అటు ప్రభాస్‌.. ఇటు మహేశ్‌.. కరీనాకి డబుల్‌ చాన్స్‌! | Buzz: Kareena Kapoor Spirit Doing Spirit Opposite Prabhas | Sakshi

అటు ప్రభాస్‌.. ఇటు మహేశ్‌.. కరీనాకి డబుల్‌ చాన్స్‌!

Sep 19 2024 10:22 AM | Updated on Sep 19 2024 10:41 AM

Buzz: Kareena Kapoor Spirit Doing Spirit Opposite Prabhas

హీరో ప్రభాస్, హీరోయిన్‌ కరీనా కపూర్‌ జోడీ కట్టనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. ప్రభాస్‌ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్‌’ అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం తొలిసారి పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించనున్నారు ప్రభాస్‌. ప్రస్తుతం ‘స్పిరిట్‌’ సినిమాకు చెందిన ప్రీప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో ‘స్పిరిట్‌’ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలనుకుంటున్నారట. 

(చదవండి: ప్రేమకథ బయటపెట్టిన సోనియా.. బూతులందుకున్న పృథ్వి)

ఈ లోపు ఈ సినిమాకు చెందిన నటీనటుల ఎంపికపై సందీప్‌ రెడ్డి దృష్టి పెట్టారట. ఈ క్రమంలోనే హీరోయిన్‌ పాత్ర కోసం కరీనా కపూర్‌ను సంప్రదించారని సమాచారం. అంతేకాదు... కరీనా భర్త, నటుడు సైఫ్‌ అలీఖాన్‌ కూడా ‘స్పిరిట్‌’ చిత్రంలో కనిపిస్తారని, సైఫ్‌ది విలన్‌ పాత్ర అని బాలీవుడ్‌ భోగట్టా.    

(చదవండి: సూపర్‌స్టార్‌ కాళ్లకు నమస్కరించిన ఐశ్వర్య కూతురు..!)

మరోవైపు మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారట రాజమౌళి. ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం కరీనాను సంప్రదించారనే ప్రచారం టాలీవుడ్‌లో వినిపిస్తోంది. మరి... ప్రభాస్‌ ‘స్పిరిట్‌’కు కరీనా ఫైనల్‌ అవుతారా? మహేశ్‌బాబు చిత్రంలోనూ నటిస్తారా? లేదా ఈ రెండు భారీ చిత్రాల్లో భాగమయ్యేలా డబుల్‌ చాన్స్‌ దక్కించుకుంటారా? అనేది చూడాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement