సోనియా గాంధీ
ఏఐసీసీ అధ్యక్షురాలిగా 17 ఏళ్లు పూర్తి చేసుకున్న సోనియా గాంధీ ఆ పదవిని సుదీర్ఘ కాలంగా నిర్వహిస్తున్న నేతగా రికార్డు సష్టించారు. 1997లో కోల్కతాలో జరిగిన పార్టీ ప్లీనరీలో ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్నారు. ప్రాథమిక సభ్యత్వం తీసుకొన్న 62 రోజులకే 1998లో ఆమె పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలను స్వీకరించారు. అప్పటి నుంచి ఆమె పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తూ రికార్డు నెలకొల్పారు. కాంగ్రెస్ చరిత్రలో ఇంతకాలం ఆ పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఎవరూ నిర్వహించలేదు.
1999లో కర్నాటకలోని బళ్ళారి నుంచి, ఉత్తరప్రదేశ్‌లోని అమేథి నుంచి ఆమె లోక్ సభకు పోటీ చేశారు. బళ్ళారిలో సీనియర్ బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్‌ను ఓడించారు. అదే సంవత్సరం ఆమె 13వ లోక్ భకు ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. 2004, 2009,2014 సంవత్సరాలలో ఆమె ఉత్తరప్రదేశ్‌లోని రాయ్బరేలీ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు.
పార్టీ అధ్యక్ష పగ్గాలను సోనియా ఈ ఏడాది వదిలిపెట్టనున్నట్లు తెలుస్తోంది. తన కుమారుడు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మే నెలలోనే పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది.