Vikram Box Office Collection Worldwide: Kamal Haasan Earns 300 Crores in 10 Days - Sakshi
Sakshi News home page

Vikram Box Office: ఏమాత్రం తగ్గని 'విక్రమ్‌'.. 10 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే..

Jun 13 2022 4:50 PM | Updated on Jun 15 2022 2:44 PM

Vikram Box Office: Kamal Haasan Earns 300 Crores Worldwide In 10 Days - Sakshi

ఉలగ నాయగన్‌ (లోక నాయకుడు) కమల్‌ హాసన్‌ సుమారు నాలుగేళ్ల తర్వాత విక్రమ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లోకేష్ కనకరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్, సూర్య విభిన్న పాత్రల్లో అలరించారు. ముఖ్యంగా కమల్‌ హాసన్‌ చేసిన యాక్షన్‌ సీన్స్‌ ప్రేక్షకులను కట్టిపడేశాయి.

Vikram Movie Collections Worldwide: ఉలగ నాయగన్‌ (లోక నాయకుడు) కమల్‌ హాసన్‌ సుమారు నాలుగేళ్ల తర్వాత విక్రమ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లోకేష్ కనకరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్, సూర్య విభిన్న పాత్రల్లో అలరించారు. ముఖ్యంగా కమల్‌ హాసన్‌ చేసిన యాక్షన్‌ సీన్స్‌ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇక 'విక్రమ్‌' బాక్సాఫీస్ కలెక్షన్లలో ఏమాత్రం తగ్గట్లేదు. కమల్‌ హాసన్‌ కెరీర్‌లోనే సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. 2022లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ సినిమాల్లో ఒకటిగా 'విక్రమ్‌' నిలిచింది. 

ఈ సినిమా విడుదలైన తొలి రోజు రూ. 45 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. తాజాగా ప్రపంచవ్యాప్తంగా 10 రోజుల్లో సుమారు రూ. 300 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ సాధించినట్లు సమాచారం. ఒక్క తమిళనాడులోనే పది రోజుల్లో రూ. 100 కోట్లను కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. ఒక్క ఆదివారం రోజే రూ. 11 కోట్ల కలెక్షన్లతో 'విక్రమ్‌' దుమ్ములేపాడు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లోనూ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచాడు విక్రమ్‌. గత 10 రోజుల్లో రూ. 25 కోట్లకుపైగా వసూలు చేసినట్లు  పలు నివేదికలు తెలుపుతున్నాయి. ఇక కేరళలో ఇప్పటివరకు రూ. 30 కోట్లకుపైగా కలెక్షన్స్‌ రాబట్టగా, కర్ణాటకలో సుమారు 15 కోట్లు సాధించినట్లు సమాచారం. అయితే ఈ వీకెండ్‌ పూర్తయ్యేవరకూ మరిన్ని కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. 

చదవండి: సూర్య ‘రోలెక్స్‌ సర్‌’ అంత బాగా ఎలా పేలాడు?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement