Dinner Party
-
సినీ ప్రముఖులకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన ఎన్టీఆర్.. ఫోటోలు వైరల్
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా పాపులారిటీ సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో NTR30లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరగుతుంది. ఇదిలా ఉంటే బుధవారం రాత్రి తారక్ తన నివాసంలో గ్రాండ్ పార్టీని అరెంజ్ చేశారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు అమెజాన్ స్టూడియోస్, ప్రైమ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫెర్రెల్ కూడా ఈ పార్టీకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పార్టీకి సంబంధించిన పలు ఫోటోలను ఎన్టీఆర్ స్వయంగా ట్విటర్ ద్వారా పంచుకున్నారు. 'నా ఫ్రెండ్స్, కావాల్సిన వాళ్లతో ఈవ్నింగ్ సరదాగా గడిచింది. పార్టీకి వచ్చినందుకు థ్యాంక్స్ జేమ్స్'.. అంటూ తారక్ ట్వీట్ చేశారు. ఈ పార్టీకి రాజమౌళి, కొరటాల శివ,నిర్మాతలు శోభు యార్లగడ్డ, శిరీష్, మైత్రీ నవీన్ యెర్నేని, రవి శంకర్, దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డితో పాటు అమెజాన్ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ హాజరయ్యారు. అయితే ఆ పార్టీకి రామ్‌చరణ్ మాత్రం రాలేదు. రీసెంట్‌గానే మాల్దీవులు ట్రిప్ నుంచి హైదరాబాద్ వచ్చేసిన చరణ్ మరి తారక్ ఏర్పాటు చేసిన పార్టీకి ఎందుకు దూరంగా ఉన్నారన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఇక గత నెలలో రామ్‌చరణ్ బర్త్‌డే పార్టీలో కూడా తారక్ కనిపించలేదు. తాజాగా సినీ ప్రముఖులకు ఎన్టీఆర్ విందు ఎందుకు ఇచ్చాడన్నది తెలియలేదు. ఈ పార్టీకి అమెజాన్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ రావడం మరింత సస్పెన్స్‌గా మారింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) An evening well spent with friends and well wishers. Was great catching up with James and Emily. Thanks for keeping your word and joining us for dinner. pic.twitter.com/Zy0nByHQoq — Jr NTR (@tarak9999) April 12, 2023 -
టీం ఇండియా ప్లేయర్లతో కలిసి డిన్నర్ చేసిన ఎన్టీఆర్
-
'విక్రమ్' సక్సెస్ డిన్నర్ పార్టీ.. విందులోని వంటకాలు ఇవే..
Kamal Haasan Vikram Success Meet Dinner Party Photos Goes Viral: యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన 'విక్రమ్' బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. ఇప్పటివరకు సుమారు రూ. 300 కోట్లకుపైగా వసూళ్లు కొల్లగొట్టి కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ సక్సెస్ జోష్‌తో చిత్రబృందం గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. తియనైన వేడుకకు బదులు మంచి మాంసాహారంతో విందు జరుపుకుంది. చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన వారికి, థియేటర్ యజమానులకు స్పెషల్ పార్టీ ఇచ్చింది. చెన్నైలో నిర్వహించిన ఈ పార్టీకి కమల్ హాసన్, లోకేష్ కనకరాజ్, అనిరుధ్ రవిచందర్, విజయ్ సేతుపతి, ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్నట్లు తెలుస్తోంది. మూవీని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. విక్రమ్ విజయం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని కమల్ హాసన్ పేర్కొన్నారు. విజయ్‌తో లోకేష్ కనకరాజ్ తెరకెక్కించనున్న తదుపరి చిత్రం విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. విక్రమ్ సక్సెస్ తనపై బాధ్యతను పెంచిందని, ఇకపై మరిన్ని మంచి సినిమాలు తెరకెక్కించేందుకు శ్రమిస్తానని డైరెక్టర్ లోకేష్ తెలిపాడు. ఇదిలా ఉంటే ఈ డిన్నర్ పార్టీలో పాల్గొన్న వారి కోసం స్పెషల్ మెనూను ఏర్పాటు చేసింది. వెజ్, నాన్ వెజ్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్తోపాటు మటన్ కీమా బాల్స్, వంజరం తవా ఫిష్ ఫ్రై, నాటు కోడి సూప్, ప్రాన్ పచ్చడి, మైసూర్ మసాల దోశ, పన్నీర్ టిక్కా ఇలా చాలా వెరైటీలు ఉన్నాయట. How it Started? How it is Going!!!@ikamalhaasan @Dir_Lokesh @DirLokeshFC @DiehardKamalian @RKFI @RedGiantMovies_ @turmericmediaTM #VikramSuccessMeet #VikramMovie #VikramInAction #Vikram pic.twitter.com/97v0NJyWqB — உத்தமன் | Villain (@mr_king_mr) June 17, 2022 ఈ విందులో కమల్ హాసన్, లోకేష్ కనకరాజ్, అనిరుధ్, ఉదయనిధి స్టాలిన్ పాల్గొని అందరితో కలిసి భోజనం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ ఫొటోలపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు. ఈ విందుని చూసి 'విక్రమ్ అలా మొదలై.. ఇలా కొనసాగుతోంది' అని చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా విజయ్ సేతుపతి, లోకేష్, అనిరుధ్‌ను కమల్ హాసన్ ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. #VikramSuccessMeet - Menu of #Sappad served! pic.twitter.com/pUfrp32WnD — Sreedhar Pillai (@sri50) June 17, 2022 #Vikram team @ikamalhaasan @Dir_Lokesh @anirudhofficial @Udhaystalin sat with distributors, exhibitors and media for an excellent non-vegetarian #ChettinadSappad #Vikramsuccessmeet pic.twitter.com/eff50gMUQZ — Sreedhar Pillai (@sri50) June 17, 2022 Dinner 🥘 is on 😍#VikramSuccessMeet ✨@Udhaystalin @ikamalhaasan @Dir_Lokesh @RKFI pic.twitter.com/TclFkI7Ri5 — Vinodth Vj... (@Vinodth_Vj) June 18, 2022 #Aandavar entry with @Udhaystalin sir & @Dir_Lokesh bro !!!#VikramSuccessMeet pic.twitter.com/Vj7y62hluF — Rakesh Gowthaman (@VettriTheatres) June 17, 2022 #Loki style balamana virundhu for theatre owners / distributors / press media for #VikramRoaringSuccess !!! Whattah feast was that 😍😋 Thank You @RKFI & @RedGiantMovies_ #VikramSuccessMeet pic.twitter.com/EQT9HqW0OM — Rakesh Gowthaman (@VettriTheatres) June 17, 2022 Vikram... Vikram... Vikram..... ! Organic & Perfect Industry hit in recent times for Kollywood. That's #KamalHaasan𓃵 for you💥❤️ Thanks @Dir_Lokesh 🙏 @anirudhofficial ❤️#IndustryHitForKH #Vikram #VikramSuccessMeet pic.twitter.com/bs4JMdG0Eq — Movie Meter (@MovieMeterOff) June 18, 2022 -
డిసెంబర్ 31 రాత్రి పార్టీ వెరైటీగా ఎలా ప్లాన్ చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఐడియాలివిగో..
You can enjoy your New Year's eve in these best possible ways కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేందుకు చివరి రోజు కూడా వచ్చేసింది. ఐతే న్యూ ఇయర్ రోజును ఎలా జరుపుకోవాలబ్బా? అని ప్రతి ఒక్కరూ బుర్రలు గోక్కుంటున్నారు కదా! మీ కోసం మా దగ్గర కొన్ని ఐడియాలున్నాయి. అవేంటంటే.. హౌస్ పార్టీ మీ ఇంటి టెర్రస్ పై కానీ, ఇంట్లోనైనా సరే స్నేహితులు, కుటుంబ సభ్యులతో సరదా సరదాగా చేసుకోవచ్చు. టెర్రస్ పై ప్లాన్ చేస్తే చలి కాలం కాబట్టి చలిమంట వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఇష్టమొచ్చినంత సమయం ఎంజాయ్ చేయొచ్చు. ట్రై చేస్తారా మరి? టాప్ రేటెడ్ హోటల్ కొంచెం ఖర్చుతో కూడుకున్న పార్టీ ఇది. ఐతే స్పెషల్ అకేషన్‌ను ఇంకా స్పెషల్‌గా జరుగుకోవాలనే వారికోసం న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని హోటళ్లు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాయి. లగ్జరియస్ డ్రింక్స్, ఫుడ్స్‌తోపాటు డీజే మ్యూజిక్ కూడా ఉంటుంది. మీ నూతన సంవత్సరాన్ని రాయల్‌గా ప్రారంభించాలనుకునే వారు ముందుగా ఇటువంటి హోటల్స్‌లో టేబుల్‌ను బుక్ చేసుకుంటే సరి. పార్టీ ప్లాన్ రెడీ అయిపోయినట్టే! రెస్టారెంట్ ట్రీట్ భోజన ప్రియులకు ఇది బెస్ట్ ఐడియా. న్యూ ఇయర్ సందర్భంగా చాలా రెస్టారెంట్లు బఫే డిన్నర్లు ఏర్పాటు చేస్తున్నాయి. బఫెట్ డిన్నర్లో రకరకాల డిసర్ట్ను మీ ప్లేట్ సర్దేసుకుని మీ నోటిని తీపి చేసుకోవడం ద్వారా నూతన సంవత్సరంలోకి తియ్యతియ్యగా అడుగుపెట్టవచ్చు. ఐతే టేబుల్ ముందే బుక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండే! లాంగ్ డ్రైవ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు ఇది కూడా మంచి ఐడియానే. సొంత వెహికల్లో, ఆహ్లాదకరమైన మ్యూజిక్ వింటూ, మీకిష్టమైన వారితో అలా.. లాంగ్ డ్రైవ్ కెళ్లారంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా! ఐతే ఇద్దరు, ముగ్గురు సన్నిహితులతోనే ఇలా ప్లాన్ చేస్తేనే బాగుంటుంది సుమా! బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు స్నేహితులు లేదా బంధువులతో కలిసి కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవాలనుకునే వారు ఓపెన్ ప్లేస్ (బహిరంగ ప్రదేశాలకు)లకు వెళ్లడం ఉత్తమం. మ్యూజిక్ ఎంత సౌండ్‌తో విన్నా మిమ్మల్ని వారించేవారెవ్వరూ ఉండరు. లగ్జరీ డెకరేషన్, లైట్ల వెలుగులో సన్నిహితులతో నూతన సంవత్సర వేడుకలను ఆస్వాదించాలనుకునే వారికి ఇది ఉత్తమమైన ఐడియా. బార్బెక్యూ డిన్నర్ కూడా మంచి ఎంపికే. పై మార్గాల్లో మీకు నచ్చిన ఐడియాని ఫాలో అవ్వండి. చెప్పనలవి కానంత ఆనందాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టండి. ఐతే గత ఏడాది మిగిల్చిన జ్ఞాపకాలను గుర్తు పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు! చదవండి: హెచ్చరిక! అదే జరిగితే మనుషులంతా ఒకరినొకరు చంపుకు తింటారు! -
డిన్నర్ పార్టీలో ఎమోషనల్ అయిన నాగార్జున
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్‌స్టోరి’ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుంది. ఫిల్మ్ దునియాలో వినిపిస్తున్న సమాచారం మేరకు తొలిరోజే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 10 కోట్లను వసూళ్లు చేసినట్లు సమచారం. దీంతో లవ్‌స్టోరీ టీం సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది. మరోవైపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన అమీర్ ఖాన్‌కు అక్కినేని కుటుంబం గ్రాండ్‌గా డిన్నర్ పార్టీ ఇచ్చింది. చదవండి: Ali Home Tour: కమెడియన్ అలీ 'హోమ్ టూర్' చూశారా? నాగ చైతన్య, సాయి పల్లవి, శేఖర్ కమ్ములతో పాటు మరికొందరు ఈ పార్టీలో పాల్గొన్నారు. అందరూ కలిసి కేక్ కట్ చేసి సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా అమీర్‌ఖాన్‌తో నాగార్జున ప్రత్యేకంగా ముచ్చటించారు. ఇక లవ్‌స్టోరీ సినిమా విడుదలైన సెప్టెంబర్ 24నే 50 సంవత్సరాల క్రితం ఏఎన్నార్ నటించిన ‘ప్రేమ్‌నగర్’ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. లవ్‌స్టోరీ మూవీ సైతం సక్సెస్ సాధించడంతో నాగార్జున ఒకింత ఎమోషనల్ అయినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న నాగచైతన్య ఆ సినిమాలో బాలరాజు అనే తెలుగు ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ సందర్భంగా గతంలో ఏఎన్నార్ కూడా బాలరాజు పేరుతో తీసిన సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకొని నాగార్జున భావేద్వేగానికి లోనయ్యారు. చదవండి : Love Story Box Office: రికార్డు స్థాయిలో ‘లవ్‌స్టోరి’ కలెక్షన్స్ Love Story Review: ‘లవ్‌స్టోరి’ మూవీ రివ్యూ -
అందరం కలిసి సుపరిపాలన అందిద్దాం
సాక్షి, అమరావతి: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాలునీళ్లలా కలిసి మెలిసి పనిచేయాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. అవినీతికి తావు లేకుండా సుపరిపాలన అందించేందుకు అంతా కృషి చేయాలన్నారు. శాసనసభ శీతాకాల సమావేశాలు ముగిసిన నేపథ్యంలో మంగళవారం రాత్రి విజయవాడలోని బరంపార్కులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులకు సీఎం విందు ఇచ్చారు. ఇద్దరు ఎంపీలు కూడా దీనికి హాజరయ్యారు. కలెక్టర్లు, ఎస్పీలు, ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్ ఇందులో పాల్గొన్నారు. చదవండి: ఆంధ్రప్రదేశ్‌కు 3 రాజధానులు! మనకు ప్రజా ప్రయోజనాలే ముఖ్యం అధికారులు, ప్రజాప్రతినిధులు సఖ్యతగా ముందుకు సాగాలని సీఎం ఆకాంక్షించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్న తరుణంలో వాటిని ప్రజలకు సంపూర్ణంగా అందించేందుకు పనిచేయాలన్నారు. అహంభావానికి తావు ఇవ్వవద్దని, ప్రజాప్రయోజనాలే అంతిమమని స్పష్టం చేశారు. జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయం కోసం తరచూ సమావేశమవ్వాలని, సీఎం కార్యాలయ అధికారులు సహకరిస్తారని సీఎం చెప్పారు. కృష్ణా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల విందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సీఎస్, డీజీపీ 1 నుంచి గ్రామాల బాట జనవరి 1 నుంచి గ్రామ సచివాలయాలు పూర్తి స్థాయిలో పనిచేయనున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, అధికారులు గ్రామాల బాట పట్టాలని ఆదేశించారు. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను పరిశీలించాలని కోరారు. పథకాల లబ్ధిదారుల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శిస్తామని, పేరు లేకపోతే అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలో కూడా సూచిస్తున్నామన్నారు. మనకు ఓటు వేయని వారికి కూడా అర్హులైతే పథకాల ప్రయోజనాలు అందించాలన్నారు. ఉదయం 8 గంటల్లోపు, రాత్రి 9 గంటల తర్వాత అధికారులకు ఫోన్లు చేసి వ్యక్తిగత జీవితానికి ఇబ్బంది కలిగించొద్దని ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రజాప్రతినిధులు ఫోన్ చేసినప్పుడు అధికారులు కచ్చితంగా స్పందించాలన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు, అధికారుల విందులో సీఎం జగన్, సీఎస్, డీజీపీ -
వైరల్ : అర్జున్ డిన్నర్‌కు జాన్వీ, ఖుషీ!
సాక్షి, ముంబై : దిగ్గజ నటి శ్రీదేవి అకాల మరణాన్ని ఇప్పుడిప్పుడే మరిచిపోవటానికి సినీ లోకం ప్రయత్నిస్తోంది. అయితే శ్రీదేవి కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్లు మాత్రం ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి కష్ట సమయాన వీరికి తన అన్న అర్జున్ కపూర్, అక్క అన్షూలు బాసటగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో అర్జున్ తన చెల్లెళ్లను డిన్నర్‌కు ఆహ్వానించగా వారు తండ్రి బోనీ కపూర్‌తో కలిసి హాజరయ్యారు. ప్రస్తుతం ఈ డిన్నర్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. అర్జున్, అన్షూలు బోనీ కపూర్ మొదటి భార్య మోనా శౌర్య కపూర్ పిల్లలు. గతంలో జాన్వీ, ఖుషీలపై అర్జున్ కపూర్ అభిమానులు అసభ్యకర కామెంట్లు పెట్టగా అన్షూ తన చెల్లెళ్లను ఏమనవద్దని గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చింది. శ్రీదేవి బతికున్నంత కాలం ఆమె కుటుంబానికి దూరంగా ఉన్న అర్జున్, అన్షూలు ఇప్పుడిప్పుడే తండ్రి బోనీతోపాటు జాన్వీ, ఖుషీలకు దగ్గర అవుతున్నారు. -
ఉత్సాహంగా..ఉల్లాసంగా..
సాక్షి, న్యూఢిల్లీ : యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ విపక్ష నేతలకు ఇచ్చిన డిన్నర్ అద్భుతంగా జరిగిందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. విందు ఆద్యంతం ఉత్సాహపూరితంగా..నిజాయితీతో కూడిన ప్రేమ, ఆప్యాయతలతో సాగిందంటూ.. డిన్నర్‌కు హాజరైన నేతల ఫోటోలను ట్వీట్ చేశారు. విందు సందర్భంగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, సీనియర్ కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే, డీఎంకే నేత కనిమొళితో తాను ముచ్చటిస్తున్న ఫోటోలను ఆయన పోస్ట్ చేశారు. విందు భేటీలో పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలను కలుసుకునే అవకాశం లభించిందని అన్నారు. రాజకీయ సమాలోచనల కంటే స్నేహపూరిత వాతావరణంలో ఆహ్లాదకరంగా సోనియాజీ ఇచ్చిన విందు సాగిందని చెప్పుకొచ్చారు. విందులో ఎన్సీపీ నేత ఒమర్ అబ్ధుల్లా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, బీహార్ మాజీ సీఎం జితన్ రాం మాంఝీ, సీపీఐ సీనియర్ నేత డీ రాజా, బీఎస్పీ నేత సతీష్ మిశ్రా, జార్ఖండ్ నేత బాబూలాల్ మరాండీ, ఆర్ఎల్డీ చీఫ్ అజిత్ సింగ్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితర నేతలు పాల్గొన్నారు. -
యాక్టింగ్ దేవుడు
రాబర్ట్ డెనీరోను యాక్టింగ్‌కు దేవుడిగా చెప్పుకుంటారు ఆయనను అభిమానించే వాళ్లు. ఐదు దశాబ్దాల కాలంలో లెక్కలేనంత మంది అభిమానులను సంపాదించుకొని, తాను తప్ప ఇంకెవరూ చెయ్యలేరన్న పాత్రలు చేసి మెప్పించిన డెనీరోకు ఇండియాలోనూ ఫ్యాన్స్ తక్కువేమీ లేరు. ముఖ్యంగా ఇండియన్ సినిమా సెలెబ్రిటీలు తమకు బాగా ఇష్టమైన నటుల పేర్లు చెప్పమంటే వినిపించే పేర్లలో రాబర్ట్ డెనీరో పేరు ఎక్కువగా ఉంటుంది. ఇండియన్ సినిమాలో నటుడిగా తనకంటూ ఒక బ్రాండ్ సృష్టించుకున్న అనుపమ్ ఖేర్ కూడా డెనీరోకు వీరాభిమాని. వీరిద్దరూ కలిసి గతంలో ‘సిల్వర్ లైనింగ్స్ ప్లేబుక్’ అనే హాలీవుడ్ సినిమాలో నటించారు. అప్పట్నుంచే ఇద్దరి మధ్యా మంచి ఫ్రెండ్షిప్ కూడా కుది రింది. తాజాగా అనుపమ్ ఖేర్ పుట్టినరోజు (మార్చి 7) సందర్భంగా డెనీరో తన భార్యతో కలిసి, అనుపమ్‌కు ఒక డిన్నర్ పార్టీ ఇచ్చాడు. హ్యాపీ బర్త్‌డే అంటూ డెనీరో పాట కూడా పాడాడు. ‘‘నా జీవితంలో ఇది మర్చిపోలేని రోజు. నాకు యాక్టింగ్ దేవుడు ఇచ్చిన బర్త్‌డే పార్టీ గొప్ప సంతోషాన్నిచ్చింది.’’ అంటూ అనుపమ్ ఖేర్ తన ఆనందాన్ని పంచుకున్నాడు. ∙రాబర్ట్ డెనీరో -
డెసిషన్ మీట్?
బాలీవుడ్ యంగ్ లవ్ బర్డ్స్ అనగానే వినిపిస్తున్న పేర్లు టైగర్ ష్రాఫ్, దిశా పాట్నీ. వాళ్ల రిలేషన్షిప్ గురించి ప్రస్తావించిన ప్రతీసారి ఈ ఇద్దరూ ‘మేము క్లోజ్ ఫ్రెండ్స్’ అంటున్నారు తప్పితే తమ రిలేషన్ స్టేటస్‌ను రివీల్ చేయట్లేదు. కానీ.. కాఫీ షాపుల్లో, పార్టీల్లో, పబ్బుల్లో తరచూ కనిపిస్తూనే ఉందీ జంట. ఈ ప్రేమ జంట లవ్‌ను టైగర్ ష్రాఫ్ ఫ్యామిలీ కూడా ఓకే చేసినట్టు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన జాకీ ష్రాఫ్ 61వ బర్త్‌డే డిన్నర్ వేడుకల్లో టైగర్ ఫ్యామిలీతో దిశా కూడా పాల్గొన్నారట. పార్టీ జరిగిన తర్వాత రెస్టారెంట్ నుంచి టైగర్ ఫ్యామిలీతో కబుర్లు చెబుతూ బయటకు వస్తూ జనాల దృష్టిలో పడ్డారు దిశా. టైగర్ ష్రాఫ్ మదర్, సిస్టర్‌తో దిశా మంచి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేశారని సమాచారం. ‘టైగర్– దిశా ప్రేమను టైగర్ ష్రాఫ్ ఫ్యామిలీ అంగీకరించలేదు’ అంటూ ఆ మధ్య వచ్చిన రూమర్స్‌ను కొట్టి పారేస్తున్నట్టుగా ఉంది ఈ డిన్నర్ మీట్. తాజాగా వేలంటైన్స్ డే సందర్భంగా ‘డిన్నర్ మీట్’ని ప్లాన్ చేసుకున్నారు ఈ యంగ్ పెయిర్. చాటుమాటుగా డిన్నర్ కానించేద్దామనుకుని ఉంటారు కానీ ఈసారీ నలుగురి దృష్టిలో పడ్డారు. దాంతో ఫ్యామిలీ అంగీకారం వచ్చినట్టే అని కొంతమంది బలంగా ఫిక్సయ్యారు. మరి అధికారికంగా ఈ జోడీ తమ ప్రేమను ఎప్పుడు ప్రకటిస్తారో? అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ డిన్నర్ మీట్‌నే డెసిషన్ మీట్‌లాగా తీసుకోవచ్చా? అంటే తెలియాల్సి ఉంది. -
రాష్ట్రపతికి గవర్నర్ విందు
సాక్షి, హైదరాబాద్: నాలుగు రోజుల శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం హైదరాబాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్‌లో విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి సీఎం కె.చంద్రశేఖర్‌రావుతోపాటు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఏపీ మంత్రులు యనమల, చినరాజప్ప, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీలు కేశవరావు, చిరంజీవి, బాల్కసుమన్, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య, జీహెచ్ఎంసీ మేయర్ రామ్మోహన్, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత జానారెడ్డి, షబ్బీర్‌అలీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, సినీనటుడు రానా, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌తో సీఎం కేసీఆర్ ముచ్చటిస్తూ కనిపించారు. విందు సమయంలో ఇండియన్ ఐడల్ విజేత రేవంత్.. బాహుబలి చిత్రంలోని ‘ఎవ్వడంట ఎవ్వడంటా నిన్ను ఎత్తుకుంది’ అనే పాట పాడి ఆహూతులను అలరించారు. రాష్ట్రపతికి గవర్నర్, సీఎం ఘన స్వాగతం అంతకుముందు రాష్ట్రపతికి హకీంపేట ఎయిర్‌పోర్టు వద్ద గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ ఘనస్వాగతం పలికారు. గవర్నర్ సతీమణి విమలా నరసింహన్, మండలి చైర్మన్ స్వామిగౌడ్, స్పీకర్ మధుసూదనా చారి, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మో హన్, ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, సీఎస్ ఎస్పీ సింగ్, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు కోవింద్‌కు స్వాగతం పలికారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ మధ్యాహ్నం 12.45 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి కోవింద్ చేరుకున్నారు. ఈనెల 27 వరకు ఆయన అక్కడే బస చేయనున్నారు. -
ముఖ్య నేతలకు రాహుల్ విందు
న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం కాంగ్రెస్ ఎంపీలు, సీనియర్ నేతలతోపాటు ఇతర పార్టీల నాయకులకు విందు ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ విందు కార్యక్రమం ఏర్పాటు చేయడం గమనార్హం. వివిధ పార్టీల ముఖ్య నేతలకు దగ్గరయ్యేందుకే రాహుల్ గాంధీ ఈ ప్రయత్నం చేశారని పరిశీలకులు భావిస్తున్నారు. విందులో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియాగాంధీ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్తోపాటు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్, టీఎంసీ నేత డెరెక్ ఒ బ్రియాన్, జేడీ యూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన రాంగోపాల్ యాదవ్, ఆర్జేడీ తరఫున మిసా భారతి, జై ప్రకాశ్ నారాయణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఓక్కి తుపాను బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మోదీని కోరారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ మోదీకి మొదటి లేఖ రాశారు. -
ఆ విందు వెనక రహస్యం ఏంటి?
‘‘కపూర్ కుటుంబం కైఫ్‌ని ఇష్టపడటంలేదు. అసలామె నీడ కూడా తమ మీద పడకూడదనుకుంటున్నారు’’... ప్రస్తుతం హిందీ రంగంలో రణ్‌బీర్ కపూర్ కుటుంబం, కత్రినా కైఫ్ గురించి ప్రచారమవుతున్న వార్త ఇది. అయితే, ఈ ప్రచారకర్తలకు షాకిస్తూ.. ఒక రోజు క్రితం కపూర్ కుటుంబంతో కత్రినా కైఫ్ విందు ఆరగించారు. కపూర్ కుటుంబానికి చెందిన దిగ్గజాలు కృష్ణరాజ్ కపూర్ (రణ్‌బీర్ నానమ్మ) రణ్‌ధీర్ కపూర్ (ప్రముఖ నటుడు, దర్శక-నిర్మాత, రణ్‌బీర్ మేనమామ), నీతూ సింగ్ (రణబీర్ తల్లి, ప్రముఖ నటి), రణ్‌బీర్ సోదరి రిధిమ తదితరులు ఓ ఐదు నక్షత్రాల హోటల్‌కు వెళ్లారు. కత్రినా కైఫ్ కూడా ఆ విందులో పాల్గొన్నారు. కపూర్ కుటుంబం ఆమెతో ఆత్మీయంగా కబుర్లు చెప్పడం, కత్రినా కూడా వాళ్లతో కలుపుగోలుగా ఉండడం నలుగురి దృష్టిలో పడింది. అసలీ విందు వెనక ఉన్న రహస్యం ఏంటి? కపూర్ కుటుంబం కత్రినాని తమ ఇంటి కోడలిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నారా? ఆ విషయం మాట్లాడుకోవడానికే కత్రినాను రమ్మన్నారా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. కొన్నిరోజుల క్రితం రణ్‌బీర్, కత్రినా గురించి సామాజిక మాధ్యమంలో వచ్చిన వార్తలకు ‘‘ఏ చిన్న విషయానికైనా.. సామాజిక మాధ్యమం అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది’’ అని కత్రినా పేర్కొన్నారు. ఇప్పుడీ విందు విషయానికి కూడా ఆమె అలానే స్పందిస్తారేమో. -
నిజాం నగ ధగ...
లండన్‌లో మంగళవారం జరిగిన ఓ డిన్నర్ పార్టీలో బ్రిటన్ ప్రిన్స్ విలియం భార్య కేట్ మిడిల్టన్ ధరించిన ఈ డెమైండ్ నెక్లెస్ చూపరులను విశేషంగా ఆకర్షించింది. రెండో ఎలిజబెత్ రాణి నుంచి అరువుపై తెచ్చుకొని మరీ మిడిల్టన్ ఈ హారాన్ని ధరించింది. ఇందులోని విశేషం ఏమిటంటే ఈ వజ్రాల హారం హైదరాబాద్ నిజాం నవాబులకు చెందినది. ‘నిజాం ఆఫ్ హైదరాబాద్’గా పిలిచే ఈ కార్టియర్ డైమండ్ నెక్లెస్‌ను 1947లో రెండో ఎలిజబెత్ రాణి తన వివాహ కానుకగా అందుకుంది.