కిడారి అంటున్న శశికుమార్ | Sasikumar's next is titled as Kidari | Sakshi
Sakshi News home page

కిడారి అంటున్న శశికుమార్

Published Thu, May 12 2016 2:48 AM | Last Updated on Sun, Sep 3 2017 11:53 PM

కిడారి అంటున్న శశికుమార్

కిడారి అంటున్న శశికుమార్

సొంతంగా నిర్మించి నటించిన తారైతప్పట్టై చిత్రం వసూళ్ల పరంగా నిరాశపరచినా ఆ వెంటనే శరవేగంగా కథానాయకుడిగా నటించిన వెట్రివేల్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న నటుడు, నిర్మాత, దర్శకుడు శశికుమార్. ఇదే ఏడాది మరో చిత్రంతో తెరపైకి రావడానికి రెడీ అవుతున్నారు. తాజా చిత్రం ఒక షెడ్యూల్ షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకుంది.
 
 ఈ చిత్రానికి కిడారి అనే టైటిల్‌ను నిర్ణయించారు. దీని గురించి శశికుమార్ తన ట్విట్టర్‌లో పేర్కొంటూ తన తాజా చిత్రానికి ప్రసాద్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తున్నట్లు వెల్లడించారు. త న సొంత బ్యానర్ కంపెనీ ప్రొడక్షన్స్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. దీన్ని ఈ ఏడాదిలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
 
  ఇందులో నటి సుభ వరూనీ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి రాజమందిరం చిత్రం ఫేమ్ దర్భుక శివ సంగీతాన్ని అందిస్తున్నారు. విషయం ఏమిటంటే కిడారి అనే టైటిల్‌తో ఒక చరిత్ర కథను తెరకెక్కించనున్నట్లు శశికుమార్ స్నేహితుడు, దర్శక-నటుడు సమద్రకణి ఇంతకు ముందు ప్రకటించారు. ఇప్పుడా టైటిల్‌ను శశికుమార్‌కి ఇచ్చినట్లు తెలుస్తోంది. సముద్రకణి కిడారి చిత్ర నిర్మాణానికి తెరపడినట్లేనా? అన్న ప్రశ్నకు కోలీవుడ్ తెరలేపుతోంది.     
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement