Kidari
-
కిడారి శ్రావణ్ రాజీనామా... ఆమోదం
సాక్షి, అమరావతి: గిరిజన, కుటుంబ సంక్షేమ శాఖ మం త్రి కిడారి శ్రావణ్ కుమార్ రాజీనామాను గవర్నర్ ఆమో దించారు. ఈ మేరకు గవర్న ర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. గురువారం ఉదయం కిడారి శ్రావణ్ తన మంత్రి పదవికి రాజీనామా చేస్తూ ఆ పత్రాన్ని సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్రకు అందజేశారు. సీఎం చంద్రబాబు అనుమతితో దాన్ని సీఎంవో గవర్నర్ నరసింహన్‌కు పంపించింది. అరకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కిడారి సర్వేశ్వరరావు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఎన్నికయ్యారు. ఆ తరువాత చంద్రబాబు ప్రలోభాలకు లోనై టీడీపీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్య చేశారు. దీంతో సర్వేశ్వరరావు కుమారుడు శ్రావణ్ కుమార్‌ను గత ఏడాది నవంబర్ 11న చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే కిడారి శ్రావణ్‌కుమార్ ఏ చట్టసభకు ఎన్నిక కాలేదు. దీంతో శుక్రవారం నాటికి కిడారి మంత్రి పదవి చేపట్టి ఆరు నెలలు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో కిడారి శ్రావణ్ కుమార్ చేత మంత్రి పదవికి రాజీనామా చేయించాల్సిందిగా సీఎంవో కార్యాలయానికి బుధవారం గవర్నర్ కార్యాలయం సూచించింది. ఈ నేపథ్యంలో గురువారం కిడారి శ్రావణ్ కుమార్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజ్యాంగ నిబంధనల మేరకు మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు శ్రావణ్ కుమార్ తెలిపారు. -
కిడారి కొవ్వు కేక
సాక్షి దినపత్రికలో రెండు రోజులుగా వస్తున్న కథనాలపై అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. అనంతగిరి మండలం శివలింగపురంలోని మౌంటేన్ వ్యూ ప్రైవేటు అతిథి గృహంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆవేశంతో ఊగిపోయారు. ఎవరో తన పేరు చెప్పి భూములు కొనుగోలు చేస్తే తానే కొన్నానని చెప్పడం సరికాదన్నారు. వాలసీ ప్రాంతంలో శెట్టి గంగాధరస్వామి మేనల్లుడు ముత్యాలు పేరున మైనింగ్ లీజు ఉందని చెప్పుకొచ్చారు. ముత్యాలు కష్టాల్లో ఉంటే సహాయం చేశానే గానీ తనకు మైనింగ్‌తో సంబంధం లేదన్నారు. హుకుంపేట మండలంలో క్వారీ తప్ప మైన్స్ ఏమీ లేవ ని తెలిపారు. ప్రభుత్వ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి, బాధ్యులపై చర్య తీసుకోవాలన్నారు. మీ పేరు చెప్పి అక్రమాలు పాల్పడిన వాళ్లపై చర్యలు తీసుకుంటారా... అని విలేకరులు ప్రశ్నించగా ఆయన నుంచి సరైన సమాధానం రాలేదు. సాక్షితో పాటు ఇతర పత్రికల్లో కూడా భూదందాపై కథనాలు వచ్చాయని ప్రస్తావించినా ఆయన పట్టించుకోకుండా ఒక్క సాక్షినే లక్ష్యంగా చేసుకొని కువిమర్శలు చేశారు. ఆ జరిమానా ఏమైందో తెలుసుకుంటా.. ఆ క్వారీలో అక్రమ తవ్వకాలపై జరిమానా విధించిన విషయం నాకు తెలియదు. నేను ఇటీవలే బాధ్యతలు చేపట్టాను. మైనింగ్ అధికారులు జరిమానా విధించి ఉంటారు. ఆ తర్వాత ఏమైందో తెలుసుకుని జరిమానా వసూలు చేసే విధంగా చర్యలు తీసుకుంటాను. - ఎల్.శివశంకర్, సబ్‌కలెక్టర్ రెవెన్యూ రికవరీ యాక్ట్‌కు పంపించాం అది కచ్చితంగా అక్రమ క్వారీనే. అక్రమ మైనింగ్ పై దాడులు చేసి కేసు నమోదు చేశాం. నోటీసులు ఇచ్చాం. అయినా బకాయిలు చెల్లించకపోవడం తో చివరికి రెవెన్యూ రికవరీ యాక్ట్‌కు రిఫర్ చేశాం. -కె.సుబ్బారావు, మైనింగ్ విజిలెన్స్ ఏడీ -
ఆ జరిమానా.. అయ్యిందా నజరానా?
కిడారి బినామీ క్వారీకి రూ.78 లక్షల ఫైన్ క్రిమినల్ కేసులూ నమోదు చేయాలని సిఫారసులు పచ్చ చొక్కా వేసుకున్నాక పట్టించుకోని అధికారులు వేధింపులు.. బెదిరింపులపైనా కేసుల్లేవు విశాఖపట్నం: ఏజెన్సీలోని చింతపల్లి మండలం లోతుగెడ్డ పంచాయతీ ఉమ్మరాసగొందిలో విలువైన నల్లరాయి కొండలు ఉన్నాయి. వీటిపై కన్నేసిన అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తవ్వకాల లెసైన్సు కోసం తన అనుచరుడైన ఓ గిరిజనుడితో దరఖాస్తు చేయించారు. గత ఏడాది అనుమతులు వచ్చాయి. అయితే మైనింగ్ శాఖ అనుమతిచ్చిన చోట కాకుండా దానికి 200 మీటర్ల దూరంలో ఉన్న విలువైన మరో నల్లరాయి కొండను నిబంధనలకు విరుద్ధంగా తవ్వేయడం ప్రారంభించారు. హైపవర్ యంత్రాలతో లోతుగా తవ్వకూడదనే నిబంధనలను సైతం పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా మైనింగ్ చేపట్టారు. భారీ పేలుళ్ల ధాటికి భ యాందోళనకు గురైన క్వారీ సమీపంలోని ఉమ్మరాసగొంది, దబ్బగరువు, కిన్నెర్ల గ్రామాల గిరిజనులు సమావేశమయ్యారు. పేలుళ్లు, అక్రమ క్వారీపై అధికారులకు ఫిర్యాదు చేయాలని భావించారు. అయితే ఎమ్మెల్యే సర్వేశ్వరరావుకు చెందిన క్వారీ కావడంతో.. ఎందుకొచ్చిన గొడవని వెనక్కి తగ్గారు. అయితే ఆ తర్వాత ఈ క్వారీ పేలుళ్లలో జి.మాడుగుల మండలానికి చెందిన ఓ కూలీ తీవ్రంగా గాయపడటంతో మేల్కొన్న గిరిజనులంతా రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. క్వారీలో అడ్డగోలు తవ్వకాలను అడ్డుకోవాలని వేడుకున్నారు. పట్టించుకోకపోగా.. వేధింపులు : ఆ ఫిర్యాదును అధికారులు పట్టించుకోకపోగా గిరిజనులకు ఎమ్మెల్యే నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఫిర్యాదు చేసిన గిరిజనులను అన్నవరం పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి బెదిరించారనే వాదనలు కూడా అప్పట్లో వెల్లువెత్తాయి.క్వారీ పేలుళ్లలో తీవ్ర గాయాలపాలైన గిరిజనుడి వివరాలను కూడా పోలీసులు నమోదు చేయలేదు. అయితే అప్పట్లో గ్రామాన్ని సందర్శించిన బీజేపీ నేత లోకులగాంధీకి గిరిజనులు క్వారీ కష్టాలను వివరించారు. స్పందించిన గాంధీ అక్రమంగా సాగుతున్న నల్లరాయి తవ్వకాలను ఫొటోలతో సహా జిల్లా కలెక్టర్, మైనింగ్‌శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎట్టకేలకు అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. అప్పటి సబ్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, మైనింగ్ శాఖ అధికారులు వేర్వేరుగా క్వారీలో తనిఖీలు నిర్వహించారు. అనుమతులు లేకుండా అక్రమ తవ్వకాలు జరిగాయని, ఇప్పటికే విలువైన నల్లరాయిని లూటీ చేశారని మైనింగ్ విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. రూ.78 లక్షల జరిమానాతో పాటు, క్వారీ నిర్వహకులందరిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని సూచించింది. కానీ కిడారి అధికార తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయిన దరిమిలా పరిస్థితిలో మార్పువచ్చింది. కనీసం నోటీసులు కూడా తీసుకోకుండా కాలయాపన చేసినా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నోటీసులే తీసుకోని వాళ్లు జరిమానా ఏం చెల్లిస్తారు.. ఒక్క పైసా కూడా కట్టలేదు. -
ఎం.ఎల్.ఎ. మైనింగ్.. ల్యాండ్స్.. అధికారం..
అరకులోయ ఎమ్మెల్యే సరికొత్త భాష్యం {పజాప్రతినిధి ముసుగులో దందాలే.. దందాలు.. ఓ పక్క డీ ఫారం భూముల కబ్జా మరో వైపు యథేచ్ఛగా అక్రమ మైనింగ్ ఇంకోవైపు సర్కారు నిధులతో క్యాంపు కార్యాలయాలు మన్యంలో అడ్డూఅదుపూ లేని కిడారి అరాచకాలు ప్రజాతీర్పును పక్కన పెట్టి పార్టీ ఫిరాయించడం ద్వారా ప్రజలకు నమ్మకద్రోహం చేశారు.. పేదలను మాటలతో మభ్యపెట్టి జీవనాధారమైన వారి భూములను లాక్కున్నారు.. ఇవి చాలవన్నట్లు అక్రమ మైనింగ్‌తో ప్రకృతి సంపదను.. ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతున్నారు.. గిరిజన ప్రజాప్రతినిధి ముసుగులో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అక్రమాలను తవ్వినకొద్దీ విస్మయకర వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి.. ఈ దందాల కోసమే ఆయన పార్టీ ఫిరాయించి.. అధికార పార్టీలోకి జంప్ చేశారన్న వాదనలను తాజా విషయాలు బలపరుస్తున్నాయి. ఏజెన్సీలో ఇక తనను అడిగేవారు గానీ.. అడ్డుచెప్పేవారు గానీ లేరన్న ధీమాతో అంతులేని అక్రమాలకు పాల్పడుతూ.. ఎమ్మెల్యే అన్న పదానికే కొత్త భాష్యం చెబుతున్నారు. అదేదో సినిమాలో ఎమ్మెల్యే అంటే నువ్వనుకున్నది కాదే.. అంటూ హీరో హీరోయిన్ను ఉద్దేశించి పాడిన పాట తరహాలోనే.. ఎం.ఎల్.ఎ. పదంలోని ఎం.. అంటే మైనింగ్, ఎల్.. అంటే ల్యాండ్, ఏ.. అధికార దాహం.. అనే సరికొత్త నిర్వచనం ఇస్తూ చెలరేగిపోతున్నారు. విశాఖపట్నం: ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన కిడారి ఇటీవల పార్టీకి ద్రోహం చేసి అధికార టీడీపీలోకి ఫిరాయించారు. అధికార పార్టీ ఆశ చూపిన ఆఫర్లే కారణమన్న వాదనలు అప్పట్లో వెల్లువెత్తాయి. అరకు నియోజకవర్గ పరిధిలోని అనంతగిరి మండలంలో తాజాగా వెలుగు చూస్తున్న అక్రమ మైనింగ్, భూదందాల పర్వం వాటిని నిజం చేస్తున్నాయి. అనంతగిరి మండలం గరుగుబిల్లి పంచాయతీ పరిధిలో సుమారు 136 ఎకరాల ఢీ ఫారం భూములను పేద రైతులను మాయచేసి కాజేసిన ఎమ్మెల్యే కిడారి.. వాలాసి పంచాయతీలో కాల్సైట్ మైనింగ్ నిర్వహిస్తున్న విషయం బయటపడింది. శివలింగపురం గ్రామానికి చెందిన భీమవరపు ముత్యాలు పేరిట వాలాసి పంచాయతీ తూబుర్తి గ్రామంలో సుమారు పదెకరాల కాల్సైట్ మైనింగ్ లీజు ఉంది. మాజీ ఎంపీపీ, టీడీపీ నాయకుడు శెట్టి గంగాధరస్వామి మేనల్లుడైన ముత్యాలు పేరిట ఈ లెసైన్స్ ఉన్నప్పటికీ అక్కడ గత ఐదేళ్లుగా మైనింగ్ నిర్వహించడం లేదు. వ్యక్తిగత కారణాల వల్ల ముత్యాలు మైనింగ్ నిలిపివేశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కిడారి దానిపై కన్నేశారు. మైనింగ్ చేపట్టేందుకు ప్రయత్నించినా లీజుదారు అందుకు అంగీకరించలేదు. ఇటీవలే అధికార పార్టీలో చేరి మళ్లీ మైనింగ్‌పై పడ్డారు. చక్రం తిప్పి లీజుదారునితో ఒప్పందం కుదుర్చుకొని తవ్వకాలు ప్రారంభించారు. గత నెలరోజులుగా ఇక్కడ విచ్చలవిడిగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 24 టన్నుల మేరకు కాల్సైట్ ఖనిజం తరలించినట్లు తెలుస్తోంది. ఇదే ప్రాంతంలో కాల్సైట్ మైనింగ్ నిర్వహిస్తున్న దుర్గా సొసైటీకి బినామీగా ఖమ్మం జిల్లాకు చెందిన అప్పారావు అనే వ్యాపారి వ్యవహరిస్తున్నారు. సదరు అప్పారావుతో కలిసి కిడారి పదెకరాల్లో మైనింగ్ చేపట్టినట్టు తెలుస్తోంది. పనిలోపనిగా నిమ్మలపాడులోని మూడు బ్లాకుల్లో ఉన్న సుమారు 50 ఎకరాల కాల్సైట్ గనులను కూడా నెలరోజుల క్రితంలీజుదారులపై ఒత్తిడి తెచ్చి దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఇక అనంతగిరి మండలంలో ఎక్కడైనా మైనింగ్ భూములు కేటాయించాలని కోరుతూ విశాఖలోని మైనింగ్ శాఖ అధికారులపై కిడారి ఒత్తిడి తీసుకువస్తున్నట్టు సమాచారం. అప్పుడు తప్పు.. ఇప్పుడు ఒప్పట! హుకుంపేట మండలం జోగులపుట్టు, గూడ గ్రామాల సరిహద్దులోని నల్లరాయి(బ్లాక్ స్టోన్) క్వారీలో మైనింగ్‌పై మూడేళ్ల కిందట విమర్శలు వెల్లువెత్తాయి. కిడారి పేరిట లెసైన్స్ ఉన్న ఆ క్వారీలో నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ జరుగుతోందంటూ అప్పటి మంత్రి బాలరాజు హయాంలో రూ.60 లక్షల జరిమానా కూడా విధించారు. అప్పటి నుంచి తెరచుకోని ఆ క్వారీ సరిగ్గా కిడారి టీడీపీలోకి జంప్ చేయడానికి కొద్దిరోజుల ముందే మళ్లీ తెరచుకుంది. కిడారి ఒత్తిడి మేరకు అప్పటి జరిమానా విషయాన్ని కూడా గాలికొదిలేసి అధికారులు మైనింగ్‌కు అనుమతులిచ్చేశారు. దాంతో అక్కడ ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగించేస్తున్నారు. ప్రభుత్వ నిధులతో క్యాంపు కార్యాలయాలకు సోకులు : అరకులోయలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఐటీడీఏ నిధులతో నిర్మించిన రెంటల్ హౌసింగ్ కాలనీలోని ఒక భవనంలో కిడారి పాగా వేశారు. సుమారు రూ.పది లక్షల ప్రభుత్వ నిధులు ఖర్చు చేసి మరమ్మతులు చేపట్టి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంగా తీర్చిదిద్దారు. ఆయన వ్యక్తిగత కార్యాలయానికి ప్రభుత్వ నిధులతో సోకులు చేయించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తగా, ఇప్పుడు పాడేరులో కూడా ఇదే మాదిరి రెంటల్ హౌసింగ్ కాలనీలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని తీర్దిదిద్దారు. -
కిడారి అంటున్న శశికుమార్
సొంతంగా నిర్మించి నటించిన తారైతప్పట్టై చిత్రం వసూళ్ల పరంగా నిరాశపరచినా ఆ వెంటనే శరవేగంగా కథానాయకుడిగా నటించిన వెట్రివేల్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న నటుడు, నిర్మాత, దర్శకుడు శశికుమార్. ఇదే ఏడాది మరో చిత్రంతో తెరపైకి రావడానికి రెడీ అవుతున్నారు. తాజా చిత్రం ఒక షెడ్యూల్ షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి కిడారి అనే టైటిల్‌ను నిర్ణయించారు. దీని గురించి శశికుమార్ తన ట్విట్టర్లో పేర్కొంటూ తన తాజా చిత్రానికి ప్రసాద్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తున్నట్లు వెల్లడించారు. త న సొంత బ్యానర్ కంపెనీ ప్రొడక్షన్స్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. దీన్ని ఈ ఏడాదిలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో నటి సుభ వరూనీ హీరోయిన్గా నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి రాజమందిరం చిత్రం ఫేమ్ దర్భుక శివ సంగీతాన్ని అందిస్తున్నారు. విషయం ఏమిటంటే కిడారి అనే టైటిల్‌తో ఒక చరిత్ర కథను తెరకెక్కించనున్నట్లు శశికుమార్ స్నేహితుడు, దర్శక-నటుడు సమద్రకణి ఇంతకు ముందు ప్రకటించారు. ఇప్పుడా టైటిల్‌ను శశికుమార్‌కి ఇచ్చినట్లు తెలుస్తోంది. సముద్రకణి కిడారి చిత్ర నిర్మాణానికి తెరపడినట్లేనా? అన్న ప్రశ్నకు కోలీవుడ్ తెరలేపుతోంది.