కిడారి శ్రావణ్‌  రాజీనామా... ఆమోదం | Kidari Sravan Kumar tendered his resignation from the state cabinet | Sakshi
Sakshi News home page

కిడారి శ్రావణ్‌  రాజీనామా... ఆమోదం

Published Fri, May 10 2019 2:00 AM | Last Updated on Fri, May 10 2019 2:00 AM

Kidari Sravan Kumar tendered his resignation from the state cabinet - Sakshi

సాక్షి, అమరావతి:  గిరిజన, కుటుంబ సంక్షేమ శాఖ మం త్రి కిడారి శ్రావణ్‌ కుమార్‌ రాజీనామాను గవర్నర్‌ ఆమో దించారు. ఈ మేరకు గవర్న ర్‌ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. గురువారం ఉదయం కిడారి శ్రావణ్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేస్తూ ఆ పత్రాన్ని సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌ చంద్రకు అందజేశారు. సీఎం చంద్రబాబు అనుమతితో దాన్ని సీఎంవో గవర్నర్‌ నరసింహన్‌కు పంపించింది. అరకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కిడారి సర్వేశ్వరరావు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఎన్నికయ్యారు. ఆ తరువాత చంద్రబాబు ప్రలోభాలకు లోనై టీడీపీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్య చేశారు.

దీంతో సర్వేశ్వరరావు కుమారుడు శ్రావణ్‌ కుమార్‌ను గత ఏడాది నవంబర్‌ 11న చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే కిడారి శ్రావణ్‌కుమార్‌ ఏ చట్టసభకు ఎన్నిక కాలేదు. దీంతో శుక్రవారం నాటికి కిడారి మంత్రి పదవి చేపట్టి ఆరు నెలలు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో కిడారి శ్రావణ్‌ కుమార్‌ చేత మంత్రి పదవికి రాజీనామా చేయించాల్సిందిగా సీఎంవో కార్యాలయానికి బుధవారం గవర్నర్‌ కార్యాలయం సూచించింది. ఈ నేపథ్యంలో గురువారం కిడారి శ్రావణ్‌ కుమార్‌ మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజ్యాంగ నిబంధనల మేరకు మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు శ్రావణ్‌ కుమార్‌ తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement