ఉత్సాహంగా..ఉల్లాసంగా..  | Positive Energy, Genuine Affection: Rahul  | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా..ఉల్లాసంగా.. 

Published Wed, Mar 14 2018 11:12 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

Positive Energy, Genuine Affection: Rahul  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ విపక్ష నేతలకు ఇచ్చిన డిన్నర్‌ అద్భుతంగా జరిగిందని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. విందు ఆద్యంతం ఉత్సాహపూరితంగా..నిజాయితీతో కూడిన ప్రేమ, ఆప్యాయతలతో సాగిందంటూ.. డిన్నర్‌కు హాజరైన నేతల ఫోటోలను ట్వీట్‌ చేశారు. విందు సందర్భంగా ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత మల్లిఖార్జున్‌ ఖర్గే, డీఎంకే నేత కనిమొళితో తాను ముచ్చటిస్తున్న ఫోటోలను ఆయన పోస్ట్‌ చేశారు.

విందు భేటీలో పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలను కలుసుకునే అవకాశం లభించిందని అన్నారు. రాజకీయ సమాలోచనల కంటే స్నేహపూరిత వాతావరణంలో ఆహ్లాదకరంగా  సోనియాజీ ఇచ్చిన విందు సాగిందని చెప్పుకొచ్చారు. విందులో ఎన్‌సీపీ నేత ఒమర్‌ అబ్ధుల్లా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌, బీహార్‌ మాజీ సీఎం జితన్‌ రాం మాంఝీ, సీపీఐ సీనియర్‌ నేత డీ రాజా, బీఎస్‌పీ నేత సతీష్‌ మిశ్రా, జార్ఖండ్‌ నేత బాబూలాల్‌ మరాండీ, ఆర్‌ఎల్‌డీ చీఫ్‌ అజిత్‌ సింగ్‌, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తదితర నేతలు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement