Megastar Chiranjeevi Comments On Meeting With CM YS Jagan, Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

Chiranjeevi: సీఎం జగన్‌తో భేటీ అనంతరం ట్వీట్‌ చేసిన చిరంజీవి

Published Thu, Feb 10 2022 8:40 PM | Last Updated on Fri, Feb 11 2022 8:59 AM

Megastar Chiranjeevi Tweet About Meeting With AP CM YS Jagan Mohan Reddy - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ఈ రోజు(ఫిబ్రవరి 10) సినీ ప్రముఖులు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి మెగాస్టార్‌ చిరంజీవితో పాటు మహేశ్‌ బాబు, ప్రభాస్‌, దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, కొరటాల శివతో పాటు పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు వెళ్లారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన వారంతా త్వరలోనే శుభవార్త వస్తుందని చెప్పారు. సమావేశం ముగిసిన తర్వాత తిరుగు పయనమయ్యారు.

చదవండి: ఓటీటీకి రౌడీ బాయ్స్‌ చిత్రం.. స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌!, ఎక్కడంటే..

ఈ నేపథ్యంలో చిరంజీవి సీఎం జగన్‌తో జరిగిన భేటీపై ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్‌కు పరిశ్రమ తరపు మరోసారి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు చిరంజీవి ట్వీట్‌ చేస్తూ.. తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలన్నీ అన్ని కోణాల్లో అర్థం చేసుకుని పూర్తి అవగాహనతో, ఎంతో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపి.. సమస్యలపై ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవడమే కాక, తెలుగు చిత్ర పరిశ్రమకు భవిష్యత్‌ కార్యచరణను సూచిస్తూ..

చదవండి: Mahesh Babu-Vijay: ఆ స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌ మధ్య ట్విట్టర్‌ వార్‌, కారణమేటంటే..

ఇండస్ట్రీకి అన్ని రకాలుగా అండగ ఉంటానని భరోసా ఇస్తూ ఎంతో సానుకూలంగా స్పందించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారికి పరిశ్రమలోని ప్రతి ఒక్కరి తరపున మరోమారు కృతజ్ఞతలు. త్వరలోనే అధికారికంగా పరిశ్రమకు శుభవార్త అందుతుందని ఆశిస్తున్నాను’ అంటూ రాసుకొచ్చారు. అలాగే ‘మీరు ఇచ్చిన భరోసాతో మీరు చేసిన దిశానిర్దేశంతో తెలుగు పరిశ్రమ రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళుతుందన్న నమ్మకంతో హృదయపూర్వక ఆనందాన్ని తెలిజేస్తూ సీఎం జగన్‌గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అని చిరంజీవి పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement