సినీ ప్రముఖులకు గ్రాండ్‌ పార్టీ ఇచ్చిన ఎన్టీఆర్‌.. ఫోటోలు వైరల్‌ | Jr NTR Hosts Special Party To Tollywood Famous Persons And Amazon Studios VP James Ferrell - Sakshi
Sakshi News home page

Jr NTR: ఎన్టీఆర్‌ పార్టీకి అమెజాన్ స్టూడియోస్ వైస్‌ ప్రెసిడెంట్‌.. ఎందుకొచ్చాడబ్బా?

Published Thu, Apr 13 2023 9:19 AM | Last Updated on Thu, Apr 13 2023 10:21 AM

Jr NTR Hosts Special Party To Tollywood Famous Persons And Amazon Studios VP James Ferrell - Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా పాపులారిటీ సంపాదించుకున్న యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో NTR30లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరగుతుంది. ఇదిలా ఉంటే బుధవారం రాత్రి తారక్‌ తన నివాసంలో గ్రాండ్‌ పార్టీని అరెంజ్‌ చేశారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు అమెజాన్ స్టూడియోస్, ప్రైమ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫెర్రెల్ కూడా ఈ పార్టీకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ పార్టీకి సంబంధించిన పలు ఫోటోలను ఎన్టీఆర్‌ స్వయంగా ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. 'నా ఫ్రెండ్స్‌, కావాల్సిన వాళ్లతో ఈవ్‌నింగ్‌ సరదాగా గడిచింది. పార్టీకి వచ్చినందుకు థ్యాంక్స్‌ జేమ్స్‌'.. అంటూ తారక్‌ ట్వీట్‌ చేశారు. ఈ పార్టీకి రాజమౌళి, కొరటాల శివ,నిర్మాతలు శోభు యార్లగడ్డ, శిరీష్‌, మైత్రీ నవీన్ యెర్నేని, రవి శంకర్, దిల్‌ రాజు కూతురు హన్షిత రెడ్డితో పాటు అమెజాన్ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ హాజరయ్యారు.

అయితే ఆ పార్టీకి రామ్‌చరణ్‌ మాత్రం రాలేదు. రీసెంట్‌గానే మాల్దీవులు ట్రిప్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చేసిన చరణ్‌ మరి తారక్‌ ఏర్పాటు చేసిన పార్టీకి ఎందుకు దూరంగా ఉన్నారన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఇక గత నెలలో రామ్‌చరణ్‌ బర్త్‌డే పార్టీలో కూడా తారక్‌ కనిపించలేదు. తాజాగా సినీ ప్రముఖులకు ఎన్టీఆర్‌ విందు ఎందుకు ఇచ్చాడన్నది తెలియలేదు. ఈ పార్టీకి అమెజాన్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ రావడం మరింత సస్పెన్స్‌గా మారింది. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement