
విభిన్న కథలను ఎంపిక చేసుకుని సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు నటుడు శశికుమార్. ఈయన ఇటీవల కథానాయకుడిగా నటించిన అయోత్తి చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకొని మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఆయన కళుగు వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన సత్య దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా జైభీమ్ చిత్రం నటి లిజోమోల్ జోస్ నటిస్తోంది.
బాలీవుడ్ నటుడు సుదేవ్‌నాయర్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా శరవణన్, కేజీఎఫ్ చిత్రం ఫేమ్ మాళవిక, బోస్ వెంకట్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. విజయగణపతి పిక్చర్స్ పతాకంపై పాండియన్ పరశురాం నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది 1990 ప్రాంతంలో జరిగే కథాచిత్రంగా ఉంటుందన్నారు.
పలు ఆసక్తికరమైన అంశాలతో థ్రిల్లర్ డ్రామాగా రూపొందిస్తున్న ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. ప్రస్తుతం చైన్నె పరిసర ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహిస్తున్నారు. నటుడు శశికుమార్ పాత్ర ఆయన గత చిత్రాలకు భిన్నంగా ఉంటుందని, కథ, కథనం, నేపథ్యం కొత్తగా ఉంటుందని, త్వరలోనే టైటిల్ ప్రకటించి చిత్ర టీజర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.
చదవండి: ‘భగవంత్ కేసరి’ కోసం శ్రీలీలకు భారీ రెమ్యునరేషన్.. కాజల్ కంటే ఎక్కువే!
Comments
Please login to add a commentAdd a comment