Worldwide
-
నెట్ ఆగితే నష్టమే!
సాక్షి, హైదరాబాద్: నిరసనలు, ఆందోళనలు, ఎన్నికలు, మత ఘర్షణలు, చివరకు పరీక్షల సమయంలో సమాచారం, సందేశాల వ్యాప్తిని నిరోధించేందుకు ప్రాంతాల వారీగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం, సామాజిక మాధ్యమాలను స్తంభింప జేయడం ఇటీవలి కాలంలో సాధారణ విషయమై పోయింది. రాష్ట్రం, దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఇది జరుగుతోంది. 2024లో 88,788 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు, సామాజిక మాధ్యమాలు స్తంభించడంతో 60.48 కోట్ల మంది వినియోగదారులపై ప్రభావం పడినట్లు అంచనా. 28 దేశాల ఆర్థిక రంగంపై రూ.68,319 కోట్ల మేర ప్రభావం చూపించగా..మన దేశంలో రూ.279 కోట్ల మేర 6.77 కోట్ల మంది వినియోగదారులపై ప్రభావం చూపించినట్లుగా లెక్కలు వేశారు.ఇంటర్నెట్ సేవల నిలిపివేత కారణంగా నష్టపోతున్న దేశాల జాబితాలో భారత్ ఆరో స్థానంలో ఉండగా పొరుగు దేశం పాకిస్తాన్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. మయన్మార్ రెండు, బంగ్లాదేశ్ ఐదో స్థానంలో ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో ‘ఎక్స్’, టిక్‌టాక్, సిగ్నల్ అత్యధిక గంటల పాటు స్తంభించిపోయాయి. ఇంటర్నెట్ నిలిపివేత డిజిటల్ ఎకానమీ, టూరిజం, స్టార్టప్ రంగాలపై ఎక్కువగా ప్రతికూల ప్రభావం చూపుతోంది. అలాగే విద్య, టెలీమెడిసిన్‌తో పాటు అత్యవసర సేవలపైనా ప్రభావం చూపుతోంది.పలు సంస్థల సూచికలు పరిగణనలోకి.. ఇంటర్నెట్ సేవల నిలిపివేతకు ప్రభుత్వాలు ఇచ్చే ఆదేశాల ద్వారా జరిగే నష్టాన్ని ప్రపంచ బ్యాంకు, ఇంటర్నేషనల్ టెలీ కమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ), యూరోస్టాట్, యూఎస్ సెన్సస్ తదితర సంస్థల సూచికలను ఆధారంగా చేసుకుని లెక్కిస్తారు. ప్రభుత్వాలు ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేయడం, సోషల్ మీడియా స్తంభన, ఇంటర్నెట్ స్పీడ్‌ను 2జీ స్థాయికి తగ్గించడం తదితరాలను పరిగణనలోకి తీసుకుని ఆర్థిక ప్రభావాన్ని అంచనా వేస్తున్నారు. ఇంటర్నెట్ నిలిపివేత, సామాజిక మాధ్యమాలను స్తంభింప చేసేందుకు ప్రభుత్వాలు తీసుకునే చర్యలను ఒక రకంగా ఇంటర్నెట్ సెన్సార్‌షిప్‌గా భావించవచ్చు.⇒ గత ఏడాది సెప్టెంబర్ మొదటి వారంలో కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఓ గిరిజన మహిళపై అత్యాచారం నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. పరిస్థితులను అదుపులోకి తెచ్చే చర్యల్లో భాగంగా పోలీసులు ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. ⇒ వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో జిల్లా కలెక్టర్, అధికారులపై రైతుల దాడి నేపథ్యంలో.. శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని గత ఏడాది నవంబర్ 12న దుద్యాల ప్రాంతంలో కొద్ది గంటల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.⇒ గత ఏడాది నవంబర్‌లో మత ఘర్షణలతో పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో, రెండు వర్గాల మధ్య హింస చెలరేగడంతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్‌లో ఇంటర్నెట్ అందుబాటులో లేకుండా చేశారు. డిసెంబర్లో రైతుల నిరసనల నేపథ్యంలో హరియాణాలోని అంబాలాలో, జాతి ఘర్షణలు చెలరేగుతున్న మణిపూర్‌లో మరోసారి ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేకుండా పోయాయి.తరచూ స్తంభిస్తున్న ‘ఎక్స్’, ‘టిక్ టాక్’ ప్రాంతాల వారీగానే కాకుండా దేశ సార్వ¿ౌమత్వం, సమగ్రత, భద్రతకు ప్రమాదం పొంచి ఉందనుకున్న ఖాతాలపై ప్రభుత్వం దృష్టి పెడుతుంది. స్థానిక పరిస్థితుల ఆధారంగా కూడా నిర్ణయాలు తీసుకుంటారు. భారత్‌లో గత ఏడాది 28 వేలకు పైగా సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేయగా ఇందులో ఫేస్బుక్, ‘ఎక్స్’కు సంబంధించినవే సుమారు 10 వేల వరకు ఉన్నాయి.సామాజిక మాధ్యమ ఖాతాల తొలగింపులో.. అభ్యంతరకర సమాచారం ఉన్న యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్‌కు సంబంధించిన ఖాతాలు తర్వాతి స్థానంలో ఉన్నాయి. తొలగింపునకు గురైన వాటిలో ఎక్కువగా ఖలిస్తానీ అనుకూల సమాచారంతో కూడిన ఖాతాలతోపాటు విద్వేష ప్రసంగాలు, జాతీయ భద్రత, ప్రజల భద్రతకు ముప్పు కలిగించే రీతిలో ఉన్న ఖాతాలు ఉన్నాయి. -
వ్యవసాయ కూలీలు, డ్రైవర్లకు భారీ ఉపాధి
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో వ్యవసాయ, నిర్మాణ కూలీలు, డ్రైవర్ల ఉద్యోగాలు (డెలివరీ రంగాల్లో) గణనీయంగా పెరగనున్నట్టు ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) తెలిపింది. అదే సమయంలో క్యాషియర్లు, టికెట్ క్లర్క్‌ల ఉద్యోగాలు పెద్ద ఎత్తున తగ్గిపోతాయని అంచనా వేసింది. ఈ నెల 20 నుంచి డబ్ల్యూఈఎఫ్ వార్షిక సదస్సు జరగనుండగా, దీనికంటే ముందు ‘ఉద్యోగాల భవిష్యత్, 2025’ పేరుతో నివేదికను విడుదల చేసింది. 2030 నాటికి 17 కోట్ల ఉద్యోగాలు కొత్తగా అందుబాటులోకి వస్తాయని, ఇందులో 9.2 కోట్ల ఉద్యోగాలకు స్థానచలనం ఉంటుందని అంచనా వేసింది. అంటే 7.8 కోట్ల మందికి నికరంగా కొత్తగా ఉపాధి లభించనుంది. అత్యాధునిక టెక్నాలజీలు, భౌగోళిక పరమైన మార్పులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక ఒత్తిళ్లు ఈ మార్పులను నడిపిస్తాయంటూ, పరిశ్రమలు, వృత్తుల ముఖచిత్రం మారిపోనుందని అంచనా వేసింది. ఏఐ, బిగ్‌డేటాకు భారీ డిమాండ్ కృత్రిమ మేధ (ఏఐ), బిగ్ డేటా, సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీకు వేగవంతమైన వృద్ధితోపాటు, డిమాండ్ ఉంటుందని డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. అదే సమయంలో మానవ నైపుణ్యాలైన సృజనాత్మకత, చురుకుదనం, బలమైన దృక్పథం ఇక ముందూ కీలకమని పేర్కొంది. 1,000 కంపెనీలకు సంబంధించిన డేటాను విశ్లేషించగా, వ్యాపారాల నవీకరణకు నైపుణ్యాల అంతరం పెద్ద అవరోధంగా ఉన్నట్టు గుర్తించింది. ఉద్యోగాలకు సంబంధించి 40 శాతం నైపుణ్యాలు మారిపోనున్నాయని, 63 శాతం సంస్థలు ఇప్పటికే నైపుణ్యాల అంతరాన్ని ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. జెనరేటివ్ ఏఐ, వేగంగా మారిపోయే టెక్నాలజీలు పరిశ్రమలకు, ఉపాధి మార్కెట్‌కు గణనీయమైన అవకాశాలను తీసుకురావడమే కాకుండా, పెద్ద ఎత్తున రిస్క్ కూడా మోసుకొస్తాయని డబ్ల్యూఈఎఫ్ ‘ఉపాధి కల్పన’ విభాగం హెడ్ టిల్ లియోపోల్డ్ అన్నారు. సంరక్షణ ఉద్యోగాలైన నర్సులు, సెకండరీ స్కూల్ టీచర్ల ఉద్యోగాలు కూడా గణనీయంగా పెరొగొచ్చని ఈ నివేదిక అంచనా వేసింది. ఏఐ వినియోగం ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలను గణనీయంగా మార్చివేయనుందని, దాదాపు సగం సంస్థలు ఏఐతో కొత్త అవకాశాలను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపింది. ముఖ్యంగా ఏఐ సాయంతో తమ సిబ్బందిని తగ్గించుకోవాలని 41 శాతం సంస్థలు భావిస్తున్నట్టు పేర్కొంది. మరో 77 శాతం సంస్థలు తమ సిబ్బందికి నైపుణ్యాల పెంపుపై శిక్షణ ఇప్పించే యోచనతో ఉన్నట్టు వివరించింది. -
నయా సాల్ జోష్
న్యూఢిల్లీ: ఆంగ్ల సంవత్సరాది సర్వత్రా నూతనోత్తేజం నింపింది. వేడుకలు, పార్టీలతో ఉత్సవ వాతావరణం నడుమ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు న్యూ ఇయర్‌కు స్వాగతం పలికారు. ఏ దేశంలో చూసినా ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలన్నీ భారీ జనసందోహంతో కిటకిటలాడాయి. వాణిజ్య సముదాయాలు, హోటళ్లు తదితరాలు కళకళలాడాయి. ఎప్పట్లాగే క్రిస్మస్ ఐలాండ్‌గా పేరొందిన కిరిబాటీ రిపబ్లిక్ 2025ను స్వాగతించిన తొలి దేశంగా నిలిచింది. ఎంత ముందుగా అంటే, అమెరికా కాలమానం ప్రకారం డిసెంబర్ 31 ఉదయం ఐదింటికే అక్కడ నూతన సంవత్సర వేడుకలు మొదలైపోయాయి! తర్వాత పావు గంటకే పసిఫిక్ మహాసముద్రానికి దక్షిణాన ఉన్న చాదం ఐలాండ్స్‌లో, ఆ వెంటనే న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నాయి.అర్ధరాత్రి క్యాలెండర్ మారి 2024 డిసెంబర్ 31 కాలగర్భంలో కలిసిపోతూనే న్యూజిలాండ్‌లోని ఆక్లండ్ నగరంలో సంబరాలు మిన్నంటాయి. తర్వాత ఆ్రస్టేలియా, జపాన్ తదితర దేశాలూ వేడుకల్లో పాలుపంచుకున్నాయి. ఆ్రస్టేలియాలోని చారిత్రక సిడ్నీ మార్బర్ బ్రిడ్జి బాణసంచా పేలుళ్లు, కళ్లు మిరుమిట్లుగొలిపే లేజర్ షోలతో పట్టపగలును తలపించింది. బ్రెజిల్‌లోని రియోడిజనిరో నగరంలో న్యూ ఇయర్ సంబరాలు మిన్నంటాయి. కోపాచబానా బీచ్ ఏకంగా 12 నిమిషాల పాటు బాణసంచా వెలుగుల్లో తళుకులీనింది. అక్కడి వేడుకల్లో ఏకంగా 20 లక్షల మందికి పైగా పాల్గొన్నారు. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్‌లో వందేళ్ల సంప్రదాయం ప్రకారం బాల్ డ్రాప్ వేడుక జరగనుంది. జోనాస్ బ్రదర్స్, సోఫీ ఎలిస్–బెక్స్టర్, రీటా ఓరా తదితరులు సంగీత ప్రదర్శనలతో అలరించనున్నారు. అమెరికాలోని ఇతర నగరాలూ సంబరాలకు సిద్ధమయ్యాయి. అమెరికన్ సమోవా ప్రజలు ఎప్పట్లాగే అందరికన్నా ఆలస్యంగా న్యూ ఇయర్‌కు స్వాగతం చెప్పనున్నారు. న్యూజిలాండ్‌తో పోలిస్తే ఏకంగా 24 గంటల తర్వాత అక్కడ తేదీ మారుతుంది! యుద్ధాలు, సంక్షోభాలతో సతమతమవుతున్న ఉక్రెయిన్‌తో పాటు పలు పశి్చమాసియా దేశాల్లో మాత్రం న్యూ ఇయర్ సందడికి బదులు ఎప్పట్లా శ్మశాన నిశ్శబ్దమే తాండవించింది.భారత్‌లో సందడి భారత్‌లో దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు దుమ్మురేపాయి. రాజధాని ఢిల్లీ మొదలుకుని అన్ని ప్రధాన నగరాల్లోనూ పలు కార్యక్రమాలు కన్నులపండువగా జరిగాయి. ప్రజలంతా ఇళ్లను విద్యుద్దీపాలతో అందంగా అలంకరించుకున్నారు. వేడుకగా కొత్త సంవత్సరాన్ని స్వాగతించారు. ఢిల్లీలోని ఇండియా గేట్, కోల్‌కతాలో విక్టోరియా మెమోరియల్, ముంబైలో గేట్‌వే ఆఫ్ ఇండియా, చెన్నై మెరినా బీచ్, బెంగళూరు బ్రిగేడ్ రోడ్ తదితర చోట్ల జనం ఇసుక వేసినా రాలనంతగా కన్పించారు. ఇక గోవాలోనైతే కొత్త సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. ఏ నగరంలో చూసినా క్లబ్బులు, పబ్బులు, హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్, పార్కులు తదితరాలన్నీ కిటకిటలాడాయి. అవాంఛనీయ ఘటనలను నివారించేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మందుబాబులకు ముకుతాడు వేసేందుకు అన్ని నగరాల్లోనూ స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించారు.ప్రముఖ పర్యాటక ప్రాంతాలన్నింటికీ తాకిడి విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతటి హిమపాతంతో తడిసి ముద్దవుతున్న ఉత్తరాఖండ్, కశ్మీర్ తదితర చోట్లకు జనం పోటెత్తారు. ఉత్తరాఖండ్‌లోని హర్షిల్, దయారా, సంక్రి వంటి మారుమూల ప్రాంతాలకు కూడా దేశం నలుమూలల నుంచీ పర్యాటకులు విరగబడ్డారు. చుట్టూ మంచు నడుమ టెంట్లు, క్యాంపుల్లో బస చేశారు. అర్ధరాత్రి కాగానే న్యూ ఇయర్ సంబరాల్లో మునిగిపోయారు. అక్కడి హోటళ్లు, దాబాలు అత్యంత వినూత్నంగా నూతన సంవత్సర వేడుకలు జరిపి ఆకట్టుకున్నాయి. కుంభమేళా నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమంలో కొలువుదీరిన కుంభనగరిలో కూడా న్యూ ఇయర్ వేడుకలు అలరించాయి. -
బాక్సాఫీస్ పై అమరన్ దండయాత్ర..
-
మైక్రోసాఫ్ట్‌లో మరో సమస్య.. స్పందించిన కంపెనీ
మైక్రోసాఫ్ట్‌లో మరో సమస్య తలెత్తింది. మైక్రోసాఫ్ట్ అజ్యూర్, మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి అంతరాయం కలిగిందని పలువురు యూజర్లు పేర్కొన్నారు. దీని వల్ల యూజర్లు అనేక సేవల్లో అంతరాయాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.మైక్రోసాఫ్ట్‌లో ఏర్పడిన సమస్యను గుర్తించి, పరిష్కరించడానికి ఇంజినీరింగ్ బృందాలు ప్రయత్నిస్తున్నట్లు అజ్యూర్ ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించింది. ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని కూడా పేర్కొంది.మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సమస్య మొదట యూరోప్‌లో గుర్తించారు. ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్యను ఎదుర్కొంటున్న యూజర్లు చాలామందే ఉన్నారని పలువురు సోషల్ మీడియాలో చేసిన పోస్టుల ద్వారా తెలిసింది.We're currently investigating access issues and degraded performance with multiple Microsoft 365 services and features. More information can be found under MO842351 in the admin center.— Microsoft 365 Status (@MSFT365Status) July 30, 2024We are investigating an issue impacting the Azure portal. More details will be provided as they become available.— Azure Support (@AzureSupport) July 30, 2024 -
బతుకు చితికి.. గూడు చెదిరి... వలస బాట
పుట్టిన నేల.. పెరిగిన ఊరు.. ఇవే మనిషి అస్తిత్వం. కానీ యుద్ధం, హింస ప్రజలను నిరాశ్రయులను చేస్తోంది. అధికార దాహం, అహంకార ధోరణి కోట్ల మందిని సొంత నేలకే పరాయివాళ్లుగా మారుస్తోంది. గత పదేళ్లలో ప్రపంచ జనాభాలో ప్రతి 69 మందిలో ఒకరు చొప్పున ఏకంగా 12 కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. వీరిలో చాలామంది తలదాచుకునేందుకు కూడా దిక్కులేక శరణార్థులుగా మారాల్సి వస్తోంది. ప్రాణాలను చేతబట్టుకుని విదేశాల బాట పట్టాల్సిన దుస్థితి దాపురిస్తోంది...! – సాక్షి, నేషనల్ డెస్క్సంఘర్షణ, హింస, మానవ హక్కుల ఉల్లంఘనల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 11.7 కోట్ల మందికి పైగా నిరాశ్రయులైనట్టు ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషన్ (యూఎన్‌హెచ్‌సీఆర్) వెల్లడించింది. వీరిలో 6.83 కోట్ల మంది సంఘర్షణలు, ఇతర సంక్షోభాల కారణంగా సొంత దేశాల్లోనే ఇతర ప్రాంతాలకు చెదిరిపోయారు. దాదాపు 4.5 కోట్ల మంది పొట్ట చేత పట్టుకుని శరణార్థులుగా విదేశాలకు వలస వెళ్లారు. 2024 తొలి నాలుగు నెలల్లో ఇది మరింత పెరిగింది.పదేళ్లకోసారి రెట్టింపు.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1951లో ఐరోపాలోని శరణార్థుల హక్కులను పరిరక్షించేందుకు ఐక్యరాజ్యసమితి శరణార్థుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. 1967లో శరణార్థుల కన్వెన్షన్ ఆవిర్భవించినప్పుడు 20 లక్షల మంది శరణార్థులున్నారు. ⇒ 1980 నాటికి కోటికి చేరిన శరణార్థులు ⇒ 1990 నాటికి రెండు కోట్లకు చేరిన సంఖ్య⇒ 2021 చివరి నాటికి 3 కోట్లను మించిన శరణార్థులు⇒ తాజాగా 11 కోట్లు దాటేసిన వైనం2020 నుంచి వేగంగా...⇒ 2022లో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక 2023 చివరి నాటికి 60 లక్షల మంది ఉక్రేనియన్లు నిరాశ్రయులయ్యారు. వీరిలో చాలామంది దేశం విడిచి వెళ్లారు. ⇒ 2023లో సుడాన్లో సైన్యం, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య ఘర్షణలు శరణార్థుల సంఖ్యను 10.5 లక్షలు పెంచాయి. ⇒ ఇక ఇజ్రాయెల్ దాడులతో గాజాలో గతేడాది చివరి మూడు నెలల్లో 10.7 లక్షల మంది నిరాశ్రయులై వలస వెళ్లారు.ఎక్కడి నుంచి వస్తున్నారు?⇒ ప్రపంచవ్యాప్తంగా నమోదైన దాదాపు 4.5 కోట్ల మంది శరణార్థులలో దాదాపు మూడొంతులు (72 శాతం) ఐదు దేశాల నుంచే వచ్చారు.అఫ్గానిస్తాన్ 64 లక్షలు సిరియా 64 లక్షలు వెనెజులా 61 లక్షలు ఉక్రెయిన్ 60 లక్షలు పాలస్తీనా 60 లక్షలుఆశ్రయమిస్తున్న దేశాలు?⇒ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 శాతం మంది శరణార్థులు తమ స మీప పొరుగు దేశాల్లోనే బతుకీడుస్తున్నారు. ⇒ ఇరాన్, పాకిస్తాన్‌లోని శరణార్థులందరూ అఫ్గాన్లే. ⇒ టర్కీలో ఎక్కువ మంది శరణార్థులు సిరియన్లు.దేశం శరణార్థులు ఇరాన్ 38 లక్షలు తుర్కియే 33 లక్షలు కొలంబియా 29 లక్షలు జర్మనీ 26 లక్షలు పాకిస్తాన్ 20 లక్షలు -
పైసా ఖర్చు లేకుండా ప్రపంచ స్థాయి నైపుణ్యాలు
సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అత్యుత్తమ, నాణ్యమైన విద్యను అందించడం.. విద్యార్థులు ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా ఆన్లైన్ కోర్సులు అందించడంలో ప్రపంచంలోనే దిగ్గజ ఎడ్యుటెక్ సంస్థ.. ఎడెక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఎడెక్స్ ద్వారా 260కిపైగా వరల్డ్ క్లాస్ వర్సిటీలు, కంటెంట్ పార్టనర్స్‌తో కలిసి 2వేలకు పైగా కోర్సులను ఉచితంగా అందుబాటులోకి తెచి్చంది. దీంతో పైసా ఖర్చు లేకుండా వీటిని అభ్యసిస్తున్న విద్యార్థులు సర్టీఫికేషన్ల సాధనలో రికార్డులు సృష్టిస్తున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ‘ఎడెక్స్’ కోర్సులు ప్రారంభించిన నెల రోజుల్లోనే ఏకంగా 1,03,956 సర్టీఫికేషన్లు సాధించి సత్తా చాటారు. దీంతో ఎడెక్స్ చరిత్రలోనే ఏపీ అతిపెద్ద సర్టిఫికేషన్ హబ్‌గా ఆవిర్భవించింది. ఏటా ప్రపంచవ్యాప్తంగా ఎడెక్స్ కేవలం 5 లక్షల సర్టీఫికేషన్లు మాత్రమే అందిస్తోంది. కానీ, రాష్ట్ర విద్యార్థులకు ఏడాదికి 12లక్షల సర్టీఫికేషన్లు ఇచ్చేలా ప్రభుత్వం ఎడెక్స్‌తో ఒప్పందం చేసుకోవడం విశేషం. 1,469 కోర్సుల్లో సర్టీఫికేషన్లు.. ఎడెక్స్ ద్వారా కోర్సులు అందిస్తున్నవాటిలో హార్వర్డ్, ఎంఐటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కొలంబియా, న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఉన్నాయి. రాష్ట్ర విద్యార్థులు 100 ప్రపంచ స్థాయి వర్సిటీల నుంచి 1,469 రకాల కోర్సుల్లో లక్షకుపైగా సర్టీఫికేషన్లు సాధించారు. ఎంఐటీ 320, హార్వర్డ్ 1,560, గూగుల్ 410, ఐబీఎం 33,700, ఏడబ్ల్యూఎస్ 770, ఏఆర్ఎం 6,400, కొలంబియా వర్సిటీ 100, ఐఐఎం బెంగళూరు 1,957, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ 170, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ 700, స్టాన్‌ఫర్డ్ 2,200, ఫుల్ బ్రిడ్జి (హార్వర్డ్, ఎంఐటీ సంయుక్తంగా అందిస్తున్న కోర్సులు)ద్వారా 13,500 సర్టిఫికేషన్లు పొందారు. ఉన్నత విద్యా మండలి ఒక ఎడెక్స్ కోర్సును తప్పనిసరి సబ్జెక్టుగా చదివేలా కరిక్యులంలో చేర్చింది. వీటికితోడు విద్యారి్థకి నచి్చనన్ని ఎడెక్స్ కోర్సులను వ్యాల్యూ యాడెడ్‌గా చదువుకోవడానికి వీలు కలి్పస్తోంది. సులభంగా ప్రవేశాలు.. ఎడెక్స్ ద్వారా మైక్రో మాస్టర్స్ కోర్సులో 7 వేల మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. దీన్ని పూర్తి చేస్తే విదేశాల్లో ఎంఎస్‌లో చేరడం సులువవుతుంది. పైగా అక్కడికి వెళ్లాక సిలబస్‌లో ప్రస్తుతం ఎడెక్స్‌లో నేర్చుకున్న గ్రూప్ మాడ్యూల్స్‌ను మినహాయిస్తారు. తద్వారా విద్యారి్థకి ఎంఎస్‌లో చదవాల్సింది తగ్గడంతో పాటు సంబంధిత కోర్సుకు చెల్లించాల్సిన ఫీజు కూడా ఆదా అవుతుంది. రూ.382 కోట్లు వ్యయమయ్యే కోర్సులు ఉచితంగా.. ఇప్పటి వరకు 3 లక్షల మంది విద్యార్థులు, బోధన సిబ్బంది ఎడెక్స్ కోర్సులకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరందరూ ఎడెక్స్ అందించే 2 వేల కోర్సుల్లో ఒక్కో కోర్సు చొప్పున బయట చదువుకుంటే మార్కెట్ రేటు ప్రకారం ఏకంగా రూ.382 కోట్లు వ్యయమవుతుంది. ఇప్పటివరకు సుమారు 75వేల మందికిపైగా విద్యార్థులు ఆయా కోర్సులు పూర్తి చేసి 1,03,956 సర్టిఫికేషన్లు పొందారు. ఈ కోర్సుల మార్కెట్ విలువ రూ.115 కోట్ల వరకు ఉంది. ఇంత ఖరీదైన కోర్సులను విద్యార్థులపై నయాపైసా భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోంది. మన వర్సిటీల్లోకి అంతర్జాతీయ స్థాయి విద్య అంతర్జాతీయ స్థాయి విద్యను మన వర్సిటీల్లోకి తేవాలన్నదే మా లక్ష్యం. అందుకే ఎడెక్స్‌తో ఒప్పందం చేసుకున్నాం. ప్రపంచంలో టాప్ 50లో ఉన్న 37 వర్సిటీలు ఇందులో కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఎడెక్స్ ద్వారా అంతర్జాతీయ కోర్సులు అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ ఒక్కటే. ప్రపంచంలో అత్యుత్తమ అధ్యాపకులతో మన విద్యార్థులకు బోధన అందిస్తున్నాం. – కె.హేమచంద్రారెడ్డి, చైర్మన్, ఉన్నత విద్యా మండలి 32 కోర్సుల్లో సర్టీఫికేషన్లు.. మాది మదనపల్లె. అమ్మా కూరగాయలు అమ్ముతూ, నాన్న ఆటో నడుపుతూ నన్ను, తమ్ముడిని చదివిస్తున్నారు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన సాయంతో ఇంజనీరింగ్ చదువుతున్నా. నేను ఎడెక్స్ ద్వారా ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా సంస్థలు అందిస్తున్న 32 రకాల కోర్సులు పూర్తి చేశాను. డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఏఐ వంటి కోర్సుల్లో అడ్వాన్స్డ్ మెథడ్స్ నేర్చుకున్నాను. హార్వర్డ్, ఐబీఎం, గూగుల్ వంటి సంస్థల నుంచి సర్టీఫికేషన్లు పొందాను. ఈ కోర్సులు బయట చేయాలంటే వేల రూపాయలు పెట్టాలి. ఎడెక్స్ కోర్సులతో నాలాంటి పేద విద్యార్థులకు పెద్ద సంస్థల్లో మంచి ఉద్యోగాలు దక్కుతాయనే నమ్మకం ఉంది. – టి.మోక్షిత్ సాయి, బీటెక్ , శ్రీ వేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, చిత్తూరు కర్టీన్ వర్సిటీ నుంచి సర్టిఫికేషన్.. మాది నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం గోవిందిన్నె గ్రామం. అమ్మ చిరుద్యోగి. నాన్న కూలి పనులకు వెళ్తారు. మా అన్నను, నన్ను జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు ఆదుకున్నాయి. నేను నంద్యాలలో రాజీవ్‌గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాను. ఎడెక్స్‌లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ)లో మైక్రో మాస్టర్స్ గ్రూప్ కోర్సు చేశాను. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 182వ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాలోని కర్టీన్ వర్సిటీ నుంచి సర్టిఫికేషన్ సాధించాను. – దూలం చందు, బీటెక్ (ఈఈఈ) స్పెయిన్ వర్సిటీ నుంచి ఐవోటీ చేశా.. నేను ఉచితంగా ఎడెక్స్ ద్వారా ప్రపంచంలోనే అడ్వాన్స్డ్ కోర్సులు నేర్చుకుంటున్నా. స్పెయిన్‌కు చెందిన ‘వాలెన్సియా పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయం’ నుంచి ఐవోటీలో మైక్రో మాస్టర్స్ కోర్సు పూర్తి చేశాను. మరో రెండు కోర్సులను కూడా త్వరలో పూర్తి చేయబోతున్నా. సొంతంగా డబ్బులు ఖర్చుపెట్టి చదవలేని నాలాంటి వారందరికీ ఎడెక్స్ కోర్సులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. – అర్వా నాగ సుజిత, బీటెక్ (ఈఈఈ), రాజీవ్‌గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నంద్యాల -
Ayodhya Ram Mandir: ప్రపంచ నలుమూలల్లోనూ ఘనంగా ప్రాణప్రతిష్ట వేడుకలు
వాషింగ్టన్/పోర్ట్ ఆఫ్ స్పెయిన్: అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ మహోజ్వల ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారాల్లో చూసి ప్రపంచవ్యాప్తంగా భక్తులు పులకించిపోయారు. ఆస్ట్రేలియా నుంచి అమెరికా దాకా సంబరాలు జరుపుకున్నారు. న్యూయార్క్‌లో ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ కూడలి వద్ద భారీ తెరలపై వందలాది భారతీయ అమెరికన్లు వేడుకను వీక్షించారు. సంప్రదాయ వస్త్రధారణలో భజనలు, కీర్తనలు చేశారు. పాకిస్తానీ ముస్లింలు సైతం.. అమెరికాలో వర్జీనియా రాష్ట్రం ఫెయిర్‌ఫాక్స్ కౌంటీలోని శ్రీవెంకటేశ్వర లోటస్ టెంపుల్ వద్ద సిక్కులు, ముస్లింలు, పాకిస్తానీ అమెరికన్లు, క్రైస్తవులు సైతం వేడుకల్లో పాలుపంచుకున్నారు. అమెరికా స్టాక్ ఎక్సే్చంజ్ ‘నాస్డాక్’ స్క్రీన్ మీదా కోదండరాముని చిత్రాన్ని ప్రదర్శించారు. లాస్ఏంజిలెస్లో 1,000 మందికిపైగా 250 కార్ల ర్యాలీ చేపట్టారు. పారిస్‌లో ఈఫిల్ టవర్ వద్ద భారతీయులు జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు. ట్రినిడాడ్, టొబాగో, మారిషస్, ఫిజీ, స్పెయిన్ తదితర దేశాల్లో సంబరాలు జరిగాయి. మెక్సికోలో తొలి రామాలయాన్ని అయోధ్య ప్రాణప్రతిష్ట ముహూర్తంలోనే ప్రారంభించారు. -
వెబ్సైట్ల రారాజు గూగులే..
ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే చాలు మొదట వెళ్లేది గూగుల్ వెబ్‌సైట్‌కే. వార్తల నుంచి ఫొటోలు, వీడియోల దాకా ఏ సమాచారం కావాలన్నా వెతికేది అందులోనే.. అందుకే ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ పాపులర్ వెబ్‌సైట్‌గా గూగుల్ నిలిచింది. అంతేకాదు.. అత్యధిక యూజర్ ట్రాఫిక్ ఉండే టాప్–10 వెబ్సైట్లలో నాలుగు గూగుల్‌కు చెందినవే. ► నిజానికి చాలా ఏళ్లుగా గూగుల్ వెబ్‌సైటే టాప్‌లో ఉంటూ వస్తోంది. అయితే టిక్‌టాక్ వెబ్సైట్ 2021 ఏడాది చివరిలో కొద్దిరోజులు గూగుల్‌ను వెనక్కి నెట్టి టాప్‌లో నిలవడం గమనార్హం. ► పాపులర్ సైట్ల లిస్టులో యూట్యూబ్ 11వ స్థానంలో, అమెజాన్ 18వ, ఇన్‌స్ట్రాగామ్ 24వ, నెట్‌ఫ్లిక్స్ 25వ, వాట్సాప్ 29వ, స్పాటిఫై 35వ, స్నాప్‌చాట్ 40వ, ట్విట్టర్ 45వ, లింక్డ్ఇన్ 68వ, జీమెయిల్ 79వ స్థానాల్లో ఉన్నాయి. -
2023లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేసిన అంశాలు
న్యూస్‌కు సంబంధించి.. 1. ఇజ్రాయెల్–పాలస్తీనా యుద్ధం 2. టైటానిక్ సబ్‌మెరైన్ 3. టర్కీ భూకంపం వ్యక్తులు 1. డామర్ హామ్లిన్ (అమెరికన్ ఫుట్‌బాలర్) 2. జెరెమీ రెన్నర్ (అమెరికన్ నటుడు) 3. ఆండ్రూ టేట్ (కిక్బాక్సర్–సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్) సంగీత కళాకారులు 1. షకీరా (కొలంబియా సింగర్) 2. జేసన్ ఆల్డీన్ (అమెరికన్ సింగర్) 3. జో జోనాస్ (అమెరికన్ సింగర్–నటుడు) సినిమాలు 1. బార్బీ 2. ఓపెన్ హైమర్ 3. జవాన్ క్రీడాకారులు 1. డామర్ హామ్లిన్ (అమెరికన్ ఫుట్‌బాలర్) 2. కైలియన్ ఎంబాపే (ఫ్రెంచ్ ఫుట్‌బాలర్) 3. ట్రావిస్ కెల్స్ (అమెరికన్ ఫుట్‌బాలర్) చనిపోయిన ప్రముఖులు 1. మాథ్యూ పెర్రీ (కెనడా నటుడు) 2. టీనా టర్నర్ (అమెరికన్ సింగర్, నటి) 3. సినీడ్ ఓ కానర్ (ఐరిష్ సింగర్, లిరిసిస్ట్) -
300 ఏళ్లలో 200 కోట్లకు!
జన విస్ఫోటనంతో ప్రపంచమంతా అల్లాడుతోంది. గతేడాది ఈ సమయానికే ప్రపంచ జనాభా 800 కోట్లు దాటేసింది. అదే ఊపులో మరో 30 నుంచి 50 ఏళ్లలోపే ఏకంగా వెయ్యి కోట్లకు చేరుతుందని అంచనా. మరి ఆ తర్వాత? అలా పెరుగుతూనే పోతుందా? పెరగకపోగా, బాగా తగ్గుముఖం పడుతుందట. ఎంతగా అంటే, ఓ 300 ఏళ్ల తర్వాత ప్రపంచ జనాభా మొత్తం కలిపి 200 కోట్లకు పరిమితమైపోతుందని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది! ఇంకా మాట్లాడితే అంతకంటే భారీగా తగ్గినా ఆశ్చర్యం లేదంటోంది. కారణమేమిటో తెలుసా? ప్రాకృతిక విపత్తులనుకుంటున్నారా? కాదు. ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు శరవేగంగా తగ్గిపోతుండటమే! ఈ జాబితాలోని దేశాల్లో భారత్ కూడా ముందు వరుసలో ఉండటం విశేషం... గత 200 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుతూ వచి్చంది. ముఖ్యంగా 1950లో 250 కోట్లకు అటూ ఇటుగా ఉన్నది కాస్తా ఈ 70 ఏళ్లలో ఏకంగా మూడింతలైందన్నది ఐరాస అంచనా! మరి మున్ముందు జనాభా పెరుగుదల తీరుతెన్నులు ఎలా ఉండొచ్చు? ఈ ఆసక్తికర అంశంపై యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పాపులేషన్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన ప్రఖ్యాత ఆర్థిక వేత్త డీన్ స్పియర్స్ లోతైన అధ్యయనం చేశారు. జనాభా ఊహాతీతంగా తగ్గిపోవడం ఖాయమని తేల్చారు. ‘‘2080 నుంచే ఈ ధోరణి మొదలవుతుంది. క్రమంగా ఊపందుకుంటుంది. అలా మరో 300 ఏళ్లలోపే ప్రపంచ జనాభా 200 కోట్లకు పరిమితమైపోతుంది. ఇంకా మాట్లాడితే అంతకంటే కూడా తగ్గుతుంది’’ అని బల్ల గుద్ది చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పునరుత్పత్తి రేటు (టోటల్ ఫెర్టిలిటీ రేట్–టీఎఫ్ఆర్)లో క్రమంగా వస్తున్న నమోదవుతున్న తగ్గుదలను ఆధారంగా స్పియర్స్ ఈ నిర్ధారణకు వచ్చారు. పలు దేశాల్లో జనాభా పెరుగుదల రేటు బాగా తగ్గుముఖమే ఇందుకు రుజువని ఆయన చెబుతున్నారు. ఐరాస అంచనాలు కూడా స్పిర్స్ వాదనను బలపరిచేలానే ఉన్నాయి. 2010లో 700 కోట్లున్న ప్రపంచ జనాభా 2022లో 800 కోట్లకు చేరింది. అంటే 12 ఏళ్లు పట్టింది. కానీ 900 కోట్లకు చేరేందుకు 15 ఏళ్లు పడుతుందని ఐరాస పేర్కొంది. అంటే 100 కోట్లు పెరిగేందుకు మూడేళ్లు ఎక్కువ సమయం పట్టనుంది! ఏమిటీ టీఎఫ్ఆర్...? ప్రతి మహిళ తన పునరుత్పత్తి సామర్థ్యం ముగిసేదాకా జీవించి, ఇతరత్రా పరిస్థితులన్నీ సానుకూలంగా ఉంటే కనగలిగిన పిల్లల సంఖ్యే టీఎఫ్ఆర్. జనాభాలో పెరుగుదల నమోదు కావాలంటే ఇది కనీసం 2 కంటే ఎంతో కొంత ఎక్కువగా ఉండాలి. ప్రస్తుతం గ్లోబల్ టీఎఫ్ఆర్ 2.1గా ఉంది. 2026కల్లా ఇది 2కు తగ్గుతుందని అంచనా. అక్కణ్నుంచి స్థిరంగా తగ్గుతూ 2081 నాటికి ఏకంగా 1.4కు పడిపోనుంది. భారత్ విషయమే తీసుకుంటే, 2020 నాటికి టీఎఫ్ఆర్ 2కు దిగొచ్చింది. ప్రస్తుతం 1.8కి తగ్గిందని అంచనా. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న దేశాల్లో చాలావరకు టీఆఎఫ్ఆర్ ఇప్పటికే 2 కంటే దిగువకు వచ్చేసింది. గ్లోబల్ టీఎఫ్ఆర్ మున్ముందు ఏ 1.5 దగ్గరో స్థిరపడుతుందని, అంతకంటే తగ్గదని భావించినా జనాభా నానాటికీ తగ్గడమే తప్ప పెరిగే ప్రసక్తే ఉండదన్నది స్పియర్స్ అంచనా. ఆయన అధ్యయనంలో వెల్లడైన విశేషాలు... ► ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల పై చిలుకు జనాభా ఉన్న 29 దేశాల్లో 2022 నాటికే 20 దేశాల్లో పునరుత్పత్తి రేటు (టీఎఫ్ఆర్) 2 కంటే తగ్గింది. ►జనాభాపరంగా పెద్ద దేశాల్లో టీఎఫ్ఆర్ 2కు పైగా ఉండేవాటి సంఖ్య 2050కల్లా 3కు తగ్గుతుంది. అవి కాంగో, నైజీరియా, టాంజానియా. ►2081 నాటికి అన్ని దేశాల్లోనూ టీఆఎఫ్ఆర్ 2 కంటే తగ్గిపోతుంది. ►జననాల విషయంలో ప్రపంచంలో అగ్ర స్థానం భారత్‌దే. దేశంలో ఏటా 2 కోట్ల జననాలు నమోదవుతున్నాయి. ఈ శతాబ్దాంతానికల్లా అది ఏకంగా నాలుగో వంతుకు, అంటే 50 ►చైనాలో 85 లక్షలుగా ఉన్న వార్షిక జననాల సంఖ్య కేవలం శతాబ్దాంతానికి 12 లక్షలకు పరిమితం కానుంది. ►ఒకసారి తగ్గుముఖం పట్టాక జనాభా మళ్లీ పెరగాలంటే గ్లోబల్ టీఎఫ్ఆర్ 2 కంటే పెరగాలి. కానీ అందుకు అవకాశాలు చాలా స్వల్పం. ఎందుకంటే చరిత్రలో ఇప్పటిదాకా ఏ దేశంలోనూ అలా జరగలేదు. ►ఏ దేశంలో చూసినా ఒక్క సంతానంతోనే సరిపెట్టుకుంటున్న వారు పెరుగుతున్నారు. ►జీవన శైలి, ఆహారపుటలవాట్ల వంటి కారణాలతో పిల్లలు పుట్టని దంపతుల సంఖ్యా పెరుగుతోంది. చాలా రాష్ట్రాల్లో తగ్గిన పునరుత్పత్తి రేటు మన దేశంలో చూసుకుంటే 40 ఏళ్ల క్రితం కేరళ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ పునరుత్పత్తి రేటు కనీసం 3 నుంచి 5 దాకా ఉండేది. ఇప్పుడది విపరీతంగా తగ్గిపోయింది. హరియాణానే తీసుకుంటే 5 నుంచి ఏకంగా 2కు తగ్గింది! ఇప్పుడు పునరుత్పత్తి రేటు 2 కంటే ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు బిహార్ (3), మధ్యప్రదేశ్ (2.6), యూపీ (2.7), రాజస్థాన్ (2.4), అస్సాం (2.1) మాత్రమే. పశి్చమబెంగాల్, తమిళనాడుల్లో 1.4 శాతం, మహారాష్ట్ర , పంజాబ్, ఆంధ్రప్రదేశ్, కేరళల్లో 1.5, కర్ణాటకలో 1.6, ఒడిశాలో టీఎఫ్ఆర్ 1.8గా ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మిసెస్ ఏసియా వరల్డ్‌వైడ్‌గా విజయారెడ్డి
పులివెందుల రూరల్: మిసెస్ సింగపూర్–2023 పోటీల్లో ఏసియా వరల్డ్‌వైడ్ కేటగిరిలో వైఎస్సార్ జిల్లా మహిళ విజేతగా నిలిచారు. పులివెందుల మండలంలోని నల్లపురెడ్డి పల్లె గ్రామానికి చెందిన గోపాల్‌రెడ్డి, రమాదేవి కుమార్తె విజయారెడ్డి సింగపూర్‌లో ఎంబీఏ చదివే సమయంలో విజయవాడకు చెందిన సుంకర ప్రదీప్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు. ప్రస్తుతం విజయ, ప్రదీప్లిద్దరూ పదిహేనేళ్లుగా సింగ పూర్లోనే ఉంటూ, అక్కడ సిటీ బ్యాంక్‌లో పనిచేస్తున్నారు. ఈక్రమంలో అక్టోబర్21న సింగపూర్‌లో లూమియర్ అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన అందాల పోటీల్లో విజయారెడ్డి పాల్గొని, విజయం సాధించారు. మొదటి ప్రయత్నంలోనే విజేత కావడం చాలా ఆనందంగా ఉందని విజయ అన్నారు. -
వెజి‘ట్రబుల్’కు విరుగుడు.. టమాటా, ఉల్లిపాయల ప్రాసెసింగ్‌తో దీర్ఘకాలం నిల్వ
-పల్లా రవికిరణ్, ఏపీ సెంట్రల్ డెస్క్ నిన్నటిదాకా వినియోగదారులను ఏడిపించిన టమాటా నేడు రైతన్నలతో కన్నీళ్లు పెట్టిస్తోంది! టమాటాతో పోటీగా ఎగబాకిన పచ్చి మిర్చి ధరలు సగానికిపైగా పతనమయ్యాయి! ఈదఫా ‘ఉల్లిపాయ’ బాంబు పేలటానికి సిద్ధమైంది!! సామాన్యుడిని ఠారెత్తించిన కూరగాయల ధరలు ఇప్పుడు దిగి వచ్చినా కొద్ది నెలలు దేశ ప్రజలకు చుక్కలు చూపించాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా టమాటాలే. ఐదారు రోజులకు మించి నిల్వ ఉంటే పాడవుతాయి. అకాల వర్షాలకు ఉల్లిపాయలు కుళ్లిపోతాయి. చాలాసార్లు కనీస ఖర్చులు కూడా దక్కకపోవడంతో టమాటాలను రోడ్లపై పారబోసి నిరసన తెలిపిన ఘటనలున్నాయి. అయితే అనావృష్టి లేదంటే అతివృష్టి..! మరి ఏం చేయాలి? సీజన్లో సద్వినియోగం.. వాతావరణ మార్పుల కారణంగా అకాల వర్షాలతో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడం నిజమే అసలు కారణం సరైన నిల్వ, ప్రాసెసింగ్ సదుపాయాలు లేకపోవడమే. వరద వచ్చినప్పుడే ఒడిసి పట్టుకోవాలి! టమాటా, ఉల్లి లాంటివి కూడా సీజన్లో విరివిగా, చౌకగా లభ్యమవుతాయి. మరి సమృద్ధిగా దొరికినప్పుడు సేకరించుకుని ప్రాసెస్ చేసి వాడుకుంటే? రాష్ట్రంలో ఇప్పుడు అదే ప్రక్రియ మొదలైంది. సరైన పద్ధతిలో నిల్వ చేయడం, నాణ్యతను సంరక్షించడం కీలకం. అందుకే ప్రాసెసింగ్ యూనిట్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. గ్రామ స్థాయిలో పొదుపు మహిళల ద్వారా వీటిని ఏర్పాటు చేయడంతోపాటు భారీ ప్లాంట్లపై కూడా దృష్టి పెట్టింది. ఒకవైపు ధరలు పతనమైనప్పుడు మార్కెట్ జోక్యంతో అన్నదాతలను ఆదుకుంటూనే మరోవైపు వీటిని అందుబాటులోకి తెస్తోంది. దీనివల్ల ధరల మంటకు, దళారుల దందాకు తెర పడుతుంది! ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు షేక్‌జుబేదా బీ. పొదుపు సంఘంలో సభ్యురాలు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం తడకనపల్లెకు చెందిన ఈమె ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సహకారంతో టమాటా, ఉల్లిపాయల ప్రాసెసింగ్, డ్రయ్యింగ్ ద్వారా నెలకు రూ.18,000 వరకు ఆదాయాన్ని పొందుతోంది. బ్యాంకు లోన్‌తో యంత్రాలు, షెడ్‌ను సమకూర్చుకోగా సబ్సిడీగా రూ.70,000 అందాయి. తన వాటాగా రూ.20 వేలు జత చేసింది. సోలార్ డ్రయ్యర్లు, డీ హైడ్రేషన్ యూనిట్లతో రోజూ 200 కిలోల కూరగాయలను ఇంట్లోనే ప్రాసెసింగ్ చేస్తోంది. వీటిని సరఫరా చేస్తూన్న ‘ఎస్4 ఎస్’ అనే కంపెనీ ప్రాసెసింగ్ అనంతరం తిరిగి ఆమె వద్ద నుంచి సేకరిస్తోంది. 50 కిలోలు ప్రాసెసింగ్ చేసినందుకు రూ.125 చెల్లిస్తుండగా కరెంట్ చార్జీల కింద మరో రూ.20 చొప్పున కంపెనీ ఇస్తోంది. ప్రతి నెలా రూ.4,000 బ్యాంకు కిస్తీ పోనూ నికరంగా నెలకు రూ.14,000 వరకు ఆదాయం లభిస్తోంది. డ్రయ్యర్లతో డీ హైడ్రేషన్ యూనిట్లు.. ఉద్యాన రైతులకు గిట్టుబాటు ధర, మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం లక్ష్యంగా సోలార్ డ్రయ్యర్లతో కూడిన డీ హైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సహిస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద కర్నూలు జిల్లా తడకనపల్లిలో గతేడాది ఆగస్టులో 35 శాతం సబ్సిడీతో పది యూనిట్లు ఏర్పాటు కాగా కొద్ది రోజుల్లోనే మరిన్ని అందుబాటులోకి వచ్చాయి. రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తూ ఇప్పటి వరకు 1,200 టన్నుల టమాటా, ఉల్లిని ప్రాసెస్ చేశారు. ఈ ఏడాది జూలైలో మరో వంద యూనిట్లను ప్రారంభించారు. పైలెట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా రూ.84 కోట్లతో 5 వేల యూనిట్ల ఏర్పాటుకు బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అవగాహన ఒప్పందం చేసుకుంది. వీటిలో 3,500 యూనిట్లను రాయలసీమ జిల్లాల్లోనే నెలకొల్పుతున్నారు. ప్రతి 100 సోలార్ యూనిట్లను ఒక క్లసర్ కిందకు తెచ్చి రైతుల నుంచి రోజూ 20 టన్నులు టమాటా, ఉల్లిని సేకరించి రెండు టన్నుల ఫ్లేక్స్ తయారు చేయనున్నారు. కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతంలో ఇప్పటికే 900 మంది లబ్ధిదారులను గుర్తించారు. సెప్టెంబరు నాటికి 500 యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, కళ్యాణదుర్గం, సత్యసాయి జిల్లా తనకల్లు ప్రాంతాల్లోనూ లబ్ధిదారులను గుర్తిస్తున్నారు. పత్తికొండలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ కర్నూలు జిల్లా పత్తికొండలో రూ.10 కోట్లతో భారీ స్థాయిలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులకు త్వరలో భూమి పూజ జరగనుంది. ఈ యూనిట్లో స్టోరేజీ, సార్టింగ్, గ్రేడింగ్ సదుపాయాలు కల్పిస్తున్నారు. పల్పింగ్ లైన్, డీ హైడ్రేషన్ లైన్ ఉంటాయి. కెచప్, జామ్, గ్రేవీ లాంటి అదనపు విలువతో కూడిన ఉత్పత్తులు తయారవుతాయి. రాజంపేటలో రూ.294.92 కోట్లతో, నంద్యాలలో రూ.165.32 కోట్లతో ఇంటిగ్రేటెడ్ గుజ్జు, ఐక్యూఎఫ్ (టమాటా) పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారు. రైతన్నకు ‘మద్దతు’.. మహిళలకు ఉపాధి ఉల్లి, టమాటా రైతులకు ఏడాది పొడవునా గిట్టుబాటు ధరలతో పాటు పొదుపు సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాం. కర్నూలు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద నెలకొల్పిన 100 యూనిట్లు విజయవంతం కావడంతో సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.84 కోట్ల అంచనాతో 5 వేల యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాం. ఈమేరకు బ్యాంక్ ఆఫ్ బరోడాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. ఒక్కో యూనిట్ రూ.1.68 లక్షల అంచనాతో ఏర్పాటు చేస్తున్నాం. లబ్ధిదారుల గుర్తింపు చురుగ్గా సాగుతోంది. – ఎల్.శ్రీధర్‌రెడ్డి, సీఈవో, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ -
అగ్రరాజ్యం సహా ప్రపంచవ్యాప్తంగా పేదరికంతో మరణాలు
ప్రపంచంలో గుండె జబ్బులు, కేన్సర్, పొగతాగడం, మెదడు మందగించడం, మధుమేహం మనుషుల మరణాలకు కారణమౌతున్నట్టే పేదరికం కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో చావులకు దారితీస్తోంది. అనేక ఇతర అంశాల వల్ల జనం చనిపోతున్నారనే విషయంపై అమెరికాలో పరిశోధనలు ఇది వరకే జరిగాయి. అలాగే దారిద్య్రం ఈ అత్యంత ధనిక దేశంలో ఎంత మందిని కబళిస్తోందనే అంశంపై కాలిఫోర్నియా యూనివర్సిటీ–రివర్సైడ్ ప్రొఫెసర్ డేవిడ్ బ్రాడీ నేతృత్వంలో తాజాగా పరిశోధన చేశారు. అమెరికాలో దారిద్య్రం చాలా తక్కువ. డెబ్బయి ఎనభై ఏళ్ల క్రితమే సంపన్నదేశంగా అవతరించింది. అయినా, ఇంకా ఇక్కడి ప్రభుత్వం పేదరికాన్ని ఒక ప్రజారోగ్య సమస్యగా పరిగణించదు. పొగతాగడానికి మరణాలకు సంబంధం ఉందని గ్రహించనట్టుగా, దారిద్య్రానికి చావుకు కూడా సంబంధం ఉందనే అంశంపై ఇప్పుడిప్పుడే సర్కార్లకు అవగాహన కలుగుతోంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఏడాదికి 4,80,000 మంది అమెరికన్లు పొగ తాగడం వల్ల కన్నుమూస్తున్నారు. ఊబకాయంతో 2,80,000 మంది, మితిమీరిన స్థాయిలో మాదకద్రవ్యాలు సేవించి 1,06,000 మంది మరణిస్తున్నారు. ఈ గణాంకాలన్నీ 2021కి సంబంధిచినవి. అమెరికా ప్రజలను వారి ఆయుష్షు నిండకుండానే చంపేస్తున్న కారణాలపై చేస్తున్న తాజా పరిశోధనల వల్ల జనం ప్రాణాలు కాపాడే ప్రచారోద్యమాలకు మేలు జరుగుతోంది. ప్రజారోగ్యంపై అమెరికన్లలో జాగరూకత పెంచడానికి అవి ఉపకరిస్తున్నాయి. అమెరికాలో పేదరికం పూర్తిగా అంతరించలేదనే వాస్తవం సభ్య ప్రపంచానికి ఆశ్చర్యం కలిగిస్తోంది. బ్రాడీ నాయకత్వంలో ఓహాయో స్టేట్ యూనివర్సిటీ సామాజికశాస్త్రవేత్త ప్రొ.హూయీ జెంగ్, యూనివర్సిటీ ఆఫ్ పోట్స్ డామ్ ప్రొఫెసర్ ఉల్రిచ్ కోహ్లర్ బృందం అమెరికాలో పేదరికం మరణాలు, పర్యవసానాలపై అధ్యయనం చేసింది. గుండె జబ్బులు, కేన్సర్, స్మోకింగ్ తర్వాత జనం ప్రాణాలు తీసే నాలుగో పెద్ద కారణం పేదరికమని ఈ బృందం సర్వేలో తేలింది. తక్కువ ఆదాయాలున్న ప్రజలను పీడించే దారిద్య్రం కారణంగా ఏటా అమెరికాలో 1,83,000 మంది చనిపోతున్నారు. వరుసగా పదేళ్లు దారిద్య్రం బారిన పడడం వల్ల ఏటా 2,95,000 మరణాలు సంభవిస్తున్నాయి. ఈ దేశంలో పేదలు నివసించే ప్రాంతాల్లో ప్రజారోగ్య సమస్యలు తీవ్రం కావడం, వాటి వల్ల మానసిక ఒత్తిడి పెరిగి దారిద్య్ర మరణాల సంఖ్య పెరుగుతోంది. అమెరికా సెన్సస్ బ్యూరో అనుబంధ నివేదిక లెక్కల ప్రకారం 2021లో దాదాపు 26 లక్షల మంది పేదరికంలో ఉన్నారు. మొత్తంమీద ఇన్నాళ్లకు దేశంలో లక్షలాది ప్రజల ప్రాణాలు ఆయువు నిండకుండానే పోవడానికి కారణమైన పేదరికంపై అమెరికా పాలకులు దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఇండియాలోనూ ప్రజల ప్రాణాలు తీస్తున్న దారిద్య్రం భారతదేశంలో కూడా ప్రజలు ఆయుష్షు తీరకుండానే బయటి కారణాల వల్ల ఎలా, ఎంత మంది మరణిస్తున్నారో ఎప్పటి నుంచో అధ్యయనం చేస్తున్నాయి. ప్రత్యేకించి దారిద్య్రం ప్రత్యక్ష ప్రభావం వల్ల ఎంత మంది కన్నుమూస్తున్నారో పరిశోధనలు చేసే ఆనవాయితీ దేశంలో లేదు. పేదరికం వల్ల ఎంత మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు? తగినంత ఆదాయం లేకపోవడంతో ఎంత మంది ఏఏ జబ్బులతో చనిపోతున్నారు? పేదరికం పోషహాకార లోపానికి ఎంత వరకు దారితీస్తోంది? దాని వల్ల ఎంత మంది దేశ ప్రజలు కన్నుమూస్తున్నారు? వంటి అంశాలపై ప్రభుత్వానికి అవగాహన ఉంది. కాని, విడిగా పేదరికం ప్రత్యక్షంగా ఎంత మంది ప్రజల చావుకు కారణమౌతోందని విషయం పరిశోధనాంశంగా మారలేదు. ఇండియాలో పేదరిక నిర్మూలనకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఏటా దేశంలో దారిద్య్ర రేఖ దిగువ నుంచి కోట్లాది మంది ప్రజలు పైకి వస్తున్నారు. ఆర్థిక సంస్కరణలతో సంపద సృష్టించడం ద్వారా పేదల సంఖ్యను గణనీయంగా తగ్గించగలుగుతున్నారు. అమెరికా తరహాలో భారత విశ్వవిద్యాలయాలు కూడా ప్రత్యకించి పేదరికం–మరణాలు అనే అంశంపై మరింత లోతుగా అధ్యయనం చేస్తే దారిద్య్ర నిర్మూలన కార్యక్రమాలు మరింత విజయవంతమౌతాయి. - విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు -
కొత్త ఊపిరి వచ్చినట్లుంది
‘‘వంద కోట్ల రూపాయల పోస్టర్స్, వంద రోజుల ఫంక్షన్స్ చూశాను. కానీ తొలిసారి వంద అవార్డుల ఫంక్షన్‌ను ‘బలగం’తో చూస్తున్నాం’’ అన్నారు ‘దిల్’ రాజు. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బలగం’. ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్‌పై వేణు ఎల్దండి దర్శకత్వంలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ చిత్రం మార్చి 3న విడులైంది. ‘బలగం’కు ప్రపంచవ్యాప్తంగా వంద అంతర్జాతీయ అవార్డులు వచ్చినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా విశ్వ విజయ శతకం ఈవెంట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘మా పిల్లలు హన్షిత, హర్షిత్ నిర్మించిన తొలి సినిమానే వంద అంతర్జాతీయ అవార్డులు సాధించడం గొప్ప విషయం. పెద్ద బడ్జెట్‌తో రాజమౌళి తీసిన ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’లకు ప్రపంచవ్యాప్తంగా పేరొచ్చింది. కానీ ‘బలగం’ చిన్న ఊర్లో నేటివిటీతో తీశాం. అంతర్జాతీయంగా వంద అవార్డులు వచ్చాయి. ఇటీవల హిట్టయిన ‘సామజ వరగమన’, ‘బేబీ’ వంటి చిత్రాలతో చిన్న, ఫ్యామిలీ చిత్రాలు ఆడతాయనే నమ్మకం మళ్లీ వచ్చింది. కొత్త ఊపిరి వచ్చినట్లయింది’’ అన్నారు. ‘‘బలగం’ తెలంగాణ సినిమాగా ప్రచారమైంది. కానీ తెలుగు సినిమా’’ అన్నారు వేణు. ‘‘నేను, అన్న నిర్మించిన తొలి చిత్రానికి వంద అంతర్జాతీయ అవార్డులు రావడం హ్యాపీ’’ అన్నారు హన్షిత. -
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 పుస్తకాలు
-
అత్యంతఘోర రైలు ప్రమాదాలు..: మృత్యు శకటాలు
ఒడిశా రైలు ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కోరమాండల్, హౌరా రైళ్ల ప్రమాద దృశ్యాలు భారతీయుల హృదయాలను కలచివేస్తున్నాయి. మన దేశంలో 1981లో బిహార్‌లో భాగమతి నదిలో పడిపోయిన రైలు ప్రమాదం ఇప్పటి వరకు అతి పెద్దది. ఈ ప్రమాదంలో 800 మందికిపైగా మరణించారు. అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలు ఇప్పటికీ మనల్ని భయపెడుతూనే ఉన్నాయి. మన దేశ చరిత్రలో... 1. పాసింజర్ రైలు రాష్ట్రం : బీహార్ తేదీ : జూన్ 6, 1981 మృతుల సంఖ్య : 800 దేశంలో అతి పెద్దదే కాకుండా ప్రపంచంలో రెండో అతి పెద్ద రైలు ప్రమాదం ఇది. 1981 సంవత్సరం జూన్ 6న బీహార్‌లోని మన్సి నుంచి సహస్రకు వెళుతున్న పాసింజర్ రైలు భాగమతి నది వంతెనపై నుంచి వెళుతుండగా పట్టాలు తప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 800 మందికి పైగా మరణించారు. భయానకమైన తుఫాన్ బీహార్‌ను వణికిస్తున్న సమయంలో రైలులో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో ప్రమాదం జరిగినట్టు తేలింది. నదిలో శవాలు కొట్టుకుపోవడంతో మృతుల సంఖ్యపై భిన్నకథనాలు వెలువడ్డాయి. మృతుల సంఖ్య 2 వేల వరకు ఉండవచ్చునని కూడా వార్తలు వచ్చాయి. నాలుగు పెళ్లి బృందాలు రైల్లో ఎక్కతే ఒక్కరి ప్రాణం కూడా మిగల్లేదు. 2 కాళింది–పురుషోత్తం ఎక్స్‌ప్రెస్ రాష్ట్రం : ఉత్తరప్రదేశ్ తేదీ : ఆగస్టు 20, 1995 మృతుల సంఖ్య : 350కి పైగా ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో రెండు రైళ్లు ఢీకొన్న దుర్ఘటనలో 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 1995 సంవత్సరం ఆగస్టు 20 తెల్లవారుజమాను 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. కాన్పూర్ నుంచి లక్నోకి వెళుతున్న ఈ రైలు నీల్గాయ్ సమీపంలో బ్రేకులు ఫెయిల్ కావడంతో నిలిచింది. పూరీ నుంచి వస్తున్న పురుషోత్తమ్ ఎక్స్‌ప్రెస్ ఆగి ఉన్న కాళిందిని ఢీ కొనడంతో ప్రమాదం సంభవించింది. 3. అవధ్ ఎక్స్‌ప్రెస్–బ్రహ్మపుత్ర మెయిల్ రాష్ట్రం : పశ్చిమ బెంగాల్ తేదీ : ఆగస్టు 2, 1999 మృతుల సంఖ్య : 300 పశ్చిమ బెంగాల్‌లోని మారుమూల ఉండే గైసాల్ స్టేషన్లో ఈ ప్రమాదం జరిగింది. న్యూఢిల్లీ నుంచి వస్తున్న అస్సాం అవద్ ఎక్స్‌ప్రెస్, గైసాల్ రైల్వే స్టేషన్లో ఉన్న బ్రహ్మపుత్ర మెయిల్‌ని ఢీకొట్టడంతో 300 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలతో ఒకే లైన్లోకి రెండు రైళ్లు రావడంతో ప్రమాదం జరిగింది 4. ఇండోర్–పట్నా ఎక్స్‌ప్రెస్ రాష్ట్రం : ఉత్తరప్రదేశ్ తేదీ : నవంబర్ 20, 2017 మృతుల సంఖ్య : 150 మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి బీహార్‌లో పట్నా వరకు వెళుతున్న ఇండోర్ పాట్నా ఎక్స్‌ప్రెస్ కాన్పూర్ వద్ద పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 150 మందికిపైగా మరణించారు. 5. డెల్టా ప్యాసింజర్ రాష్ట్రం : ఆంధ్రప్రదేశ్ తేదీ : అక్టోబర్ 29, 2005 మృతుల సంఖ్య : 120 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నల్లగొండ జిల్లా వలిగొండ వద్ద సంభవించిన భారీ వరదలకు పట్టాలు కొట్టుకుపోవడంతో డెల్టా పాసింజర్ పట్టాలు తప్పింది. రైలులో 15 బోగీలు నీట మునిగాయి. ఈ ప్రమాదంలో 120 మంది వరకు జలసమాధి అయ్యారు. ప్రపంచ చరిత్రలో.. మాటలకందని మహా విషాదాలన్నో ప్రపంచ రైల్వే చరిత్రలో కన్నీటిని మిగిల్చాయి. 2004లో వచ్చిన సునామీ రాకాసి అలలు ఒక రైలునే ఏకంగా సముద్రంలో కలిపేయడం అత్యంత ఘోరమైన ప్రమాదంగా నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో 1700 మంది జలసమాధి అయ్యారు. క్వీన్ ఆఫ్ ది సీ : శ్రీలంక ఏడాది: 2004 మృతులు: 1700 ప్రపంచ రైల్వే చరిత్రలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం 2004లో సునామీ వచ్చినప్పుడు శ్రీలంకలో జరిగింది. ది క్వీన్ ఆఫ్ సీ రైలు శ్రీలంక టెల్వాట్ట మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో సముద్రం అలలు ముంచేసి రైలు బోగీలను సముద్రంలోకి ఈడ్చుకెళ్లాయి. ఈ ప్రమాదంలో ఏకంగా 1700 మంది ప్రాణాలు కోల్పోయారు. సెయింట్ మిషెల్: ఫ్రాన్స్ ఏడాది : 1917 మృతులు: 700 ఫ్రాన్స్ రైల్వే చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రమాదం 1917లో జరిగింది. సెయింట్ మిషెల్–డి–మౌరినె ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో 700 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో ఫ్రాన్స్‌లోని ఈ రైలు సెయింట్ మిషెల్ దగ్గర పట్టాలు తప్పింది. సియారా : రుమేనియా ఏడాది : 1917 మృతులు : 600 ఒకే ఏడాది ఫ్రాన్స్, రుమేనియాలో ఒకే విధంగా రైలు ప్రమాదాలు జరగడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అతి వేగంగా వస్తున్న రుమేనియాలో రైలు సియారా రైల్వే స్టేషన్ సమీపంలో బ్రేక్ ఫెయిల్ కావడంతో పట్టాలు తప్పింది. అప్పుడు రైల్లో ఎక్కువగా సైనికులు, జర్మనీ శరణార్థులు ఉన్నారు. 800 మంది ప్రాణాలు కోల్పోయారు. గౌడలాజర ట్రైన్ : మెక్సికో ఏడాది : 1915 మృతులు : 600 మెక్సికోలో 2015 జనవరిలో గౌడలాజర రైలు మితి మీరిన వేగంతో వెళుతుండగా పట్టాలు తప్పింది. కొలిమా నుంచి గౌడలాజర వెళుతుండగా రైలు బ్రేకులు ఫెయిల్ కావడంతో పట్టాలు తప్పిన రైలు పక్కనే ఉన్న లోయలో పడిపోవడంతో 600 మంది మరణించారు. ఉఫా : రష్యా ఏడాది : 1989 మృతులు : 575 రష్యాలోని ఉఫా నుంచి ఆషా మధ్య రెండు పాసింజర్ రైళ్లు పక్క పక్క నుంచి వెళుతుండగా గ్యాస్ పైప్‌లైన్ పగిలిపోయి మంటలు చెలరేగాయి. క్షణాల్లో బోగీలకు అంటుకోవడంతో 575 మంది ప్రాణాలు కోల్పోయారు. -
మృత్యుఘాతం
న్యూయార్క్: గాయాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా దాదాపు 44 లక్షల మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. వీరిలో ప్రతి ముగ్గురిలో ఒకరు రోడ్డు ప్రమాదాల్లో గాయపడి, ప్రాణాలు కోల్పోతున్నారని తెలియజేసింది. ఈ మేరకు ‘గాయాల నివారణ, సంరక్షణ’ 14వ ప్రపంచ సదస్సు సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ ఒక నివేదిక విడుదల చేసింది. గాయాలు, హింస వల్ల ప్రపంచవ్యాప్తంగా నిత్యం 12,000 మంది బలైపోతున్నారని నివేదికలో వివరించింది. 5 నుంచి 29 ఏళ్ల వయసున్నవారిలో సంభవిస్తున్న మరణాలకు తొలి 5 కారణాల్లో 3 కారణాలు గాయాలకు సంబంధించినవేనని స్పష్టం చేసింది. జనం మృత్యువాత పడడానికి రోడ్డు ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యలు, నీటిలో మునిగిపోవడం, అగ్ని ప్రమాదాలు, విషం తీసుకోవడం వంటివి ప్రధానంగా కారణమవుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ తేల్చిచెప్పింది. ప్రతి 6 మరణాల్లో ఒకటి ఆత్మహత్య, ప్రతి 9 మరణాల్లో ఒకటి హత్య, ప్రతి 61 మరణాల్లో ఒకటి యుద్ధం, ఘర్షణల వల్ల సంభవిస్తున్నాయని పేర్కొంది. సంపన్నులతో పోలిస్తే పేదలు గాయాల వల్ల చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధానోమ్ గెబ్రీయెసస్ తెలిపారు. -
ప్రపంచవ్యాప్తంగా పలు బ్రిడ్జిల ఘోర ప్రమాదాలు (ఫొటోలు)
-
'మేజర్' అరుదైన రికార్డు.. పాక్‌తో సహా 14 దేశాల్లో ట్రెండింగ్
Major Trends At Top 10 On Netflix Across 14 Countries: 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. అడివి శేష్ లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. అడివి శేష్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. అలాగే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో జులై 3 నుంచి స్ట్రీమింగ్ అవుతూ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా సత్తా చాటుతోంది. అడవి శేష్ నటన, యాక్షన్ సీక్వెన్స్, శశి కిరణ్ తిక్క దర్శకత్వం వివిధ దేశాల్లోని ప్రజలను ఆకట్టుకుంటోంది. 'మేజర్' చిత్రం ఒకటి, రెండు కాదు ఏకంగా 14 దేశాల్లో ట్రెండింగ్‌లో ఉంది. తెలుగు, హిందీ భాషలతోపాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉండగా.. బంగ్లాదేశ్, బహ్రెయిన్, కువైట్, మలేషియా, ఒమన్, మాల్దీవులు, పాకిస్థాన్, శ్రీలంక, యూఏఈ, ఖతార్, సింగపూర్ సహా 14 దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్స్ టాప్-10లో నిలిచింది. ఇండియా, మారిషస్, నైజీరియాలో టాప్-1లో ఉన్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ విషయంపై హీరో అడవి శేష్ సంతోషం వ్యక్తం చేశాడు. 'నాకు చాలా సంతోషంగా ఉంది. సినిమాపై ఆడియెన్స్ చూపిస్తున్న ప్రేమకు రుణపడి ఉంటాను. నిజంగా మేము గర్వపడే సందర్భమిది. ఈ సినిమా ఎప్పటికీ ప్రత్యేకమే' అని తెలిపాడు. India's hero is being celebrated worldwide 💥💥#MajorTheFilm is trending in Top 10 films on @NetflixIndia across 14 countries ❤️🔥❤️🔥@AdiviSesh #SobhitaDhulipala @saieemmanjrekar @GMBents @urstrulyMahesh @AplusSMovies @SashiTikka @sonypicsindia pic.twitter.com/sKv0jQ3IGr — Major (@MajorTheFilm) July 14, 2022 -
బజాజ్ అలియాంజ్ గ్లోబల్ హెల్త్ ప్లాన్
న్యూఢిల్లీ: ప్రపంచంలో ఎక్కడైనా హెల్త్ కవరేజీ పొందే ఫీచర్‌తో బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ‘గ్లోబల్ హెల్త్ కేర్’ పేరుతో ఒక పాలసీని ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ తీసుకున్న వారు ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో అయినా తమ ఆరోగ్య సమస్యకు చికిత్స తీసుకుని, కవరేజీ పొందొచ్చు. భారత్‌లోనూ కవరేజీ ఉంటుంది. ప్రపంచంలో అత్యుత్తమ వైద్య సదుపాయాలు ఎక్కడ ఉన్నా, వాటిని పొందే సదుపాయాన్ని కల్పించడమే ఈ ప్లాన్ ఉద్దేశ్యమని బజాజ్ అలియాంజ్ ప్రకటించింది. అలియాంజ్ పార్ట్నర్స్’ భాగస్వామ్యంతో బజాజ్ అలియాంజ్ ఈ పాలసీని తీసుకొచ్చింది. రూ.37.50 లక్షల నుంచి కవరేజీ (బీమా/సమ్ అష్యూర్డ్) ప్రారంభమై, రూ.3.75 కోట్ల వరకు అందుబాటులో ఉంటుంది. ఇంపీరియల్ ప్లాన్, ఇంపీరియల్ ప్లస్ ప్లాన్ అనే రెండు రకాలుగా ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుందని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ప్రకటించింది. హాస్పిటల్లో చేరి తీసుకునే చికిత్సలు, చేరే అవసరం లేకుండా తీసుకునే డే కేర్ ప్రొసీజర్స్, మానసిక అనారోగ్యం, పాలియేటివ్ కేర్, ఎయిర్ అంబులెన్స్, అవయవదాతకు అయ్యే ఖర్చులు, ఆధునిక చికిత్సలకు ఈ ప్లాన్‌లో కవరేజీ ఉంటుంది. ప్రీమియం రూ.39,432తో ప్రారంభమవుతుంది. -
World Refugee Day: బతుకు జీవుడా
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రతో శరణార్థి సంక్షోభం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రష్యా సైన్యం నుంచి ఏ క్షణం ఎటు వైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయంతో ప్రాణాలరచేతుల్లో పెట్టుకొని కట్టుబట్టలతో కన్న భూమిని విడిచి వెళ్లిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికేడాది పెరిగిపోతున్న శరణార్థుల్ని చూసే దిక్కు లేక దుర్భర జీవితాన్ని కొనసాగిస్తున్నారు. శరణార్థుల దుస్థితిపై అవగాహన కల్పించడానికి, వారిని అన్ని విధాలా ఆదుకోవడానికి ఐక్యరాజ్య సమితి ప్రతీ ఏడాది జూన్ 20న ప్రపంచ శరణార్థుల దినం నిర్వహిస్తోంది. 10 కోట్లు.. అక్షరాలా పది కోట్లు మంది ప్రపంచవ్యాప్తంగా.. ఉన్న ఊరుని విడిచి పెట్టి మెరుగైన జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్లిపోయారు. యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఆఫ్ రెఫ్యూజీస్ (యూఎన్‌హెచ్‌సీఆర్) తేల్చిన లెక్కలు ఇవి. యుద్ధాలు, అంతర్గత ఘర్షణలు, వాతావరణ మార్పులు, ఆకలి కేకలు, అణచివేత, హింసాకాండ, మానవహక్కుల హననం వంటి కారణాలు దశాబ్ద కాలంగా శరణార్థుల సంఖ్యను పెంచేస్తున్నాయి. కరోనా సంక్షోభం, ఉక్రెయిన్‌పై రష్యా దాడి, శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంతో బలవంతంగా వలస బాట పట్టినవారు ఎందరో ఉన్నారు. ఏటికేడు శరణార్థుల సంఖ్య ఎలా పెరుగుతోందంటే వీళ్లందరూ ఒకే ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటే అది ప్రపంచంలో అతి పెద్ద జనాభా కలిగిన 14వ దేశంగా అవతరిస్తుంది. అందులోనూ ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రతో ప్రపంచవ్యాప్తంగా శరణార్థుల సంఖ్య రికార్డు స్థాయికి చేరుకుంది. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం 2021 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 8.9 కోట్ల మంది శరణార్థులు ఉంటే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత వారి సంఖ్య 10 కోట్లు దాటేసింది ప్రపంచాన్ని కుదిపేసిన సంక్షోభాలు ఉక్రెయిన్ ఉక్రెయిన్‌పై రష్యా ఈ ఏడాది ఫిబ్రవరి 24 నుంచి చేస్తున్న భీకరమైన దాడులతో ఇప్పటివరకు 50 లక్షల మందికిపైగా శరణార్థులుగా ఇతర దేశాలకు వెళ్లిపోయారు. ఇక అంతర్గతంగా చెట్టుకొకరు పుట్టకొకరుగా వెళ్లిపోయిన వారు 80 లక్షల మంది వరకు ఉంటారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శరణార్థి సంక్షోభం రికార్డు స్థాయికి చేరుకుంది ఇప్పుడే. పోలండ్, రష్యా, రుమేనియా వంటి దేశాలు ఉక్రెయిన్ శరణార్థులను అక్కున చేర్చుకుంటున్నాయి. వారి అవసరాలు తీరుస్తున్నాయి. సిరియా దాదాపుగా పదేళ్ల పాటు అంతర్యుద్ధంతో నలిగిపోయిన సిరియాలో 2021 చివరి నాటికి 67 లక్షల మంది సిరియన్లు శరణార్థులుగా ఇతర దేశాలకు వెళ్లిపోయారు. లెబనాన్, జోర్డాన్, ఇరాక్, ఈజిప్టు, టర్కీ దేశాల్లో వీరంతా బతుకులీడుస్తున్నారు. అఫ్గానిస్తాన్ ఈ దేశం నుంచి నిరంతరం శరణార్థులుగా ఇతర దేశాలకు వెళ్లేవారు చాలా ఎక్కువ. ప్రతీ పది మందిలో ఒకరు అక్కడ జీవనం సాగించలేక ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారు. కనీసం 26 లక్షల మంది శరణార్థి శిబిరాల్లోనే పుట్టారు. సూడాన్ దక్షిణ సూడాన్‌లో నిరంతర ఘర్షణలతో ఇల్లు వీడి వెళ్లిన వారి సంఖ్య 40 లక్షలు ఉంటే, 26 లక్షల మంది దేశం విడిచి వేరే దేశాలకు వెళ్లిపోయారు. మయన్మార్ మయన్మార్‌లో రోహింగ్యాలను మైనార్టీల పేరుతో ఊచకోత కోస్తూ దేశం నుంచి తరిమి కొట్టడంతో ఏకంగా 10 లక్షల మంది ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లిపోయారు. ఆదుకోవడం ఎలా? శరణార్థులుగా ఇతర దేశాలకు వెళుతున్న వారికి కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ అందించడానికి ఆయా దేశాలు ఎంతో చేస్తున్నాయి. కానీ కేవలం అవి చేస్తే సరిపోవు. వారికి విద్య, ఆరోగ్యం, ఉపాధి, కుటుంబం , స్థిరత్వం అన్నింటికంటే గుర్తింపు కూడా అత్యంత ముఖ్యం. ఇల్లు, దేశం విడిచి వెళ్లిన శరణార్థి ఇతర దేశాల్లో స్థిరపడడానికి కనీసం 20 ఏళ్లు వేచి చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం నిధుల కొరత. శరణార్థులు కొత్త జీవితం గడపడానికి అవసరమైన నిధులు అందడం లేదు. ప్రతీ ఏడాది మానవీయ సంక్షోభాలు లెక్కకు మించి వస్తూ ఉండడంతో కనీసం వెయ్యి కోట్ల డాలర్లు (రూ.77,000 కోట్లు) లోటు ఉంది. యెమెన్, అఫ్గానిస్తాన్, సూడాన్‌లో శరణార్థులుగా మారిన వారిలో మూడో వంతు మందికి కూడా సాయం అందలేదని యూఎన్ లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ కాకుండా నిత్యం శరణార్థుల్ని పుట్టించే 30 ఘర్షణాత్మక ప్రాంతాలు ప్రపంచంలో ఉన్నాయి. శరణార్థుల్లో సగానికి సగం మంది పిల్లలే ఉండడం ఆందోళనకరం. వారిలో ఒక్క శాతం మందికి కూడా సాయం అందడం లేదు. సంపన్న దేశాలు ఇకనైనా శరణార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. –సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇప్పుడు నా అప్పులన్నీ తీర్చేస్తా: కమల్ హాసన్
Kamal Haasan Says He Will Repay All Loans Vikram Earns 300 Cr Worldwide: సుమారు నాలుగేళ్ల తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేశాడు ఉలగ నాయగన్ (లోక నాయకుడు) కమల్ హాసన్. ఆయన తాజాగా నటించి బ్లాక్‌బ్లస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం 'విక్రమ్'. కమల్‌తోపాటు విజయ్‌సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య విభిన్న పాత్రల్లో అలరించిన ఈ సినిమాకు లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించారు. నాలుగేళ్ల తర్వాత ఈ సినిమాతో పవర్ఫుల్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు కమల్ హాసన్. ఈ మూవీ విడుదలైన రెండు వారాల్లో రూ. 300 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ విషయంపై తాజాగా కమల్ హాసన్ స్పందించారు. చెన్నైలో రక్తదాన ప్రచార కార్యక్రమంలో జరిగిన ప్రెస్మీట్లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలంటే డబ్బు గురించి చింతించని నాయకుడు మనకు కావాలి. గతంలో ఒకసారి నేను రూ. 300 కోట్లు సంపాదించగలను అని చెబితే ఎవరూ నా మాట నమ్మలేదు. అసలు వాళ్లు అర్థం చేసుకోలేదు కూడా. ఇప్పుడు విక్రమ్ బాక్సాఫీస్ వసూళ్లతో నా మాట నిజమైంది. ఇక ఇప్పుడు నా అప్పులన్నీ తీర్చేస్తా. నాకిష్టమైన ఆహారాన్ని తింటాను. నా కుటుంబం, సన్నిహితులకు చేతనైన సాయం చేస్తాను. ఒకవేళ నా దగ్గర డబ్బు అయిపోతే ఇవ్వడానికి ఏం లేదని చెప్పేస్తా. వేరే వాళ్ల దగ్గర డబ్బు తీసుకుని పక్కన వాళ్ల సాయం చేయాలని నాకు ఉండదు. నాకు గొప్ప పేరు వద్దు. ఒక మంచి మనిషిగా ఉండాలనుకుంటున్నాను.' అని కమల్ హాసన్ పేర్కొన్నాడు. చదవండి:👇 ఏమాత్రం తగ్గని 'విక్రమ్'.. 10 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే.. ఆ పాత్ర కోసం 15 రోజులు ఇంట్లో వాళ్లతో మాట్లాడలేదు: నటుడు హైదరాబాద్ ఆస్పత్రిలో చేరిన దీపికా పదుకొణె.. -
ఏమాత్రం తగ్గని 'విక్రమ్'.. 10 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే..
Vikram Movie Collections Worldwide: ఉలగ నాయగన్ (లోక నాయకుడు) కమల్ హాసన్ సుమారు నాలుగేళ్ల తర్వాత విక్రమ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య విభిన్న పాత్రల్లో అలరించారు. ముఖ్యంగా కమల్ హాసన్ చేసిన యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇక 'విక్రమ్' బాక్సాఫీస్ కలెక్షన్లలో ఏమాత్రం తగ్గట్లేదు. కమల్ హాసన్ కెరీర్లోనే సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. 2022లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ సినిమాల్లో ఒకటిగా 'విక్రమ్' నిలిచింది. ఈ సినిమా విడుదలైన తొలి రోజు రూ. 45 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. తాజాగా ప్రపంచవ్యాప్తంగా 10 రోజుల్లో సుమారు రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం. ఒక్క తమిళనాడులోనే పది రోజుల్లో రూ. 100 కోట్లను కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. ఒక్క ఆదివారం రోజే రూ. 11 కోట్ల కలెక్షన్లతో 'విక్రమ్' దుమ్ములేపాడు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాడు విక్రమ్. గత 10 రోజుల్లో రూ. 25 కోట్లకుపైగా వసూలు చేసినట్లు పలు నివేదికలు తెలుపుతున్నాయి. ఇక కేరళలో ఇప్పటివరకు రూ. 30 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టగా, కర్ణాటకలో సుమారు 15 కోట్లు సాధించినట్లు సమాచారం. అయితే ఈ వీకెండ్ పూర్తయ్యేవరకూ మరిన్ని కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. చదవండి: సూర్య ‘రోలెక్స్ సర్’ అంత బాగా ఎలా పేలాడు? At the end of 2nd weekend, #Vikram has crossed the ₹ 300 Cr gross mark at the WW Box office.. 🔥 A first for #Ulaganayagan @ikamalhaasan and rest of the cast and crew! @VijaySethuOffl #FahadhFaasil @Suriya_offl @Dir_Lokesh @anirudhofficial @RKFI @turmericmediaTM — Ramesh Bala (@rameshlaus) June 13, 2022 Looks like #Vikram is gonna break more box office records this weekend ! Unbelievable collections ! Ulaganayakan @ikamalhaasan sir @Dir_Lokesh @anirudhofficial @VijaySethuOffl @turmericmediaTM #Fahad @RedGiantMovies_ — Udhay (@Udhaystalin) June 10, 2022 -
పుతిన్ పొగరు తగ్గించుకో.. ఉక్రెయిన్‌కు పెరుగుతున్న మద్ధతు(ఫోటోలు)
-
ప్రపంచంలో అత్యధిక దేశాల్లో జరుపుకునే పండుగ ఇదే!
సాక్షి, హైదరాబాద్: విశ్వవ్యాప్తంగా అత్యధికులు జరుపుకొనే పండుగల్లో దీపావళి ఒకటి. కులమతాలలు, ప్రాంతాలకు అతీతంగా దేశ విదేశాల్లో చాలా ఎక్కువమంది జరుపుకొనే పండుగ దీపావళి మాత్రమే. మనలోని చీకటిని తొలగించి మన అంతరంగాన్ని వెలుగులు నింపాలనే సందేశం. అజ్ఞాన తిమిరాన్ని తరిమికొట్టి కోట్లాదిమంది గుండెల్లో వేయి మతాబుల వెలుగులు చిందే ఈ దీపావళిని ఏయే దేశాల్లో ఎలా జరుపుకుంటారో ఒకసారి చూసి వద్దాం రండి. Have a Happy and safe Diwali!! దీపావళి వేడుకలు భారతదేశంలోనే కాకుండా హిందువులు, జైనులు, బౌద్ధులు, సిక్కుల జనాభా ఎక్కువగా ఉండే నేపాల్, భూటాన్, శ్రీలంక, మయాన్మార్, థాయ్‌లాండ్, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, ఫిజీ, మారిషస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, కెన్యా, సురినామ్, గుయానా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, బ్రిటన్, కెనడా, అమెరికా, ట్రినిడాడ్ అండ్ టొబాగో తదితర దేశాల్లోనూ ఘనంగా జరుగుతాయి. నేపాల్‌లో కూడా భారత్ మాదిరిగానే ఐదు రోజుల వేడుకలు జరుగుతాయి. విద్యుద్దీప కాంతులతో ఆయా దేశాల్లోని నగర వీధులు వెలిగిపోతాయి. సింగపూర్‌లోనూ దీపావళి పండుగ రోజు పబ్లిక్ హాలిడే కూడా.(Diwali 2021 Safety Tips: శానిటైజర్లతో జాగ్రత్త! హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ!!) ముఖ్యంగా సెంటోసా ఐల్యాండ్, క్లార్క్ క్వే, గార్డెన్స్ బై ది బే తదితర ప్రాంతాల్లో దీపావళి వేడుకలు అట్టహాసంగా నిర్వహించుకుంటారు. మారిషస్‌లో కూడా భారతీయులు ఎక్కువే ఈ నేపథ్యంలో దీపావళి సందడి నెలకొంటుంది. పైగా సెలవు దినం కావడంతో దీపావళి వేడుకలను వీక్షించేందుకు బీచ్ ఒడ్డుకుని పర్వదినాన్ని ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా కౌలాలంపూర్‌లో జరిగే దీపావళి వేడుకలు ప్రధాన ఆకర్షణ. అమెరికాలో భారతీయులు, ముఖ్యంగా తెలుగువాళ్లు దీపావళి కడు ముచ్చటగా నిర్వహించుకుంటారు. అమెరికాలోనూ దీపావళికి సెలవు ఇస్తారు. అక్కడి న్యూజెర్సీ, ఇల్లినాయిస్, టెక్సాస్, కాలిఫోర్నియాలలో దీపావళి వేడుకలు అంబరాన్ని అంటుతాయి. అలాగే ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్ ప్రాంతాల్లో దీపావళి వేడుకలు కన్నులపండువగా సాగుతాయి. ముఖ్యంగా మెల్బోర్న్లోని ఫెడరేషన్ స్క్వేర్‌లో దీపావళి వేడుకలను చూసి తీరాల్సిందే. చదవండి : Diwali 2021: పండుగ సంబరాలు, కథలు ప్రస్తుత కరోనా మహమ్మారి కాలంలో అందరూ నిబంధనలు పాటించాల్సిందే అని చాలా ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయి. దీంతోపాటు కాలుష్య రహితంగా ఈ పండుగను చేసుకోవాలని పిలుపునిచ్చాయి. నిర్దేశిత సమయంలో మాత్రమే దీపావళి టపాసులు పేల్చాలి. మరోవైపు భారీ శబ్దాలతో పిల్లలకు, వృద్ధులకు ఇబ్బంది కలగకుండా గ్రీన్ క్రాకర్లు, లేదా పర్యావరణ అనుకూల క్రాకర్స్ ద్వారా పండుగ నిర్వహించుకోవాలని పర్యావరణ వేత్తలు సూచనలు పాటిద్దాం. -
ఒక జీబీ @ రూ.3,659
మొబైల్ ఓపెన్ చేస్తే చాలు.. ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ ఇంకా ఎన్నో యాప్స్.. ఎన్నో పనులు.. ప్రతిదానికీ డేటా అవసరమే. డబ్బులు చెల్లించి డేటాను రీచార్జి చేసుకోవాల్సిందే. మన దగ్గర కొన్నేళ్లుగా డేటా ధరలు బాగా తగ్గిపోయాయిగానీ.. ప్రపంచవ్యాప్తంగా ఇంకా రేట్లు చుక్కలను తాకుతూనే ఉన్నాయి. మరి ఏ దేశంలో సగటున ఒక్కో గిగాబైట్ (జీబీ) డేటాకు ఎంత ఖర్చవుతుందో తెలుసా? దీనిపై బ్రిటన్‌కు చెందిన కేబుల్ అనే వెబ్సైట్ విస్తృతమైన సర్వే చేసి లెక్కలు తేల్చింది. ఆ వివరాలు తెలుసుకుందామా? 230 దేశాల్లో పరిశీలించి.. అమెరికాకు చెందిన గూగుల్, న్యూఅమెరికాస్ ఓపెన్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ల ఉమ్మడి సంస్థ ఎం–ల్యాబ్, ప్రిన్స్టన్ యూనివర్సిటీకి చెందిన ప్లానెట్ ల్యాబ్ తదితర సంస్థల సహకారంతో కేబుల్ డాట్ యూకే వెబ్సైట్ ప్రతినిధులు ప్రపంచవ్యాప్తంగా మొబైల్ డేటా ప్లాన్లు, ధరలపై సర్వే చేశారు. 230 దేశాల్లో 6000 మొబైల్ డేటా ప్లాన్ల వివరాలను సేకరించి విశ్లేషించారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆయా దేశాల్లోని ప్రధాన టెలికాం సంస్థల డేటా ప్యాకేజీలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులో గుర్తించిన వివరాలతో తాజాగా ఒక నివేదికను విడుదల చేశారు. ►ప్రపంచవ్యాప్తంగా అమెరికా, ఆఫ్రికా ఖండాల పరిధిలోని దీవుల్లో డేటా ధరలు ఎక్కువగా ఉన్నాయి. ►టెలికాం కంపెనీల మధ్య విపరీతమైన పోటీ ఉన్న దేశాల్లో ధరలు తక్కువగా ఉన్నట్టు సర్వే గుర్తించింది. ►ప్రపంచ సగటు డేటా ధరల కంటే అగ్రరాజ్యమైన అమెరికా, దాని పరిసర దేశాల్లో డేటా ధరలు ఎక్కువగా ఉండటం గమనార్హం. అమెరికా (154వ ర్యాంకు), జపాన్ (156వ ర్యాంకు) తదితర దేశాల్లో సగటున ఒక జీబీ రేటు రూ.250కిపైనే ఉంది. ►యూరప్ దేశాల్లో ఫ్రాన్స్ మినహా మిగతా దేశాల్లో డేటా ధరలు చాలా ఎక్కువ. ►పొరుగున ఉన్న చైనా, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాల్లో ఇండియా కంటే తక్కువ ధరలకు మొబైల్ డేటా అందుబాటులో ఉందని సర్వే పేర్కొంది. ►ఇప్పటికీ 2జీ, 3జీ మొబైల్ నెట్‌వర్క్‌లను వినియోగిస్తున్న దేశాల్లో.. తక్కువ మొత్తంలో డేటాకు ఎక్కువగా చార్జి చేస్తున్నారు. దీనితో మొత్తంగా ఒక్కో జీబీ డేటాకు రేటు వేల రూపాయల్లోకి వెళుతోంది. -
చిప్‌ల కొరత, కలవరంలో కార్ల కంపెనీలు
ముంబై:అంతర్జాతీయంగా సెమీకండక్టర్ చిప్‌ల కొరత భారత్‌లో వాహనాల తయారీకి ప్రతికూలంగా మారుతోంది. దీంతో ఆగస్టు–సెప్టెంబర్ హోల్‌సేల్ అమ్మకాలపై ప్రభావం పడొచ్చని ఆర్థిక సేవల సంస్థ జెఫ్రీస్ ఒక నివేదికలో తెలిపింది. ‘మారుతి, బజాజ్, రాయల్ ఎన్ఫీల్డ్ వంటి కంపెనీలపై సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ ప్రభావం ఉండవచ్చు‘ అని వివరించింది. మలేషియాలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి విధించిన లాక్డౌన్ కూడా చిప్‌ల కొరతకు కారణంగా ఉంటోందని జెఫ్రీస్ తెలిపింది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ దెబ్బ నుంచి డిమాండ్ క్రమంగా పుంజుకుంటున్న తరుణంలో ఈ పరిస్థితులు ఆటోమొబైల్ కంపెనీలను కలవరపరుస్తున్నాయి. చదవండి : ఆపిల్ 'థింక్ డిఫరెంట్'..వీళ్లకి మూడింది! విరివిగా సెమీకండక్టర్ల వినియోగం.. వాహనాలు మొదలుకుని కంప్యూటర్లు, సెల్ఫోన్లతో పాటు ఇతరత్రా అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో సెమీకండక్టర్లుగా వ్యవహరించే సిలికాన్ చిప్‌లను వాడుతున్నారు. ఆయా ఉత్పత్తులు వివిధ పనులను సక్రమంగా నిర్వర్తించేందుకు (కంట్రోల్, మెమొరీ మొదలైనవి) చిప్‌లు ఉపయోగపడతాయి. ఇటీవలి కాలంలో బ్లూటూత్ కనెక్టివిటీ, డ్రైవర్ అసిస్ట్, నేవిగేషన్, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ సిస్టమ్స్ వంటి అధునాతన ఎలక్ట్రానిక్ ఫీచర్లతో కొత్త వాహనాల రూపకల్పనలో సెమీకండక్టర్ల వాడకం గణనీయంగా పెరిగింది. కీలకమైన చిప్‌లకు కొరత నెలకొనడంతో అంతర్జాతీయంగా ఆటోమోటివ్ సహా ఇతర పరిశ్రమలపైనా ప్రభావం పడుతోంది. దీంతో అవి ఉత్పత్తిని తగ్గించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. నివేదికలోని ఇతర వివరాలు.. 2019 ఆగస్టుతో (కరోనాకి పూర్వం) పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో ప్యాసింజర్ వాహనాలు, ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ 41–44 శాతం పెరిగింది. ట్రక్కుల రిజిస్ట్రేషన్ 15 శాతం తగ్గినప్పటికీ క్రమంగా మెరుగుపడుతోంది. ద్విచక్ర వాహనాల అమ్మకాలు మాత్రం ఆగస్టులో ఏకంగా 19 శాతం పడిపోయాయి. ►2019 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో ప్యాసింజర్ వాహనాల రిజిస్ట్రేషన్లు 29 శాతం తగ్గాయి. కోవిడ్ సెకండ్ వేవ్ పరిణామాలు ఇందుకు కారణం. డిమాండ్ క్రమంగా పుంజుకుంటోంది. జులై ద్వితీయార్థంలో ఆటోమొబైల్ కంపెనీల కోసం ఆన్లైన్లో సెర్చి చేయడం కాస్త తగ్గినప్పటికీ ప్రస్తుతం మళ్లీ పెరుగుతోంది. కన్జూమర్ సెంటిమెంట్ మెరుగుపడుతోందనడానికి ఇది నిదర్శనంగా జెఫ్రీస్ తెలిపింది. ►ఇక 2019తో పోలిస్తే 2022 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో టూవీలర్ల రిజిస్ట్రేషన్లు 46 శాతం పడిపోయినప్పటికీ క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. ►జులై–ఆగస్టు మధ్య కాలంలో ట్రాక్టర్ల విభాగంలో రిజిస్ట్రేషన్లు 2019తో పోలిస్తే 44 శాతం పెరిగాయి. ట్రక్కులకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ►ఆటోమొబైల్ కంపెనీల స్థూల మార్జిన్ ఒత్తిళ్లలో అత్యధిక భాగం సెప్టెంబర్ త్రైమాసికానికి తగ్గిపోవచ్చని జెఫ్రీస్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో కంపెనీలు సీక్వెన్షియల్ ప్రాతిపదికన మెరుగైన మార్జిన్లు నమోదు చేసుకోవచ్చని వివరించింది. సెప్టెంబర్‌లో మారుతీ ఉత్పత్తి డౌన్..? చిప్‌ల కొరత కారణంగా సాధారణ స్థాయితో పోలిస్తే సెప్టెంబర్‌లో ఉత్పత్తి 40 శాతానికి తగ్గిపోవచ్చని దేశీ దిగ్గజం మారుతీ సుజుకీ అంచనా వేస్తోంది. హర్యానా, గుజరాత్‌లోని ప్లాంట్లలో ఉత్పత్తి ప్రభావం పడవచ్చని సంస్థ తెలిపింది. హర్యానాలోని గుర్గావ్, మానెసర్ ప్లాంట్ల వార్షిక తయారీ సామర్థ్యం 15 లక్షల యూనిట్లుగా ఉంది. దీంతో పాటు గుజరా త్‌లోని సుజుకీ మోటర్ గుజరాత్ (ఎస్ఎంజీ) ప్లాంటు స్థాపిత సామర్థ్యం వార్షికంగా మరో 7.5 లక్షల యూనిట్ల స్థాయిలో ఉంది. జులైలో మారుతీ సుజుకీ మొత్తం ఉత్పత్తి 58 శాతం పెరిగి 1,70,719 యూనిట్లుగా నమోదైంది. -
ప్రమాదపు అంచున ‘బాల్యం’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోని దాదాపు 100 కోట్ల మంది పిల్లలు వాతావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్యం మూలంగా తీవ్ర ప్రభావానికి గురయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 220 కోట్ల మంది పిల్లలు వాతావరణ మార్పులకు సంబంధించిన ఏదో ఒక ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా భారత్, నైజీరియా, ఫిలిప్పీన్స్ సహా 33 దేశాల పిల్లలు వేడిగాలులు, వరదలు, తుఫానులు, వ్యా«ధుల సంక్రమణ, కరువు, వాయు కాలుష్యంవంటి మూడు నుంచి నాలుగు వాతావరణ ప్రభావాలను ఒకేసారి ఎదుర్కొంటున్నారని యూనిసెఫ్ తెలిపింది. తాజాగా విడుదల చేసిన తొలి వాతావరణ ప్రమాద సూచిక (సీసీఆర్‌ఐ) నివేదికలో పేర్కొంది. సీసీఆర్‌ఐ ఇండెక్స్ ప్రకారం ప్రపంచ దేశాల్లో 8.7 పాయింట్లతో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ మొదటి స్థానంలో ఉంది. 7.7 పాయింట్లతో పాకిస్తాన్ 14వ స్థానంలో ఉండగా, 7.6 పాయింట్లతో అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లు 15వ స్థానంలో ఉన్నాయి. కాగా 7.4 పాయింట్లతో భారత్ 26వ స్థానంలో ఉంది. 6.7 పాయింట్లతో చైనా 40వ స్థానంలో, 5.4 పాయింట్లతో శ్రీలంక 61వ స్థానంలో, 5 పాయింట్లతో అమెరికా 80వ స్థానంలో ఉన్నాయి. 92 కోట్ల మంది పిల్లలకు తాగునీటి కొరత వాతావరణ మార్పు, కాలుష్యం, పేదరికం, పిల్లలకు పరిశుభ్రమైన నీటి లభ్యత, ఆరోగ్యం, విద్యా సదుపాయాల లభ్యతవంటి అంశాలను పరిగణలోకి తీసుకొని యూనిసెఫ్ ఈ నివేదికను తయారుచేసింది. కాగా ఈ అంశాలపై గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమౌతోంది. ఈ ప్రభావాల కారణంగా 33 దేశాల్లోని పిల్లల ఆరోగ్యం, విద్య, భద్రతకు సంబంధించిన పరిస్థితి భయంకరంగా ఉందని యూనిసెఫ్ అభివర్ణించింది. కాగా పిల్లల వాతావరణ ప్రమాద సూచిక (సీసీఆర్‌ఐ) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మంది పిల్లలు వాయు కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అంతేగాక 92 కోట్ల మంది పిల్లలు తాగునీటి కొరతతో బాధపడుతున్నారని, 82 కోట్ల మంది వేడిగాలులు, 60 కోట్ల మంది చిన్నారులు మలేరియా, డెంగ్యూ జ్వరం వంటి సంక్రమించే వ్యాధుల ప్రభావానికి గురవుతున్నారు. 24 కోట్ల మంది పిల్లలు తీరప్రాంత వరదలకు, 33 కోట్లమంది పిల్లలు నదీ ప్రవాహానికి, 40 కోట్లమంది పిల్లలు తుఫానులకు, 81.5 కోట్ల పిల్లలు లెడ్ (సీసం) కాలుష్య ప్రభావాలకు లోనవుతున్నారని నివేదిక తెలిపింది. సుమారు 100 కోట్ల మంది చిన్నారులు అత్యధిక స్థాయిలో ఉన్న వాయుకాలుష్య ప్రభావానికి గురవుతున్నారు. 4.09 లక్షల మలేరియా మరణాలు వాతావరణపరంగా అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్న దేశాల్లో క్లీన్ ఎనర్జీపై పరిశోధన, అభివృద్ధి, ఉత్పత్తి కోసం ప్రపంచవ్యాప్త వనరుల ద్వారా కేవలం 980 కోట్ల అమెరికన్ డాలర్లు అందాయని యూనిసెఫ్ పేర్కొంది. సురక్షిత తాగునీరు, పరిశుభ్రత వంటి అంశాలపై పెట్టుబడులను పెంచడం వల్ల కనీసం 41.5 కోట్ల మంది చిన్నారులను రక్షించే అవకాశం ఉంటుందని నివేదికలో తెలిపారు. అంతేగాక 2019లో ప్రపంచవ్యాప్తంగా 22.9 కోట్ల మలేరియా కేసులు నమోదుకాగా, సుమారు 4.09 లక్షల మరణాలు సంభవించాయి. 10 దేశాల నుంచి 70% కర్బన ఉద్గారాలు కర్బన ఉద్గారాలు ఎక్కువగా ఉత్పన్నమౌతున్న దేశాల్లోని చిన్నారుల పరిస్థితులకు, వాతావరణంలోని అత్యంత తీవ్రమైన ప్రభావాలను ఎదుర్కొంటున్న దేశాల్లో పిల్లల పరిస్థితికి ఏ మాత్రం సంబంధంలేదని ఈ నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోని గ్రీన్‌హౌజ్ ఉద్గారాల్లో కేవలం 9 శాతం ఉద్గారాలు వాతావరణ ప్రభావానికి గురైన 33 అత్యంత ప్రమాదకర దేశాల్లో విడుదలవుతున్నాయి. కాగా ప్రపంచ ఉద్గారాలలో దాదాపు 70 శాతం కేవలం 10 దేశాల నుంచి విడుదలవుతున్నాయి. టాప్ 10 దేశాల్లో భారత్ మాత్రమే సీసీఆర్‌ఐ జాబితాలో అత్యంత ప్రమాదకర స్థానంలో ఉంది. టాప్ 10 దేశాల్లో 30.30%తో చైనా, 14.63%తో అమెరికా, 7.15%తో భారత్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు తక్షణమే చర్యలు తీసుకోని పక్షంలో ఎక్కువగా పిల్లలపై ప్రభావం ఉంటుందని యూనిసెఫ్ హెచ్చరించింది. 81.5 కోట్ల మంది పిల్లల్లో సీసం కాలుష్యం ప్రభావం ఇతర విషపూరితమైన ప్రమాదాలలో సీసం కాలుష్యం ఎక్కువగా నమోదవుతోంది. ఇది తరచుగా నేల, నీటిలో కనిపిస్తుంది. ప్రపం చవ్యాప్తంగా దాదాపు 81.5 కోట్ల మంది పిల్లల్లో ఒక డెసి లీటర్‌కు 5 మైక్రోగ్రాములు లేదా అంతకంటే ఎక్కువ స్థాయి సీసం రక్తంలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కారణంగా పిల్లల్లో ఐక్యూ స్థాయి తగ్గడంతో పాటు వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం ఉంటుందని యూనిసెఫ్ సీసీఆర్‌ఐ నివేదికలో పేర్కొంది. అంతేగాక సీసం కాలు ష్యం ప్రభావం కేవలం పిల్లలకు మాత్రమే పరిమితం కాకుండా, దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏడాది 9 లక్షలకు పైగా అకాల మరణాలు సంభవిస్తున్నాయని తెలి పింది. -
అస్సలు శారీరక శ్రమ చేయడం లేదా? అయితే లాన్సెట్ స్టడీ తెలుసుకోండి!
ప్రతిఒక్కరూ రోజులో కనీస శారీరక శ్రమ ఎంతసేపు చేయాలో తెలుసా.. అసలు శారీరక శ్రమ చేయకపోతే ఏమవుతుందో తెలుసా.. ఈ విషయాల గురించి పరిశోధన చేసిన అంతర్జాతీయ హెల్త్ జర్నల్ లాన్సెట్ ఏం చెబుతుందో ఓసారి చూద్దాం. మారుతున్న జీవన విధానంలో ప్రతి నలుగురిలో ఒకరు కనీస శారీరక శ్రమ చేయడంలేదని లాన్సెట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. సాక్షి, హైదరాబాద్: ప్రధానంగా యువత రోజూ కనీసంగా రెండు గంటలపాటు ఆన్‌స్క్రీన్‌పై ఉంటుండగా, అందులో పావువంతు సమయాన్ని కూడా వ్యాయామానికి కేటాయించడం లేదు. దీని వల్ల తలెత్తే దుష్ప్రభావం వారి తదుపరి జీవనంతోపాటు రాబోయే తరంపైనా పడనుందని పేర్కొంది. ఆరోగ్యంపై శారీరక శ్రమ, క్రీడల ప్రభావం అనే అంశంపై ప్రతి నాలుగేళ్లకోసారి లాన్సెట్ పరిశోధన చేస్తోంది. 2012 నుంచి ప్రతిసారి ఒలింపిక్స్ సమయంలో చేసే ఈ పరిశోధన తాలూకూ నివేదికను జర్నల్‌లో ప్రచురిస్తోంది. తాజాగా మూడో పరిశోధన సిరీస్‌ను విడుదల చేసింది. ఆ వివరాలు కింది విధంగా ఉన్నాయి. శారీరక శ్రమకు పావువంతు మంది దూరం ప్రస్తుత జనాభాలో పావువంతు (25 శాతం) మంది శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారు. వ్యాయామంపై అవగాహన పెరుగుతున్న క్రమంలోనే కోవిడ్ అడ్డంకిగా మారింది. శారీరక శ్రమ చేయనివ్యక్తి త్వరగా జీవనశైలి వ్యాధులకు గురయ్యే అవకాశాలెక్కువ. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాయామాన్ని తప్పనిసరి చేయాలని నిర్ణయిస్తూ ఫిజికల్ యాక్టివిటీకి దూరంగా ఉన్న 25 శాతాన్ని 15 శాతానికి కుదించాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. ఒకదానికొకటి అనుసంధానం నడక, సైక్లింగ్ లాంటి వాటితో వాహనాల వినియోగం తగ్గిస్తే వాతావరణ కాలుష్య మూ తగ్గుతుంది. గాడ్జెట్లు, ఇతర సాంకేతిక పరికరాల వినియోగాన్ని కాస్త తగ్గించడంతో గ్లోబల్ వార్మింగ్‌పై ప్రభావం చూపుతుంది. ఇలాంటి అంశాలన్నీ వాతావరణ పరిస్థితులను మారుస్తాయని డబ్ల్యూహెచ్‌వో చెప్పుకొచి్చంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ విస్తృతం చేయాలి. ప్రతి బడి, కళాశాలలో వ్యాయా మం ఒక సబ్జెక్టుగా నిర్దేశించి క్లాస్‌వర్క్, హోమ్‌వర్క్ ఇవ్వాలి. యాక్టివ్ ట్రావెల్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతిపాదించింది. పరిశోధనలో వెలుగు చూసిన మరికొన్ని అంశాలు ♦ శారీరక శ్రమకు దూరంగా ఉన్న 25 శాతంలో 80 శాతం మంది మధ్య ఆదాయ, దిగువ ఆదాయాలున్న దేశాలకు చెందినవాళ్లే. ♦ ప్రపంచ జనాభాలో 20 శాతం మంది వ్యాయామం సరిగ్గా చేయకపోవడంతో జీవనశైలి వ్యాధులతో బాధపడుతున్నారు. ♦ రోజుకు సగటున 20-30 నిమిషాలు, వారానికి కనీసం 150 నిమిషాలపాటు వ్యాయామం చేస్తే బీపీ, మధుమేహం, గుండె, కండరాల సంబంధిత వ్యాధుల నుంచి బయటపడొచ్చు. ♦ దివ్యాంగుల్లో 62 శాతం మంది అవసరమైన దానికన్నా తక్కువగా శారీరక శ్రమ ఉన్నట్లు పరిశోధన చెబుతోంది. ♦ ప్రపంచవ్యాప్తంగా 10-24 సంవత్సరాల మధ్య వయసువాళ్లు 24 శాతం ఉన్నారు. వీరిలో 80 శాతం ఫిజికల్ యాక్టివిటీకి దూరంగా ఉన్నారు. ♦ 2008 నుంచి గూగుల్‌లో క్రీడలు, వ్యాయామం పదాల సెర్చింగ్ పెరుగుతూ వస్తోంది. చిన్నప్పటి నుంచే అవగాహన పెంచాలి 2020 ప్రొజెక్టెడ్ సెన్సెస్ ప్రకారం చైల్డ్‌హుడ్ ఒబిసిటీ 19.3 శాతంగా ఉంది. దీంతో పిల్లల్లో బీపీ, కొలెస్ట్రాల్, గ్రోత్, ప్రీ డయాబెటిక్ సమస్యలు అత్యధికంగా వస్తాయి. వీటి నుంచి బయటపడాలంటే చిన్నప్పటి నుంచే శారీరక శ్రమకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా తల్లిదండ్రులు బాధ్యత వహించాలి. -డాక్టర్ కిషోర్ ఈగ, పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ కోవిడ్‌తో మారిన జీవనశైలి ప్రస్తుతం ఆస్పత్రులకు వచ్చే వాళ్లలో సగం మందికి ఆర్థో సమస్యలుంటున్నాయి. కోవిడ్-19 నేపథ్యంలో జీవనశైలిలో చాలా మార్పు వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోం, ఆన్లైన్ తరగతులు తదితరాలతో ఎక్కువ సమయం ఒకే చోట, ఒకే విధంగా గడుపుతున్నారు. ఎక్కువ సమయం ఒకేవిధంగా కూర్చోకుండా అటుఇటు తిరగడం లాంటి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. – డాక్టర్ సురేశ్ చీకట్ల, స్పైన్ సర్జన్, కిమ్స్ ముందస్తు వ్యూహం అవసరం వ్యాయామం చేయకుంటే తలెత్తే అనర్థాలను ముందస్తు వ్యూహాలతో అరికట్టాలి. వైద్య చికిత్సలపై ప్రభుత్వాలు భారీ బడ్జెట్ ఖర్చు చేస్తున్నాయి. అనారోగ్యం బారిన పడకుండా సరైన అవగాహన కల్పించడం, తప్పనిసరి చర్యల కింద వ్యాయామాన్ని ఎంపిక చేయడం వంటివాటిపై కార్యాచరణ రూపొందించి పక్కాగా అమలు చేయాలి. – డాక్టర్ కిరణ్ మాదల, అసోసియేట్ ప్రొఫెసర్, నిజామాబాద్ వైద్య కళాశాల -
అమెజాన్ కస్టమర్లకు షాక్! ఫిర్యాదుల మోత
సాక్షి,న్యూఢిల్లీ: ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం దాకా కొన్ని గంటల పాటు ఆన్లైన్ షాపింగ్‌లో అంతరాయం ఏర్పడింది. గ్లోబల్‌గా కస్టమర్లు షాపింగ్ చేసేటప్పుడు తాత్కాలికంగా సమస్యలను ఎదుర్కొన్నారు. లాగిన్, షాపింగ్ సమస్యలు, ప్రైమ్ వీడియో సేవలకు అంతరాయం లాంటి ఫిర్యాదులతో ట్విటర్ మారు మోగింది. ఇండియాతో పాటు యుకె, కెనడా, ఫ్రాన్స్ , సింగపూర్‌లోని పలు కస్టమర్లు అమెజాన్ డౌన్ అంటూ గగ్గోలు పెట్టారు. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది. దీనిపై వినియోగ దారుల ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అమెజాన్ స్పందించింది. ఇబ్బందులు తలెత్తినమాట నిజమేనని, ప్రస్తుతం ఆ సమస్యలను పరిష్కరించామని, ప్రస్తుతం అంతా సజావుగా నడుస్తోందని అమెజాన్ ప్రతినిధి వెల్లడించారు. అయితే, సేవల అంతరాయానికి గల కారణాలను స్పష్టం చేయలేదు. ఇంటర్నెట్లో అంతరాయాలను గుర్తించే వెబ్సైట్ డౌన్‌డెటెక్టర్.కామ్ ప్రకారం అమెజాన్‌లోని పలు రకాల సేవలు గంటల పాటు నిలిచిపోయాయి. 40 మందికి వేలకు పైగా వినియోగదారులు తమ అమెజాన్ ఖాతా స్పందించడం లేదని నివేదించారు. అమెజాన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌తో పాటు అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో కూడా సమస్య లొచ్చాయని ఆరోపించారు. ఫలితంగా అమెజాన్ ప్రైమ్ వీడియో, అలెక్సా సేవలు కూడా నిలిచిపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. -
డిజిటల్ లావాదేవీల జోరు!!
ముంబై: రాబోయే రోజుల్లో డిజిటల్ పేమెంట్స్ లావాదేవీలు గణనీయంగా పెరగనున్నాయి. 2025 నాటికి దేశీయంగా వివిధ సాధనాల ద్వారా జరిగే మొత్తం చెల్లింపు లావాదేవీల్లో వీటి వాటా 71.7 శాతానికి చేరనుంది. నగదు, చెక్కులతో పాటు ఇతరత్రా ప్రత్యామ్నాయాల వాటా 28.3 శాతానికి పరిమితం కానుంది. పేమెంట్ సేవల సంస్థ ఏసీఐ వరల్డ్‌వైడ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2020లో 2,550 కోట్ల రియల్ టైమ్ పేమెంట్స్ లావాదేవీలతో చైనాను భారత్ అధిగమించింది. చైనాలో ఈ తరహా లావాదేవీల సంఖ్య 1,570 కోట్లకు పరిమితమైంది. ఇక గతేడాది మొత్తం చెల్లింపుల్లో ఇన్స్టంట్ పేమెంట్స్ వాటా 15.6 శాతంగాను, ఎలక్ట్రానిక్ చెల్లింపుల వాటా 22.9 శాతంగాను ఉండగా.. పేపర్ ఆధారిత చెల్లింపుల విధానాల వాటా 61.4 శాతంగా నమోదైంది. 2025 నాటికి ఇది పూర్తిగా మారిపోనుందని నివేదిక తెలిపింది. అప్పటికి ఇన్స్టంట్ పేమెంట్స్ వాటా 37.1 శాతం, ఎలక్ట్రానిక్ చెల్లింపుల వాటా 34.6 శాతానికి చేరుతుందని, నగదు ఇతరత్రా పేపర్ ఆధారిత చెల్లింపు విధానాల వాటా 28.3 శాతానికి తగ్గుతుందని వివరించింది. అన్ని వర్గాల మధ్య సమన్వయం.. అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తీసుకురావాలన్న లక్ష్యం దిశగా భారత్ వేగంగా ముందుకు సాగేందుకు .. ప్రభుత్వం, నియంత్రణ సంస్థ, బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు వంటి అన్ని వర్గాల మధ్య సమన్వయం తోడ్పడుతోందని ఏసీఐ వరల్డ్‌వైడ్ వైస్–ప్రెసిడెంట్ కౌశిక్ రాయ్ తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వినియోగదారులు, వ్యాపార విధానాలు మారే కొద్దీ పేమెంట్స్ వ్యవస్థలోని బ్యాంకులు, వ్యాపారులు, మధ్యవర్తిత్వ సంస్థలు కూడా తదనుగుణమైన మార్పులు, చేర్పులను వేగంగా చేపడుతున్నాయని పేర్కొన్నారు. నివేదిక ప్రకారం 2020లో రియల్ టైమ్ లావాదేవీల నిర్వహణలో భారత్ అగ్రస్థానంలో ఉండగా, చైనా, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, బ్రిటన్ టాప్–5 దేశాల జాబితాలో నిల్చాయి. గతేడాది మొబైల్ వాలెట్ల వినియోగం చారిత్రక గరిష్ట స్థాయి 46 శాతానికి ఎగిసింది. 2018లో ఇది 19 శాతంగాను, 2019లో 40.6 శాతంగాను నమోదైంది. ఎక్కువగా నగదు లావాదేవీలకు ప్రాధాన్యమిచ్చే బ్రెజిల్, మెక్సికో, మలేసియా తదితర దేశాల ప్రజలు వేగంగా మొబైల్ వాలెట్ల వైపు మళ్లినట్లు నివేదిక తెలిపింది. -
యాక్సెంచర్‌కు షాకిచ్చిన టీసీఎస్
సాక్షి, ముంబై: భారతీయ సాఫ్ట్వేర్ సేవలసంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మరోసారి అరుదైన ఘనతను సాదించింది. సోమవారం (జనవరి 25) న మరో ఐటీసంస్థ యాక్సెంచర్‌ను అధిగమించి ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన ఐటీ కంపెనీగా అవతరించింది. టీసీఎస్ మార్కెట్ విలువ సోమవారం ఉదయం169.9 బిలియన్ డాలర్లను దాటింది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో యాక్సెంచర్ మార్కెట్ క్యాప్ 168 బిలియన్ డాలర్లు. కాగా మార్కెట్ క్యాప్‌కు సంబంధించి టీసీఎస్ ఇంతకుముందు రెండుసార్లు యాక్సెంచర్ కంపెనీని అధిగమించింది. 2018 లో ఒకసారి, గత ఏడాది అక్టోబర్‌లో మరోసారి టీసీఎస్ యాక్సెంచర్‌ను దాటేసింది. అయితే 2020 అక్టోబరులో తొలిసారి ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ సేవల సంస్థ టైటిల్‌ను దక్కించుకుంది. 2018 లో, యాక్సెంచర్ కంటే టీసీఎస్ ముందంజలో ఉన్నప్పటికీ, అప్పటికి ఐబీఎం 300 శాతం ఎక్కువ ఆదాయంతో మార్కెట్లో అగ్రస్థానంలో ఉంది. కాగా ఇటీవల ప్రకటించిన 2020 , డిసెంబరు త్రైమాసిక ఫలితాల్లో ఊహించిన దానికంటే మెరుగైన ఆదాయాలను ప్రకటించింది. దీంతో 3,224 రూపాయల వద్ద జనవరి 11 న, కంపెనీ షేర్ ధర 52 వారాల గరిష్ట స్థాయిని సంగతి తెలిసిందే. -
కరోనాను దాదాపు జయించిన 38 దేశాలు
-
లాక్డౌన్: రికార్డు స్థాయిలో జనాభా పెరుగుదల
పారిస్: మహమ్మారి కరోనా కారణంగా ప్రపంచ దేశాలు లాక్డౌన్లోకి వెళ్లిపోయాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్డౌన్ ఒక్కటే శరణ్యమని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ లాక్డౌన్ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా జననాల రేటు గణనీయంగా పెరగనుందని ఐక్యరాజ్య సమితి(ఐరాస) అనుబంధ సంస్థ యునిసెఫ్ తెలిపింది. ముఖ్యంగా భారత్‌లో జననాల రేటు రికార్డు స్థాయిలో ఉండనున్నట్లు వివరించింది. భారత్‌లో మార్చి చివరి వారం నుంచి లాక్డౌన్ అమలవుతోందని, ఈ తొమ్మిది నెలల కాలంలో సుమారు రెండు కోట్ల మంది పిల్లలు పుడతారని యునిసెఫ్ అంచనా వేసింది. భారత్ తర్వాత చైనా (1.35 కోట్లు), నైజీరియా(64 లక్షలు), పాకిస్తాన్ (50 లక్షలు) ఇండోనేషియా(40 లక్షలు) దేశాలలో అత్యధికంగా జననాల రేటు నమోదుకానుందని తెలిపింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 11.6 కోట్లుగా ఉండనుందని యునిసెఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. ‘ఇక కరోనా కష్టకాలంలో గర్భిణిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. ఈ సమయంలో వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పుట్టబోయే పిల్లలను ప్రమాదంలో పడేసినట్లే’ అని యునిసెఫ్ స్పష్టం చేసింది. ఇక గతేడాది ప్రపంచ వ్యాప్తంగా 14.1 కోట్ల మంది పిల్లలు పుట్టగా, భారత్‌లో అత్యధికంగా 2.72 కోట్ల మంది పిల్లలు పుట్టారని గుర్తుచేసింది. ఇక 2015 నుంచి భారత్‌లో జననాల రేటు తగ్గుతూ వస్తోందని వివరించింది. ఈ ఏడాది మార్చి 11 నుంచి డిసెంబర్ 16 వరకు జరిపిన అధ్యయనం ప్రకారమే జననాల రేటుపై నివేదిక రూపొందించామని యునిసెఫ్ ప్రకటించింది. చదవండి: లిక్కర్‌కి వేలమంది, శవయాత్రలో 20 మందికేనా? కరోనా: అందుకే మనదేశంలో మరణాలు తక్కువ -
గబ్బిలాలపై అనుమానపు చూపులు
-
2.5 కోట్ల ఉద్యోగాలకు కోత
జెనీవా: కరోనా వైరస్‌ను తక్షణమే నియంత్రించలేకపోతే ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల ఉద్యోగాలు ఊడిపోతాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఒ) హెచ్చరించింది. 1930 నాటి ఆర్థిక మాంద్యం పరిస్థితులు మరోసారి తలెత్తే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఐఎల్ఒ ఆందోళన వ్యక్తం చేసింది. దీని ప్రభావంతో ప్రభుత్వాలు, బ్యాంకులు సంస్కరణలు చేపట్టడానికి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటాయని ఆ సంస్థ ఒక నివేదికలో వెల్లడించింది. ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న కరోనా వైరస్ విస్తరించకుండా వివిధ దేశాలు లాక్డౌన్ పాటిస్తున్నాయి. సగం మందికి పైగా ఇల్లు కదిలి బయటకు రావడం లేదు. దీంతో ఉత్పాదకత పడిపోయింది. ఈ పరిణామంతో వివిధ దేశాలు సంస్థలను నడపలేక ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. అమెరికా, యూరప్‌లలో నిరుద్యోగం రేటు రెండు అంకెలు దాటేసిందంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. అంతర్జాతీయ కార్మిక సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం ► అమెరికా గత దశాబ్దకాలంలో కనీవినీ ఎరుగని నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటోంది. కరోనా విజృంభణ తర్వాత 7 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆర్థిక నిపుణులు అంచనా వేసిన దాని కంటే ఇది ఏడు రెట్లు ఎక్కువ. ► యూరప్‌లో గత రెండు వారాల్లోనే 10 లక్షల మంది తమకు బతుకు గడవడమే కష్టంగా ఉందని, తమ సంక్షేమం కూడా చూడాలంటూ బ్రిటన్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. బ్రిటన్‌లో ఉన్న పెద్ద, చిన్న కంపెనీలన్నీ గత వారం రోజుల్లోనే 27% సిబ్బందిని తగ్గించారు. ► స్పెయిన్‌లో ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య రికార్డు స్థాయిలో ఉంది. ప్రపంచంలో అత్యధికంగా 14% నిరుద్యోగ రేటు నమోదైంది. ► రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆస్ట్రియాలో తొలిసారిగా నిరుద్యోగం 12 శాతానికి ఎగబాకింది. ► జర్మనీలో గంట పనికి వేతనం ఇచ్చే విధానం అమల్లో ఉంది. దీంతో కంపెనీలు ఉద్యోగుల పని గంటల్ని రికార్డు స్థాయిలో తగ్గించాయి. దేశంలో ఇంచుమించుగా 4,70,000 కంపెనీలు జర్మనీ ప్రభుత్వానికి వేతన మద్దతు కోరుతూ దరఖాస్తు చేసుకున్నాయి. ► ఫ్రాన్స్‌లో కూడా వివిధ వ్యాపార కంపెనీలు జీతం చెల్లించలేక ప్రభుత్వ సాయాన్ని కోరుతున్నాయి. ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న కార్మికుల్లో 20% మందికి జీతాలు చెల్లించే పరిస్థితి లేదని ప్రభుత్వమే సాయపడాలని కోరాయి ► థాయ్‌లాండ్‌లో 2.3 కోట్ల మంది (దాదాపుగా మూడో వంతు జనాభా) ప్రభుత్వం ఇచ్చే నగదు సాయానికి దరఖాస్తులు చేసుకున్నారు. ► చైనాలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నప్పటికీ రెండు నెలలు కరోనా సృష్టించిన కల్లోలంతో దాదాపుగా 80 లక్షల మంది ఉపాధి కోల్పోయారని అంచనా. -
ధర అదిరే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా ఇళ్ల ధరల వృద్ధిలో హైదరాబాద్ 14వ స్థానంలో నిలిచింది. మన దేశం నుంచి టాప్–20లో చోటు దక్కించుకున్న ఏకైక నగరం భాగ్యనగరమే. గతేడాది జూలై –సెప్టెంబర్ (క్యూ3) మధ్య కాలంలో హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 9% వృద్ధి చెందాయని గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్‌ఫ్రాంక్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 150 నగరాల్లో సర్వే నిర్వహించగా..హంగేరీలోని బుడాపెస్ట్ తొలి స్థానంలో నిలిచింది. ఇక్కడ ధరల వృద్ధి 24%గా ఉంది. ఆ తర్వాత చైనాలోని జియాన్, యూహాన్ నగరాలున్నాయి. ఈ ప్రాంతాల్లో వరుసగా 15.9%, 14.9% ధరల వృద్ధి ఉంది. ఇండియాలో ఏకైక నగరం హైదరాబాదే టాప్–20లో చోటు దక్కించుకున్న ఏకైక నగరం మనదే. జూలై – సెప్టెంబర్ మధ్య కాలంలో హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్ నగరాల్లో ధరలు వృద్ధిలో ఉంటే..మిగిలిన అన్ని మెట్రో నగరాల్లో గృహాల ధరలు క్షీణించాయి. ధరల వృద్ధిలో హైదరాబాద్ తర్వాత 73వ స్థానంలో ఢిల్లీ నిలిచింది. ఇక్కడ 3.2 % ధరల వృద్ధి ఉంది. 2% రేట్ల అప్రిసియేషన్‌తో బెంగళూరు 94వ స్థానంలో, 1.1% వృద్ధితో అహ్మదాబాద్ 108వ స్థానంలో నిలిచింది. 2% క్షీణతతో కోల్‌కతా 130వ స్థానంలో, 3% క్షీణతతో 135వ స్థానంలో ముంబై, 3% క్షీణతతో 136వ స్థానంలో చెన్నై, 3.5% క్షీణతతో 138వ స్థానంలో పుణే నగరాలు నిలిచాయి. హైదరాబాద్‌లోనే వృద్ధి ఎందుకంటే? ప్రపంచవ్యాప్తంగా 150 నగరాల్లో సగటున 3.2% ధరలు పెరిగాయి. 2015 రెండో త్రైమాసికం నుంచి ఇదే అత్యంత బలహీనం. ఇండియాలోని నగరాల్లో గృహాల ధరల వృద్ధి అనేది రిటైల్ ద్రవ్యోల్బణం కన్నా దిగువలోనే ఉంది. ఈ అంతరం 2016 హెచ్1 నుంచి పెరుగుతూనే ఉంది. ఒక్క హైదరాబాద్‌లో మాత్రం రిటైల్ ద్రవ్యోల్బణం స్థాయిని మించి గృహాల ధరల వృద్ధి ఉందని నైట్‌ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశీర్ బైజాల్ తెలిపారు. పైగా ఇక్కడ కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభాలు తగ్గిపోవటంతో కొనుగోలుదారులు గృహ ప్రవేశానికి సిద్ధం గా ఉన్న ఇళ్లను, ఇన్వెంటరీ గృహాలను కొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపించారు. ఇదే డెవలపర్లకు లాభసాటిగా మారిందని పేర్కొన్నారు. -
రూ. 200 కోట్ల క్లబ్లో ‘దర్బార్’
సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన రజనీకాంత్ దర్బార్ భారీ కలెక్షన్లను కొల్లగొడుతోంది. దర్బార్ కలెక్షన్ల సునామీతో రూ. 200 కోట్ల క్లబ్లో చేరి మరో రికార్డు సొంతం చేసుకుంది. విడులైన పదకొండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దర్బార్ రూ. 200 కోట్లు రాబట్టిందని ప్రముఖ ట్రేడ్ విశ్లేషకుడు త్రినాథ్ వెల్లడించారు. దీంతోపాటు ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల వసూళ్లు రాబట్టిన రజనీకాంత్ ఐదో సినిమా ‘దర్బార్’ కావడం విశేషం. గతంలో రాజనీకాంత్ నటించిన ఎంతిరాన్, కబాలి, రోబో 2.ఓ, పేటా చిత్రాలు కూడా ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల కలెక్షన్లను సాధించాయి. కాగా ఈ భారీ కలెక్షన్లలో అధికభాగం తమిళనాడు నుంచి సుమారు రూ. 80 కోట్లు వచ్చాయని త్రినాథ్ పేర్కొన్నారు. అదేవిధంగా ‘దర్బార్’ మూవీ కేరళలో రూ. 8 కోట్లు, కర్ణాటకలో రూ.19 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. చదవండి: దర్బార్: ట్విటర్లో ఏమంటున్నారంటే? రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు రూ. 20 కోట్లు, హిందిలో రూ.8 కోట్లు రాబట్టిందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా విదేశాల్లో సుమారు రూ. 70 కోట్లు వసూలు చేసిందని తెలిపారు. కోలీవుడ్ అగ్ర దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన ‘దర్బార్’ సంక్రాంతి కానుకగా ఈ నెల 9న విడుదలైన సంగతి తెలిసిందే. అభిమానులకు కావాల్సిన మాస్‌మసాలా అంశాలు, పోరాట సన్నివేశాలు రజనీని సూపర్‌స్టైలిష్‌గా చూపించిన ‘దర్బార్’ సినిమా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతోంది. ముంబై పోలీసు కమిషనర్ ఆదిత్య అరుణాచలంగా నటించిన రజనీకాంత్ నటన, స్టైల్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుండటంతో ఈ సినిమా భారీగా వసూళ్లు సాధిస్తోంది. చదవండి: దర్బార్ చిత్రంలో నయనతార పాత్ర దారుణం -
10 వేల ఉద్యోగాలకు ఎసరు
టోక్యో: జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ నిస్సాన్ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించే యోచనలో ఉంది. ఆర్థిక సంక్షోభం, ఖర్చులను తగ్గించుకునే క్రమంలో గ్లోబల్‌గా 4వేల 800 మంది ఉద్యోగులను ఇంటికి పంపించాలని నిర్ణయించిన కంపెనీ తాజాగా ఈ సంఖ్యను రెట్టింపు చేసిందట. కంపెనీ వర్గాలను ఉటంకిస్తూ జపాన్ మీడియా బుధవారం అందించిన సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 10వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించాలని భావిస్తోంది. అమెరికా, ఐరోపాలో అమ్మకాలు పడిపోవడంతో ఈ సంస్థ దెబ్బతినడంతోపాటు, ఆర్థిక కుంభకోణం ఆరోపణలపై మాజీ బాస్ కార్లోస్ ఘోస్న్ అరెస్ట్ తరువాత నిస్సాన్ మరింత కుదేలైంది. అలాగే 43 శాతం వాటా ఉన్న ఫ్రెంచ్ భాగస్వామి రెనాల్ట్‌తో వివాదం ముదిరి సంక్షోభంలో చిక్కుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీ ఉద్యోగుల్లో లక్షా 39వేల ఉద్యోగాల్లో 4,800 ఉద్యోగాల కోత పెట్టనున్నామని కంపెనీ మేలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజా కథనాలపై వ్యాఖ్యానించేందుకు నిస్సాన్ ప్రతినిధి నిరాకరించారు. కాగా నిస్సాన్ లాభాలు గత ఏడాది దశాబ్దం కనిష్టానికి పడిపోయింది. అలాగే భవిషత్తు మరింత కష్టంగా ఉండనుందని కూడా వ్యాఖ్యానించింది. 2019 మార్చి లో 319 బిలియన్ యెన్ల (2.9 బిలియన్ డాలర్లు) నికర లాభాలను నివేదించింది. మునుపటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 57 శాతం క్షీణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి లాభాలు 170 బిలియన్లకు పడిపోవచ్చని అంచనా. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మొదటి త్రైమాసిక ఫలితాలను గురువారం ప్రకటించనుంది. -
ఆ బ్యాంకులో 10వేల ఉద్యోగాల కోత
సాక్షి, న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన అతిపెద్ద బ్యాంకు డాయిష్ బ్యాంక్ భారీగా ఉద్యోగులపై వేటువేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సుమారు పదివేల ఉద్యోగాల కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంకు సీఈవోగా క్రిస్టియన్ సెవింగ్ నియమితులైన ఒక నెలరోజుల్లోనే ఈ కీలక నిర్ణయం వెలువడింది. అతి కఠినమైన పరిస్థితులు, నిర్ణయాలు ముందున్నాయని ఇప్పటికే బ్యాంకు వాటాదార్ల సమావేశంలో హెచ్చరించిన సీఈవో, కాస్ట్ కటింగ్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. తమ ఉద్యోగుల్లో దాదాపు 10శాతం తగ్గించుకోనున్నట్టు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా నష్టాలు వస్తున్న ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కార్యకలాపాలను 10 శాతం అంటే 117 బిలియన్ డాలర్లు (సుమారు రూ.8 లక్షల కోట్లు) మేర తగ్గిస్తున్నట్లు యురోపియన్ ఫైనాన్షియల్ సర్వీస్ మేజర్ డాయిస్ తెలిపింది. పునర్నిర్మాణ పథకంలో వ్యయాల్లో కోత పెట్టడం తద్వారా బ్యాంకును లాభాల్లోకి తెచ్చేందుకు సాధ్యమైన యత్నాలన్నీ చేస్తామని, కొత్తగా నియమితులైన చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రిస్టియన్ సెవింగ్ హామీ ఇచ్చిన రోజే, ఈ ప్రకటన వెలువడింది. ప్రపంచవ్యాప్తంగా పూర్తిస్థాయి ఉద్యోగులు 97,000 మంది ఉన్నారని, 10శాతం కోతతో ఈ సంఖ్యను సుమారు 90,000కు పరిమితం చేస్తామని బ్యాంక్ తెలిపింది. ఇప్పటికే ఈ తొలగింపు ప్రారంభమైందని వెల్లడించింది. ఈక్విటీలు, విక్రయాల విభాగాల్లోనే నాలుగోవంతు తొలగింపులుంటాయని, పనితీరు బాగాలేని వారిపై వేటు పడుతుందని స్పష్టం చేసింది. ఐరోపాలో రిటైల్ బ్యాంకింగ్‌పై దృష్టి సారిస్తామని తెలిపింది. అంతర్జాతీయంగా కార్యకలాపాలుంటాయని, కార్పొరేట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్‌కు కట్టుబడి ఉన్నామనీ వివరించింది. ఈ వార్తలతో ప్రాంక్ఫర్ట్ మార్కెట్లో డాయిష్ బ్యాంకు షేరు 6శాతం కుప్పకూలింది. -
జనరల్ మోటార్స్ వాహనాల భారీ రీకాల్
వాషింగ్టన్: అమెరికాకు చెందిన అతిపెద్ద ఆటో మేకర్ జనరల్ మోటార్స్ సంస్థ భారీ ఎత్తున వాహనాలను రీకాల్ చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8లక్షల పికప్ ట్రక్కులను వెనక్కి తీసుకుంటోంది. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ యంత్రంగా శుక్రవారం ఈ వివరాలను వెల్లడించింది. షెవర్లే సిల్వరాడో 1500, జీఎంసీ సియర్రా1500 పికప్ టక్కులను రీకాల్ చేస్తోంది. 2014 నాటి మోడల్ ట్రక్కులు షెవర్లే సిల్వరాడో 1500, జీఎంసీ సియర్రా1500 లలో తాత్కాలికంగా విద్యుత్ శక్తి స్టీరింగ్‌లో లోపాలు, ముఖ్యంగా తక్కువ వేగంతో ప్రయాణించే సమయంలో తాత్కాలిక సమస్యలు ఎదురవుతున్నాయని జనరల్ మోటార్స్ ప్రకటిచింది. అందుకే వీటిని రీకాల్ చేస్తున్నట్టు చెప్పింది. అమెరికాలో 6 లక్షల 90వేలు వాహనాలను, కెనడాలో 80వేలు వాహనాలతోపాటు ఇతర మార్కెట్లలో 25వేల వాహనాలను రీకాల్ చేస్తోంది. జీఎం డీలర్లు కొత్త సాఫ్ట్‌వేర్‌తో ఈ లోపాన్ని పరిష్కరించనున్నారని ప్రకటించింది. అయితే ప్రమాదాలు, గాయాలకు సంబంధింత తమ దగ్గర ఎలాంటి సమాచారం లేదని జీఎం ప్రతినిధి టామ్ వికిన్సన్ పేర్కొన్నారు. అయితే 2015 సం.రం మోడల్ వాహనాల్లో దీనికి సంబంధించి కొన్ని మార్పులను జోడించింది. -
ప్రపంచ వడ్డీరేట్లపై రాజన్ హెచ్చరిక
ముంబై : తక్కువ వడ్డీరేట్లపై మొగ్గుచూపుతున్న ప్రపంచ దేశాలను ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ హెచ్చరించారు. తక్కువ వడ్డీరేట్లు ఆర్థిక సంస్కరణలకు ప్రత్యామ్నాయం కాదని చెప్పారు. తక్కువ వడ్డీరేట్ల విధానాలు పాటిస్తున్న అతిపెద్ద ఆర్థిక దేశాలు యూఎస్, యూరప్, జపాన్‌లు గ్లోబల్ ఎకానమీలో ఇంకా నిదానంగానే ఉన్నాయని న్యూయార్క్ టైమ్స్‌కు తెలిపారు. ఎక్కడైతే మానిటరీ పాలసీ తేలికగా ఉంటుందో అక్కడ తక్కువ వడ్డీరేట్లు అవలంభించాలో లేదో నచ్చినట్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు. తక్కువ వృద్ది రేటు చూడాల్సి వస్తుందనే ఆందోళనతో వడ్డీరేట్లు పెంచడానికి చాలా సెంట్రల్ బ్యాంకులు భయపడుతున్నాయని వ్యాఖ్యానించారు. కానీ ఆర్థికాభివృద్దిని పుంజుకునేలా చేయడానికి పాలసీలో ఇతర మార్గాలపై దృష్టిసారించాల్సినవసరం ఎంతైనా ఉందన్నారు. ఆర్బీఐ గవర్నర్‌గా రాజన్ సెప్టెంబర్ 4న పదవీ విరమణ చేశారు. ఆయన తదుపరి గవర్నర్ బాధ్యతలను ఉర్జిత్ పటేల్ సోమవారం చేపట్టారు. రాజన్ ఆర్బీఐ పదవిలో కొనసాగినంత కాలం అధిక వడ్డీరేట్లను అవలంభించారనే విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ ఆ విధానాలే దేశంలో అధిక ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకురావడానికి, ఆర్థికాభివృద్ధి పరుగులు పెట్టడానికి దోహదం చేశాయని ఆర్థిక విశ్లేషకులు కొనియాడిన సంగతి తెలిసిందే. -
జోయాలుక్కాస్ను భారీగా విస్తరిస్తున్నాం
సంస్థ చైర్మన్ జోయ్ ఆలుక్కాస్ వెల్లడి సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ జ్యువెలరీ వ్యాపారంలో జోయాలుక్కాస్ విజయవంతం ముందుకు వెళ్తుందని జోయాలుక్కాస్ చైర్మన్ అండ్ ఎండీ జోయ్ ఆలుక్కాస్ తెలిపారు. హైదరాబాద్ నగరంలోని జోయాలుక్కాస్ షోరూమ్‌లు వ్యాపారంలో అంచనాలకు మించి పోయాయని తెలిపారు. అందుకే మరో పెద్ద జోయాలుక్కాస్ షోరూమ్‌ను తాజాగా పంజాగుట్టలో ప్రారంభించామన్నారు. శనివారం జోయాలుక్కాస్ షోరూమ్ ప్రారంభం అనంతరం ఆయన సాక్షికి ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు... 121వ షోరూమ్ ఇది... ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే జోయాలుక్కాస్ షోరూమ్‌లు 120 వరకు ఉన్నాయి. పంజాగుట్టలో ప్రారంభమైన దానితో కలిపితే 121వది. మా సంస్థల్లో ఎక్కడ షోరూమ్ ప్రారంభించినా అక్కడి స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఏపీ, తెలంగాణలో కలిసి 18 జ్యూయలరీ షోరూమ్‌లు ఉన్నాయి. ప్రతి ఏడాది 12 నుంచి 18 షోరూమ్‌లు ఓపెన్ చేస్తున్నాం. 11 దేశాల్లో ఉన్న మా సంస్థల్లో 99% ఉద్యోగాలు స్థానికులకే ఇస్తున్నాం. 2015-16కు 14 షోరూమ్‌లు, 2016-17లో 8 నుంచి 9 షోరూమ్‌లు ప్రారంభించనున్నాం. ఇప్పటికి దేశవ్యాప్తంగా 65 షోరూమ్స్ ఉన్నాయి. జిల్లాలకూ... 2020 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 200 జోయాలుక్కాస్ షోరూమ్‌లు ప్రారంభించటం ధ్యేయం. అంతేకాదు జిల్లాలకు కూడా విస్తరించాలని ఆలోచిస్తున్నాం. ఇప్పటి లాగా ప్రజలు ఆదరించి, అభిమానిస్తే విస్తరణ సులభతరం అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా మా టర్న్వర్ రెండు బిలియన్ డాలర్లు. అందులో ఇక్కడ రూ. 6 వేల కోట్లు టర్నోవర్ ఉంది. పంజాగుట్ట లాంటి షోరూమ్‌ల్లో రూ. 150 కోట్ల విలువైన స్టాక్ ఉంటోంది. ఇక్కడ జ్యువెలరీ వ్యాపార వృద్ధి 5 నుంచి 6 శాతం ఉంది. అది కాస్తా 12 నుంచి 15 శాతం పెరగాల్సివుంది. ఐపీవో ప్రణాళిక... విస్తరణ కోసం మార్కెట్ ద్వారా నిధులు సమీకరించేందుకు తొలి పబ్లిక్ ఇష్యూ జారీచేయాలన్న ప్రణాళిక వుంది. జ్యువెలరీతో సహా పలు ఇతర వ్యాపారాలు కూడా మేము చేస్తున్నాం. జోయాలుక్కాస్ వ్యాపారాలు భారత్‌తో పాటు యూఏఈ, సౌదీ అరేబియా, బెహ్రెయిన్, ఒమన్, కువైట్, కతార్, సింగపూర్, మలేషియా, లండన్లలో నడుస్తున్నాయి. మా వ్యాపారాల్లో జ్యువెలరీ, ద్రవ్య మార్పిడి, ఫ్యాషన్, టెక్స్ టైల్స్, లగ్జరీ విమానాలు, మాల్స్, రియాల్టీలు ఉన్నాయి. జోయాలుక్కాస్ ప్రపంచ వ్యాప్తంగా 7,000 మంది నిపుణులకు ఉద్యోగాలు కల్పించింది. -
టూరిజానికి పారిస్ కన్నా అది మిన్న!
వాషింగ్టన్: ప్రపంచంలో అత్యుత్తమ టూరిజం స్పాట్ ఏదన్న అంశంపై యూఎస్ ట్రావెల్ సైట్ నిర్వహించిన సర్వేలో ఆస్ట్రేలియాలోని క్విన్స్‌లాండ్ తీరంలో ఉన్న గ్రేట్ బారియర్ రీఫ్ ప్రధమ స్థానంలో నిలిచింది. యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్స్ 2016-17 సంవత్సరానికి గాను వెల్లడించిన ఈ ఫలితాల్లో పారిస్, బోర బొరాలను వెనక్కినెట్టి మరీ గ్రేట్ బారియర్ రీఫ్ ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. వరల్డ్ టూరిస్ట్‌లు ఒక్కసారైన చూడాల్సిన ప్రదేశం ఈ కొరల్ రీఫ్స్ అని న్యూస్ కార్ప్ మీడియా సంస్థ వెల్లడించింది. దీనిపై క్వీన్స్లాండ్ టూరిజం అండ్ ఈవెంట్స్ చీఫ్ లియానె మాట్లాడుతూ.. గ్రేట్ బారియర్ రీఫ్‌కు ఫస్ట్ ప్లేస్ దక్కడం ప్రపంచ టూరిజంలో దాని ప్రాముఖ్యతను సూచిస్తుందన్నారు. క్వీన్స్లాండ్ పర్యాటకులకు గ్రేట్ బారియర్ రీఫ్ ఒక 'లివింగ్ ట్రెజర్' అని ఆమె తెలిపారు. ఆస్ట్రేలియన్ ఎకానమీకి ఈ రీఫ్ ద్వారా ఏటా 5.2 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని ఆమె తెలిపారు. ప్రతీఏటా దీనిని 1.9 మిలియన్ల పర్యాటకులు సందర్శిస్తున్నారని లియానె వెల్లడించారు. -
'గ్లోబల్ టాప్ ఎంప్లాయర్' గా టీసీఎస్...
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రపంచ వ్యాప్త గుర్తింపును తెచ్చుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 1,072 సంస్థల్లో టాప్ ఎంప్లాయర్స్ ఇనిస్టిట్యూట్ గా పేరొందిన టీసీఎస్ 'గ్లోబల్ టాప్ ఎంప్లాయర్' అవార్డును అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిది ఇతర సంస్థలతో సహా శ్రామిక ప్రణాళిక, ఆన్ బోర్డింగ్, అభ్యాసం మరియు అభివృద్ధి, పనితీరు నిర్వహణ, నాయకత్వ అభివృద్ధి వంటి విషయాల్లో అగ్రభాగాన నిలిచింది. ప్రపంచంలోని ఉత్తమ యాజమాన్యాలకు ప్రదానం చేసే ఈ గౌరవ అవార్డును ఇప్పుడు టీసీఎస్ సాధించింది. ఉద్యోగులు, వినియోగదారుల విషయంలో అత్యున్నత ప్రమాణాలను పాటించే తమ యాజమాన్యం ఈ పురస్కారాన్ని అందుకుంటోందని సంస్థ తెలిపింది. ఈ జాబితాలో సీజేఎస్సీ టెక్నిప్, డీహెచ్ ఎల్, డైమెన్షన్ డేటా, సెయింట్ గోబెయిన్, జేటీ ఇంటర్నేషనల్, మొబినిల్, మోబిస్టార్, ఆరెంజ్, వాలియో సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలన్నీ నిరంతరం ముందు చూపుతో ఆలోచిస్తూ తమ ఉద్యోగుల పరిస్థితులు, అభివృద్ధికి మార్గంగా నిలుస్తున్నాయని టీసీఎస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ గ్లోబల్ హెడ్ అజయ్ ముఖర్జీ తెలిపారు. ఇది తమ సంస్థకు మంచి విజయమని, దీని స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగులు, వినియోగదారుల సేవల్లో మరింత అభివృద్ధికి మార్గమౌతుందని సంస్థ చెప్తోంది. -
ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సందడి
వెలుగులీనుతున్న చర్చిలు * మాల్స్, చర్చిల్లో ఆకట్టుకుంటున్న క్రిస్మస్ ట్రీలు * అసహనంపై గోవా బిషప్ ఆందోళన న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వాతావరణం నెలకొంది. క్రిస్మస్ ట్రీలు, స్టార్లతో ఇళ్లు, చర్చిలు కళకళలాడుతున్నాయి. ప్రపంచం లోని వివిధ నగరాలతో పాటు దేశ రాజధాని ఢిల్లీ,దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు క్రిస్మస్ శోభతో కాంతులీనుతున్నాయి. ఎక్కడ చూసినా శాంటాక్లాజ్ డ్రస్సుల్లో చిన్నారుల సందడే. ఇక పెద్దలు స్వీట్లు, కేక్‌లు పంచుకుంటూ ఒకరికొకరు అభినందనలు తెలుపుకుంటున్నారు. ప్రముఖుల శుభాకాంక్షలు క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు గవర్నర్ రోశయ్య, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత, తదితరులు క్రిస్టియన్లకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అసహనంపై గోవా బిషప్ ఆందోళన పనాజీ: దేశంలో పెరుగుతున్న అసహనం తీవ్రత ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతోందని ఆర్చ్‌బిషప్ ఆఫ్ గోవా ఫిలిప్ నెరి ఫెర్రావో ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ వర్గాలు, సంస్కృతుల ప్రజల మధ్య అసహనం పెరుగుతోందన్నారు. అవగాహన, సయోధ్య, శాంతి మొదలైన వాటి ద్వారా అసహనానికి అడ్డుకట్ట వేయవచ్చని ఆయన తన క్రిస్మస్ సందేశంలో స్పష్టం చేశారు. -
50 కోట్లు దాటిన 'శ్రీమంతుడు'
చెన్నై: సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ శ్రీమంతుడు రూ.50 కోట్లు దాటింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం వారం ప్రారంభంలోనే రూ.50 కోట్లు వసూళ్లను రాబట్టడంతో తెలుగు చిత్ర సీమకు మరింత ఉత్సాహాన్నిచ్చినట్లయింది. కాగా, ఈ చిత్రం విడుదలైన రోజే రూ.31కోట్లు సాధించిందని చిత్ర వర్గాలు తెలిపాయి. మరోపక్క, అమెరికాలో కూడా విడుదలైన ఈ చిత్రం సోమవారం రెండు మిలియన్ డాలర్లను దాటనుందట. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతిహాసన్, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ వంటి ప్రముఖ నటులు ఉన్నారు. కోటీశ్వరుడైన ఓ యువకుడు ఊరిని దత్తత తీసుకునే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. -
ప్రపంచ ట్రెండ్‌గా 'సెల్ఫీ విత్ డాటర్'
న్యూఢిల్లీ: ఇప్పుడు ఎక్కడ చూసినా తమ చిన్నారి కూతుర్లను, పెద్దవారైతే వారిని తమ గుండెలకు హత్తుకుని సెల్ఫీలు తీసుకునే పనిలో తండ్రులు పడ్డారు. ఒకటి కాకుంటే మరొకటి అనుకుంటూ వేర్వేరు కోణాల్లో తమ సెల్ ఫోన్లలో బందిస్తున్నారు. ఇదిప్పుడు కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పాకుతుండటంతో ఒక కొత్త ట్రెండ్ సృష్టించిన దేశాల జాబితాల్లో తాజాగా భారత్ కూడా చేరినట్లయింది. లింగ వివక్షను దూరం చేయాలని, కూతుర్లను కూడా కొడుకులతో సమానంగా చూడాలని బ్రూణ హత్యలు తగ్గించాలనే ఉద్దేశంతో పంజాబ్ లోని సునిల్ జగ్లాన్ అనే ఓ గ్రామ పంచాయతీ పెద్దాయన కూతురితో సెల్లో సెల్ఫీ తీసే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. అలా ఫొటోలు తీసి పంపించినవారిలో కొన్నింటిని ఎంపిక చేసి బహుమతుల ప్రధానం కూడా పెట్టాడు. దీంతో అది మెల్లమెల్లగా పాకి అందరు తండ్రులు తమకూతుర్లతో సెల్ఫీలు దిగుతున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం మాట్లాడిన రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్'లో పంజాబ్ గ్రామపెద్ద చేసిన పనిని కొనియాడిన మరుక్షణం నుంచి అది కాస్త మరింత ఊపందుకుంది. మన్ కీ బాత్ కార్యక్రమం ఒక్క భారత్ ప్రజలే కాకుండా విదేశాల్లోని వారు ఫాలో అవుతుండటంతో మోదీ పిలుపునందుకు ఇప్పుడు అన్ని చోట్ల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నీవీస్, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ భేడిలాంటివారు కూడా దీనికి ఆకర్షితులై తమ కూతుర్లతో కెమెరాల్లో సెల్ఫీలు క్లిక్ మనిపించారు. -
విశ్వవ్యాప్తంగా..
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శిబిరాలు న్యూఢిల్లీ: తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆదివారం దాదాపు అన్ని రాష్ట్రాల్లో భారీ ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పలువురు ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, రాష్ర్ట మంత్రులు, ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులతోపాటు సామాన్యులు కూడా ఆసనాలు వేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు యోగా డేని ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాయి. గుజరాత్లో 29 వేల ప్రాంతాల్లో 1.25 కోట్ల మంది ఆసనాలు వేశారు. హైదరాబాద్‌లో జరిగిన యోగా డేలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా, మరో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పాలుపంచుకున్నారు. పట్నాలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలోని జరిగిన శిబిరంలో పెద్దఎత్తున రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. లక్నోలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన శిబిరంలో 15 వేలమందికిపైగా పాల్గొన్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున ముస్లింలు కూడా ఆసనాలు వేశారు. హర్యానా ప్రభుత్వం వెయ్యి గ్రామాల్లో యోగ, వ్యాయామశాలలను నెలకొల్పుతూ నిర్ణయం తీసుకుంది. జైపూర్‌లో 25వేల మందితో నిర్వహించిన కార్యక్రమం ఆకట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఘనంగా యోగా డే లండన్: అంతర్జాతీయ యోగా డే ప్రారంభ వేడుకలను పురస్కరించుకొని ఆదివారం ప్రపంచవ్యాప్తంగా వేలాది ఔత్సాహికులు ప్రాచీన భారతీయ యోగ కళను అభ్యసించారు. యోగా సార్వజనీనతను చాటుతూ వివిధ రకాల ఆసనాలను వేసి చూపారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో 500 మందికిపైగా ఔత్సాహికులు సూర్య నమస్కారాలు చేశారు. లండన్‌లో థేమ్స్ నది ఒడ్డున వందలాదిప్రజలు యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు. చైనాలోని ప్రఖ్యాత పెకింగ్ యూనివర్సిటీ, గీలీ యూనివర్సిటీలలో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. సింగపూర్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో 4 వేల మందికిపైగా ప్రజలు పాల్గొన్నారు. థాయ్‌లాండ్, నేపాల్, వియత్నాం, జపాన్, ఫ్రాన్స్, మలేసియా, ఫిలిప్పీన్స్ తదితర దేశాల్లోనూ యోగా డేను పాటించారు. -
ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు
-
ఫేస్బుక్ ఆప్... ఫ్రీగా ఇంటర్నెట్!
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్లు భలే సందడి చేస్తున్నాయి. అయినా.. ఇంకా అనేక చోట్ల ఇంటర్నెట్ అందుబాటులో లే నివారు మాత్రం గణనీయంగానే ఉన్నారు. అందుకే ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో సరికొత్త మొబైల్ అప్లికేషన్(ఆప్)ను విడుదలచేసినట్లు ‘ఫేస్బుక్’ వెబ్సైట్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. ‘ఇంటర్నెట్.ఆర్గ్’ అని పేరు పెట్టిన ఈ ఆప్‌తో ఎవరైనా సరే ఉచితంగానే ఇంటర్నెట్ను వాడుకోవచ్చు. స్థానికంగా వైద్యం, విద్య, ఉద్యోగ అవకాశాలు, వాతావరణానికి సంబంధించిన సమాచారం కోసం, ప్రాథమిక స్థాయిలో కమ్యూనికేషన్స్ కోసం ఫ్రీగా బ్రౌజ్ చేసుకోవచ్చు. అంతేకాదండోయ్.. ఈ ఆప్‌తో ఫేస్‌బుక్‌ను, గూగుల్ సెర్చ్‌ను, వికీపీడియాను సైతం ఉపయోగించుకోవచ్చట. ప్రపంచ జనాభాలో 85 శాతం మంది నివసించే ప్రాంతాల్లో మొబైల్ ఫోన్ నెట్‌వర్క్‌లు ఉన్నా.. ఇంటర్నెట్ మాత్రం 30 శాతం మంది నివసించే చోట్ల మాత్రమే ఉందని, అందుకే అందరికీ ఇంటర్నెట్ను అందించేందుకే ఈ ఆప్‌ను రూపొందించినట్లు ఫేస్బుక్ వర్గాలు వెల్లడించాయి. బాగుందే. వెంటనే డౌన్లోడ్ చేసేసుకుందాం.. అనుకుంటున్నారా? కానీ ఇప్పుడే కుదరదులెండి. ప్రస్తుతం ఈ ఆప్ జాంబియా దేశంలోని ఎయిర్టెల్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దశలవారీగా మిగతా అన్ని దేశాల్లోనూ విడుదల చేస్తారట. -
మంచు కురిసే వేళలో..