నా కామెడీ బావుందంటున్నారు - శర్వానంద్ | peoples are talking about my comedy ,says sharwanand | Sakshi
Sakshi News home page

నా కామెడీ బావుందంటున్నారు - శర్వానంద్

Published Sat, Aug 16 2014 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 11:55 AM

నా కామెడీ బావుందంటున్నారు - శర్వానంద్

నా కామెడీ బావుందంటున్నారు - శర్వానంద్

‘‘నా పదేళ్ల కల ఈ విజయం. నా కెరీర్‌కి ఇంతటి విజయాన్నిచ్చిన యు.వి. క్రియేషన్స్ సంస్థకు కృతజ్ఞతలు. ఈ సినిమా చూసిన వారందరూ నేను కామెడీ బాగా చేశానంటున్నారు. ఈ క్రెడిట్ మొత్తం దర్శకుడు సుజిత్‌కే దక్కుతుంది’’ అని శర్వానంద్ అన్నారు. ఆయన కథానాయకునిగా సుజిత్ దర్శకత్వంలో వంశీ-ప్రమోద్ కలిసి నిర్మించిన ‘రన్ రాజా రన్’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. దర్శకునిగా అవకాశం ఇచ్చిన నిర్మాతలకు సుజిత్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది సమష్టి విజయమనీ నిర్మాతలు అభిప్రాయపడ్డారు. దిల్ రాజు, అడివి శేషు కూడా మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement