pickup trucks
-
ఇంత మంచి డిస్కౌంట్ మళ్ళీ రాదు.. హైలక్స్ కొనుగోలుపై బంపర్ ఆఫర్!
Toyota Hilux Discounts: భారతీయ మార్కెట్లో 'టయోటా' (Toyota) కార్లకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కంపెనీ ఇప్పుడు తన పికప్ ట్రక్కు 'హైలక్స్' (Hilux) మీద కనీవినీ ఎరుగని డిస్కౌంట్ ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఇప్పటికే మంచి సంఖ్యలో అమ్ముడవుతున్న 'టయోటా హైలక్స్ పికప్' (Toyota Hilux Pickup) ట్రక్కు మీద కంపెనీ రూ. 6 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. గతంలో సంస్థ ఈ వెహికల్ బేస్ వేరియంట్ ధరలు రూ. 3.60 లక్షలు తగ్గించి, ఇతర వేరియట్ల ధరలను రూ. 1.35 లక్షల వరకు పెంచింది. కాగా ఇప్పుడు భారీ డిస్కౌంట్ ప్రకటించింది. టయోటా హైలక్స్ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి స్టాండర్డ్ ఎమ్‌టి, హై ఎమ్‌టి, హై ఏటీ. ఈ పికప్ ట్రక్కు ఇప్పటి వరకు 1300 యూనిట్లు అమ్ముడైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీని ధరలు రూ. 30.40 లక్షల నుంచి రూ. 37.90 లక్షల మధ్య ఉన్నాయి. (ఇదీ చదవండి: యమహా ఆర్ఎక్స్100 మళ్ళీ రానుందా? ఇదిగో క్లారిటీ!) ప్రస్తుతం దేశంలోని కొన్ని కంపెనీ డీలర్‌షిప్‌లు రూ. 6 లక్షల డిస్కౌంట్ అందిస్తున్నట్లు, ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలోని డీలర్‌షిప్‌లు రూ. 8 లక్షల వరకు తగ్గింపుని అందిస్తున్నట్లు సమాచారం. అయితే తగ్గింపులు ఒక నగరం నుంచి మరో నగరానికి మారే అవకాశం ఉంటుంది. ఖచ్చితమైన డిస్కౌంట్స్ గురించి తెలుసుకోవడానికి సమీపంలో ఉండే అధికారిక డీలర్‌షిప్‌లను సందర్శించి తెలుసుకోవచ్చు. (ఇదీ చదవండి: అదరగొట్టిన 'నెక్సాన్ ఈవీ'.. టాటా ఆంటే మినిమమ్ ఉంటది!) 2022 మార్చిలో ప్రారంభమైన ఈ హైలక్స్ అద్భుతమైన డిజైన్, ఫీచర్స్ కలిగి మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. దీని కోసం కంపెనీ ఇందులో 2.8 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ అమర్చింది. మాన్యువల్ వేరియంట్లలో 201 బిహెచ్పి, 420 ఎన్ఎమ్ టార్క్.. ఆటోమేటిక్ వేరియంట్లలో 500 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ అండ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. కావున ఉత్తమ పనితీరుని అందిస్తుంది. -
ఒకటి తగ్గింది.. మరొకటి పెరిగింది: ఇదీ టయోటా హైలెక్స్ ధరల వరుస!
భారతదేశంలో కేవలం కార్లకు, బైకులకు మాత్రమే కాకుండా పికప్ ట్రక్కులకు కూడా మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని టొయోటా కంపెనీ గత ఏడాది 'హైలెక్స్' (Hilux) విడుదల చేసింది. అయితే కంపెనీ ఇప్పుడు ఒక వేరియంట్ ధరలను కొంత తగ్గించింది, మరో వేరియంట్ ధరలను పెంచింది. వేరియంట్స్ & ధరలు: నిజానికి టొయోటా హైలెక్స్ స్టాండర్డ్, హై అనే రెండు ట్రిమ్‌లలో లభిస్తుంది. ఇప్పుడు స్టాండర్డ్ మోడల్ మీద ఏకంగా రూ. 3.59 లక్షలు తగ్గించింది. కావున ప్రస్తుతం ఈ వేరియంట్ ధర రూ. 30.40 లక్షలు. అదే సమయంలో హై మ్యాన్యువల్, ఆటోమాటిక్ మీద వరుసగా రూ. 1.35 లక్షలు, రూ. 1.10 లక్షలు పెంచింది. దీని ప్రస్తుత ధరలు రూ. 37.15 లక్షలు, రూ. 37.90 లక్షలు. టయోటా ఈ ఏడాది ప్రారంభంలో తన రెండవ బ్యాచ్ బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కాగా ఇప్పుడు ఒక మోడల్ మీద భారీగా ధరలను తగ్గించి, మరో మోడల్ ధరలను పెంచింది. ధరల పెరుగుదల అమ్మకాల మీద ప్రభావం చూపే అవకాశం ఉందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. డిజైన్ & ఫీచర్స్: టయోటా హైలక్స్ ఆధునిక డిజైన్ పొందుతుంది. ఇందులో పెద్ద హెక్సాగోనల్ ఫ్రంట్ గ్రిల్ ఉంటుంది, దీనికి రెండు వైపులా ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్లైట్లు ఇవ్వబడ్డాయి. ఈ పికప్ ట్రక్కు అల్లాయ్ వీల్స్‌తో పాటు వీల్ ఆర్చ్‌ల చుట్టూ ప్లాస్టిక్ క్లాడింగ్ పొందుతుంది. దీని డిజైన్ దాదాపు ఫార్చ్యూనర్ మాదిరిగానే ఉంటుంది. ఇది వర్టికల్ టెయిల్ లైట్ మరియు డబుల్ క్యాబ్ స్టైలింగ్ పొందుతుంది. (ఇదీ చదవండి: భార్య గురించి అలా ట్వీట్ చేసిన అష్నీర్ గ్రోవర్) ఇంటీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో ఆపిల్ కార్ప్లే & ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 8.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మౌంటెడ్ కంట్రోల్‌లతో కూడిన మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కొలతలు: టయోటా ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్ మాదిరిగానే ఈ కొత్త పికప్ ట్రక్కును కూడా IMV-2 ల్యాడర్ ఫ్రేమ్ ఛాసిస్‌పై నిర్మించబడింది. కావున దీని పొడవు 5,325 మి.మీ, వెడల్పు 1,855 మి.మీ, ఎత్తు 1,865 మి.మీ, వీల్‌బేస్ 3,085 మి.మీ వరకు ఉంటుంది. అదే సమయంలో దీని గ్రౌండ్ క్లియరెన్స్ 216 మి.మీ కాగా, బరువు 2.1 టన్నులు వరకు ఉంటుంది. మొత్తం మీద భారతదేశంలో అమ్ముడవుతున్న వాహనాల్లో ఇదే భారీ వాహనం అని చెప్పాలి. ఇంజిన్: టయోటా హైలక్స్ 2.8 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ ద్వారా 204 బిహెచ్పి పవర్ 420 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇందులో ఫోర్ వీల్ డ్రైవ్ స్టాండర్డ్‌గా అందుబాటులో ఉంటుంది. (ఇదీ చదవండి: విడుదలకు సిద్దమవుతున్న మారుతి కార్లు: కొత్త జిమ్నీ నుంచి ఫ్రాంక్స్ వరకు..) ప్రత్యర్థులు: దేశీయ మార్కెట్లో అమ్ముడవుతున్న టయోటా హైలక్స్ ఒక ప్రత్యేకమైన విభాగంలో ఉండటం వల్ల దీనికి ప్రధాన ప్రత్యర్థులు లేదు. అయిత్ ఇది 'ఇసుజు D-Max V-క్రాస్'కి అమ్మకాల్లో ప్రత్యర్థిగా నిలిచే అవకాశం ఉంది. కానీ దీని ధర హైలక్స్ కంటే చాలా తక్కువ. -
జనరల్ మోటార్స్ వాహనాల భారీ రీకాల్
వాషింగ్టన్: అమెరికాకు చెందిన అతిపెద్ద ఆటో మేకర్ జనరల్ మోటార్స్ సంస్థ భారీ ఎత్తున వాహనాలను రీకాల్ చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8లక్షల పికప్ ట్రక్కులను వెనక్కి తీసుకుంటోంది. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ యంత్రంగా శుక్రవారం ఈ వివరాలను వెల్లడించింది. షెవర్లే సిల్వరాడో 1500, జీఎంసీ సియర్రా1500 పికప్ టక్కులను రీకాల్ చేస్తోంది. 2014 నాటి మోడల్ ట్రక్కులు షెవర్లే సిల్వరాడో 1500, జీఎంసీ సియర్రా1500 లలో తాత్కాలికంగా విద్యుత్ శక్తి స్టీరింగ్‌లో లోపాలు, ముఖ్యంగా తక్కువ వేగంతో ప్రయాణించే సమయంలో తాత్కాలిక సమస్యలు ఎదురవుతున్నాయని జనరల్ మోటార్స్ ప్రకటిచింది. అందుకే వీటిని రీకాల్ చేస్తున్నట్టు చెప్పింది. అమెరికాలో 6 లక్షల 90వేలు వాహనాలను, కెనడాలో 80వేలు వాహనాలతోపాటు ఇతర మార్కెట్లలో 25వేల వాహనాలను రీకాల్ చేస్తోంది. జీఎం డీలర్లు కొత్త సాఫ్ట్‌వేర్‌తో ఈ లోపాన్ని పరిష్కరించనున్నారని ప్రకటించింది. అయితే ప్రమాదాలు, గాయాలకు సంబంధింత తమ దగ్గర ఎలాంటి సమాచారం లేదని జీఎం ప్రతినిధి టామ్ వికిన్సన్ పేర్కొన్నారు. అయితే 2015 సం.రం మోడల్ వాహనాల్లో దీనికి సంబంధించి కొన్ని మార్పులను జోడించింది.