
Chiranjeevi, Mahesh Babu And Others To Meet Cm Ys Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ ముగిసింది. టికెట్ ధరలు, సినీ ఇండస్ట్రీ సమస్యలపై ప్రధానంగా చర్చ జరిగింది. సుమారు గంటకు పైగా ఈ సమావేశం కొనసాగింది. చిరంజీవి, ప్రభాస్, మహేశ్‌బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, ఆర్ నారాయణ మూర్తి, నిరంజన్ రెడ్డి, అలీ వంటి ప్రముఖులు సీఎం జగన్‌తో సమావేశం అయ్యారు.
17 అంశాలపై చర్చ?
సినిమా టికెట్ల ధరను నిర్ణయించడానికి ఇప్పటికే ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భేటీ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. టికెట్ ధరలు, ఏసీ, నాన్‌ఏసీ థియేటర్లలో టికెట్ ధరల పెంపు సహా ఇండస్ట్రీకి చెందిన 17 అంశాలపై సినీ పెద్దలు సీఎంతో చర్చించినట్టు తెలుస్తోంది. కాగా బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు టాలీవుడ్ బృందం గన్నవరం విమనాశ్రయానికి చేరుకుంది. అక్కడినుంచి రోడ్డుమార్గంలో తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి సినీ ప్రముఖులు బయల్దేరి వెళ్లారు.