సాహో షూటింగ్ అప్‌డేట్‌ | Saaho New Schedule From June Second Week | Sakshi
Sakshi News home page

Published Sat, May 26 2018 3:25 PM | Last Updated on Sat, May 26 2018 3:25 PM

Saaho New Schedule From June Second Week - Sakshi

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సాహో. యూవీ క్రియేషన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు రన్‌ రాజా రన్‌ ఫేం సుజిత్‌ దర్శకుడు. ఇటీవల దుబాయ్‌లో భారీ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ సాహో టీం ప్రస్తుతం బ్రేక్‌ తీసుకుంది. దుబాయ్‌ షెడ్యూల్‌లో భారీ యాక్షన్‌, చేజ్‌ సీన్స్‌ను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు.

జూన్‌ రెండో వారంలో మరో షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు సాహో యూనిట్‌. ఈ షెడ్యూల్‌ను రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించనున్నారు. బాహుబలి సిరీస్‌ తరువాత ప్రభాస్‌ చేస్తున్న సినిమా కావటంతో సాహోపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ‍్గట్టుగా చిత్రయూనిట్‌ ప్రతిష్టాత్మకంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తోంది.

ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు జాకీష్రాఫ్, నీల్‌ నితిన్‌ ముఖేష్,చుంకీ పాండే, మందిరా బేడిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement