టాలీవుడ్‌ హారర్‌ కామెడీ థ్రిల్లర్.. రిలీజ్‌ ఎప్పుడంటే? | Tollywood Movie OMG (O Manchi Ghost) Release Date Announced | Sakshi
Sakshi News home page

O My Ghost: వెన్నెల కిశోర్‌ హారర్‌ కామెడీ థ్రిల్లర్.. రిలీజ్‌ ఎప్పుడంటే?

Published Thu, Jun 6 2024 9:16 PM | Last Updated on Fri, Jun 7 2024 9:23 AM

Tollywood Movie OMG (O Manchi Ghost) Release Date Announced

వెన్నెల కిషోర్, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఓ మంచి ఘోస్ట్'. హారర్‌, కామెడీ జానర్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మార్క్‌సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్‌పై శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో రూపొందించారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్, లిరికల్ సాంగ్‌, టీజర్‌లకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా జూన్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మేరకు కొత్త పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, రఘుబాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement