titled
-
పేస్ జంటకు టైటిల్
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఈ ఏడాది రెండో ఏటీపీ చాలెంజర్ టూర్ డబుల్స్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. సాంటో డొమింగో ఓపెన్‌లో పేస్–వరేలా (మెక్సికో) జోడీ విజేతగా నిలిచింది. డొమినికన్ రిపబ్లిక్లో ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో రెండో సీడ్ పేస్–వరేలా జంట 4–6, 6–3, 10–5తో బెహర్ (ఉరుగ్వే)–రొబెర్టో (ఈక్వెడార్) ద్వయంపై గెలిచి టైటిల్ సాధించింది. ఈ టైటిల్‌తో 110 ర్యాంకింగ్ పాయింట్లతో పాటు రూ. 5.70 లక్షల ప్రైజ్‌మనీ పేస్ ఖాతాలో చేరింది. 45 ఏళ్ల పేస్ వరేలాతో కలిసి గతవారం మాంట్రీ చాలెంజర్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. -
సాత్విక జంటకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి సామ సాత్విక మహిళల డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించింది. న్యూఢిల్లీలో శుక్రవారం జరిగిన ఫైనల్లో సాత్విక–మహక్ జైన్ జంట 6–3, 6–3తో షేక్ హుమేరా (తెలంగాణ)–సారా దేవ్ జోడీపై గెలుపొందింది. అండర్–18 బాలికల సింగిల్స్ టైటిల్ తెలంగాణ అమ్మాయికి ఖాయమైంది. ఈ విభాగంలో హైదరాబాద్ అమ్మాయిలు భమిడిపాటి శ్రీవల్లి రష్మిక, షేక్ హుమేరా టైటిల్ పోరుకు చేరుకున్నారు. సెమీఫైనల్స్‌లో రష్మిక 6–4, 6–3తో రెండోసీడ్ శరణ్య గవారే (మహారాష్ట్ర)పై, షేక్ హుమేరా 6 -
హామిల్టన్ హవా
సోచి: సహచరుడు బొటాస్ సహకారం ఇవ్వడంతో ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఎనిమిదో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన రష్యా గ్రాండ్‌ప్రి రేసులో హామిల్టన్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. నిర్ణీత 53 ల్యాప్‌లను హామిల్టన్ గంటా 27 నిమిషాల 32.054 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన బొటాస్ రెండో స్థానాన్ని పొందాడు. 25వ ల్యాప్ వరకు వెటెల్ (ఫెరారీ) తొలి స్థానంలో, బొటాస్ రెండో స్థానంలో, హామిల్టన్ మూడో స్థానంలో ఉన్నారు. ఈ దశలో హామిల్టన్‌కు ఓవర్టేక్ చేసే అవకాశం ఇవ్వాలని మెర్సిడెస్ జట్టు టీమ్ రేడియాలో బొటాస్‌ను ఆదేశించింది. జట్టు ఆదేశాలను పాటించిన బొటాస్ వేగం తగ్గించి హామిల్టన్‌కు ఓవర్టేక్ చేసే అవకాశం ఇచ్చాడు. దాంతో రెండో స్థానానికి చేరిన హామిల్టన్ అదే జోరులో ఆధిక్యంలో ఉన్న వెటెల్‌ను కూడా వెనక్కి నెట్టి ఆధిక్యంలోకి వచ్చాడు. చివరి ల్యాప్ వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని కెరీర్లో 70వ విజయాన్ని దక్కించుకున్నాడు. వెటెల్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా తొమ్మిది, పది స్థానాల్లో నిలిచారు. 21 రేసుల ఈ సీజన్లో 16 రేసులు పూర్తయ్యాక హామిల్టన్ 306 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 256 పాయింట్లతో వెటెల్ రెండో స్థానంలో... 189 పాయింట్లతో బొటాస్ మూడో స్థానంలో ఉన్నారు. సీజన్‌లోని తదుపరి రేసు జపాన్ గ్రాండ్‌ప్రి ఈనెల 7న జరుగుతుంది. -
లలిత్‌కు మూడో గెలుపు
కోల్‌కతా: కోల్‌కతా ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు మూడో విజయం నమోదు చేశాడు. నితిన్ (రైల్వేస్)తో ఆదివారం జరిగిన ఏడో రౌండ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన లలిత్ 34 ఎత్తుల్లో గెలుపొందాడు. రత్నాకరన్ (భారత్)తో జరిగిన మరో గేమ్‌లో తెలంగాణ ప్లేయర్ ఎరిగైసి అర్జున్ 42 ఎత్తుల్లో విజయం సాధించాడు. హర్ష భరతకోటి, రవితేజ మధ్య జరిగిన గేమ్ 30 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. ఏడో రౌండ్ తర్వాత లలిత్, అర్జున్ 5.5 పాయింట్లతో మరో ఏడుగురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. -
కిడారి అంటున్న శశికుమార్
సొంతంగా నిర్మించి నటించిన తారైతప్పట్టై చిత్రం వసూళ్ల పరంగా నిరాశపరచినా ఆ వెంటనే శరవేగంగా కథానాయకుడిగా నటించిన వెట్రివేల్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న నటుడు, నిర్మాత, దర్శకుడు శశికుమార్. ఇదే ఏడాది మరో చిత్రంతో తెరపైకి రావడానికి రెడీ అవుతున్నారు. తాజా చిత్రం ఒక షెడ్యూల్ షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి కిడారి అనే టైటిల్‌ను నిర్ణయించారు. దీని గురించి శశికుమార్ తన ట్విట్టర్లో పేర్కొంటూ తన తాజా చిత్రానికి ప్రసాద్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తున్నట్లు వెల్లడించారు. త న సొంత బ్యానర్ కంపెనీ ప్రొడక్షన్స్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. దీన్ని ఈ ఏడాదిలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో నటి సుభ వరూనీ హీరోయిన్గా నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి రాజమందిరం చిత్రం ఫేమ్ దర్భుక శివ సంగీతాన్ని అందిస్తున్నారు. విషయం ఏమిటంటే కిడారి అనే టైటిల్‌తో ఒక చరిత్ర కథను తెరకెక్కించనున్నట్లు శశికుమార్ స్నేహితుడు, దర్శక-నటుడు సమద్రకణి ఇంతకు ముందు ప్రకటించారు. ఇప్పుడా టైటిల్‌ను శశికుమార్‌కి ఇచ్చినట్లు తెలుస్తోంది. సముద్రకణి కిడారి చిత్ర నిర్మాణానికి తెరపడినట్లేనా? అన్న ప్రశ్నకు కోలీవుడ్ తెరలేపుతోంది. -
రన్ శర్వా రన్
ప్రయాణానికి రిలేటడ్గా ఉండే టైటిల్స్... శర్వానంద్‌కి బాగా కలిసొచ్చాయి. గమ్యం, ప్రస్థానం, జర్నీ చిత్రాల టైటిల్స్ ఆ కోవకు చెందినవే. ప్రస్తుతం శర్వానంద్ నటిస్తున్న చిత్రానికి ‘రన్ రాజా రన్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఇది కూడా ప్రయాణానికి రిలేటెడ్‌గా ఉన్న టైటిలే కావడం గమనార్హం. సో.. శర్వానంద్‌కి మరో హిట్ ఖాయం అని ఫిలింనగర్ టాక్. బ్లాక్‌బస్టర్ హిట్ ‘మిర్చి’ తర్వాత యు.వి.క్రియేషన్స్ పతాకంపై వంశి, ప్రమోద్‌లు నిర్మిస్తున్న చిత్రమిది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్‌కి జోడీగా సీరత్ కపూర్ నటిస్తున్నారు. సగానికి పైగా టాకీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘దర్శకుడు చెప్పిన కథపై నమ్మకంతో ఈ సినిమా తీస్తున్నాం. ‘మిర్చి’కి చాయాగ్రహణం అందించిన మధి... ఈ చిత్రానికి కూడా పనిచేస్తున్నారు. ‘విశ్వరూపం-2’కు స్వరాలందిస్తున్న గిబ్రాన్.ఎం ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ప్రస్తుతం ఆర్ఎఫ్సీలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. ఈ నెలాఖరుకు గోవాలో చిత్రీకరణ ఉంటుంది. ప్రేమ, వినోదం మేళవింపుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కూర్పు: మధు, కళ: ఏఎస్ ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్, లైన్ ప్రొడ్యూసర్: సందీప్.