Sujit
-
1500 మీటర్ల విభాగంలో దీక్ష జాతీయ రికార్డు
న్యూఢిల్లీ: సౌండ్ రన్నింగ్ ట్రాక్ ఫెస్టివల్ అథ్లెటిక్స్ మీట్లో భారత మహిళా అథ్లెట్ కేఎం దీక్ష 1500 మీటర్ల విభాగంలో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. లాస్ ఏంజెలిస్‌లో జరిగిన ఈ మీట్లో దీక్ష 1500 మీటర్ల దూరాన్ని 4ని:04.78 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఈ క్రమంలో 2021 నుంచి హర్మిలన్ బైన్స్ (4ని:05.39 సెకన్లు) పేరిట ఉన్న జాతీయ రికార్డును దీక్ష బద్దలు కొట్టింది. సుజీత్, జైదీప్లకు నిరాశ.. ఇస్తాంబుల్: వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ చివరి రోజు భారత ఫ్రీస్టయిల్ రెజ్లర్లు సుజీత్ (65 కేజీలు), జైదీప్ (74 కేజీలు) ఒలింపిక్ బెర్త్‌లను దక్కించుకోవడంలో విఫలమయ్యారు. మూడో స్థానం కోసం జరిగిన బౌట్లో రూథర్‌ఫర్డ్ (అమెరికా) చేతిలో సుదీప్ ఓడిపోగా... కాంస్య పతక బౌట్లో జైదీప్ 1–2తో దెమిర్తాస్ (టర్కీ) చేతిలో పరాజయం పాలయ్యాడు. దాంతో ఈసారి పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి పురుషుల విభాగంలో ఒక్క రెజ్లర్ (అమన్; 57 కేజీలు) మాత్రమే పోటీపడనున్నాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘సాహో’ డైరెక్టర్‌తో కన్నడ స్టార్ హీరో సుదీప్ మూవీ!
కన్నడ స్టార్ హీరో సుదీప్, తెలుగు యువదర్శకుడు సుజిత్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుందా? అంటే అవుననే అంటున్నాయి శాండిల్‌వుడ్ వర్గాలు. ఇటీవల బెంగళూరు వెళ్లి సుదీప్‌కు ఓ కథ చెప్పారట సుజిత్. ఈ స్టోరీ లైన్ సుదీప్‌కు నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్‌తో రావాల్సిందిగా సుజిత్‌ను కోరారని సమాచారం. మరి... ఎస్ (సుదీప్) అండ్ ఎస్ (సుజిత్) కాంబినేషన్లో సినిమా సెట్ అవుతుందా? వేచి చూడాలి. ఇదిలా ఉంటే తెలుగులో శర్వానంద్‌తో ‘రన్ రాజా రన్’, ప్రభాస్‌తో ‘సాహో’ చిత్రాలు తెరకెక్కించారు సుజిత్. ‘సాహో’ తర్వాత సుజిత్ ఓ హిందీ సినిమా చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. మరి.. సుదీప్తో చేయనున్నది ఆ చిత్రమేనా? లేక కన్నడంలో ఏమైనా ప్లాన్ చేశారా? ఈ రెండూ కాకుండా తెలుగులో స్టార్ హీరోతో తీయబోయే సినిమాలో సుదీప్‌ని కీలక పాత్రకు అడిగారా? అనేది తెలియాల్సి ఉంది. -
కొత్త కాంబినేషన్
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్‌చరణ్ ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నారు అనే విషయంపై ఎప్పటికప్పుడు పలు వార్తలు వినిపిస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారని, అనిల్ రావిపూడితో సినిమా ఉండొచ్చని ఆ మధ్య ప్రచారం జరిగింది. తాజాగా ‘సాహో’ ఫేమ్ సుజీత్‌తో రామ్‌చరణ్ సినిమా చేసే అవకాçశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను యువీ క్రియేషన్ బ్యానర్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోందని సమాచారం. యువీ క్రియేషన్స్ సంస్థ అధినేతలు వంశీ, ప్రమోద్, విక్కీ అటు దర్శకుడు సుజీత్‌కి ఇటు రామ్‌చరణ్‌కి సన్ని హితులు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్–సుజీత్ సినిమా ప్రారంభం అవుతుందట. -
సాహో షూటింగ్ అప్డేట్
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సాహో. యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకుడు. ఇటీవల దుబాయ్‌లో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సాహో టీం ప్రస్తుతం బ్రేక్ తీసుకుంది. దుబాయ్ షెడ్యూల్లో భారీ యాక్షన్, చేజ్ సీన్స్‌ను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. జూన్ రెండో వారంలో మరో షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు సాహో యూనిట్. ఈ షెడ్యూల్‌ను రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించనున్నారు. బాహుబలి సిరీస్ తరువాత ప్రభాస్ చేస్తున్న సినిమా కావటంతో సాహోపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా చిత్రయూనిట్ ప్రతిష్టాత్మకంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్,చుంకీ పాండే, మందిరా బేడిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
‘సాహో’ దుబాయ్ షెడ్యూల్ అప్డేట్
బాహుబలి లాంటి ఘనవిజయం తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సాహో. రన్ రాజా రన్ ఫేం సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో యాక్షన్ సీన్స్‌తో పాటు భారీ చేజ్‌లను చిత్రీకరిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం సాహో యూనిట్ దుబాయ్ షెడ్యూల్‌ను పొడిగించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. విరామం లేకుండా రిస్కీ యాక్షన్ సన్నివేశాలు చేస్తున్న కారణంగా ప్రభాస్ చాలా ప్రెజర్ ఫీల్ అవుతున్నాడట.. అందుకే షెడ్యూల్ ను పొడిగించి షూటింగ్ కాస్త నెమ్మదిగా చేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ తారలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
వైరల్ : సాహోలో ప్రభాస్
బాహుబలి లాంటి ఘన విజయం తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా సాహో. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ భారీ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు చిత్రయూనిట్. తాజా ఈ షూటింగ్‌కు సంబంధించిన స్టిల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రభాస్ స్టైలిష్ లుక్‌లో బైక్ మీద కూర్చున్న స్టిల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు చిత్రయూనిట్ సాహోలో ప్రభాస్ లుక్ కు సంబంధించి ఎలాంటి స్టిల్ రిలీజ్ చేయకపోవటంతో రెబల్ స్టార్ అభిమానులు లీకైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, చుంకీ పాండేలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
డ్యూడ్ ఈజ్ బ్యాక్
ఫోర్ ఇయర్స్ ‘బాహుబలి’కి డెడికేట్ అయిపోయాడు. ఫ్యాన్స్ గుండెలు బాదుకుంటూ ఎదురు చూస్తున్నారు మళ్లీ మా డార్లింగ్ కనపడాలని. మళ్లీ మన డ్యూడ్ రావాలని. మళ్లీ క్లాసిక్ కట్ అవుట్ ఒకటి పడాలని... అభిమానులు నరాలకి నాట్స్ వేసుకుని కూర్చున్నారు. ఆరాధించేవాడు రావాలని.. ఆనందింపజేసేవాడు అలరించాలని. కోరిక ఫలించింది. యస్... డ్యూడ్ ఈజ్ బ్యాక్. ఏడాదికి 2 కటౌట్లు గ్యారెంటీ అట. ఈ ఇంటర్వూలో కూడా డబుల్ హ్యాపీనెస్ గ్యారెంటీ. ►‘బాహుబలి కన్‌క్లూజన్’ పూర్తయింది కదా... ఆ సినిమా మూడ్ నుంచి పూర్తిగా బయటికొచ్చేశారా? ► దాదాపు నాలుగేళ్లు ఆ సినిమాతో ట్రావెల్ చేశాను. ఇప్పటికీ మాహిష్మతి సామ్రాజ్యంలో ఉన్నట్లే ఉంది. బయటకు రావడానికి మరో నాలుగైదు నెలలు పడుతుందేమో. ► ‘బాహుబలి’ గడ్డం నుంచి కూడా మీకు విముక్తి లభించేసింది. గడ్డం మెయిన్టైన్ చేయడం ఇబ్బంది అనిపించిందా? ► (నవ్వేస్తూ)... నేను చాలా బద్ధకస్తుణ్ణి. రోజూ షేవింగ్ చేసుకోవడం, ట్రిమ్ చేసుకోవడం అంటే చిరాకు. అందుకని గడ్డంతో హాయిగా అనిపించింది. కానీ, మూడు నాలుగేళ్లు అలానే ఉన్నాను కాబట్టి, నాకు నేనే బోర్ కొట్టేస్తున్నా. ► పెరగడం, తగ్గడం... ‘బాహుబలి’ ఫిజికల్‌గా మిమ్మల్ని బాగానే కష్టపెట్టేసింది కదూ? ► అది నిజమే. అందుకే ఇంకొన్ని సినిమాల వరకూ బాడీని ఎలా పడితే అలా మార్చకుండా ఎలా ఉన్నానో అలానే చేయాలనుకుంటున్నాను. కొన్నాళ్ల వరకూ రెండు వేరియేషన్స్ ఉన్న కథలు ఒప్పుకోకూడదనుకుంటున్నా. ► ‘బాహుబలి’ లాంటి భారీ సినిమా చేసిన తర్వాత ఏ సినిమా అయినా మీకు చాలా ఈజీగా ఉంటుందేమో? ► కొంచెం ఈజీయే. ‘బాహుబలి’కి చిన్నపాటి ప్రెజర్ ఉండేది. గెటప్, యాక్టింగ్... అసలు సినిమా కాన్సెప్టే వేరు. అందుకని టెన్షన్‌గా ఉండేది. ఇప్పుడు కొంచెం కూల్‌గా చేయొచ్చు. అయితే సినిమా మొత్తం కూల్‌గా చేసినా రిలీజ్ టైమ్‌లో టెన్షన్ తప్పదు. ప్రతి సినిమా విడుదల ముందు నాకు పిచ్చ టెన్షన్‌గా ఉంటుంది. ► రాజమౌళి లాంటి మహా యోగితో సినిమా చేశాక సుజిత్ లాంటి బాల మేధావితో సినిమా చేయడం... ► రాజమౌళి వేరు. సుజిత్ వేరు. రాజమౌళిని గురువులా భావిస్తా. ఆయన్నుంచి ప్రొఫెషనల్‌గానే కాదు.. పర్సనల్‌గా కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. సుజిత్‌కి 26 ఏళ్లు. కుర్రాడు కాబట్టి థాట్స్ ఫ్రెష్‌గా ఉంటాయి. పైగా నేను ఇంత యంగ్ డైరెక్టర్‌తో ఇప్పటివరకూ సినిమా చేయలేదు. అందుకని చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తోంది. ► సుజిత్‌తో చేయబోతున్న సినిమాలో స్టైలిష్‌గా కనిపిస్తారా? ► కొత్త హెయిర్ స్టైల్ ట్రై చేస్తున్నాం. లుక్ గురించి నేను, సుజిత్ బాగా డిస్కస్ చేసుకుంటున్నాం. డెఫినెట్‌గా నా లుక్ చాలా బాగుంటుంది. ► కొత్త హెయిర్ స్టైల్ అంటున్నారు... ఎవరైనా హెయిర్ స్టైలిస్ట్‌ని పెట్టుకున్నారా? ► ‘మిస్టర్ పర్ఫెక్ట్’ నుంచి నాకు హకీమ్ అలీ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా తనే. అలవాటైన హెయిర్ స్టైలిస్ట్ అయితే నాకు ఏది బాగుంటుందో బాగా తెలుస్తుంది. అందుకే అప్పటి నుంచి తననే కంటిన్యూ చేస్తున్నాను. ► డ్రెస్‌ల విషయానికొస్తే... ఫంక్షన్స్‌లో ఎక్కువగా బ్లాక్ లేదా వైట్ షర్ట్‌లో కనిపిస్తారు. రీజన్ ఏంటి? ► ఆడియో ఫంక్షన్స్‌కి వచ్చేటప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలా? అని ఆలోచిస్తాను. వార్డ్ రోబ్ మొత్తం చూసుకుంటా. ఓ కలర్‌ఫుల్ షర్ట్ తీసి, ‘ఇది వేసుకోవాలి’ అని ఫిక్స్ అయిపోతా. మళ్లీ ఇదేమైనా గాడీగా ఉంటుందా? అని డైలమాలో పడతాను. ఎందుకొచ్చిందిలే బ్లాక్ లేకపోతే వైట్ అయితే సేఫ్ అని ఫైనల్‌గా వాటికి ఫిక్సవుతా. అందుకే ఎక్కువగా ఆ కలర్ షర్ట్స్‌లో కనిపిస్తాను. డ్రెస్ సెలక్షన్ నా మూడ్‌ని బట్టి ఉంటుంది. గత రెండేళ్లు డల్ కలర్స్ వాడాను. ఇప్పుడేమో ముదురు రంగు డ్రెస్సులు వాడాలనిపిస్తోంది. ► ఇంతకీ ‘బాహుబలి’ అప్పుడు ఎంత బరువు ఉన్నారు... ఇప్పుడు సుజిత్ సినిమా కోసం ఏమైనా తగ్గారా? ► ‘బాహుబలి’లో చేసిన శివుడి క్యారెక్టర్‌కు 96 నుంచి 98 కిలోల లోపు ఉండేవాణ్ణి. బాహుబలి పాత్రలో 89 నుంచి 92 కిలోల లోపు ఉండేవాణ్ణి. ఇప్పుడు సుజిత్ సినిమా కోసం నాలుగైదు కిలోలు తగ్గాను. ► తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలకు ‘బాహుబలి’ మిమ్మల్ని తీసుకెళ్లడం పై మీ ఫీలింగ్? ► అది సూపర్ ఫీలింగ్. మహా అయితే తమిళ్ వరకూ వెళతానేమో అనుకున్నా. ఊహించని విధంగా హిందీకి కూడా వెళ్లాను. ‘బాహుబలి’ వల్లే అది సాధ్యమైంది. హిందీ ప్రేక్షకులు గుర్తు పట్టడం, మాట్లాడటం హ్యాపీగా అనిపించింది. ► ‘బాహుబలి’ కోసం నాలుగేళ్లు డెడికేట్ అయిపోవడం మీ ఫ్యాన్స్‌ని బాధపెట్టింది... అది మీరు గ్రహించారా? ► అందుకే అప్పుడప్పుడూ ‘సారీ’ చెబుతున్నాను. ఫ్యాన్స్ ఎక్కువ సినిమాల్లో చూడాలని కోరుకుంటారు. కానీ, ‘బాహుబలి’లాంటి సినిమా చేసేటప్పుడు వేరే సినిమా సాధ్యం కాదు. ఇప్పుడు ఏడాదికి రెండు సినిమాలు చేయాలన్నది ప్లాన్. ఇది చదివి ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతారనుకుంటున్నా. ► అదేంటండి బాబు... లేడీస్‌లో అంత ఫాలోయింగ్ ► అది లక్. హీరో అయినప్పుడు ఎక్కువమందికి నచ్చితే చాలనుకునేవాణ్ణి. లక్కీగా అమ్మాయిలకు కూడా నచ్చేశాను. మేబీ ‘వర్షం’లాంటి లవ్‌స్టోరీ చేయడం వల్ల ఎక్కువమంది ఇష్టపడుతున్నారేమో. ► ‘బాహుబలి’కి ముందు ఆ తర్వాత మీకొస్తున్న లవ్ లెటర్స్ సంఖ్యలో ఏమైనా మార్పుందా... ఏదైనా లవ్ లెటర్ స్పెషల్‌గా ఉంటే సరదాగా షేర్ చేసుకుంటారా? ► నిజానికి ‘మిర్చి’ తర్వాత లవ్ లెటర్స్ పెరిగాయి. ‘బాహుబలి’ తర్వాత ఇంకా పెరిగాయి. అల్మోస్ట్ అన్నీ చదువుతాను. ఇప్పటికిప్పుడు అంటే చెప్పలేను కానీ, కొన్ని లవ్ లెటర్స్ చదివినప్పుడు భలే అనిపిస్తుంటుంది. అసలంత బాగా ఎలా రాస్తారా? అనుకుంటుంటాను. ► మీరు లవ్ లెటర్స్ ఇచ్చేవారా... కవితలేమైనా రాసేవారా? ► మనకా? కవితలా! అబ్బే అంత సీన్ లేదండి. అమ్మాయికి ప్రపోజ్ చేయాలనుకుంటే డైరెక్ట్‌గా గ్రీటింగ్ కార్డ్స్ షాప్‌కి వెళ్లేవాణ్ణి. రెండు కలర్‌ఫుల్ కార్డ్స్, అందులో మాంచి కొటేషన్ ఉందేమో చూసుకునేవాణ్ణి. అది కొని, ఇచ్చేవాణ్ణి. ► ఎంతమందికి ఇచ్చి ఉంటారేంటి? ► ఏదోలెండి... చిన్నప్పుడు అది లవ్వో, ఎట్రాక్షనో తెలియక అలా ఇచ్చేవాణ్ణి. లెక్కలడిగితే చెప్పలేను. ► కొడుకు ఆరడుగుల అందగాడైతే ఏ అమ్మకైనా టెన్షనే. ప్రపోజ్ చేసే గర్ల్స్ ఎక్కువమంది ఉంటారు కదా? ► మా అమ్మగారికి ఆ టెన్షన్ లేదు. చాలా విషయాల్లో ఆవిడ బ్రాడ్‌గా ఆలోచిస్తుంది. అమ్మ పెరిగిన వాతావరణం డిఫరెంట్. లైఫ్‌లో చాలా నేర్చుకుంది. ► మీ నాన్నగారు ‘బాహుబలి’ చూడలేదనే బాధ తప్పకుండా ఉంటుంది... ► రాఘవేంద్రరావుగారు, మా బంధువులు కూడా ఈ మాట చాలాసార్లు అన్నారు. నాన్నగారు ‘బాహుబలి’ చూడలేదనే కొరత నాకూ చాలా ఉంది. ఆయన ఉండుంటే ఎంతో ఆనందపడేవారు. ► ‘బాహుబలి’తో మీకొచ్చిన పాపులార్టీకి మీ అమ్మగారు ఏమన్నారు? ► షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇతర దేశాలకు కూడా వెళ్లింది కదా. ఈ సినిమా అప్పుడు చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. ఇలాంటి ఓ సినిమా చేయడమే ఓ హ్యాపీ మూమెంట్. ఇతర స్టేట్స్‌కి వెళ్లినప్పుడు, వేరే కంట్రీస్‌లోనూ అందరూ ఆత్మీయంగా మాట్లాడటం... అవన్నీ వెరీ స్పెషల్. ► బ్యాంకాక్‌లోని మేడమ్ తుస్సాడ్స్‌లో మీ మైనపు బొమ్మ పెట్టబోవడంపై మీ ఫీలింగ్? ► ఇంకా బొమ్మ రెడీ కాలేదు. వాళ్లు వచ్చి ఫేస్ కొలతలవీ తీసుకువెళ్లారు. కళ్లు ఎలా ఉంటాయి? ముక్కు, బుగ్గలు... ఇలా అన్నీ ఫొటోలు తీశారు. నావి త్రీడీ పిక్చర్స్ తీశారు. మొత్తం మూడు నాలుగు గంటలు పట్టింది. భలే గమ్మత్తుగా అనిపించింది. ‘బాహుబలి’ తాలూకు మరో స్వీట్ మెమరీ ఇది. ► మీరు ఆల్వేస్ స్వీట్‌గా మాట్లాడతారు. స్వీట్స్ బాగా తింటారేంటి? ► స్వీట్ అంటే నాకు చాక్లెట్సే. విపరీతంగా తింటాను. ఐస్‌క్రీమ్ తిన్నా చాక్లెట్ ఫ్లేవరే అయ్యుండాలి. రస్మలై కూడా ఇష్టమే. ► గరిటె తిప్పడం వచ్చా? ► బ్రెడ్ ఆమ్లెట్ వచ్చు. ఒకప్పుడు టీ బాగా పెట్టేవాణ్ణి. ఇప్పుడు టీ చేయడం మరచిపోయాను. ► పెద్ద వంటే నేర్చుకున్నారు? ► (నవ్వుతూ)... ఏదోలెండి.. వంట రాని నాబోటి వాళ్లకు బ్రెడ్ ఆమ్లెట్ కూడా పెద్ద వంట కిందే లెక్క. అయినా నాకు బద్ధకం ఎక్కువ అని చెప్పాను కదా. బ్రెడ్–ఆమ్లెట్ చేయడం కూడా నాకు పెద్ద పని కిందే లెక్క. ► బ్రెడ్–ఆమ్లెట్ ఎలా చేస్తారో చెబితే... ‘ప్రభాస్ రెసిపీ’ అనుకుంటూ మేం కూడా చేసి చూస్తాం... ► అదేం పెద్ద పని. గుడ్లు మ్యాష్ చేయడం, ఉప్పు, కారం వేసేయడం... బ్రెడ్ ముక్క అందులో ముంచి, చీజ్‌తో ఫ్రై చేసుకోవడమే. నేను చేసుకునేది ‘చీజ్ బ్రెడ్ ఆమ్లెట్’. ► ఇప్పటికి రెండు సమాధానాల్లో ‘నేను బద్ధకస్తుణ్ణి’ అన్నారు... సినిమాల కోసం మాత్రం కేజీలు కేజీలు కష్టపడతారేమో? ► ప్రొఫెషన్లో బద్ధకం చూపిస్తే అంతే సంగతులు. అందుకే సినిమా కోసం కేజీల కష్టమైనా, టన్నుల కొద్దీ కష్టమైనా ఎంజాయ్ చేస్తా. ► సినిమాలో మీరు పాతిక మందిని కొడితే నిజంగానే కొట్టినట్లు ఉంటుంది... బయట స్వీట్‌గా మాట్లాడతారు కాబట్టి ‘మంచి హ్యుమన్ బీయింగ్’ అనిపిస్తుంది. ఏది యాక్టింగ్? ► (నవ్వేస్తూ). ఎవరైనాసరే సినిమాల్లో ఎన్నేళ్లయినా యాక్ట్ చేయగలుగతారు. కానీ, రియల్ లైఫ్‌లో అది సాధ్యం కాదు. ఓ పదేళ్లు మహా అయితే ఇరవయ్యేళ్లు నటించగలుగుతారేమో. ఆ తర్వాత తెలిసిపోతుంది. సో... నేను రియల్ లైఫ్‌లో నటిస్తున్నానా? రీల్ లైఫ్‌లో నటిస్తున్నానా? అనేది మీకు మరో పదీ పదిహేనేళ్లల్లో తెలిసిపోతుంది. ► లేదండీ... మీరు సూపరే. జనరల్‌గా హీరోలంటే కాంట్రవర్సీస్ కామన్. కానీ, మీరెలాంటి వివాదాలలోనూ ఇరుక్కోలేదు? ► నా ఫస్ట్ సినిమా ‘ఈశ్వర్’ అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడూ అలానే ఉన్నాను. మాగ్జిమమ్ అందరితోనూ బాగుంటాను. ఇప్పటివరకూ ఎలాంటి వివాదాలు లేవు. భవిష్యత్తులోనూ ఇలానే ఉంటుందా? ఏమో చూద్దాం. ► మల్టీస్టారర్ మూవీస్ చేస్తారా? ► నేను, గోపి (హీరో గోపీచంద్) కలసి సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నాం. మంచి కథ వస్తే చేస్తాం. ► ఎండలు స్టార్ట్... అవుట్డోర్ షూటింగ్స్ అంటే ఇబ్బందే? ► మార్చి, ఏప్రిల్‌లో ‘బాహుబలి’ ప్రమోషనల్ యాక్టివిటీస్‌తో బిజీగా ఉంటాం. సుజిత్‌తో చేయబోయే సినిమా ఏప్రిల్‌లో స్టార్ట్ అవుతుంది. మాంచి ఎండలు. అయినా నేను ఒకటి ఫిక్స్ అయ్యా. సమ్మర్ అయినా వింటర్ అయినా ఆగేది లేదు. సినిమాలు చేసేయడమే. ఒకేసారి రెండు సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాను. ఒకటి సుజిత్ సినిమా, ఇంకోటి రాధాకృష్ణ సినిమా. ► అవునూ... ఎంగేజ్మెంట్ అయిందట. మిమ్మల్ని ఇష్టపడే అమ్మాయిల్లో కొంతమంది తెగ బాధపడిపోతున్నారు... ► బాధ పడాల్సిన అవసరంలేదు. అలాంటిదేమీ జరగలేదు. జస్ట్ రూమర్ మాత్రమే. ► అమ్మాయిల సంగతెలా ఉన్నా మీ మేల్ ఫ్యాన్స్ మాత్రం మీరు పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారు... ► ఏం సమాధానం చెప్పాలో తెలియడంలేదు. టైమ్ రావాలండి. అది వచ్చినప్పుడు జరుగుతుంది. ► ఇంతకీ మీరు భోజనప్రియులేనా? వచ్చే అమ్మాయికి వంట బాగా తెలిసుండాలా? ► మా ఇంటిల్లిపాదీ... పెదనాన్నగారు, నేను... మొత్తం అందరం భోజనప్రియులమే. అస్సలు మొహమాటపడకుండా బ్రహ్మాండంగా తింటాం. కానీ, వచ్చే అమ్మాయికి వంట తెలియకపోయినా ఫర్వాలేదు. ఇవాళ బోల్డన్ని రెస్టారెంట్లు ఉన్నాయి కదా... అక్కడికి వెళ్లడమే. ► ‘బాహుబలి’తో ఇంటర్నేషనల్ రేంజ్‌కి వెళ్లారు... హాలీవుడ్ సినిమా చేసే ఐడియా ఏమైనా? ► హాలీవుడ్ చేయను. హిందీ సినిమా చేయాలని ఉంది. మంచి కథ కుదిరితే ఒప్పుకుంటా. ► హిందీ బాగా మాట్లాడగలుగుతారా? ► లైట్‌గా వచ్చు. తమిళ్ మాట్లాడతా. ► చిన్నప్పుడు చెన్నైలో చదువుకున్నారు కాబట్టి తమిళ్ వచ్చి ఉంటుంది... ► థర్డ్ స్టాండర్డ్ వరకూ అక్కడే చదువుకున్నాను. ఉన్నది తక్కువ సంవత్సరాలే అయినా చెన్నైతో ఆ చిన్నిపాటి అనుబంధం నాకు బాగుంటుంది. ► చెన్నై వెళ్లినప్పుడు పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయా? ► ‘బాహుబలి’ ప్రమోషన్స్‌కి చెన్నై వెళ్లాం కదా. చిన్నప్పుడు మేం ఉన్న ఇంటిని చూడాలనిపించి, వెళ్లాను. గుర్తు పట్టలేని విధంగా అయిపోయింది. ఆ ఇల్లు తలుచుకున్నప్పుడల్లా నాకు రెండు స్తంభాలు మాత్రమే గుర్తుకొచ్చేవి. అవి ఉన్నాయా? అని చూశాను. లేవు. ► ఫ్యాన్స్ ఏమో ‘మా డ్యూడ్.. డార్లింగ్ ఎప్పుడు బయటికొస్తాడా?’ అని ఎదురు చూస్తున్నారు.. వాళ్ల కోసం దర్శనాలు ఇవ్వొచ్చు కదా.. ► (గట్టిగా నవ్వుతూ). ఇంకో నెలలో ‘బాహుబలి’ పబ్లిసిటీ మొదలుపెట్టేస్తాం. ఇంటర్వ్యూలు, ఇతర కార్యక్రమాలు అంటూ చాలాసార్లు కనిపిస్తా. మీరు కావాలంటే చూడండి.. అందరికీ మొహం మొత్తేలా ఎక్కువసార్లు కనిపిస్తా. ► మీరు ఎన్నిసార్లు కనిపించినా మొహం మొత్తదులెండి.. ఫ్యాన్స్ సంబరపడిపోతారు. ► ఫ్యాన్స్... నా డార్లింగ్స్. అసలు వాళ్లు చూపించే ప్రేమ అమేజింగ్. – డి.జి. భవాని -
కొత్త సినిమా... కవల పాత్రలు...
సినిమాల్లో హీరో కవలలుగా నటించడం ప్రేక్షకులు చూశారు. హీరో డ్యూయల్ యాక్షన్‌తో విలన్లు తికమక పడడం చూసి ఎంజాయ్ చేశారు. కానీ, విలన్స్ ద్విపాత్రాభినయం అరుదే. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించే సినిమాలో హిందీ నటుడు నీల్ నితిన్ ముఖేశ్ కవలలుగా డ్యూయల్ రోల్లో కనిపించనున్నారు. అందులో ఒకటి విలన్ పాత్ర, మరొకటి పాజిటివ్‌గా ఉండే హీరో స్నేహితుడి పాత్ర. ఇద్దరిలో విలన్ ఎవరో? స్నేహితుడు ఎవరో? ప్రభాస్ తెలుసుకునే సన్ని వేశాలు ఆసక్తికరంగా ఉంటాయట. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో యూవీ క్రియేషన్స్ నిర్మించే ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో నటించమని ఏడాది క్రితమే నీల్ నితిన్ ముఖేశ్‌ను సంప్రతించారు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషలపై పట్టు సాధించే పనిలో నీల్ నితిన్ ముఖేశ్ ఉన్నారట. ఆల్రెడీ తమిళ ‘కత్తి’లో నీల్ విలన్. ఇది ఆయనకు దక్షిణాదిలో రెండో సినిమా. జనవరిలో షూటింగ్ మొదలట! -
ప్రేమకథలో ప్రభాస్
‘మిర్చి’లో ప్రభాస్ ఘాటు చూసి అప్పుడే మూడేళ్లు దాటేసింది. అప్పట్నుంచి రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ‘బాహుబలి’కి అంకితమయ్యారు. తప్పదు మరి.. ఇంటర్నెషనల్ స్టాండర్డ్స్ ఉన్న సినిమా కదా! ప్రభాస్ కష్టం కూడా వృధా కాలేదు. ఈ యంగ్ రెబల్‌స్టార్‌కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది. కానీ, గ్యాప్ లేకుండా ప్రభాస్ నుంచి సినిమాలు ఆశిస్తున్న ప్రేక్షకులు, అభిమానుల కోసం వెంట వెంటనే రెండు సినిమాల్లో నటించనున్నారు. ఇప్పటికే, సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించారనే వార్త తెలిసిందే. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ చెప్పిన కథకూ ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందట. రాధాకృష్ణ మాట్లాడుతూ -‘‘ప్రేమకథా చిత్రమిది. పూర్తిగా విదేశాల్లోనే చిత్రీకరిస్తాం. ప్రభాస్ పక్కన హీరోయిన్గా కొత్త అమ్మాయిని ఎంపిక చేయాలనుకుంటున్నాం’’ అని తెలిపారు. ఈ సినిమాని గోపీకృష్ణ, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మించనున్నాయి. -
'గెలిచాం.. కానీ అసలైన సాయం ఇప్పుడు కావాలి'
పాట్నా: డబ్బు ఉన్నవాళ్లకు చదువుండదు.. చదువొచ్చేవాళ్లకు డబ్బుండదు అనేది ఒక నానుడి. అయితే, డబ్బున్నవాడు అది అయిపోవడంతో ఆగిపోతాడేమోగానీ.. చదువున్నవాడు మాత్రం డబ్బు హెచ్చుతగ్గలవల్ల ఆగిపోడూ.. ఓ ప్రవాహంలా ముందుకు వెళుతూనే ఉంటాడు. అందుకోసం అనువైన మార్గాలు శోధిస్తాడు. సిగ్గు, బిడియం అనేది దరిచేరనీయరు.. ఎందుకంటే వారి లక్ష్యం ముందు ఇవన్నీ పూచిక పుల్లలు. బీహార్‌లోని మ్యాథమేటిషియన్ అనంద్ కుమార్ ప్రతి ఏటా దాదాపు 30 మంది నిరుపేద పిల్లలకు రూపాయి తీసుకోకుండా ఐఐటీ కోచింగ్ ఇస్తున్నారు. కోచింగ్ తీసుకున్న వారంతా ఫలితాల్లో మెరుస్తున్నారు. అయితే, ఫలితాల్లో తమను విజయం వరిస్తుందన్న సంతోషం కన్నా.. ఫలితాల అనంతరం కౌన్సెలింగ్ ఉంటుంది.. అందుకు భారీ స్థాయిలో ఫీజులు కట్టాల్సి ఉంటుంది. అసలే రెక్కాడితే డొక్కాడని తమ తల్లిదండ్రులు అంతమొత్తం ఎలా ఇవ్వాగలరనే ఆందోళన బాగా వేదిస్తోంది. దీంతో ఎలాగైన తమ కలను నెరవేర్చుకోవాలని, దేశంలోని విశిష్ట ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదవాలని ఆశపడుతున్నారు. దీంతో వారు తమ పరిస్థితిని ఏమాత్రం తడుముకోకుండా వివరిస్తూ మాకు సాయం చేయండి అంటూ వేడుకుంటున్నారు. ఇలాసాయం కోరుతున్న వారిలో కొందరిని ఉదాహరణగా తీసుకుంటే.. దనంజయ్ కుమార్ (18) అనే విద్యార్థి సూపర్ కంప్యూటర్ 30లో శిక్షణ తీసుకొని ఐఐటీ ర్యాంకు సాధించాడు. అతడు ఇప్పుడు ఖరగ్‌పూర్ ఐఐటీ కౌన్సెలింగ్‌కు హాజరు కావాలంటే కనీసం 45 వేలు ఫీజు కట్టాలి. పోనీ బ్యాంకులను అడుగుదామా అంటే ప్రవేశం పత్రాన్ని తీసుకొచ్చాకే బ్యాంకులు లోన్ ఇస్తాయి. తన తండ్రి నెలకు సంపాధించేది కేవలం మూడువేల రూపాయలు. కానీ ఇంట్లో ఉంది మాత్రం ఎనిమిది మంది. వీటితో వారందరిని పోషించడమే కష్టం. అలాంటిది 45 వేలు కౌన్సెలింగ్ ఫీజు చెల్లించడమంటే సాధారణమైన విషయం కాదు. ఈ నేపథ్యంలో ధనంజయ్ కుమార్ తనను ఆదుకొని తన కల నెరవేర్చరూ అంటూ వేడుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల మధ్యే మాదేపూర్ నుంచి సుజిత్ కుమార్, నలందా నుంచి ప్రేమ్ పాల్, ససరాం నుంచి శరవణ్ అనే విద్యార్థులంతా తమకు ఆర్థిక సాయం చేసి విద్యను కొనసాగించేలా ఆదుకోండంటూ కోరుతున్నారు. -
లండన్ రైలు ప్రమాదంలో కానూరు విద్యార్థి మృతి
పెనమలూరు : లండన్‌లో ఎంఎస్ చదివేందుకు వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి అక్కడ జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందాడు. కానూరులో ఉంటున్న ఇంజినీర్ దేవభక్తుని వినయ్‌కుమార్ కుమారుడు సుజిత్ ఈ నెల 21వ తేదీన లండన్‌లోని మాంచెస్టర్ యూనివర్సిటీలో ఎంఎస్ చదవడానికి వెళ్లాడు. అక్కడినుంచి నివాసమండే రూమ్‌కు వెళ్లడానికి 22వ తేదీ సాయంత్రం లోకల్ ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఫోన్ మాట్లాడుతుండగా రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో సుజిత్ మృతి చెందాడు. అతడు ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ చేశాడు. సుజిత్ భౌతికకాయాన్ని సోమవారం వీరులపాడులో ఉంటున్న తాత దేవభక్తుని రామమోహనరావు ఇంటికి తీసుకొస్తారని కుటుంబసభ్యులు తెలిపారు. -
ఇదో ‘ప్రేమ్’కథ
ప్రేమ ఓ మధుర జ్ఞాపకం... అది ఎప్పుడు... ఎక్కడ... ఎలా.. మొదలవుతుందో ఎవరికీ తెలియదు. ఆ ప్రేమ పుట్టుక తొలిచూపునకే అవ్వొచ్చు.. తొలి పలుకుకే అవ్వొచ్చు.. తొలి స్పర్శకే అవ్వొచ్చు.. అలాంటి ఈ ప్రేమ దేశంలో ఒకమ్మాయిని ఫస్ట్ టైం చూసి ప్రేమ్ అనే కుర్రాడు పడిన తపన.. తన ప్రేమను ఎలా సాధించుకున్నాడు అనే అంశంతో లఘు చిత్ర దర్శకుడు చేతన్ సిరసపల్లి నిర్మించిన ప్రేమ్‌కథ లఘు చిత్రం నెటిజన్ల మనసు దోచుకుంటోంది. బీటెక్ విద్యార్థి చేతన్ దర్శకత్వం మీద ఉన్న మక్కువతో ప్రణీత్, కృష్ణకుమారిలను హీరో, హీరోయిన్లుగా తీసుకొని అద్భుతమైన స్క్రీన్‌ప్లే, మాటలతో ఈ లఘు చిత్రాన్ని తెరకెక్కించాడు. వైజాగ్‌లోని సుందరమైన లోకేషన్లలో చిత్రీకరించాడు. దీని తరువాత చేతన్‌కు రన్ రాజా రన్ దర్శకుడు సుజిత్ నుంచి పిలుపు వచ్చింది. అతడి నూతన చిత్రంలో దర్శకత్వ విభాగంలోనూ చోటు సంపాదించాడు. జీవితాంతం గుర్తుండిపోయేలా ప్రేమకథా చిత్రాలను తీస్తానని చేతన్ చెబుతున్నాడు. -
నా కామెడీ బావుందంటున్నారు - శర్వానంద్
‘‘నా పదేళ్ల కల ఈ విజయం. నా కెరీర్‌కి ఇంతటి విజయాన్నిచ్చిన యు.వి. క్రియేషన్స్ సంస్థకు కృతజ్ఞతలు. ఈ సినిమా చూసిన వారందరూ నేను కామెడీ బాగా చేశానంటున్నారు. ఈ క్రెడిట్ మొత్తం దర్శకుడు సుజిత్‌కే దక్కుతుంది’’ అని శర్వానంద్ అన్నారు. ఆయన కథానాయకునిగా సుజిత్ దర్శకత్వంలో వంశీ-ప్రమోద్ కలిసి నిర్మించిన ‘రన్ రాజా రన్’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. దర్శకునిగా అవకాశం ఇచ్చిన నిర్మాతలకు సుజిత్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది సమష్టి విజయమనీ నిర్మాతలు అభిప్రాయపడ్డారు. దిల్ రాజు, అడివి శేషు కూడా మాట్లాడారు. -
రన్ సుజిత్ రన్
‘‘మీ అబ్బాయి పిచ్చి పిచ్చి సినిమాలేవో తీస్తున్నాడు. కాస్త జాగ్రత్త పడండి’’ అంటూ పొరుగింటావిడ చెబితే ఏ తల్లయినా ఏం చేస్తుంది? వామ్మో... అని కంగారు పడిపోయి బయట నుంచి కొడుకు ఇంటికి రాగానే వాడి పని జింతాత జితా జితా చేసేసి... అయిపోయిందండీ మనబ్బాయి పాడైపోయాడటండీ అంటూ భర్తకి గుమ్మం దగ్గర నుంచే ఆరున్నొక్క రాగంతో స్వాగతాలు పలికేసి... కట్... కట్... అంటూ కట్ చెప్పి ‘‘ఠాట్ మా అమ్మ అలాంటిది కాదు’’ అని డైలాగ్ కూడా చెప్పాడు సుజిత్. సారీ... టాలీవుడ్ దర్శకుడు సుజిత్. ‘లవ్‌లో లాజిక్‌లు’ పేరుతో నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు పేరెంట్స్‌కి తెలీదు. రెండోది పూర్తవగానే చుట్టుపక్కలవాళ్లు మీవాడు చెడిపోతున్నాడు జాగ్రత్తని చెప్పేశారు. అయితే అమ్మ ఏం కంగారు పడకుండా నాకో కెమెరా కూడా కొనిచ్చింది. కాకపోతే చదువు చెడగొట్టుకోకు అని ఫినిషింగ్ టచ్ ఇచ్చింది’’ అంటూ గుర్తు చేసుకున్నాడీ కుర్రాడు. అలా పొట్టి చిత్రాలకు గట్టి పునాది లేనప్పుడే (పదేళ్ల క్రితం) దాని మీదకి ఎగిరి దూకిన ఈ అడ్వాన్స్డ్ అబ్బాయి... షార్ట్ ఫిల్మ్ సక్సెస్‌నే బేస్ చేసుకుని ఇప్పుడు ఏకంగా పెద్ద తెరపైకి వచ్చేశాడు. తాజాగా విడుదలైన ‘రన్ రాజా రన్’ ఈ అనంతపురం కుర్రాడు‘తెర’కెక్కించిందే. ఈ సందర్భంగా షార్ట్ టు బిగ్ దాకా తన రన్‌ను తనదైన స్టైల్లో వివరించాడు సుజిత్. ‘మాది అనంతపురం. స్కూల్ డేస్‌లో ఉన్నపుడు డిసిప్లిన్ కోసం చెన్నైలోని గురుకుల్ స్కూల్లో జేర్పించారు. అక్కడంతా సినిమా గోలే కదా దాంతో డిసిప్లిన్ సంగతేమోగానీ సినిమా పిచ్చి పట్టింది. ఆ తర్వాత మా ఫ్యామిలీ హైదరాబాద్ వచ్చేశారు. 2006లో అమ్మ కొనిచ్చిన కెమెరాతో ‘లవ్ ఫెయిలైతే మళ్లీ లవ్ చెయ్’ అని తీస్తే ఒక్కరోజులో లక్ష హిట్లొచ్చాయి. అప్పట్లో అది చాలా గొప్ప. దాంతో వీర కాన్ఫిడెన్స్ వచ్చింది. అక్కడి నుంచి సినిమాలు తీస్తూనే ఉన్నా. తెలుగులో, తమిళ్లో కూడా. తమిళ్లో తీసిన షార్ట్ ఫిల్మ్ ‘వేషం’ అవార్డ్ కూడా సాధించింది. ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ అకాడ మీలో అసిస్టెంట్ కెమెరామెన్‌గా వర్క్ చేశా. అదే టైమ్‌లో ‘మిర్చి’ సినిమా తీసిన వాళ్లు కొత్త సినిమా చేస్తున్నపుడు నన్ను అడిగితే కథ చెప్పా. నచ్చింది. అదే రన్ రాజా రన్’ డైలీలైఫ్‌లో ఇన్సిడెంట్స్‌కి కామెడీ ని మిక్స్ చేసి క్యాజువల్ లుక్‌తో నవ్వులు వండించే ఈ యువ కుక్కి బెస్టాఫ్ లక్ చెబుతూ... రన్ సుజిత్ రన్. -
ఆ లఘు చిత్రం టైటిలే దీనికి పెట్టాను
‘‘లక్స్ సబ్బు వాణిజ్య ప్రకటనకి సహాయ దర్శకునిగా పనిచేసేవాణ్ణి. ఓ రోజు యాడ్ చేస్తున్న సమయంలో అందులోని ఓ సన్నివేశం నాకు నచ్చలేదు. అదే దర్శకుడికి చెప్పాను. ‘ఎలా తీస్తే బావుంటుందో నువ్వే చెప్పు’ అన్నారాయన. నాకు తెలిసింది చెప్పాను. అందరూ మెచ్చుకున్నారు. ఎలాగైనా దర్శకుడు కావాలనే ఆకాంక్ష ఆ రోజే నాలో బలంగా మొదలైంది’’ అని యువ దర్శకుడు సుజిత్ చెప్పారు. ఆయన దర్శకత్వంలో శర్వానంద్ కథానాయకునిగా రూపొందిన చిత్రం ‘రన్ రాజా రన్’. యు.వి.క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా సుజిత్ పత్రికల వారితో ముచ్చటిస్తూ -‘‘ఇప్పటికి 40 లఘు చిత్రాలు తీశాను. వాటిలో ఓ దాని పేరు ‘రన్ రాజా రన్’. ఈ సినిమా కోసం కథ రాసుకున్నాక, అదే టైటిల్ సినిమాకు యాప్ట్ అనిపించింది. అందుకే ‘రన్ రాజా రన్’ అని టైటిల్ పెట్టాం’’ అన్నారు. ‘‘దర్శకునిగా నా తొలి సినిమా సంఘమిత్ర బ్యానర్లో మొదలైంది. అయితే, ఆ సినిమా ఇంకా పూర్తి కాలేదు. యు.వి. క్రియేషన్స్వారు కొత్త దర్శకులకు అవకాశం ఇస్తున్నారని తెలిసి వెళ్లాను. ఆఫీస్‌లో వాళ్లు అలాంటిదేం లేదని చెప్పారు. అయినా పట్టు విడవకుండా ఎలాగోలా ప్రమోద్గారిని కలిసి ఈ కథ చెప్పాను. ఆయనకు ప్రథమార్ధం బాగా నచ్చింది. ద్వితీయార్ధంలో కొన్ని మార్పులు సూచించారు. ఆ చిన్న మార్పులతో ‘రన్ రాజా రన్’ మొదలైంది’’ అని తెలిపారు సుజిత్. నిజాలు మాట్లాడి ప్రేమలో అవరోధాలు ఎదుర్కొన్న కుర్రాడి కథ ఇదనీ,. తాను చెప్పే ఓ నిజం వల్ల క్రైమ్‌లో ఇరుక్కున్న హీరో... దాని నుంచి ఎలా బయటపడ్డాడనేది ఇందులో ఆసక్తికరమైన అంశమనీ, కథ, కథనం, సంభాషణలు ఆసక్తికరంగా ఉంటాయని ఆయన చెప్పారు. -
శభాష్ శర్వా..!
‘‘వినూత్నమైన ప్రేమకథాచిత్రం మా ‘రన్ రాజా రన్’. యువతరం మెచ్చే అంశాలన్నీ ఇందులో పుష్కలంగా ఉంటాయి’’ అంటున్నారు దర్శకుడు సుజిత్. ఆయన దర్శకత్వంలో శర్వానంద్, సీరత్ కపూర్ జంటగా రూపొందిన చిత్రం ‘రన్ రాజా రన్’. బ్లాక్‌బస్టర్ ‘మిర్చి’ని ప్రేక్షకులకు అందించిన వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి ఈ చిత్రానికి నిర్మాతలు. జూలైలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ-‘‘కథ ఈ చిత్రానికి ప్రాణం. ‘మిర్చి’ లాంటి విజయం తర్వాత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామంటే కారణం అదే. శర్వానంద్ నటన శభాష్ అనిపించుకుంటుంది. గిబ్రన్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్. ‘మిర్చి’ తర్వాత మళ్లీ ఈ చిత్రానికి మది ఛాయాగ్రహణం అందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని నిర్మించాం’’ అని తెలిపారు. కోట శ్రీనివాసరావు, అలీ, జయప్రకాశ్‌రెడ్డి, అడవి శేషు తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కూర్పు: మధు, కళ: ఏఎస్.ప్రకాశ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అశోక్, లైన్ ప్రొడ్యూసర్: సందీప్. -
రన్ శర్వా రన్
ప్రయాణానికి రిలేటడ్గా ఉండే టైటిల్స్... శర్వానంద్‌కి బాగా కలిసొచ్చాయి. గమ్యం, ప్రస్థానం, జర్నీ చిత్రాల టైటిల్స్ ఆ కోవకు చెందినవే. ప్రస్తుతం శర్వానంద్ నటిస్తున్న చిత్రానికి ‘రన్ రాజా రన్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఇది కూడా ప్రయాణానికి రిలేటెడ్‌గా ఉన్న టైటిలే కావడం గమనార్హం. సో.. శర్వానంద్‌కి మరో హిట్ ఖాయం అని ఫిలింనగర్ టాక్. బ్లాక్‌బస్టర్ హిట్ ‘మిర్చి’ తర్వాత యు.వి.క్రియేషన్స్ పతాకంపై వంశి, ప్రమోద్‌లు నిర్మిస్తున్న చిత్రమిది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్‌కి జోడీగా సీరత్ కపూర్ నటిస్తున్నారు. సగానికి పైగా టాకీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘దర్శకుడు చెప్పిన కథపై నమ్మకంతో ఈ సినిమా తీస్తున్నాం. ‘మిర్చి’కి చాయాగ్రహణం అందించిన మధి... ఈ చిత్రానికి కూడా పనిచేస్తున్నారు. ‘విశ్వరూపం-2’కు స్వరాలందిస్తున్న గిబ్రాన్.ఎం ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ప్రస్తుతం ఆర్ఎఫ్సీలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. ఈ నెలాఖరుకు గోవాలో చిత్రీకరణ ఉంటుంది. ప్రేమ, వినోదం మేళవింపుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కూర్పు: మధు, కళ: ఏఎస్ ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్, లైన్ ప్రొడ్యూసర్: సందీప్.