
న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం కాంగ్రెస్ ఎంపీలు, సీనియర్ నేతలతోపాటు ఇతర పార్టీల నాయకులకు విందు ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ విందు కార్యక్రమం ఏర్పాటు చేయడం గమనార్హం. వివిధ పార్టీల ముఖ్య నేతలకు దగ్గరయ్యేందుకే రాహుల్ గాంధీ ఈ ప్రయత్నం చేశారని పరిశీలకులు భావిస్తున్నారు.
విందులో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియాగాంధీ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తోపాటు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్, టీఎంసీ నేత డెరెక్ ఒ బ్రియాన్, జేడీ యూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన రాంగోపాల్ యాదవ్, ఆర్జేడీ తరఫున మిసా భారతి, జై ప్రకాశ్ నారాయణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఓక్కి తుపాను బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మోదీని కోరారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ మోదీకి మొదటి లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment