ప్రేమకథలో ప్రభాస్ | hero prabs act to love story | Sakshi
Sakshi News home page

ప్రేమకథలో ప్రభాస్

Aug 2 2016 12:34 AM | Updated on Jul 14 2019 4:05 PM

ప్రేమకథలో ప్రభాస్ - Sakshi

ప్రేమకథలో ప్రభాస్

‘మిర్చి’లో ప్రభాస్ ఘాటు చూసి అప్పుడే మూడేళ్లు దాటేసింది. అప్పట్నుంచి రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ‘బాహుబలి’కి

‘మిర్చి’లో ప్రభాస్ ఘాటు చూసి అప్పుడే మూడేళ్లు దాటేసింది. అప్పట్నుంచి రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ‘బాహుబలి’కి అంకితమయ్యారు. తప్పదు మరి.. ఇంటర్నెషనల్ స్టాండర్డ్స్ ఉన్న సినిమా కదా! ప్రభాస్ కష్టం కూడా వృధా కాలేదు. ఈ యంగ్ రెబల్‌స్టార్‌కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది. కానీ, గ్యాప్ లేకుండా ప్రభాస్ నుంచి సినిమాలు ఆశిస్తున్న ప్రేక్షకులు, అభిమానుల కోసం వెంట వెంటనే రెండు సినిమాల్లో నటించనున్నారు.

ఇప్పటికే, సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించారనే వార్త తెలిసిందే. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ చెప్పిన కథకూ ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందట. రాధాకృష్ణ మాట్లాడుతూ -‘‘ప్రేమకథా చిత్రమిది. పూర్తిగా విదేశాల్లోనే చిత్రీకరిస్తాం. ప్రభాస్ పక్కన హీరోయిన్‌గా కొత్త అమ్మాయిని ఎంపిక చేయాలనుకుంటున్నాం’’ అని తెలిపారు. ఈ సినిమాని గోపీకృష్ణ, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మించనున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement