Nagarjuna And Jr NTR: Afar From Meeting With CM Jagan Mohan Reddy Details Inside - Sakshi
Sakshi News home page

Nagarjuna- Jr NTR : సీఎం జగన్‌తో భేటీ.. నాగార్జున, తారక్‌ దూరం

Published Thu, Feb 10 2022 11:10 AM | Last Updated on Fri, Feb 11 2022 10:14 AM

Nagarjuna And Jr NTR Afar From Meeting With CM Jagan Mohan Reddy - Sakshi

Nagarjuna And Jr NTR Afar From Meeting With CM Jagan: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీపైనే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం చర్చ జరుగుతుంది. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరిన టాలీవుడ్‌ బృందం రోడ్డు మార్గంలో సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. సినిమా టికెట్ల ధర సహా ఇతర అంశాలపై ప్రధానంగా ఈ భేటీ జరగనుంది.

చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్‌, కొరటాల శివ, నిరంజన్‌ రెడ్డి, అలీ, పోసాని కృష్ణమురళి వంటి ప్రముఖులు సీఎం జగన్‌తో సమావేశం అయ్యారు. అయితే ఈ భేటీలో నాగార్జున, జూనియర్‌ ఎన్టీఆర్‌ పాల్గొనకపోవడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. సీఎం జగన్‌ను కలిసే లిస్ట్‌లో వీరిద్దరి పేర్లు ఉన్నా చివరి నిమిషంలో ఎందుకు గైర్హాజరయ్యారు అన్నదానిపై ఇప్పుడు చర్చకు దారితీసింది.

కాగా అక్కినేని అమలకు కరోనా పాజిటివ్‌ అని నిర్థారణ అవడంతో హోం ఐసోలేషన్‌లో ఉన్న నాగార్జున ఈ కారణంగానే భేటికి దూరంగా ఉన్నట్లు సమాచారం. మరి తారక్‌ విషయంలో వ్యక్తిగత కారణాలు ఉన్నాయా అన్నదానిపై ఇంకా తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement