సాహో : రొమానియాలో మరో భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ | Saaho Team Heading to Romania For The Final Schedule | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 20 2018 12:48 PM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM

Saaho Team Heading to Romania For The Final Schedule - Sakshi

బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సాహో. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను 2019 సమ్మర్‌లో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే దుబాయ్‌లో ఓ భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ను చిత్రీకరించిన చిత్రయూనిట్‌ త్వరలో మరో యాక్షన్‌ సీన్‌కు రెడీ అవుతున్నారు.
 

ఈ సారి రొమానియాలో ఓ భారీ చేజ్‌ను చిత్రీకరించనున్నారట. ఈ షెడ్యూల్‌ లో ప్రభాస్‌తో పాటు ప్రతినాయక పాత్రలో నటిస్తున్న నీల్‌ నితిన్‌ ముఖేష్‌ కూడా పాల్గొననున్నట్టుగా తెలుస్తోంది. సాహోతో పాటు రాధకృష్ణ దర్శకత్వంలో పిరియాడిక్‌లవ్‌ స్టోరిలోనూ నటిస్తున్నాడు ప్రభాస్‌. ఈ రెండు సినిమాలు 2019లోనే రిలీజ్‌ అయ్యే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement