రన్ శర్వా రన్
రన్ శర్వా రన్
Published Sun, Feb 9 2014 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 3:31 AM
ప్రయాణానికి రిలేటడ్‌గా ఉండే టైటిల్స్... శర్వానంద్‌కి బాగా కలిసొచ్చాయి. గమ్యం, ప్రస్థానం, జర్నీ చిత్రాల టైటిల్స్ ఆ కోవకు చెందినవే. ప్రస్తుతం శర్వానంద్ నటిస్తున్న చిత్రానికి ‘రన్ రాజా రన్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఇది కూడా ప్రయాణానికి రిలేటెడ్‌గా ఉన్న టైటిలే కావడం గమనార్హం. సో.. శర్వానంద్‌కి మరో హిట్ ఖాయం అని ఫిలింనగర్ టాక్. బ్లాక్‌బస్టర్ హిట్ ‘మిర్చి’ తర్వాత యు.వి.క్రియేషన్స్ పతాకంపై వంశి, ప్రమోద్‌లు నిర్మిస్తున్న చిత్రమిది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్‌కి జోడీగా సీరత్ కపూర్ నటిస్తున్నారు.
సగానికి పైగా టాకీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘దర్శకుడు చెప్పిన కథపై నమ్మకంతో ఈ సినిమా తీస్తున్నాం. ‘మిర్చి’కి చాయాగ్రహణం అందించిన మధి... ఈ చిత్రానికి కూడా పనిచేస్తున్నారు. ‘విశ్వరూపం-2’కు స్వరాలందిస్తున్న గిబ్రాన్.ఎం ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ప్రస్తుతం ఆర్‌ఎఫ్‌సీలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. ఈ నెలాఖరుకు గోవాలో చిత్రీకరణ ఉంటుంది. ప్రేమ, వినోదం మేళవింపుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కూర్పు: మధు, కళ: ఏఎస్ ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్, లైన్ ప్రొడ్యూసర్: సందీప్.
Advertisement
Advertisement