
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఈ ఏడాది రెండో ఏటీపీ చాలెంజర్ టూర్ డబుల్స్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. సాంటో డొమింగో ఓపెన్‌లో పేస్–వరేలా (మెక్సికో) జోడీ విజేతగా నిలిచింది. డొమినికన్ రిపబ్లిక్‌లో ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో రెండో సీడ్ పేస్–వరేలా జంట 4–6, 6–3, 10–5తో బెహర్ (ఉరుగ్వే)–రొబెర్టో (ఈక్వెడార్) ద్వయంపై గెలిచి టైటిల్ సాధించింది. ఈ టైటిల్‌తో 110 ర్యాంకింగ్ పాయింట్లతో పాటు రూ. 5.70 లక్షల ప్రైజ్‌మనీ పేస్ ఖాతాలో చేరింది. 45 ఏళ్ల పేస్ వరేలాతో కలిసి గతవారం మాంట్రీ చాలెంజర్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment