Kamal Haasan Vikram Success Meet Dinner Party Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Vikram Success Dinner Party: వారిని ఆప్యాయంగా ముద్దుపెట్టుకున్న కమల్‌ హాసన్‌..

Published Sat, Jun 18 2022 8:58 PM | Last Updated on Sun, Jun 19 2022 6:05 PM

Kamal Haasan Vikram Success Meet Dinner Party Photos Goes Viral - Sakshi

Kamal Haasan Vikram Success Meet Dinner Party Photos Goes Viral: యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ నటించిన 'విక్రమ్‌' బాక్సాఫీస్‌ వద్ద దుమ్ములేపుతోంది. ఇప్పటివరకు సుమారు రూ. 300 కోట్లకుపైగా వసూళ్లు కొల్లగొట్టి కొత్త రికార్డు క్రియేట్‌ చేసింది. ఈ సక్సెస్‌ జోష్‌తో చిత్రబృందం గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంది. తియనైన వేడుకకు బదులు మంచి మాంసాహారంతో విందు జరుపుకుంది. చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్‌ చేసిన వారికి, థియేటర్‌ యజమానులకు స్పెషల్ పార్టీ ఇచ్చింది. చెన్నైలో నిర్వహించిన ఈ పార్టీకి కమల్‌ హాసన్‌, లోకేష్‌ కనకరాజ్‌, అనిరుధ్‌ రవిచందర్‌, విజయ్ సేతుపతి, ఉదయనిధి స్టాలిన్‌ పాల్గొన్నట్లు తెలుస్తోంది. మూవీని సక్సెస్‌ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

విక్రమ్ విజయం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని కమల్‌ హాసన్‌ పేర్కొన్నారు. విజయ్‌తో లోకేష్‌ కనకరాజ్‌ తెరకెక్కించనున్న తదుపరి చిత్రం విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. విక్రమ్‌ సక్సెస్‌ తనపై బాధ్యతను పెంచిందని, ఇకపై మరిన్ని మంచి సినిమాలు తెరకెక్కించేందుకు శ్రమిస్తానని డైరెక్టర్‌ లోకేష్‌ తెలిపాడు. ఇదిలా ఉంటే ఈ డిన్నర్ పార్టీలో పాల్గొన్న వారి కోసం స్పెషల్ మెనూను ఏర్పాటు చేసింది. వెజ్‌, నాన్‌ వెజ్‌, స్వీట్స్‌, ఐస్‌ క్రీమ్స్‌తోపాటు మటన్‌ కీమా బాల్స్‌, వంజరం తవా ఫిష్‌ ఫ్రై, నాటు కోడి సూప్, ప్రాన్ పచ్చడి, మైసూర్‌ మసాల దోశ, పన్నీర్‌ టిక్కా ఇలా చాలా వెరైటీలు ఉన్నాయట. 
 

ఈ విందులో కమల్ హాసన్‌, లోకేష్ కనకరాజ్‌, అనిరుధ్, ఉదయనిధి స్టాలిన్ పాల్గొని అందరితో కలిసి భోజనం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ ఫొటోలపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు. ఈ విందుని చూసి 'విక్రమ్‌ అలా మొదలై.. ఇలా కొనసాగుతోంది' అని చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా విజయ్ సేతుపతి, లోకేష్‌, అనిరుధ్‌ను కమల్‌ హాసన్‌ ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్న ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement