కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘విక్రమ్’. కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని తెలుగులో హీరో నితిన్, నిర్మాత సుధాకర్ రెడ్డి విక్రమ్: హిట్ లిస్ట్ పేరుతో రిలీజ్ చేశారు. జూన్ 3న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి జనం బ్రహ్మరథం పట్టారు. ఉలగనాయన్(లోక నాయకుడు) ఈజ్ బ్యాక్ అంటూ నెట్టింట తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తాజాగా ఈ సినిమా రిలీజైన నెల రోజుల్లోపే రూ.400 కోట్ల వసూళ్లు సాధించింది. రోబో 2.0 తర్వాత ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లు వసూలు చేసిన రెండో తమిళ చిత్రంగా విక్రమ్ రికార్డు సృష్టించింది.
కాగా ఈ సినిమా సక్సెస్ సాధించిన సంతోషంలో చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన వారికి, థియేటర్ యజమానులకు ఇటీవల స్పెషల్ పార్టీ ఇచ్చింది మూవీ యూనిట్. ఇక కమల్ హాసన్ అయితే ఏకంగా 13 మంది అసిస్టెంట్ డైరెక్టర్లకు బైకులు, రోలెక్స్ పాత్రలో నటించిన సూర్యకు ఖరీదైన రోలెక్స్ వాచ్, డైరెక్టర్ శోకేశ్ కగనరాజుకు కోటి విలువ చేసే లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే!
#Vikram - 400 CR total WW gross done 🔥👌👏 as it approaches the 25 days mark in theaters tomorrow.
— Kaushik LM (@LMKMovieManiac) June 26, 2022
Just WOW! "Once upon a time" kinda success this is! #400CRVikram
Naanooru Kodi dawwww! #KamalHaasan𓃵
చదవండి: ప్రేమ వివాహానికి రెడీ అవుతున్న హీరో రామ్, త్వరలో ప్రకటన?!
నాలుక కొరికేసుకో.. బండ్ల గణేశ్‌కు పూరీ జగన్నాథ్ వార్నింగ్?!
Comments
Please login to add a commentAdd a comment