జనరల్‌ మోటార్స్‌ వాహనాల భారీ రీకాల్‌ | General Motors recalling nearly 800,000 pickup trucks worldwide | Sakshi
Sakshi News home page

జనరల్‌ మోటార్స్‌ వాహనాల భారీ రీకాల్‌

Published Sat, Aug 5 2017 11:18 AM | Last Updated on Sun, Sep 17 2017 5:12 PM

జనరల్‌ మోటార్స్‌  వాహనాల భారీ రీకాల్‌

జనరల్‌ మోటార్స్‌ వాహనాల భారీ రీకాల్‌

వాషింగ్టన్: అమెరికాకు   చెందిన అతిపెద్ద ఆటో మేకర్‌ జనరల్ మోటార్స్  సంస్థ భారీ ఎత్తున వాహనాలను రీకాల్‌ చేస్తోంది.  ప్రపంచ వ్యాప‍్తంగా దాదాపు 8లక్షల పికప్ ట్రక్కులను వెనక్కి తీసుకుంటోంది.   నేషనల్‌ హైవే ట్రాఫిక్‌ సేఫ్టీ  యంత్రంగా శుక్రవారం ఈ వివరాలను వెల్లడించింది.  షెవర్లే  సిల్వరాడో 1500, జీఎంసీ  సియర్రా1500  పికప్‌  టక్కులను రీకాల్‌  చేస్తోంది.  
 
2014 నాటి మోడల్  ట్రక్కులు  షెవర్లే  సిల్వరాడో 1500, జీఎంసీ  సియర్రా1500 లలో తాత్కాలికంగా విద్యుత్ శక్తి స్టీరింగ్‌లో లోపాలు, ముఖ్యంగా తక్కువ వేగంతో ప్రయాణించే సమయంలో తాత్కాలిక సమస్యలు ఎదురవుతున్నాయని జనరల్‌ మోటార్స్‌ ప్రకటిచింది. అందుకే వీటిని రీకాల్‌ చేస్తున్నట్టు చెప్పింది. 
అమెరికాలో 6 లక్షల 90వేలు వాహనాలను, కెనడాలో 80వేలు వాహనాలతోపాటు ఇతర మార్కెట్లలో 25వేల వాహనాలను  రీకాల్‌ చేస్తోంది. జీఎం డీలర్లు కొత్త సాఫ్ట్‌వేర్‌తో  ఈ  లోపాన్ని పరిష్కరించనున్నారని ప్రకటించింది. అయితే ప్రమాదాలు, గాయాలకు సంబంధింత తమ దగ్గర ఎలాంటి సమాచారం లేదని  జీఎం ప్రతినిధి టామ్‌ వికిన్‌సన్‌ పేర్కొన్నారు. అయితే 2015 సం.రం మోడల్‌ ​ వాహనాల్లో దీనికి సంబంధించి కొన్ని మార్పులను జోడించింది. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement