తొలి తెలుగు చిత్రంగా ‘సాహో’ | Prabhas Saaho Is The First Telugu Film Got Twitter Emoji | Sakshi
Sakshi News home page

తొలి తెలుగు చిత్రంగా ‘సాహో’

Published Fri, Aug 23 2019 1:00 PM | Last Updated on Fri, Aug 23 2019 4:45 PM

Prabhas Saaho Is The First Telugu Film Got Twitter Emoji - Sakshi

టాలీవుడ్‌లో ఇప్పటివరకు ఏ చిత్రానికి దక్కని అరుదైన ఘనతను ‘సాహో’ సొంతం చేసుకుంది. ప్రభాస్‌ హీరోగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రం ‘సాహో’. సుజీత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. యువీ క్రియేషన్‌ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంపై ఇప్పటికే జాతీయ స్థాయిలో క్రేజ్‌ ఏర్పడింది. ఇప్పటికే ప్రమోషన్స్‌ మొదలుపెట్టిని చిత్ర బృందానికి మరింత జోష్‌ కలిగించే వార్త లభించింది. తాజాగా సాహోకు ట్విటర్‌ ఎమోజీ వచ్చింది.  

ఇందులో వింతేముంది అనుకోకండి. ట్విటర్‌ ఎమోజీ లభించిన తొలి తెలుగు సినిమాగా ‘సాహో’నిలిచింది. టాలీవుడ్‌ను ఏలిన అగ్రహీరోల సినిమాలకు సాధ్యంకానీ ఘనతను ప్రభాస్‌ సాహో సాధించింది. ఈ మధ్యకాలంలో తమిళంలో కాలా, సర్కార్‌, బాలీవుడ్‌లో జీరో, సుల్తాన్‌ సినిమాలకు ట్విటర్‌ ఎమోజీలు వచ్చాయి. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌లతో ‘సాహో’పై భారీ అంచనాలే నమోదయ్యాయి. ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచుతుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

చదవండి:
‘సాహో’ఖాతాలో ప్రపంచ రికార్డు
‘సాహో నుంచి తీసేశారనుకున్నా’
సాహో : ప్రభాస్‌ సింగిలా.. డబులా?​​​​​​​

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement