు ఇంకా గుర్తున్నాయి. మా కాలనీ ఫ్రెండ్స్‌తో బస్సు మిస్సయితే షేర్ ఆటో ఎక్కడం, అమీర్‌పేట సెంటర్లో చాట్ తినడం... నాన్న బిజినెస్‌మేన్ అయినా మమ్మల్ని నార్మల్‌గానే పెంచారు. క్లాస్మేట్స్ రామ్‌చరణ్, రానా, ‘యూవీ క్రియేషన్స్’ విక్కీ నా క్లాస్మేట్స్! మేమంతా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బ్యాచ్. హాలీడే వస్తే చాలు చరణ్, నేను జూబ్లీహిల్స్ క్లబ్‌కి వెళ్లి బ్యాడ్మింటన్ ఆడేవాళ్లం. చాలా టోర్నమెంట్స్‌లో ఆడాం. సిక్త్స్ క్లాస్ నుంచి నాకు రానా తెలుసు. ఇద్దరం ఒకే ట్యూషన్కెళ్లేవాళ్లం. నేను మారినన్ని స్కూల్స్ ఇంకెవరూ మారి ఉండరేమో. బాగా చదవకపోవడం వల్ల వచ్చిన తిప్పలు ఇవన్నీ. ఏ సినిమా రిలీజైనా ఫస్ట్‌డే... మార్నింగ్ షో చూసి తీరాల్సిందే. సికింద్రాబాద్ సంగీత్, బేగంపేట ఆనంద్ థియేటర్లు మా అడ్డాలు. చాంతాడంత క్యూలో ఎండలో నిలబడి టికెట్లు సంపాదించడం థ్రిల్. ఆ లైఫే వేరులెండి. గమ్యం ఆ రోజు నాకింకా బాగా గుర్తు. ‘చిత్రం’ సినిమా రిలీజైంది. అబ్బా ఏం జనం... ఓ కొత్త కుర్రాడి సినిమాకి ఇంత జనమా? నేను కూడా ఇలా హీరో అయితే ఎంత బాగుంటుంది అనిపించింది లేదా ప్రకాశ్‌రాజ్‌లాగా మంచి పేరున్న నటుడు అనిపించుకుంటే చాలనుకున్నా. నాన్న సపోర్ట్ లేకుండా ‘స్వయంకృషి’లో చిరంజీవిలాగా చిన్న స్థాయి నుంచి ఎదగాలనుకున్నా. అమ్మా చెప్పంది ‘అమ్మా... నేను సినిమా యాక్టర్‌నవుతా’ అని చెప్పగానే ‘నీకంత సీన్ లేదురా’ అనేసింది. ‘అదేంటమ్మా అలా అనేశావ్?’ అనడిగాను. ‘చిన్నీ... నువ్వు చాలా చిన్నవాడివి... ఈలోకం పోకడ తెలీనివాడివి, ఇండస్ట్రీ అంటే అదో మహాసముద్రం. నీకు సెట్ కాదురా’ అని చెప్పింది. నేను వింటే కదా. నా పంతం నాదే. ఇప్పుడు బాల్ నాన్న కోర్టులోకి వెళ్లింది. నాన్న చాలా క్యాజువల్‌గా ‘నీకేది ఇంట్రస్ట్ ఉంటే అది చెయ్. ముందు నా చేతిలో నీ డిగ్రీ సర్టిఫికెట్ పెట్టు. ఆ తర్వాతే ఏదైనా’ అనేశారు. ఐదోతారిఖు అదే నా ఫస్టు సినిమా. అమ్మ చూసింది. నేను బాగా చేయలేదని డెరైక్ట్‌గా చెబితే ఫీలవుతాననుకుంది - ‘బావుందిరా... ఇంకా బాగా ఇంప్రూవ్ కావాలి’ అని మెచ్చుకుంది. ఈసారి ఇలాంటి ఛాన్సు ఇవ్వకూడదు. బాగా కాన్సన్ట్రేట్ చేశా. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ చూసి అమ్మ ఆనందపడింది. కానీ శంకర్‌దాదా ఎమ్‌బీబీఎస్, ‘అమ్మ చెప్పింది’, ‘వెన్నెల’ చూసి తెగ ఇదై పోయింది. ‘వద్దురా చిన్నీ... నిన్నిలాంటి శాడ్ కేరెక్టర్స్‌లో చూడలేకపోతున్నా’ అనేసింది. ‘రన్ రాజా రన్’ చూసి మాత్రం అమ్మ ఫుల్ ఖుష్. ప్రస్తానం 2003లో ‘5వ తారీఖు’ సినిమాతో నా కెరీర్ స్టార్ట్. ఈ పన్నెండేళ్లలో 23 సినిమాలు చేశా. అందులో 3 తమిళ సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నా ప్రోగ్రెస్ కార్డ్ చూసుకుంటే ఐ యామ్ సో హ్యాపీ. ఎవరికైనా ఇంతకన్నా ఏం కావాలి? ఎక్కడో మొదలై ఇక్కడకొచ్చాను కదా! యువసేన నేనెప్పుడైనా పార్టీ ఇవ్వాలనుకుంటే నా పని అంతే. ఎందుకంటే అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. స్కూల్స్ ఎక్కువ మారడం వల్ల ప్రతి స్కూల్లోనూ ఓ గ్యాంగ్ ఏర్పడ్డారు. ఇక కాలేజీ గ్యాంగ్ ఎలానూ ఉంది. వాళ్లందరితోనూ ఇప్పటికీ నేను టచ్‌లో ఉన్నా. మేమంతా కలిస్తే సందడే సందడి. అందరి బంధువయ మాది చాలా పెద్ద ఫ్యామిలీ. అమ్మతరపు, నాన్న తరపు చాలామంది బంధువులున్నారు. అవనిగడ్డ, బందరు, విజయవాడ, హైదరాబాద్‌ల్లో బోల్డంతమంది రిలేటివ్స్ ఉన్నారు. నేను అన్ని ఫంక్షన్లకూ వెళ్తుంటాను. హీరో రామ్ సిస్టర్ని మా అన్నయ్యే పెళ్లి చేసుకున్నాడు. ‘రన్ రాజా రన్' ఏమాత్రం ఖాళీ దొరికినా నేను యూఎస్ వెళ్లిపోతా. మా అక్క అక్కడే ఉంటుంది. అక్క మీద ప్రేమ కన్నా, సరదాగా ఎంజాయ్ చేయొచ్చనే కారణమే ఎక్కువ. యూఎస్, యూకె ట్రిప్ పూర్తి చేసుకుని లాస్ట్ వీక్ హైదరాబాద్ వచ్చాను. ఒక్కోసారి ఏడాదికి 3, 4 సార్లు యూఎస్ వెళ్లిన సందర్భాలున్నాయి. నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. లాంగ్ డ్రైవ్స్‌కి వెళ్తుంటా. మన కంట్రీలో చాలా ఏరియాలు తిరిగేశా. ఢిల్లీ నుంచి లే లడాఖ్ వరకూ వెళ్లా. చైనా బోర్డర్, పాకిస్తాన్ బోర్డర్క్కూడా వెళ్లా. ఎక్కడకెళ్లినా ఆ ఏరియా ఫుడ్ తినేస్తా. నో రిస్ట్రిక్షన్స్. జర్నీ నాకు తెలిసి ఈ జనరేషన్ హీరోల్లో ఎవ్వరికీ నాలాంటి జర్నీ లేదు. ఎందుకంటే - అందరూ డెరైక్ట్‌గా హీరోలైపోయారు. నేను మాత్రం ఫ్రెండ్ వేషాలు, తమ్ముడి వేషాలు, నెగటివ్ వేషాలు వేసుకుంటూ ఈ స్థాయికొచ్చాను. నా ఇమేజ్ ఏంటో, నా మార్కెట్ రేంజ్ ఏంటో నాకు బాగా తెలుసు. దానికి తగ్గట్టుగానే నా కథల ఎంపిక ఉంటుంది. ఇకపై నేను చేసే సినిమాల బడ్జెట్లన్నీ కంట్రోల్లోనే ఉంటాయి. ఉండాలి కూడా. అనవసరపు ఖర్చులు, హంగామాలూ వద్దని నిర్మాతకు ముందే చెప్పేస్తున్నా. అలాగే 50 రోజుల్లోపు సినిమా పూర్తి చేసేయాలని కూడా చెప్పేస్తున్నా. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్ పరిస్థితి బాగా లేదు. అందరూ ముందే జాగ్రత్త పడాలి. హీరోలు ఒక్కరే హ్యాపీ అని కాకుండా, అందరూ హ్యాపీగా ఉండేలా సినిమాలు తీస్తే బావుంటుంది. - పులగం చిన్నారాయణ మళ్లీ మళ్లీ ఇది రాని రోజు నిజమే... ఆ రోజు మళ్లీ రాదు. నా ఫేవరెట్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి ‘థమ్సప్’ యాడ్‌లో వీణ స్టెప్ వేయడం. ఆ రోజు నా పరిస్థితి చూడాలి. అంత థ్రిల్... ఆ ఎగ్జైట్ మెంట్ ఎన్ని కోట్లిచ్చినా రావంటే నమ్మండి. ‘ఇంద్ర’ కోసం వీణ స్టెప్ పాట షూట్ చేస్తున్నపుడే నేను, చరణ్ లొకేషన్కెళ్లాం. చిరంజీవిగారు మెస్మరైజింగ్‌గా స్టెప్స్ వేస్తుంటే, నేనలా కళ్లార్పకుండా చూస్తూ ఉండిపోయా. అదే స్టెప్ని ఆయనతో కలిసి వేస్తానని కలలో కూడా ఊహించలేదు. -
'ఆ సినిమా రీమేక్ కు డైరెక్షన్ చేయడం లేదు'
చెన్నై:2014 వ సంవత్సరంలో తెలుగులో ఘనవిజయం సాధించిన రన్ రాజా రన్ సినిమా తమిళ రీమేక్ కు తాను దర్శకత్వం వహించడం లేదని దర్శకుడు సుజిత్ స్పష్టం చేశాడు. ఆ సినిమాను తెలుగులో తాను తీసినా.. తమిళ రీమేక్ కు మాత్రం దర్శకత్వం వహించడం లేదన్నాడు. రన్ రాజా రన్ కు తాను దర్శకత్వం వహిస్తున్నట్లు వచ్చిన వార్తలను సుజిత్ తాజాగా ఖండించారు. ప్రస్తుతం తన తదుపరి ప్రభాస్ చిత్ర స్క్రిప్ట్ లో బిజీగా ఉన్నట్లు సుజిత్ తెలిపాడు. అయినా తమిళ చిత్ర రీమేక్ కు తనను ఎవరూ సంప్రదించలేదన్నాడు. ఆ సినిమా రీమేక్ కు ఎవరు దర్శకత్వం వహిస్తున్నారో కూడా తనకు తెలియదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. -
ఎక్స్ట్రార్డినరీ!
‘‘కథను నమ్మి ఈ సినిమా చేస్తున్నా’’ అని సందీప్ కిషన్ పూర్తి స్థాయి ఆత్మవిశ్వాసంతో చెప్పారు. ఆయన హీరోగా రూపొందుతోన్న పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘టైగర్’. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సీరత్‌కపూర్ ఇందులో కథానాయిక. ఏఆర్ మురుగదాస్ శిష్యుడు వి.ఐ. ఆనంద్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ, అగ్ర నిర్మాతలు ఎన్.వి. ప్రసాద్, ‘ఠాగూర్’ మధు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను సోమవారం మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత ఎన్.వి. ప్రసాద్, సమర్పకుడు ‘ఠాగూర్’ మధు మాట్లాడుతూ -‘‘ఎక్స్ట్రార్డినరీ కథ ఇది. సందీప్‌కిషన్‌ను హీరోగా మరో స్థాయికి తీసుకెళ్లే సినిమా అవుతుంది. సాంకేతిక విలువలు గొప్పగా ఉంటాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. దాదాపుగా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ నెల 14న ‘ఐ’ సినిమాతో పాటు ఫస్ట్ టీజర్‌ను థియేటర్లలో విడుదల చేస్తున్నాం’’ అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘కాశీ నేపథ్యంలో సాగే కథ ఇది. వినోదానికి ప్రాధాన్యమున్న మంచి యాక్షన్ థ్రిల్లర్’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ఛోటా కె. నాయుడు, సంగీతం: తమన్, మాటలు: అబ్బూరి రవి, ఎడిటింగ్: ఛోటా కె. ప్రసాద్, కో-డెరైక్టర్: పుల్లారావు కొప్పినీడి, లైన్ ప్రొడ్యూసర్: జి. నాగేశ్వరరావు. -
కొత్త దర్శకుని ఛాన్స్ ఇచ్చిన స్టార్ హీరో!
-
సుజిత్ దర్శకత్వంలో?
‘బాహుబలి’ సినిమా పూర్తయ్యేంత వరకూ ప్రభాస్ మరో సినిమా అంగీకరించరు.’ ఏడాదిన్నర కాలంగా అటు మీడియాలోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ నానుతున్న మాట ఇది. ‘బాహుబలి’ కోసం తన శారీరక భాషను మార్చుకోవడం, దృఢకాయుడిగా మారడం, పాత్ర కోసం భారీగా బరువు పెరగడం... ఈ మార్పులు చూసిన అందరూ ‘ఇక ‘బాహుబలి’ పూర్తయ్యే వరకూ ప్రభాస్‌ని మరో సినిమాలో చూడలేం’ అని ఫిక్సయిపోయారు. ప్రభాస్ కూడా ఈ విషయమై మొన్నటి వరకూ క్లారిటీ ఇవ్వలేదు. అయితే... తాజాగా ఈ అంశంపై క్లారిటీ వచ్చింది. ‘బాహుబలి’ పూర్తవ్వక ముందే ప్రభాస్ మరో సినిమాకు పచ్చజెండా ఊపేశారు. ప్రభాస్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే. ‘రన్ రాజా రన్’ చిత్రంతో మంచి విజయాన్ని చేజిక్కించుకున్న యువ దర్శకుడు సుజిత్ చెప్పిన కథ నచ్చడంతో ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకున్నారట. ఫిబ్రవరి నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రభాస్ హీరోగా ‘మిర్చి’, సుజిత్ దర్శకత్వంలో ‘రన్ రాజా రన్’ చిత్రాలు నిర్మించిన వంశీ, ప్రమోద్ ఈ చిత్రానికి నిర్మాతలు. యూవీ క్రియేషన్స్ పతాకంపై రూపొందే ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. -
‘మళ్ళీ మళ్ళీఇది రాని రోజు’ మూవీ స్టిల్స్
-
‘షకలక’ శంకర్
కష్టాలను మరచిపోయేందుకు నవ్వుతూ గడిపాడు. ప్రేక్షకులను నవ్విస్తూ తన పేదరికాన్ని ఎదిరించాడు. పకపకా నవ్వాలంటే అతడి కామెడీ చూడాల్సిందే అనే రేంజ్‌కు ఎదిగిపోయాడు. శ్రీకాకుళం యాస విప్పితే కిలకిలా నవ్వకుండా ఉండలేం.. రాంగోపాల్‌వర్మలా అనుకరిస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే! అతడే షకలక కామెడీ శంకర్. శ్రీకాకుళం జిల్లాకు చెందిన శంకర్ ఆర్థిక స్తోమత లేక పదో తరగతికే ఫుల్స్టాప్ పెట్టేశాడు. అష్టకష్టాలు పడుతూ జీవితాన్ని నెట్టుకొచ్చే వాడు. ఒకరోజు మంజునాథ సినిమా షూటింగ్లో చిరంజీవిని చూసి ఫిదా అయిపోయాడు. ఎలాగైనా సినిమాల్లో నటించాలనుకుని 2002లో హైదరాబాద్ బస్సెక్కాడు. పెయింటింగ్ తప్ప ఇంకే పనీ రాదు. హైదరాబాద్‌లో మొదట స్నేహితుల వద్ద ఉంటూ నాలుగేళ్ల పాటు పెయింటింగ్ పనికి వెళ్లాడు. ఆ తర్వాత ప్రముఖ సినీనటి నిర్మలమ్మ వద్ద పనిచేశాడు. అప్పుడే సినీ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆఫీస్ బాయ్‌గా, ప్రొడక్షన్ బాయ్‌గా పని చేస్తూ సినిమాలు చూస్తూ గడిపేవాడు. రన్ రాజా రన్ దర్శకుడు అప్పట్లో తాను తీసిన షార్ట్‌ఫిలింలో ఒక అవకాశం ఇచ్చాడు. దానిని సద్వినియోగం చేసుకున్నాడు. క్లిక్ కావడంతో వెంటనే ప్రముఖ నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి జబర్దస్త్ కామెడీషోలో అవకాశం ఇవ్వడం.. ప్రేక్షకులు ఆదరించడంతో ఇక వెనుదిరిగి చూడలేదు. తర్వాత గీతాంజలి, రన్ రాజా రన్ సినిమాల్లో నటించాడు. అనేక సినిమాల్లో నటిస్తూ శంకర్ ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్ అయ్యాడు. ఇదంతా షార్ట్ ఫిల్మ్ మహిమే అంటాడు శంకర్! -
ఇదో ‘ప్రేమ్’కథ
ప్రేమ ఓ మధుర జ్ఞాపకం... అది ఎప్పుడు... ఎక్కడ... ఎలా.. మొదలవుతుందో ఎవరికీ తెలియదు. ఆ ప్రేమ పుట్టుక తొలిచూపునకే అవ్వొచ్చు.. తొలి పలుకుకే అవ్వొచ్చు.. తొలి స్పర్శకే అవ్వొచ్చు.. అలాంటి ఈ ప్రేమ దేశంలో ఒకమ్మాయిని ఫస్ట్ టైం చూసి ప్రేమ్ అనే కుర్రాడు పడిన తపన.. తన ప్రేమను ఎలా సాధించుకున్నాడు అనే అంశంతో లఘు చిత్ర దర్శకుడు చేతన్ సిరసపల్లి నిర్మించిన ప్రేమ్‌కథ లఘు చిత్రం నెటిజన్ల మనసు దోచుకుంటోంది. బీటెక్ విద్యార్థి చేతన్ దర్శకత్వం మీద ఉన్న మక్కువతో ప్రణీత్, కృష్ణకుమారిలను హీరో, హీరోయిన్లుగా తీసుకొని అద్భుతమైన స్క్రీన్‌ప్లే, మాటలతో ఈ లఘు చిత్రాన్ని తెరకెక్కించాడు. వైజాగ్‌లోని సుందరమైన లోకేషన్లలో చిత్రీకరించాడు. దీని తరువాత చేతన్‌కు రన్ రాజా రన్ దర్శకుడు సుజిత్ నుంచి పిలుపు వచ్చింది. అతడి నూతన చిత్రంలో దర్శకత్వ విభాగంలోనూ చోటు సంపాదించాడు. జీవితాంతం గుర్తుండిపోయేలా ప్రేమకథా చిత్రాలను తీస్తానని చేతన్ చెబుతున్నాడు. -
బాహుబలిని కొనేయాలని..
-
పదకొండేళ్లుగా...ఈ రోజు కోసమే ఎదురుచూశా..!
‘‘సినిమా సినిమాకీ ఎంత విరామం తీసుకున్నానో ఎప్పుడూ లెక్కలేసుకోలేదు. మంచి సినిమా చేయాలనే తపనతో మంచి కథ కుదిరే వరకూ ఎదురుచూస్తుంటాను’’ అని శర్వానంద్ చెప్పారు. కెరీర్ ప్రారంభం నుంచి ఎలాంటి చట్రంలో ఇరుక్కోకుండా, ఎలాంటి పాత్రకైనా పనికొస్తాడనిపించుకున్నారు శర్వా. ఇటీవలే ‘రన్ రాజా రన్’లో నటించిన శర్వా ఆ సినిమా తాను ఆశించినట్టుగానే మంచి ఫలితాన్ని చ్చిందన్నారు. ఈ సందర్భంగా శర్వాతో జరిపిన భేటీ... ‘రన్ రాజా రన్’ మీ కెరీర్‌కి ఎలాంటి సినిమా? నాకు తెలిసి ఇప్పటివరకు నేను చేసిన అన్ని చిత్రాల్లోకెల్లా వసూళ్ల పరంగా నంబర్ వన్ అనొచ్చు. పదకొండేళ్లుగా ఈ ఒక్కరోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఇలాంటి విజయం యూవీ క్రియేషన్స్ ద్వారా రావడం ఆనందంగా ఉంది. ఎందుకంటే, నా మిత్రుడు విక్కీకి నిర్మాతగా ఇది తొలి చిత్రం. యూవీ సంస్థ అధినేతలు వంశీ, ప్రమోద్‌లు కూడా మంచి మిత్రులే. అందుకేనా... పారితోషికం గురించి అడగకుండా ఈ చిత్రం చేశానని ఆడియో ఫంక్షన్లో మీరు చెప్పారు...? అవును. అసలు మా మధ్య డబ్బు ప్రస్తావనే రాలేదు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడానికి కారణం నిర్మాతలే. పబ్లిసిటీ పరంగా ఎక్కడా వెనకాడలేదు. అలాగే, ఈ చిత్రకథ వినగానే ‘చేయగలమా’ అని సందేహించాను. కానీ, దర్శక, నిర్మాతలు నన్ను నమ్మారు. ఈ సినిమాలో నేను బాగా చేశానంటే ఆ ఘనత మొత్తం దర్శకుడు సుజీత్కే దక్కుతుంది. శర్వానంద్ సీరియస్ పాత్రలే చేస్తున్నాడనేవారికి సమాధానం చెప్పడానికేనా ‘రన్ రాజా రన్’లాంటి ఎంటర్టైనర్ చేశారు? సమాధానం చెప్పాలని కాదు కానీ.. ఈ సినిమాలో నేను చేసిన రాహుల్ పాత్ర లాంటిది చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. చివరికి సుజీత్ ద్వారా నా కోరిక నెరవేరింది. శర్వా ఎలాంటి పాత్రలైనా చేయగలడని ఈ సినిమా మరోసారి నిరూపించింది. పాత్ర డిమాండ్ చేస్తే.. డీ-గ్లామరైజ్డ్గా కనిపించడానికి, నెగటివ్ యాంగిల్ చూపించడానికి నేను రెడీ. విచిత్రం ఏంటంటే.. నేను కెరీర్ ఆరంభించినప్పుడు నా వయసు 19 ఏళ్లు. అప్పుడు, సీరియస్ కేరెక్టర్లు చేసిన నేను, ఇప్పుడు ముప్ఫయేళ్ల వయసుకి దగ్గరపడుతున్న సమయంలో వినోదాత్మక పాత్రలు చేస్తున్నా. మాస్ ఇమేజ్ తెచ్చుకుంటే కోట్ల రూపాయల బడ్జెట్ సినిమాలు, కోట్ల పారితోషికం తీసుకోవచ్చు కదా? తీసుకోవచ్చండి. కానీ, అలాంటి భారీ సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. నేను ఎలాంటి ఇమేజ్‌నీ సొంతం చేసుకోకుండా విభిన్న తరహా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతాను. ప్రస్తుతం చేస్తున్న చిత్రాల గురించి? క్రాంతిమాధవ్ దర్శకత్వంలో కేయస్ రామారావుగారు నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నాను. తమిళంలో ఓ చిత్రం, తెలుగులో మరో చిత్రం ఓకే చేశా. ఇంతకూ మీ పెళ్లెప్పుడు? నాకు నచ్చిన అమ్మాయి తారసపడలేదు. -
రన్ రాజా రన్ టీమ్‌తో చిట్‌చాట్
-
ఆ లఘు చిత్రం టైటిలే దీనికి పెట్టాను
‘‘లక్స్ సబ్బు వాణిజ్య ప్రకటనకి సహాయ దర్శకునిగా పనిచేసేవాణ్ణి. ఓ రోజు యాడ్ చేస్తున్న సమయంలో అందులోని ఓ సన్నివేశం నాకు నచ్చలేదు. అదే దర్శకుడికి చెప్పాను. ‘ఎలా తీస్తే బావుంటుందో నువ్వే చెప్పు’ అన్నారాయన. నాకు తెలిసింది చెప్పాను. అందరూ మెచ్చుకున్నారు. ఎలాగైనా దర్శకుడు కావాలనే ఆకాంక్ష ఆ రోజే నాలో బలంగా మొదలైంది’’ అని యువ దర్శకుడు సుజిత్ చెప్పారు. ఆయన దర్శకత్వంలో శర్వానంద్ కథానాయకునిగా రూపొందిన చిత్రం ‘రన్ రాజా రన్’. యు.వి.క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా సుజిత్ పత్రికల వారితో ముచ్చటిస్తూ -‘‘ఇప్పటికి 40 లఘు చిత్రాలు తీశాను. వాటిలో ఓ దాని పేరు ‘రన్ రాజా రన్’. ఈ సినిమా కోసం కథ రాసుకున్నాక, అదే టైటిల్ సినిమాకు యాప్ట్ అనిపించింది. అందుకే ‘రన్ రాజా రన్’ అని టైటిల్ పెట్టాం’’ అన్నారు. ‘‘దర్శకునిగా నా తొలి సినిమా సంఘమిత్ర బ్యానర్లో మొదలైంది. అయితే, ఆ సినిమా ఇంకా పూర్తి కాలేదు. యు.వి. క్రియేషన్స్వారు కొత్త దర్శకులకు అవకాశం ఇస్తున్నారని తెలిసి వెళ్లాను. ఆఫీస్‌లో వాళ్లు అలాంటిదేం లేదని చెప్పారు. అయినా పట్టు విడవకుండా ఎలాగోలా ప్రమోద్గారిని కలిసి ఈ కథ చెప్పాను. ఆయనకు ప్రథమార్ధం బాగా నచ్చింది. ద్వితీయార్ధంలో కొన్ని మార్పులు సూచించారు. ఆ చిన్న మార్పులతో ‘రన్ రాజా రన్’ మొదలైంది’’ అని తెలిపారు సుజిత్. నిజాలు మాట్లాడి ప్రేమలో అవరోధాలు ఎదుర్కొన్న కుర్రాడి కథ ఇదనీ,. తాను చెప్పే ఓ నిజం వల్ల క్రైమ్‌లో ఇరుక్కున్న హీరో... దాని నుంచి ఎలా బయటపడ్డాడనేది ఇందులో ఆసక్తికరమైన అంశమనీ, కథ, కథనం, సంభాషణలు ఆసక్తికరంగా ఉంటాయని ఆయన చెప్పారు. -
రన్ రాజా రన్ మూవీ రిలీజ్ పోస్టర్స్
-
ఆ గుళ్లోనే నా జీవితం మలుపు తిరిగింది
‘‘కమల్‌హాసన్‌తో పరిచయం నా జీవితాన్ని సమూలంగా మార్చేసింది’’ అంటున్నారు సంగీత దర్శకుడు గిబ్రన్. ప్రస్తుతం ఆయన కమల్ ‘విశ్వరూపం-2’కు సంగీతం అందిస్తున్నారు. శర్వానంద్ హీరోగా ఆయన సంగీతం అందించిన ‘రన్ రాజా రన్’ చిత్రం ఆగస్ట్ 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారాయన. ‘విశ్వరూపం-2’ భారీ సీజీ వర్క్ ఉన్న సినిమా అనీ, అంతటి గొప్ప సినిమాకు సంగీతం అందించడం గర్వంగా ఉందని గిబ్రన్ ఆనందం వెలిబుచ్చారు. కమల్ ‘ఉత్తమ విలన్’ తర్వాతే ‘విశ్వరూపం-2’ విడుదల అవుతుందని గిబ్రన్ చెప్పారు. తాను స్వరాలందించిన ‘రన్ రాజా రన్’ చిత్రం చాలా ఆసక్తికరంగా సాగే సినిమా అనీ, సంగీత దర్శకునిగా ఓ కొత్త అనుభూతిని ఈ సినిమా తనకు అందించిందని గిబ్రన్ అన్నారు. ‘‘సంగీత దర్శకుడు కాక ముందు నేను పియానో టీచర్ని. ఎంతో మంది పిల్లలకు పియోనో నేర్పిన అనుభవం నాది. సింగపూర్‌లో చదువుకున్నాను. ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్ని చవిచూశాను. పులిహోర పోట్లాల కోసం గుడికెళ్లిన రోజులున్నాయి. ఆ గుళ్లోనే నా జీవితం మలుపుతిరిగింది. నా భార్య పరిచయమైంది అక్కడే. మా కలయిక స్నేహం నుంచి ప్రేమగా మారింది. తను విజయవాడ అమ్మాయి. సైంటిస్ట్. తన పరిచయం నాలో ఊహించని మార్పు తెచ్చింది. ఆమె తర్వాత నా జీవితంపై ప్రభావితం చేసిన మరో వ్యక్తి కమల్‌హాసన్‌గారు. ఆయన్ను కలవక ముందు కలిశాక నా జీవితాన్ని ఊహించుకుంటే... ఉద్వేగం కలుగుతుంది’’ అని గతాన్ని నెమరువేసుకున్నారు గిబ్రన్. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఓ అరడజను సినిమాల దాకా చేస్తున్నానని, సంగీత దర్శకునిగా కెరీర్ ఆశాజనకంగా ఉందని గిబ్రన్ ఆనందం వెలిబుచ్చారు. -
ఆగష్ట్ 1కి రానున్న 'రన్ రాజా రన్'
-
‘రన్ రాజా రన్’ విజయవంతం కావాలి
- సినీ హీరో శర్వానంద్ తిరుమల : తాను నటించిన ‘రన్ రాజా రన్’ చిత్రం విజయవంతం కావాలని శ్రీవారిని ప్రార్థించానని హీరో శర్వానంద్ తెలిపారు. బుధవారం ఉదయం సహస్ర కలశాభిషేకంలో ఆయన పాల్గొని వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం శర్వానంద్ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ స్వామిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. రన్ రాజా రన్ చిత్రం త్వరలోనే అభిమానుల ముందుకు రానుందన్నారు. ఈ సందర్భంగా స్వామి వారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చినట్లు చెప్పారు. ఆలయం వెలుపల శర్వానంద్‌ను చూడటానికి అభిమానులు ఉత్సాహం చూపారు. ఆయనతో కలిసి ఫొటోలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు. -
శభాష్ శర్వా..!
‘‘వినూత్నమైన ప్రేమకథాచిత్రం మా ‘రన్ రాజా రన్’. యువతరం మెచ్చే అంశాలన్నీ ఇందులో పుష్కలంగా ఉంటాయి’’ అంటున్నారు దర్శకుడు సుజిత్. ఆయన దర్శకత్వంలో శర్వానంద్, సీరత్ కపూర్ జంటగా రూపొందిన చిత్రం ‘రన్ రాజా రన్’. బ్లాక్‌బస్టర్ ‘మిర్చి’ని ప్రేక్షకులకు అందించిన వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి ఈ చిత్రానికి నిర్మాతలు. జూలైలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ-‘‘కథ ఈ చిత్రానికి ప్రాణం. ‘మిర్చి’ లాంటి విజయం తర్వాత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామంటే కారణం అదే. శర్వానంద్ నటన శభాష్ అనిపించుకుంటుంది. గిబ్రన్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్. ‘మిర్చి’ తర్వాత మళ్లీ ఈ చిత్రానికి మది ఛాయాగ్రహణం అందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని నిర్మించాం’’ అని తెలిపారు. కోట శ్రీనివాసరావు, అలీ, జయప్రకాశ్‌రెడ్డి, అడవి శేషు తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కూర్పు: మధు, కళ: ఏఎస్.ప్రకాశ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అశోక్, లైన్ ప్రొడ్యూసర్: సందీప్. -
రన్ రాజా రన్ మూవీ న్యూ స్టిల్స్
-
రన్ రాజా రన్ మూవీ స్టిల్స్
-
రన్ రాజా రన్ మూవీ పొస్టర్స్
-
శర్వానంద్ అలా అనడం గొప్ప విషయం : ప్రభాస్
‘‘నాతో ’మిర్చి’వంటి ఘనవిజయాన్ని అందించిన నా మిత్రులు వంశీ, ప్రమోద్ ఇప్పుడు సుజిత్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుజిత్ ఈ కథ చెప్పినప్పుడే మంచి సినిమా అవుతుందనిపించింది’’ అని ప్రభాస్ చెప్పారు. శర్వానంద్, సీరత్‌కపూర్ జంటగా వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్న చిత్రం ‘రన్ రాజా రన్’. గిబ్రాన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో ప్రభాస్ విడుదల చేశారు. తొలి సీడీని హీరో గోపీచంద్ స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రాన్ని క్వాలిటీగా తీయండి చాలు. సినిమా విడుదల తర్వాత పారితోషికం తీసుకుంటా అని శర్వానంద్ అనడం గొప్ప విషయం. ప్రతి సన్నివేశం ఫ్రెష్‌గా ఉంది. ఈ సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘బాహుబలి’ గురించి ప్రత్యేకంగా చెబుతూ.. ‘‘ఈ చిత్రాన్ని రాజమౌళి అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. అందరం ఎంతో కష్టపడి చేస్తున్నాం. వచ్చే ఏడాది జనవరి తర్వాత ఈ సినిమా విడుదల ఉంటుంది’’ అన్నారు. గోపీచంద్ మాట్లాడుతూ -‘‘నిర్మాతలుగా మొదటి సినిమా ‘మిర్చి’తోనే ఘనవిజయం సాధించారు వంశీ, ప్రమోద్. శర్వా నాకు తమ్ముడి లాంటి వాడు. తను చేసే చిత్రాలన్నీ విభిన్నంగా ఉంటాయి. ఈ సినిమా ఘనవిజయం సాధించాలి’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘కథే హీరో అని నమ్మి ఈ చిత్రాన్ని తీశారు నిర్మాతలు. వారి నమ్మకం వమ్ము కానివ్వకుండా నేను అనుకున్న కథను ఎంతో స్పష్టంగా తెరపై ఆవిష్కరించగలిగాను. శర్వాని నేను అనుకున్న విధంగా చక్కగా చూపించాను. కమల్‌హాసన్ సినిమాతో బిజీగా ఉన్నప్పటికీ ఈ చిత్రానికి పాటలు ఇచ్చినందుకు గిబ్రాన్‌కి ధన్యవాదాలు’’ అని చెప్పారు. చిత్రబృందం అంతా ఎంతో కష్టపడి ఈ సినిమా చేశామని, విజయం సాధించాలని కోరుకుంటున్నానని శర్వానంద్ అన్నారు. -
రన్ రాజా రన్ మూవీ ఆడియో ఆవిష్కరణ
-
ఆశ్చర్యపరిచే రన్...
‘‘ఓ కొత్త లుక్‌లో ఉండే సినిమా ఇది. శర్వానంద్ పాత్రచిత్రణ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ప్రేమ, వినోదాల కలబోతగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఓ సర్ప్రైజ్ ఎలిమెంట్ కూడా ఉంది’’ అని దర్శకుడు సుజీత్ చెప్పారు. ప్రభాస్‌తో ‘మిర్చి’ వంటి బ్లాక్ బస్టర్ తీసిన యు.వి.క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న చిత్రం ‘రన్ రాజా రన్’. శర్వానంద్, సీరత్ కపూర్ ఇందులో హీరో హీరోయిన్లు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘కథకు ఈ టైటిల్ చక్కగా సరిపోతుంది. ‘మిర్చి’కి పని చేసిన మది ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ‘విశ్వరూపం-2’ చిత్రానికి సంగీతం చేసిన ఝిబ్రాన్. యమ్ దీనికి మంచి స్వరాలిచ్చారు’’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అశోక్, లైన్ ప్రొడ్యూసర్: సందీప్. -
రన్ శర్వా రన్
ప్రయాణానికి రిలేటడ్గా ఉండే టైటిల్స్... శర్వానంద్‌కి బాగా కలిసొచ్చాయి. గమ్యం, ప్రస్థానం, జర్నీ చిత్రాల టైటిల్స్ ఆ కోవకు చెందినవే. ప్రస్తుతం శర్వానంద్ నటిస్తున్న చిత్రానికి ‘రన్ రాజా రన్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఇది కూడా ప్రయాణానికి రిలేటెడ్‌గా ఉన్న టైటిలే కావడం గమనార్హం. సో.. శర్వానంద్‌కి మరో హిట్ ఖాయం అని ఫిలింనగర్ టాక్. బ్లాక్‌బస్టర్ హిట్ ‘మిర్చి’ తర్వాత యు.వి.క్రియేషన్స్ పతాకంపై వంశి, ప్రమోద్‌లు నిర్మిస్తున్న చిత్రమిది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్‌కి జోడీగా సీరత్ కపూర్ నటిస్తున్నారు. సగానికి పైగా టాకీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘దర్శకుడు చెప్పిన కథపై నమ్మకంతో ఈ సినిమా తీస్తున్నాం. ‘మిర్చి’కి చాయాగ్రహణం అందించిన మధి... ఈ చిత్రానికి కూడా పనిచేస్తున్నారు. ‘విశ్వరూపం-2’కు స్వరాలందిస్తున్న గిబ్రాన్.ఎం ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ప్రస్తుతం ఆర్ఎఫ్సీలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. ఈ నెలాఖరుకు గోవాలో చిత్రీకరణ ఉంటుంది. ప్రేమ, వినోదం మేళవింపుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కూర్పు: మధు, కళ: ఏఎస్ ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్, లైన్ ప్రొడ్యూసర్: సందీప్.