కొత్త సినిమా... కవల పాత్రలు... | Neil Nitin Mukesh teams up with Prabhas for his next multilingual film | Sakshi
Sakshi News home page

కొత్త సినిమా... కవల పాత్రలు...

Published Sat, Nov 19 2016 10:48 PM | Last Updated on Thu, Apr 4 2019 4:44 PM

కొత్త సినిమా... కవల పాత్రలు... - Sakshi

కొత్త సినిమా... కవల పాత్రలు...

సినిమాల్లో హీరో కవలలుగా నటించడం ప్రేక్షకులు చూశారు. హీరో డ్యూయల్ యాక్షన్‌తో విలన్లు తికమక పడడం చూసి ఎంజాయ్ చేశారు. కానీ, విలన్స్ ద్విపాత్రాభినయం అరుదే. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించే సినిమాలో హిందీ నటుడు నీల్ నితిన్ ముఖేశ్ కవలలుగా డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారు. అందులో ఒకటి విలన్ పాత్ర, మరొకటి పాజిటివ్‌గా ఉండే హీరో స్నేహితుడి పాత్ర. ఇద్దరిలో విలన్ ఎవరో? స్నేహితుడు ఎవరో? ప్రభాస్ తెలుసుకునే సన్ని వేశాలు ఆసక్తికరంగా ఉంటాయట.

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో యూవీ క్రియేషన్స్ నిర్మించే ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో నటించమని ఏడాది క్రితమే నీల్ నితిన్ ముఖేశ్‌ను సంప్రతించారు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషలపై పట్టు సాధించే పనిలో నీల్ నితిన్ ముఖేశ్ ఉన్నారట. ఆల్రెడీ తమిళ ‘కత్తి’లో నీల్ విలన్. ఇది ఆయనకు దక్షిణాదిలో రెండో సినిమా. జనవరిలో షూటింగ్ మొదలట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement