శభాష్ శర్వా..! | Run Raja Run to release in July | Sakshi
Sakshi News home page

శభాష్ శర్వా..!

Published Sat, Jun 28 2014 11:13 PM | Last Updated on Sat, Sep 2 2017 9:31 AM

శభాష్ శర్వా..!

శభాష్ శర్వా..!

 ‘‘వినూత్నమైన ప్రేమకథాచిత్రం మా ‘రన్ రాజా రన్’. యువతరం మెచ్చే అంశాలన్నీ ఇందులో పుష్కలంగా ఉంటాయి’’ అంటున్నారు దర్శకుడు సుజిత్. ఆయన దర్శకత్వంలో శర్వానంద్, సీరత్ కపూర్ జంటగా రూపొందిన చిత్రం ‘రన్ రాజా రన్’. బ్లాక్‌బస్టర్ ‘మిర్చి’ని ప్రేక్షకులకు అందించిన వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి ఈ చిత్రానికి నిర్మాతలు. జూలైలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ-‘‘కథ ఈ చిత్రానికి ప్రాణం.
 
 ‘మిర్చి’ లాంటి విజయం తర్వాత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామంటే కారణం అదే. శర్వానంద్ నటన శభాష్ అనిపించుకుంటుంది. గిబ్రన్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్. ‘మిర్చి’ తర్వాత మళ్లీ ఈ చిత్రానికి మది ఛాయాగ్రహణం అందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని నిర్మించాం’’ అని తెలిపారు. కోట శ్రీనివాసరావు, అలీ, జయప్రకాశ్‌రెడ్డి, అడవి శేషు తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కూర్పు: మధు, కళ: ఏఎస్.ప్రకాశ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అశోక్, లైన్ ప్రొడ్యూసర్: సందీప్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement